breaking news
Bollywood
-
టాలీవుడ్ డైరెక్టర్ సినిమా.. మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలో స్ట్రీమింగ్
ఓటీటీల్లో సినిమాలు సడన్‌గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ రోజుల్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ముందుగానే డీల్స్ ఉండడంతో స్ట్రీమింగ్ చేసేస్తుంటారు. మరికొన్ని చిత్రాలు ఒకే ఫ్లాట్‌ఫామ్ కాకుండా రెండు, మూడింటిలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా మూవీ విడుదలైన కొన్ని నెలలు, ఏడాదిలోపు రావడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ చిత్రం రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా?బాలీవుడ్ మూవీ 8 ఏఎమ్ మెట్రో 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. 2023 మే 19న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం మరో ఓటీటీకి రావడం విశేషం. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు. -
నాకు ఏం కావాలి? ఏం వద్దో బాగా తెలుసు: శోభిత
కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటారు. ఏదో ఒకరకంగా తమ గురించే మాట్లాడుకోవాలని, అందరి నోళ్లలో నానుతూ ఉండాలని తహతహలాడతారు.అలా పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్‌లను పెట్టుకుంటారు. కానీ తనకు అలాంటివేవీ ఇష్టం లేదని, పీఆర్ టీమ్ అసలే లేదని చెప్తోంది హీరోయిన్ శోభిత ధూళిపాళ.24 గంటలు కనిపించాలా?తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. గతంలో నేను పీఆర్ ఏజెన్సీలతో పని చేశాను. కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ అవవు అని అర్థమైంది. 24 గంటలు అందరికీ కనిపించాలి, అందరూ నాకోసం మాట్లాడుకోవాలి అని నేను అనుకోవడం లేదు. అది నాకు ఏమాత్రం ఉపయోగపడదు, దానిపై నాకు ఆసక్తి అసలే లేదు.అదైతే తెలుసునాకు పీఆర్ లేదు, కానీ కొందరికి అది బానే పని చేస్తుంది. నేను సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాలేదు, నాది ముంబై కూడా కాదు. వైజాగ్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు సాగాను. నాకు ఏం కావాలి? ఏం వద్దనే విషయాలపై క్లారిటీ ఉంది. రూల్స్‌తో సంబంధం లేకుండా నా దారిలో వెళ్లడమే నాకిష్టం. జనాలకు ఏదిష్టం, వాళ్లేం కోరుకుంటున్నారు? అనేది నాకు తెలియదు. కానీ నా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.సినిమాశోభిత ధూళిపాళ తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్లో ఎక్కువ పాపులర్ అయింది. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఇటీవలే చీకటిలో సినిమాతో మరోసారి అలరించింది.చదవండి: అప్పుడు రూ.500 అప్పు.. రూ.90 కోట్ల కలెక్షన్స్ -
పెద్ద సినిమాకు సెలక్ట్ అయ్యా.. తీరా హీరోగా పనికిరానని!
ఎంతోమంది యాక్టర్స్ ఏదో ఒక సమయంలో తిరస్కరణకు గురవుతుంటారు. ఆల్రెడీ వేరేవాళ్లను సెలక్ట్ చేశాం, నీ ఫేస్‌కు ఈ పాత్ర సూటవదు... ఇలా ఏదో ఒక సాకు చెప్పి వారిని తప్పిస్తుంటారు. అలా ఓ నిర్మాత తనకూ ఓ సాకు చెప్పడంతో గుండు గీసుకున్నానంటున్నాడు బాలీవుడ్ హీరో సిద్దాంత్ చతుర్వేది.పెద్ద సినిమాకు షార్ట్లిస్ట్తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. చాలామంది నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా రిజెక్ చేస్తూనే వచ్చారు. అయితే అందులో ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఒక పెద్ద సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లాను. నా పేరు షార్ట్‌లిస్ట్ చేయడంతో సంతోషపడ్డాను. కొన్ని వర్క్‌షాప్స్‌కి సైతం హాజరయ్యాను. నా పాత్ర కోసం నేను రెడీ అవుతూ ఉన్నాను. నేను ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలిచిన ఏడాదికే ఈ సినిమా ఆఫర్ దక్కించుకున్నాను. రిజెక్షన్‌తో షాక్దాంతో సినిమాల్లోకి రావడం పెద్ద కష్టమేం కాదని భావించాను. ఆ మూవీ దర్శకుడు, కాస్టింగ్ డైరెక్టర్‌కు నేను బాగా నచ్చాను. మూడు, నాలుగు నెలలు వర్క్‌షాప్‌కు హాజరయ్యాక నిర్మాత నన్ను స్క్రీన్ టెస్ట్ చేసి రిజెక్ట్ చేశాడు. నేను షాకయ్యాను. అసలేమైందని కాస్టింగ్ డైరెక్టర్‌ను అడిగాను. ఉంగరాల జుట్టు ఉంటే హీరో కాలేరు అని ఒక్క ముక్కలో సింపుల్‌గా చెప్పేశాడు. ఒకసారి జుట్టు స్ట్రయిట్ చేసుకుని ఆడిషన్‌కు రమ్మన్నారు. వాళ్లు చెప్పినట్లు చేశాక కూడా నన్ను రిజక్ట్ చేశారు.