ప్రధాన వార్తలు
పవర్‌ఫుల్ సెయాన్
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘సెయాన్’ టైటిల్ ఖరారైంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో శివ కార్తికేయన్ చేస్తున్న రెండో సినిమా ఇది.సోమవారం ‘సెయాన్’ సినిమా టైటిల్‌ని ప్రకటించి, శివ కార్తికేయన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘సెయాన్’. పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ క్యారెక్టర్లో శివ కార్తికేయన్ కనిపిస్తారు. కమర్షియల్ మాస్ అంశాలు, భావోద్వేగాలు, వినోదం.. వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్.
పిలిచే మల్లికా...
ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ యాక్షన్ డ్రామా ‘కాటాలన్’. ఈ చిత్రంలో దుషారా విజయన్, సునీల్, కబీర్ దుహాన సింగ్, తరందాసు, పార్థ్ తివారీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పాల్ జార్జ్ దర్శకత్వంలో క్యూబ్స్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మే 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘మజాకో మల్లికా..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ‘రాజ రా.. రాజ రా రాజా.. పిలిచే మల్లిక... మజాకో మల్లికా..’ అంటూ ‘మజాకో మల్లికా...’ అంటూ తెలుగు వెర్షన్ సాంగ్ లిరిక్స్ వినిపిస్తాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ పాటకి రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అరుణ్, సమీర పాడారు.
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ కింగ్‌గా ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జున్ సర్జా, సినీమాల్లోకి రాకముందు ఓ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారట. తన తండ్రి తనకోసం ఒక డాక్టర్ సీటు ఎలాగైనా సంపాదించి ఇస్తాను నువ్వు చదివి డాక్టర్ కావాలి అన్నారట. అయితే తనకు డాక్టర్ అవ్వాలని లేదు. అయితే అనుకోకుండా తను సినిమాల్లోకి వచ్చానని. తనకి సినీ హీరో అవుతాడని తెలియదని, తనని సినీమాల్లోకి ఎవరో తోసేశారని అర్జున్ అన్నారు. అర్జున్ సర్జా తాజాగా తన సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న సమయంలో సినిమాలను వదిలేయాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో శంకర్ తన వద్దకు వచ్చాడు. కానీ అప్పటికి తను కొత్త వాడు కావడంతో మొదట రిజెక్ట్ చేశాను. అయితే దర్శకుడు శంకర్ వెంటపడి మరీ ‘జెంటిల్‌మెన్’ కథ వినిపించారు. కాగా అందులోని సామాజిక సందేశం తనను ఆకట్టుకుంది. దాంతో ఆ చిత్రానికి ఓకే చెప్పాను.అయితే ‘జెంటిల్‌మెన్’ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం కథలోని సామాజిక సందేశం, పాత్ర బలం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కథను వదిలేస్తే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడు అనిపించింది. 1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్జున్ నటన అన్నీ కలిసి ‘జెంటిల్‌మెన్’ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి. ఆ చిత్రంతో ఆయన స్టార్ హీరోగా మారారు. ఆ తరువాత యాక్షన్ కింగ్‌గా ఎన్నో హిట్లు తన కెరీర్‌లో సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించడం విశేషం. కుటుంబ విలువలతో పాటు ప్రేమ, రోడ్ జర్నీ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది. అర్జున్ సర్జా చెప్పినట్లుగా ఒక్క నిర్ణయం జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలదు. అర్జున్ సర్జా కెరీర్‌లో ‘జెంటిల్‌మెన్’ అలాంటి మలుపు.
టాలీవుడ్ డైరెక్టర్ సినిమా.. మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలో స్ట్రీమింగ్
ఓటీటీల్లో సినిమాలు సడన్‌గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ రోజుల్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ముందుగానే డీల్స్ ఉండడంతో స్ట్రీమింగ్ చేసేస్తుంటారు. మరికొన్ని చిత్రాలు ఒకే ఫ్లాట్‌ఫామ్ కాకుండా రెండు, మూడింటిలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా మూవీ విడుదలైన కొన్ని నెలలు, ఏడాదిలోపు రావడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ చిత్రం రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా?బాలీవుడ్ మూవీ 8 ఏఎమ్ మెట్రో 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. 2023 మే 19న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం మరో ఓటీటీకి రావడం విశేషం. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు.
