మత్స్యాసనం
స్వరూపం
మత్స్యాసనం (సంస్కృతం: मत्स्यसन) యోగాలో ఒక విధమైన ఆసనం. నీటిలో ఈదే చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది.
పద్ధతి
[మార్చు]- ముందు పద్మాసనం వెయ్యాలి.
- పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి.[1]
- రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి.[1]
- కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి.
- తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేచి, పద్మాసనంలో కొంతసేపు కూర్చొవాలి.[2]
- ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది.
- ఛాతీ పరిమాణం పెరుగుతుంది.
- ఊపిరితిత్తులు తాజా ప్రాణవాయువును పీల్చు ఉంచుకునేలా తమ సామర్థ్యతను పెంచుకుంటాయి.
- మీ వెన్ను, మెడ ప్రాంతాలు విస్తరించడం వల్ల మరింత అనుకూల స్థితిలో ఉంటాయి.
- వెన్నెముక బలిష్టంగా తయారవుతుంది.
- సరైన స్థితిలో కూర్చోకపోవడం అనే అలవాటునుంచి వెన్ను వంపు భాగాలు సరిదిద్దబడతాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Yoga Journal - Fish Pose". Retrieved 2011-04-09.
- ↑ Mehta, Silva; Mehta, Mira; Mehta, Shyam (1990). Yoga: The Iyengar Way. Dorling Kindersley. p. 83. ISBN 978-0-86318-420-8.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ NIFT, వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC. "Matsyasanam | Yoga | Asana | ఛాతీ పరిమాణాన్ని పెంచే మత్య్సాసనం". telugu.webdunia.com. Retrieved 2021-01-10.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)
బాహ్య లంకెలు
[మార్చు]- "Matsyasana | Fish Pose | Steps | Benefits | Yogic Fitness - YouTube". www.youtube.com. Retrieved 2021-01-10.
- Krishna, Kishore. "మత్స్యాసనం". Retrieved 2021-01-10.