గుండు గీసుకున్నా..చాలా బాధపడ్డాను. నాకసలు జుట్టే వద్దని గుండు గీసుకున్నాను. మా అమ్మకు నా ఉంగరాల జుట్టు అంటే ఇష్టం. అయినా సరే కోపం, బాధతో దాన్ని తీసేశాను. ఇప్పుడీ రోజు సినిమా పోస్టర్లో అదే ఉంగరాల జుట్టుతో కనిపిస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. సిద్దాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన దో దీవానే షెహర్ మే ఫిబ్రవరి 20న విడుదలవుతోంది.చదవండి: భార్యతో విడాకులు, జైలు జీవితం..నరకం అనుభవించానంటున్న సామ్రాట్ రెడ్డి -
ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసి సారీ చెప్పా: రవీనా టండన్
అటు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన "ధురంధర్" ప్రస్తుతం ఓటీటీలోనూ చెలరేగుతోంది. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ రవీనా టండన్ ప్రశంసలు కురిపించింది. దానికంటే ముందు హీరోయిన్ యామీ గౌతమ్‌కు క్షమాపణలు చెప్పింది.హీరోయిన్‌కు సారీజూమ్ పాడ్‌కాస్ట్‌లో రవీనా టండన్ మాట్లాడుతూ.. ధురంధర్ సినిమా చూశాక హీరోయిన్ యామీ గౌతమ్‌కు ఫోన్ చేశాను. ఐయామ్ సారీ, నేను నీ భర్త (దర్శకుడు ఆదిత్య ధర్)కు వీరాభిమానిని అని మాట్లాడాను. ఈ విషయం ఆమె భర్తతో చెప్పమన్నాను. మన సినిమాల్లో ఏదైతే మిస్ అవుతుందో దాన్ని ఆయన తిరిగి తీసుకొచ్చాడు. పుష్ప, కేజీఎఫ్, ధురంధర్ వంటి సినిమాలు చూశాక జనాల్లో సంతృప్తి కలిగింది. ఎంత ఎదిగిపోయాడో!ఇప్పుడు హీరోలు నిజమైన హీరోల్లా కనిపిస్తున్నారని ఫీలవుతున్నారు. ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ 10 ఏళ్ల వయసులో నేను ఓ సాంగ్ చేస్తుండగా చూడటానికి వచ్చాడు. ఇప్పుడు ఎంత ఎదిగిపోయాడో! సినిమాలో అద్భుతంగా నటించాడు. సంజయ్, అక్షయ్ కూడా చించేశారు. సారా అర్జున్, రాకేశ్ బేడీ, గౌరవ్ కూడా బాగా యాక్ట్ చేశారు అని రవీనా టండన్ చెప్పుకొచ్చింది.సినిమాధురంధర్ గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా ధురంధర్ 2 మార్చి 19న రాబోతోంది.చదవండి: టాలీవుడ్లో సీక్వెల్ ట్రెండ్‌కు బ్రేక్? -
రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలే. వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్.. హీరో ధనుష్‌ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.లైఫ్‌లో సెటిలవాలిప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్ మే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్‌లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.సన్యాసి జీవితమే..యాక్టర్‌గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్ ఉంది. కానీ నాపై రూమర్స్ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అందులో డౌటే లేదురూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్‌ను పట్టించుకుంటూ పోతే కెరీర్‌పై ఫోకస్ చేయలేను అని మృణాల్ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్‌మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది? -
తిట్లదండకం ఆపలేదు.. కోపంతో లాగిపెట్టి కొట్టా: హీరో
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. ప్రత్యర్థులను మట్టి కరిపించడంలోనే కాదు, వారిపై పంచులు విసరడంలోనూ దిట్ట! ఇతడు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్‌కు షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 5 జడ్జిలు హాజరయ్యారు. వారిలో ఒకరైన అమన్ గుప్తా.. మీరు జీవితంలో బాగా ఇబ్బందిపడ్డ సంఘటన ఏది? అని అడిగాడు.ఎంత చెప్పినా వినడే..అందుకు అక్షయ్ ఏదైనా ఫన్నీ సంఘటన చెప్తాడనుకుంటే ఏకంగా ఒకరిని లాగి పెట్టి కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి నా స్నేహితుడిని తిడుతున్నాడు. ఆపమని వారించినా సరే వినకుండా దుర్భాషలాడుతున్నాడు. మొదట మంచిగా చెప్పి చూశా.. తర్వాత వార్నింగ్ ఇచ్చా.. అయినా వినలేదు. ఇక ఆరోసారి మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చాను.