బిగ్‌బాస్
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
దాంపత్యం బానే ఉందా? బిగ్‌బాస్ విన్నర్ భార్య కౌంటర్!
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
A to Z
థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలోకి వచ్...
ఓటీటీలో మనశంకర వరప్రసాద్‌గారు.. 24 గంటల్లోనే రికార్డ్
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమ...
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
టాలీవుడ్ సంగతి కాస్త పక్కనబెడితే తమిళంలో ఈసారి సంక...
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
రీసెంట్ టైంలో తెలుగులో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాల...
దురంధర్ మరో రికార్డ్.. ఏకంగా 59 రోజుల పాటు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ రికార్డుల మీద...
ధురంధర్లో ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున
గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సి...
రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి.. ఇప్పుడు ప్రముఖ నటి..!
బాలీవుడ్ తారలకు ఇటీవల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయ...
పెళ్లి చేసుకోకుండానే తండ్రినయ్యా.. ఐవీఎఫ్, సరోగసి ద్వారా!
యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోయినా సరే.. కానీ తాను మా...
ఆస్కార్ నామినేషన్స్‌లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరి...
ఆస్కార్ నామినేషన్స్ 2026.. అఫీషియల్ జాబితా ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్-2026 లి...
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎ...
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్...
సౌత్ హీరోలను కలవాలంటే కండీషన్స్? సెంథిల్ ఆన్సరిదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధన...
మహాశివరాత్రి సెలబ్రేషన్స్.. దురంధర్ బ్యూటీ, శ్రీనిధి శెట్టి డ్యాన్స్ వైరల్
మహాశివరాత్రి వేడుకల్లో పలువురు సినీతారలు సందడి చే...
తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ...
'డబ్బులు రాలేదని శనగలు తిందామన్నారు'.. వీకే నరేశ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్త...
ఫొటోలు
అల్లు శిరీష్, నయనిక వాలెంటైన్స్ డే ఎలా జరుపుకున్నారంటే.. (ఫోటోలు)
‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)
'పెద్ది' సెట్లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )
టాలీవుడ్ యాంకర్ మ్యారెజ్ డే.. భర్తలో లాస్య జ్ఞాపకాలు (ఫోటోలు )
విశ్వక్సేన్ 'ఫంకీ' సక్సెస్ మీట్ (ఫోటోలు)
ట్రావెల్ అడ్వెంచర్ టాక్ షో 'సోల్ ట్రిప్' (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో నరేశ్- పవిత్ర (ఫోటోలు)
డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)
గాసిప్స్
View all
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్‌కు బ్రేక్?
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
టాలీవుడ్‌లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
రివ్యూలు
View all
3
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
2.5
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
2
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
2.5
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
2.5
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
సినీ ప్రపంచం
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లో చెప్పుకోదగ్గ తెలుగు రిలీజులు అయితే లేవు. ఉన్నవి కూడా డబ్బింగ్, హిందీ చిత్రాలే. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి ఉంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్)గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలు చేశారు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. అయితే ఎప్పటికప్పుడు హారర్ మూవీస్ చూసేవాళ్లకు ఇదేమంత గొప్పగా అనిపించలేదు. కొందరికి మాత్రం నచ్చింది. ఓవరాల్ గా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఇప్పుడీ చిత్రం దాదాపు రెండు నెలలకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'ఈషా' విషయానికొస్తే.. కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతుంటారు. ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి తెలుసుకుంటారు. అతడి బాగోతం బయటపెట్టాలని, అక్కడికే వెళ్లి బాబాని కలుస్తారు. మాటల సందర్భంలో ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)
'వారణాసి'లో ప్రకాష్ రాజ్ పాత్ర పవర్‌ఫుల్.. రివీల్ చేసిన నటుడు
మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్ సినిమా ‘వారణాసి’.. ఇందులో ప్రకాష్ రాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనేది దర్శకుడు ప్రకటించలేదు. దీంతో సోషల్‌మీడియాలో పలు కథనాలు వచ్చాయి. మహేశ్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు. వారణాసిలో శివుడి పరమ భక్తుడిగా నటిస్తున్నానని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్ పంచుకున్నారు. ఆపై హిందీ ‘దృశ్యం 3’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ఇప్పటికే విక్రమార్కుడులో నటించిన విషయం తెలిసిందే. ఆపై మహేశ్‌తో కూడా ఆయన కలిసి పలు సినిమాల్లో నటించారు. ఒక్కడు, రాజకుమారుడు, గుంటూరు కారం వంటి పలు సినిమాల్లో మెప్పించారు. ఇప్పుడు వారణాసిలో వీరిద్దరూ మరోసారి కలిశారు. మైథలాజికల్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వారణాసి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. అక్కడ షూటింగ్ చేసేందుకు సంబంధించిన కార్యాచరణను ఆల్రెడీ ప్రారంభించారట రాజమౌళి. అలాగే ఓ కీలక షెడ్యూల్‌ను అంటార్టికాలోనూ ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఒకవేళ అంటార్టికా లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగితే, అక్కడి క్లిష్టమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.“I am a Maha Shiva Bhakt in #Varanasi”— #PrakashRaj pic.twitter.com/Xr3AMjQZH9— cinee worldd (@Cinee_Worldd) February 16, 2026
విజయ్- రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొననున్నారు. అయితే, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో భారీగా టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.విజయ్, రష్మికల వివాహానికి ఉదయ్‌పూర్ వెళ్లే అతిధుల జాబితా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుండి ఎంపిక చేసిన ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, కృతి సనన్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అయితే, హైదరాబాద్‌లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు స్టార్స్‌తో పాటు యువ నటీనటులు హజరుకానున్నారు. ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నుండి కొంతమంది కీలక రాజకీయ నాయకులు కూడా విజయ్ పెళ్లిలో పాల్గొంటారని సమాచారం. ఈ జాబితా గురించి విజయ్ జోడీ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.
రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: స్టార్ హీరోయిన్
ప్రేమలో మోసపోయిన సినీ తారల్లో నటి మమతమోహన్‌దాస్ ఒకరు. ఈమె బహు భాషా నాయకి. మలయాళం, తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించారు. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, రుద్రంగి సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో శివప్పధికారం, గురు ఎన్ ఆళు, తడయార తాక్క,ఎనిమి,మహారాజా తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ప్రభు జయరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మైడియర్ సిస్టర్ చిత్రంలో అరుళ్‌నిధితో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ మధ్య క్యాన్సర్ మహ్మమారి బారిన పడ్డారు. అయితే దాని నుంచి పోరాడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మళ్లీ నటించడం మొదలెట్టిన మమత మోహన్‌దాస్ (Mamta Mohandas) తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి నుంచి బయప పడి మళ్లీ నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందన్నారు. అలా మలయాళ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడితో డేటింగ్‌కు వెళ్లానని చెప్పారు. అయితే అతను మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్న విషయం తనకు ఆ తరువాతనే తెలిసిందన్నారు. దాంతో తన మనసు ముక్కలైయ్యిందన్నారు. ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానన్నారు. దీని గురించి ఆ నటుడిని అడగ్గా చాలా లైట్‌గా తీసుకున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం ఆ ఘటనను జీర్ణించుకోలేకపోయానన్నారు. తన మాజీ భర్తతో మొదటిసారి పరిచయం ఎలా అయిందో కూడా ఆమె పంచుకున్నారు. ఒక కార్యక్రమంలో తనను చూసి వివాహం చేసుకుందామని ఆకాంక్షను వ్యక్తం చేశారని, అందుకు తాను తన తల్లిదండ్రులను అడగమని చెప్పానట్లు గుర్తు చేసుకున్నారు. అలా అప్పుడు తమ పెళ్లి జరిగిందని చెప్పారు. కాగా వివాహ బంధంపై తనకు నమ్మకం ఉందని, అది ఎప్పటికీ చెరగదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మాదిరిగానే అర్థం చేసుకోగలిగిన వ్యక్తి తారసపడితే కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి మమత మోహన్‌దాస్ పేర్కొన్నారు. మమతకు 2011 నవంబరు 11న బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌తో నిశ్చితార్థం జరిగింది. వీరికి 2011 డిసెంబరు 28న కోజికోడ్‌లో వివాహం జరిగింది. 2012 డిసెంబరు 12న అంటే కేవలం ఏడాదిలోనే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ కారణంగానే వారిద్దరూ విడిపోయారని కొన్ని కథనాలు కూడా వచ్చాయి.
