Jump to content

బకాసనం

వికీపీడియా నుండి
బకాసనం

బకాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. ఈ ఆసనంలో శరీరం నీటిలో నించున్న కొంగను పోలి ఉండాడం వల్ల ఈ పేరు వచ్చింది. బకము అంటే కొంగ అని అర్థం.

ఆసనవిధానం పాదాలమీద దొంతుక్కూచుని, చేతులు రెండు ముందుకు చాచి, నేలమీద ఆనించి ఉంచాలి. చేతులు ఆధారంగా చేసుకుని శరీరాన్ని వీలయినంత పైకి లేపాలి. ఈ ఆసనం వేయడానికి ఎంతో ఏకాగ్రత కావాలి. ఇందులో ఉండగలిగినంతసేపు ఉండి మళ్లీ యధాస్థితికి రావాలి [1].

ఉపయోగాలు

[మార్చు]

ఈ ఆసనం వేయడం వలన శ్వాసక్రియ బాగా జరుగుతుంది. వెన్నెముకకు శక్తి పెరుగు తుంది. వెన్నెముక మృదువుగా తయాకరవుతుంది. శరీరములో అవయవములు ఎంతో చురుకుగా పనిచేస్తాయి. మెడ, నరాలకు కూడా చక్కని రక్తప్రసరణ జరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మెడలోని నాడులకు శుభ్రమైన రక్తం అందుతుంది.శ్వాసక్రియ చక్కగా జరుగుతుంది[2].

మూలాలు

[మార్చు]
  1. "Vaartha Online Edition". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-09-11. Retrieved 2020-04-13.[permanent dead link]
  2. "యోగ‌సనాల్లో దిట్ట దాస‌రి ల‌క్ష్మణ్‌". Archived from the original on 2021-09-18.