ఆవేశం పట్టలేక..అందరిముందు అలా తిడుతుండేసరికి నా ఫ్రెండ్ ఏడుస్తున్నాడు. అది చూసి భరించలేకపోయిన నేను అతడి చెంప చెళ్లుమనిపించాను. ఒక్క దెబ్బకే అతడు కిందపడిపోయి స్పృహ కోల్పోయాడు. అయిపోయింది, నా కెరీర్ ఖతం అని భయపడ్డా.. అతడికి మెలకువ రావాలని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ముఖంపై నీళ్లు చల్లిన కొద్ది క్షణాలకే అతడు లేచి కూర్చో వడంతో ఊపిరి పీల్చుకున్నా..ఈరోజు అయితే..అదే సంఘటన ఈరోజు జరిగి ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని కానీ అలా కొట్టేవాడిని కాదు. అదే నాకు ఇబ్బందిగా అనిపించిన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ చివరగా జాలీ ఎల్ఎల్బీ 3 సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ సినిమా భూత్ బంగ్లా ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న నటి -
అది నా దురదృష్టం: రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు సొంతంగా బట్టల బిజినెస్ ఉంది. అదే ఆర్క్స్. గతేడాది ఫిబ్రవరి 14న ఈ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆర్క్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ప్రస్తుతం రణ్‌బీర్ లవ్ అండ్ వార్తో పాటు రామాయణ సినిమాలు చేస్తున్నాడు. అయితే లవ్ అండ్ వార్ రిలీజ్ పోస్ట్‌పోన్ అయినట్లు తెలిపాడు.ఎదురుచూపులకు తగ్గ ఫలితంఅదేంటో మరి దురదృష్టం. నేనెప్పుడు సినిమా మొదలుపెట్టినా త్వరగా పూర్తవవు. అందరూ ఐదారు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, నావి మాత్రం చాలా సమయం పడుతున్నాయి. అయితే అది రిలీజైనప్పుడు మాత్రం మీ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించాలన్నదే నా కోరిక. రెండుమూడేళ్లుగా చాలా కష్టపడుతున్నాను. కొన్నింటికి సమయం తప్పదు. రామాయణ రిలీజ్ తర్వాతే లవ్ అండ్ వార్ వస్తుంది అని పేర్కొన్నాడు.అనుకోకుండా అలా..రామాయణ ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది. తన కూతురు రాహా పుట్టిన నెల అయిన నవంబర్లోనే రామాయణ రిలీజ్ అవుతుండటం యాదృచ్ఛికమైనప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ఫేవరెట్ సినిమా ధురంధర్ అని చెప్పాడు. అందులో అందరూ అద్భుతంగా నటించారని రణ్‌బీర్ ప్రశంసించాడు.చదవండి: తెరపై శివుడిగా మెప్పించిన హీరోలు -
దురంధర్ మరో రికార్డ్.. ఏకంగా 59 రోజుల పాటు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే వసూళ్లపరంగా పలు రికార్డులు బద్దలు కొట్టిన దురంధర్.. రెండు నెలలు పూర్తయినా తగ్గేలేదే అంటోంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న ఈ చిత్రం బుక్ మై షోలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక రోజులు ట్రెండింగ్‌లో ఉన్న చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, స్త్రీ-2, ప్రేమలు, పుష్ప-2 సినిమాలను దాటేసింది. ఈ మూవీ అత్యధికంగా 59 రోజులు బుక్ మై షోలో ట్రెండింగ్‌లో కొనసాగింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించని అతి పెద్ద ఘనతను దక్కించుకుంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన దురంధర్.. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దీంతో బుక్ మై షోలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.కాగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్‌లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ సీక్వెల్‌గా ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న విడుదల కానుంది.బుక్ మై షోలో ట్రెండింగ్ సినిమాలు..1. ధురంధర్- 59 రోజులు2. ఛావా -58 రోజులు3. స్ట్రీ 2 -57 రోజులు4. ప్రేమలు- 53 రోజులు5. పుష్ప 2: ది రూల్- 53 రోజులు6. మంజుమ్మెల్ బాయ్స్- 50 రోజులు7. కల్కి 2898 ఏడీ- 49 రోజులు8. జవాన్- 48 రోజులు9. లోకా చాప్టర్- 1- 46 రోజులు10. మహావతార నరసింహ- 42 రోజులు -