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ కింగ్‌గా ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జున్ సర్జా, సినీమాల్లోకి రాకముందు ఓ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారట. తన తండ్రి తనకోసం ఒక డాక్టర్ సీటు ఎలాగైనా సంపాదించి ఇస్తాను నువ్వు చదివి డాక్టర్ కావాలి అన్నారట. అయితే తనకు డాక్టర్ అవ్వాలని లేదు. అయితే అనుకోకుండా తను సినిమాల్లోకి వచ్చానని. తనకి సినీ హీరో అవుతాడని తెలియదని, తనని సినీమాల్లోకి ఎవరో తోసేశారని అర్జున్ అన్నారు. అర్జున్ సర్జా తాజాగా తన సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న సమయంలో సినిమాలను వదిలేయాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో శంకర్ తన వద్దకు వచ్చాడు. కానీ అప్పటికి తను కొత్త వాడు కావడంతో మొదట రిజెక్ట్ చేశాను. అయితే దర్శకుడు శంకర్ వెంటపడి మరీ ‘జెంటిల్‌మెన్’ కథ వినిపించారు. కాగా అందులోని సామాజిక సందేశం తనను ఆకట్టుకుంది. దాంతో ఆ చిత్రానికి ఓకే చెప్పాను.అయితే ‘జెంటిల్‌మెన్’ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం కథలోని సామాజిక సందేశం, పాత్ర బలం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కథను వదిలేస్తే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడు అనిపించింది. 1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్జున్ నటన అన్నీ కలిసి ‘జెంటిల్‌మెన్’ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి. ఆ చిత్రంతో ఆయన స్టార్ హీరోగా మారారు. ఆ తరువాత యాక్షన్ కింగ్‌గా ఎన్నో హిట్లు తన కెరీర్‌లో సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించడం విశేషం. కుటుంబ విలువలతో పాటు ప్రేమ, రోడ్ జర్నీ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది. అర్జున్ సర్జా చెప్పినట్లుగా ఒక్క నిర్ణయం జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలదు. అర్జున్ సర్జా కెరీర్‌లో ‘జెంటిల్‌మెన్’ అలాంటి మలుపు.
టాలీవుడ్ డైరెక్టర్ సినిమా.. మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలో స్ట్రీమింగ్
ఓటీటీల్లో సినిమాలు సడన్‌గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ రోజుల్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ముందుగానే డీల్స్ ఉండడంతో స్ట్రీమింగ్ చేసేస్తుంటారు. మరికొన్ని చిత్రాలు ఒకే ఫ్లాట్‌ఫామ్ కాకుండా రెండు, మూడింటిలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా మూవీ విడుదలైన కొన్ని నెలలు, ఏడాదిలోపు రావడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ చిత్రం రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా?బాలీవుడ్ మూవీ 8 ఏఎమ్ మెట్రో 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. 2023 మే 19న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం మరో ఓటీటీకి రావడం విశేషం. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు.
