వజ్రాసనము
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వజ్రాసనము (సంస్కృతం: वज्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము.సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్థం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. పద్మాసనం రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.
పద్ధతి
[మార్చు]- తొలుత సుఖాసన స్థితిని పొందాలి
- నిటారుగా కూర్చోవాలి.
- రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
- ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
- వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
- పాదం కింది భాగం (అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
- మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
- పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
- వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
- అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
- రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
- తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
- వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.