ధురంధర్లో ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున
గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ధురంధర్. మౌత్ టాక్‌తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ దుమ్ము దులుపుతోంది.అక్షయ్‌పై సర్వత్రా ప్రశంసలురణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సినిమా రిలీజయ్యాక అందరికన్నా ఎక్కువగా అక్షయ్ పేరే మారుమోగిపోయింది. అతడి స్వాగ్, డ్యాన్స్, లుక్స్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రెహ్మాన్ డకాయిట్‌గా అక్షయ్ అదరగొట్టేశాడని ప్రశంసలు లభించాయి.స్పందించిన నాగ్అయితే రెహ్మాన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు నాగార్జునను సంప్రదించారని ఓ వార్త ఫిల్మీదునియాలో వైరలవుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని కింగ్ నాగ్ కొట్టిపారేశాడు. ధురంధర్ సినిమా కోసం తనను సంప్రదించలేదని కుండ బద్ధలు కొట్టాడు. ఒకవేళ తనకు అవకాశం ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ధురంధర్ మూవీ చాలా బాగుందన్నాడు. సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం అదిరిపోయిందని, అతడి ముందు సినిమా ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ కూడా తనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించాడు. సినిమాలో అందరూ బాగా నటించారని, అక్షయ్ ఖన్నా అద్భుతంగా యాక్ట్ చేశాడని మెచ్చుకున్నాడు. ధురంధర్ సీక్వెల్ కూడా మరింత బ్లాక్‌బస్టర్ అవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ధురంధర్ 2 మూవీ మార్చి 19న విడుదలవుతోంది.చదవండి: కపుల్ ఫ్రెండ్లీకి హిట్ టాక్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే? -
రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి.. ఇప్పుడు ప్రముఖ నటి..!
బాలీవుడ్ తారలకు ఇటీవల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలైన రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు బెదిరింపులొచ్చాయి. తాజాగా మరో నటికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ నటి హిమాన్షీ ఖురానాకు బెదిరింపులొచ్చాయి. పది కోట్లు ఇవ్వాలని ఓ దుండగుడు డిమాండ్ చేశాడు. దీంతో నటి పంజాబ్‌లోని మొహాలీ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ మెయిల్ ద్వారా వాయిస్ నోట్ వచ్చిందని.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని హిమాన్షీ తన ఫిర్యాదులో పేర్కొంది. జీషన్ అక్తర్ అనే పేరుతో మెయిల్ వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. నటి హిమాన్షీ ఖురానీ పంజాబీ మూవీ సద్దా హక్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు. జోడీ బిగ్డే పార్టీ, నా.. నా.. నా లాంటి ఆల్బమ్స్‌తో అలరించారు. అంతేకాకుండా హిందీ బిగ్‌బాస్ సీజన్- 13లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకోకుండానే తండ్రినయ్యా.. ఐవీఎఫ్, సరోగసి ద్వారా!
యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోయినా సరే.. కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోనని మొండిగా కూర్చున్నాడు ప్రముఖ నటుడు జితేంద్ర కుమారుడు, నటుడు తుషార్ కపూర్. అయితే పెళ్లికి విరుద్ధమే కానీ, తండ్రవడానికి కాదని సింగిల్ పేరెంట్ అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఐవీఎఫ్, సరోగసి ద్వారా తండ్రయిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీగా గుర్తింపు పొందాడు. తాజాగా ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.అక్కడే నేర్చుకున్నా..తుషార్ కపూర్ మాట్లాడుతూ.. మా నాన్నలాగే నేను కూడా పాతకాలం మనిషిని. కాకపోతే ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు కాస్త భిన్నంగా ఉండేవి. ఐదేళ్లు అమెరికాలో ఉండటం వల్ల ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నాను. పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఓ బిడ్డకు తండ్రయ్యాను. మా నాన్న అలా కాదు. తను పెళ్లిని గౌరవిస్తాడు. కుటుంబ బంధాలను నమ్ముతాడు.40 ఏళ్లకు తండ్రినయ్యా..