మెగాస్టార్ చేతికి పట్టీ.. అసలు విషయం ఇదే
తనకు సర్జరీ జరిగిందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అల్లు శిరీశ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకునే సమయంలో చేతికి పట్టీ వేసుకుని మెగాస్టార్ కనిపించారు. దీంతో చిరు ఏమైందని ఫ్యాన్స్‌తో పాటు పలువురు ఆరా తీశారు. తాజాగా సర్జరీ జరిగిన విషయాన్ని మెగాస్టార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' నా చేయి పట్టీ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీ హోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నా. ఇప్పటికే నా దినచర్య తిరిగి ప్రారంభించా. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడంలో ఆయన శ్రద్ధ, నైపుణ్యం అద్భుతం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. Several well-wishers have enquired about my health after noticing the arm sling.It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine.My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care… pic.twitter.com/txLNH2yNFQ— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2026
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల హవా.. ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్‌గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు. అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.మానస వారణాసి..మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.శివానీ నాగారం..తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్ మూవీతో యూత్‌ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.బేబీ వైష్ణవి చైతన్య..బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్ నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ మెరిసింది. ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.శ్రీ గౌరి ప్రియ..మ్యాడ్ బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. యూత్‌లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..కోర్ట్ మూవీతో ఓవర్‌నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్‌మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.ఈషా రెబ్బా..మన వరంగల్‌కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్‌లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.
చీరలో 'ధురంధర్' బ్యూటీ.. విష్ణుప్రియ జిగేలు!
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఆయేషాజిగేలుమని మెరిపించేస్తున్న బిగ్‌బాస్ విష్ణుప్రియపక్షులతో ఆడుకుంటున్న బిగ్‌బాస్ ఫేమ్ దివి'రాజాసాబ్' ఫేమ్ మనీషా చీరలో అందాలుగ్లామర్‌తో రచ్చ లేపేస్తున్న మంచు లక్ష‍్మీప్రిన్సెస్‌లా తయారైపోయిన 'రాజాసాబ్' రిద్ధి View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manisha Kandkur (@manisha_kandkur) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor)
అమ్మకు రెండో పెళ్లి.. అవన్నీ అబద్ధాలే: సుప్రీత
టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత ఇటీవలే బిగ్ స్క్రీన్‌పై సందడి చేసింది. అమరావతికి ఆహ్వానం పేరుతో వచ్చిన థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 13న థియేటర్లలోకి వచ్చిన టాలీవుడ్ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు జరిగిన ఈవెంట్‌లో సుప్రీత ఫుల్ ఎమోషనలైంది. తన జర్నీని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.అంతేకాకుండా ఇటీవల సురేఖవాణి రెండో పెళ్లి గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి క్లారిటీ ఇచ్చింది సుప్రీత. అమ్మకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచన కేవలం నాది మాత్రమేనని.. అమ్మకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గతంలో మీ అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? అని నన్ను కొందరు అడిగారని పేర్కొంది.ఈ ప్రశ్నకు తాను అవును సమాధానమిచ్చానని సుప్రీత తెలిపింది. కానీ చాలామంది నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. నా మాటలు విని అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు రాసుకొచ్చారని పేర్కొంది. అదంతా పూర్తిగా అబద్ధమని.. అమ్మకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. ఆమెకు మ్యారేజ్ చేయాలన్న ఆలోచన నాది మాత్రమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది
సినిమా
విజయ్ రష్మిక పెళ్లి సందడి శుభలేఖ ఇదే.. పెళ్లి ముహూర్తం ఫిక్స్
25 ఏళ్ల తర్వాత మళ్లీ..! మెగా ఫ్యాన్స్ కు ఇక పండగే
రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఫౌజీ టీమ్ గుడ్ న్యూస్
స్టార్ హీరోలతో పోటీ పడుతున్న వెంకీ మామ
చికిరి చికిరి హుక్ స్టెప్ వెనకాల రామ్ చరణ్
సీతా పయనం చిత్ర బృందంతో జగపతి బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ
నాకు టైం ఇవ్వట్లేవు నన్ను IGNORE చేస్తున్నావేంటి? మా అమ్మ తర్వాత నువ్వే పవిత్ర
లవ్ &రిలేషన్ షిప్ కి ఉన్న తేడా అదే..! ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే...
సుహాస్ కాల్ చేసి మరీ..! ఫ్రెండ్ రోల్ కోసం వెళ్లి...
పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