నేను కాస్త మొహమాటస్తుడినే. ఎక్కువగా బయట కూడా తిరగను. అయితే ఒక పిల్లవాడిని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. 40 ఏళ్ల వయసులో తండ్రయ్యాను. తండ్రవడానికి అదే సరైన సమయం అని భావిస్తాను. మన సమాజం మాత్రం 25 ఏళ్లకే పెళ్లి, పిల్లలు అని గోల మొదలుపెడుతుంది. నేను కూడా పెళ్లిని గౌరవిస్తాను, నమ్ముతాను. కానీ ఎందుకో అది నాకు సూటవదనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు.ఆ జర్నీ వల్లే..39 ఏళ్ల వయసులో ఓసారి తిరుపతికి వెళ్లాను. అప్పుడే నటుడు, నిర్మాత ప్రకాశ్ జాను కలిశాను. తిరుపతి నుంచి తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు మా విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇద్దరం కాసేపు కూర్చుని కాలక్షేపం చేశాం. అప్పుడే అతడో మాటన్నాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ సింగిల్ పేరెంట్ అవొచ్చుగా.. అదొకసారి ఆలోచించు అన్నాడు. అతడి కుటుంబంలో ఒక అమ్మాయి ఇలాగే సింగిల్ పేరెంట్ అయిందని తెలిపాడు.సినిమావెంటనే నాక్కూడా ఓ బిడ్డ కావాలనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పటికప్పుడు అన్నీ తెలుసుకుని, ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోలేదు. చివరకు ఐవీఎఫ్, సరోగసి ద్వారా తండ్రినయ్యాను అని తుషార్ చెప్పుకొచ్చాడు. తుషార్ కపూర్.. ముజే కుచ్ కెహ్నా హై, గాయబ్, గోల్మాల్, గోల్మాల్ రిటర్న్స్, షోర్ ఇన్ ద సిటీ, ద డర్టీ పిక్చర్, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'వెల్కమ్ టు ద జంగిల్' మూవీ చేస్తున్నాడు.చదవండి: సూర్య-జ్యోతిక ప్రేమను ఒప్పుకోని హీరో తండ్రి -
అడుక్కుంటున్నా పట్టించుకోవట్లే.. హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత విక్రమ్ భట్ ఆర్థిక మోసం కేసులో చిక్కుకున్నాడు. దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రమ్ దంపతులను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్ ఏమందంటే?ఇదే సమయంలో పలువురు ఆర్టిస్టులు విక్రమ్ తమకు సరిగా జీతాలివ్వలేదని ముందుకొస్తున్నారు. 2023లో వచ్చిన 1920: హారర్స్ ఆఫ్ ద హార్ట్, ఖిలోనా (ఇది మధ్యలోనే ఆగిపోయింది) సినిమాలకు టెక్నీషియన్లకు డబ్బు చెల్లించలేదని పలువురు మీడియా ముందుకొచ్చారు. తాజాగా హీరోయిన్ అవికాగోర్‌కు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన స్నేహ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.స్పందన లేదుమిడ్డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ శర్మ మాట్లాడుతూ.. 1920: హారర్స్ ఆఫ్ ద హార్ట్ సినిమాకు పని చేసిన చాలామందికి పూర్తి వేతనాలు చెల్లించలేదు. మా జీతాలు మాకు చెల్లించమని అడుక్కుంటున్నాం.. కానీ విక్రమ్ భట్ టీమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఒక హెయిర్‌స్టైలిస్ట్‌కి అయితే ఇంటి అద్దె కట్టకపోవడంతో అతడిని ఇంటినుంచి గెంటేసే పరిస్థితి వచ్చింది. మొదట్లో మాకు సమయానికి డబ్బు చెల్లించారు.సగమే ఇచ్చి..కానీ రెండో షెడ్యూల్‌కు వచ్చేసరికి నిధులు లేవన్నారు. ఓపక్క డబ్బు లేదంటూనే మరో పక్క కొత్త సినిమాను కూడా మొదలుపెట్టారు. 1920 మూవీ కోసం నాకు రోజుకు రూ.18 వేల లెక్కన డీల్ మాట్లాడుకున్నాను. అయితే అందులో నాకు సగమే ఇచ్చారు. విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్‌ను అడిగితే ఆ లెక్కలేవీ తనకు తెలియదంది. పైగా మరికొన్ని రోజులు ఉచితంగా పని చేయమని కోరింది.పైసా ఇవ్వడుడబ్బు ఇవ్వకపోతే నేనెందుకు పని చేస్తానని కరాఖండిగా రానని చెప్పేశాను. దాంతో మరో మేకప్ ఆర్టిస్ట్‌తో ఉచితంగా పని చేయించుకున్నారు అని చెప్పుకొచ్చింది. విక్రమ్ భట్ మనమంతా ఒకే కుటుంబం అని సెంటిమెంట్ డైలాగ్ చెప్పి అందరితో ఇలాగే పని చేయించుకుంటాడని, డబ్బు మాత్రం సరిగా ఇవ్వడని పలువురు సిబ్బంది వాపోయారు. కొందరికైతే లక్షలు ముట్టాల్సింది ఉందని, అవేవీ ఇవ్వకుండా మోసం చేశాడంటున్నారు.చదవండి: సూర్య -జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు: హీరో తండ్రి -
బన్నీని చూసి బాలీవుడ్ రగిలిపోతోందా?
‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత, దక్షిణాది నటుల్లో ఎవరికీ రానంత దేశవ్యాప్త క్రేజ్ అల్లు అర్జున్‌కి రావడం, జవాన్ సినిమా తీసిన అట్లీ తన రెండో సినిమాకి ఎంచుకోవడం...అలాగే బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణే వంటి స్టార్స్‌తో బన్నీ కలిసి నటించనుండడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ బాలీవుడ్లో కొందరికి ముప్పుగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్నకు కొందరు సినీ పెద్దలు అవుననే సమాధానమే చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్లో సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత అల్లు అర్జున్ ఎదుర్కున్న పరిణామాలు తను కొందరు ప్రముఖులకు టార్గెట్‌గా మారాడనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాయి. తాజా పరిణామాల నేపధ్యంలో బన్నీ ని ఈ సారి వేరే రకంగా టార్గెట్ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివాదమా? బాలీవుడ్ వ్యూహమా?ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఓ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అల్లు అర్జున్ ను కలవాలంటే ఏకంగా 42 కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందులో కళ్లలోకి చూడకూడదు, చేతులు కలపకూడదు వంటి ఆంక్షలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫలితంగా అల్లు అర్జున్ పేరు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, నిజంగానే ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అని కొందరిలో సందేహాలు వ్యక్తమవడం సహజమే.అయితే అదే సమయంలో కొందరు ఇది అల్లు అర్జున్ పెరుగుతున్న పాన్ ఇండియా క్రేజ్‌ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలను కావాలనే పెద్దవిగా చేసి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ఇలా టాలీవుడ్ స్టార్స్‌పై వ్యతిరేక ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల భారీ విజయం తర్వాత ప్రభాస్ కూడా ఇలాంటి విమర్శలు, నెగెటివ్ ప్రచారం చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. బాలీవుడ్లో చెప్పుకోదగ్గ ఆదరణ పొందిన దక్షిణాది నటులు ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్ టీమ్ స్పందన..తమపై పడిన వివాదంపై అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించి వైరల్ అవుతున్న ఆరోపణలు అసత్యమని, ఆధారంలేనివని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ఎప్పుడూ గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నదని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. ఈ ఉదంతంపై తగినంత కూపీ లాగి కుట్రలపై ఆధారం దొరికిన తర్వాతే అల్లు టీమ్ ఇలా చెప్పి ఉంటుందనేది నిస్సందేహం. అంతేకాదు అల్లు అర్జున్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. తద్వారా ఇకపై కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అల్లు అండ్ కో భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా అల్లు అర్జున్ ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి రెండు భాగాలుగా రూపొందనున్న ఓ భారీ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. , అల్లు అర్జున్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కుట్రలలో ఆరితేరిన చరిత్ర ఉన్న కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థల విషయంలో అల్లు అర్జున్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. -
దురంధర్‌పై ప్రశంసలు.. నన్ను కావాలనే టార్గెట్ చేశారు: అనురాగ్ కశ్యప్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.పాకిస్తాన్ గూడఛార నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై చాలామంది ప్రశంసలు కురిపించారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తనతోతో పాటు చాలామంది సినీ క్రిటిక్స్‌పై సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయని అన్నారు. ఇలాంటివీ కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తారని విమర్శించారు. ఈ వేధింపులకు గురైన వారిలో తాను ఒకడినని అనురాగ్ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కశ్యప్ ఈ విషయాన్ని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో కొన్ని సమస్యాత్మక అంశాలు ఉన్నప్పటికీ.. సినిమాను నిర్మించేటప్పుడు ఆదిత్య ధర్ ధైర్యాన్ని కూడా తాను గుర్తించానని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పట్ల తనకున్న అభిమానం.. దాని లోపాలను విస్మరించినట్లు కాదని స్పష్టం చేశారు. నాకు ఏదైనా నచ్చితే నా అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు తనకు లేదన్నారు. దురంధర్‌ను ప్రశంసించినందుకు తనను కూడా ప్రశ్నించారని అన్నారు. ఒక చిత్రనిర్మాతగా ఈ మూవీతో ఆదిత్య ధర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు. అర్జున్ రాంపాల్ నటించిన సీన్ చూసి ఓ డైరెక్టర్‌గా తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ చిత్రంలో సారా అర్జున్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాక్‌లో ధురంధర్ సీడీలు.. ఇంత చీప్‌గా దొరుకుతున్నాయా?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ గతేడాది ధురంధర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దాదాపు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లోనూ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. అక్కడ థియేటర్లలో రిలీజ్ అవకుండా బ్యాన్ చేసినప్పటికీ ఓటీటీలో మాత్రం తెగ చూసేస్తున్నారు.సీడీల అమ్మకంఅంతేకాదు, పాక్‌లో ధురంధర్ మూవీ పైరసీ క్యాసెట్లు కూడా అమ్ముతున్నారు. యూట్యూబర్ కార్ల్ రాక్ షేర్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరాచీలోని రెయిన్బో సెంటర్ పైరసీ కంటెంట్‌కు పెట్టింది పేరు. అక్కడ ధురంధర్ సినిమా సీడీలను 50 పాకిస్తాన్ రూపాయలకే ( భారత కరెన్సీలో రూ.16కే) అమ్ముతున్నారు. పాకిస్తాన్లో ఇండియన్ సినిమాలను నిషేధిస్తారు. కానీ ఇక్కడ నేనేం కనుగొన్నానో చూడండి అంటూ యూట్యూబర్ ధురంధర్ సీడీ చూపించాడు.అటు బ్యాన్.. ఇటు పైరసీఇది చూసిన జనాలు.. పాకిస్తాన్‌ను తిట్టే సినిమాలను అక్కడి ప్రజలే ప్రేమిస్తున్నారు.. ఇది మరీ విడ్డూరం. ఇంకా పైరసీ క్యాసెట్లు అమ్ముతున్నారంటే విచిత్రంగానే ఉంది. ప్రభుత్వం ఏమో ధురంధర్‌పై బ్యాన్ విధించింది. వీళ్లేమో ఎంతో సులువుగా పైరసీ చేస్తున్నారు. మరోపక్క మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్ 2 మార్చి 19న విడుదలవుతోంది. View this post on Instagram A post shared by Karl Rock (@iamkarlrock) చదవండి: అర్జున్‌తో వివాదం.. విశ్వక్ ఏమన్నాడంటే? -
రూ.45 కోట్లు పెడితే రూ.1 లక్షలోపు వసూళ్లు.. హీరోయిన్ ఏమందంటే?
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలుస్తాయి. అలాంటి డిజాస్టరే అందుకుంది 2023లో వచ్చిన "ది లేడీ కిల్లర్". ఈ సినిమా వైఫల్యం గురించి తాజాగా స్పందించింది హీరోయిన్ భూమి పెడ్నేకర్. దల్దల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా మిడ్ డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన స్క్రిప్ట్ పరిపూర్ణంగా ఉంది. కానీ, అందులో చాలా భాగాన్ని తెరకెక్కించలేదు. ముందే తెలిసుంటే బాగుండుఅసంపూర్తిగానే సినిమా రిలీజ్ చేశారు. ఇది నాకు ముందే తెలిసుంటే బాగుండేది. నేను కూడా మేకింగ్‌లో భాగమై ఉంటే కొన్ని విషయాలను మార్చగలిగేదాన్ని. అయినా జరిగినదానికి నేను షాక్‌లోనే ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. కాబట్టి ఈ సినిమా పరిస్థితేంటా? అని భయపడ్డాను. చివరకు ఇది ఒక గుణపాఠం అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. సినిమా షూట్ అవలేదుదాదాపు 35% సినిమా షూట్ చేయనేలేదు. అయినా రిలీజ్ చేశారు. అది నా జీవితంలోనే ఎంతో బాధాకరమైన విషయం. ఈ సినిమాకిలా జరగడం నన్ను ఎంతగానో కలిచివేసింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను చాలా బాధపెట్టింది. ఇక నా పనైపోయిందనుకున్నాను. అసలు దానికి బాధ్యులెవరన్నది ఇప్పటికీ నాకర్థం కాదు అని భూమి పెడ్నేకర్ చెప్పుకొచ్చింది.సినిమాద లేడీ కిల్లర్ సినిమా విషయానికి వస్తే.. అజయ్ భేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా నటించారు. దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.1 లక్షలోపే కలెక్షన్స్ రాబట్టింది. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో యూట్యూబ్‌లో ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు.చదవండి: రామ్‌చరణ్- ఉపాసన కవలల పేర్ల వెనక అర్థం ఇదే.. -
‘దల్ దల్’ రివ్యూ.. గుండె ధైర్యం ఉంటేనే ఈ సిరీస్ చూడండి!
అది సినిమా అయినా, జీవితం అయినా వాటిలో కొన్ని ఘటనలను చూడాలన్నా, వినాలన్నా దమ్ముండాలి. ప్రేక్షకులందరూ ఒకేలా ఉండరు. కొన్ని సన్నివేశాలను, ఘటనలను చూడాలంటే కొందరికి ధైర్యం తప్పనిసరి. ఆ కోవలోకి చెందినదే దల్ దల్ వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ ఏడు భాగాల వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకుడికి చమటలు తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా హింస ను చూడలేనివారు ఈ సిరీస్ గురించి మర్చిపోవడమే మేలు. అంతలా ఈ సిరీస్ లో ఏముందో ఓ సారి చూద్దాం.అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ దల్ దల్ సిరీస్ మొత్తం ఓ సీరియల్ కిల్లర్ కేసు చుట్టూనే తిరుగుతుంది. అతి చిన్న వయస్సులో ముంబై నగరానికి డీసిపి అయిన రీటా ఫెరారియాకి ఆ కేసు ఓ సవాలుగా మారుతుంది. ఇంతకీ కేసు ఏంటంటే నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు కూడా ఒకే పంథాలో ఓ సీరియల్ కిల్లర్ చేస్తూ ఉంటాడు. కిల్లర్ పోలీసులకు ఏమాత్రం క్లూ కూడా వదలకుండా చాలా పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. హత్య గావించబడ్డ బాధితులు అతి దారుణంగా హింసించి హత్య చేయబడుతుంటారు. ఈ విషయం పై మీడియా పోలీసులపై ఒత్తిడి పెంచుతుంది. అందులోనూ అనితా ఆచార్య అనే జర్నలిస్టు ఏకంగా డీసిపి అయిన రీటాని టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తూ ఉంటుంది. విచారణలో భాగంగా రీటా నేరస్తుడిని కనుక్కునే ప్రయత్నంలో తాను ఆ కేసునుండి తప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి కిల్లర్ వేసిన ప్లాన్ వల్లనే ఇలా జరుగుతుంది. ఇంతలో పోలీస్ స్టాఫ్ లో ఒకరిని మళ్ళీ సిరీయల్ కిల్లర్ చంపుతాడు. మరి దాదాపుగా నేరస్తుడిని కనుక్కున్న రీటా ఏం చేస్తుంది అన్న విషయం మాత్రం దల్ దల్ చూసే తెలుసుకోవాలి. ఈ సిరీస్ ఓ సైకలాజికల్ త్రిల్లర్, అందులోనూ హింసా నేపధ్యమున్న సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ప్రధాన పాత్రధారి రీటా భూమికను పోషించిన భూమి పెడ్నేకర్ సిరీస్ ఆద్యంతం చాలా సీరియస్ గా కనిపించడం, దానితో పాటు సన్నివేశాలలో వచ్చే దారుణమైన హింసాత్మక ఘటనలను తప్పిస్తే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులతో ఇదో థ్రిల్లింగ్ సీరిస్ . గుర్తుపెట్టుకోండి ఈ దల్ దల్ గుండె నిబ్బరం కలవాళ్ళు మాత్రమే చూడండి. -
మనోజ్ బాజ్పేయీ సినిమాకు సుప్రీం షాక్.. పేరు మార్చాల్సిందే!
మనోజ్ బాజ్పేయీ తాజా చిత్రం ‘ఘూస్ఖోర్ పండత్’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పేరు మార్చనిదే విడుదలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. నీరజ్ పాండే, రితేశ్ షా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. ఇందులో మనోజ్.. అజయ్ దీక్షిత్ అనే అవినీతీ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా పేరు, మనోజ్ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై బ్రహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలను నిలిపిపివేయాలంటూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు.. టైటిల్ మార్చిన తర్వాత విడుదల చేయాలని నిర్మాతలను ఆదేశించింది. ‘సినిమాలకు ఇలాంటి పేర్లు పెట్టి ఓ వర్గం ప్రజలను తక్కువ చేసి చూపే అధికారం ఎవరీకీ లేదు. వెంటనే పేరు మార్చాలి. కొత్త టైటిల్‌ని కోర్టుకు తెలిపిన తర్వాత విడుదల చేయాలకు అనుమతి ఇస్తాం’ అని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పాటు చిత్రంలో ఏ వర్గాన్నీ కించపరచడం లేదని హామీ ఇస్తూ నిర్మాతలు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్ర బృందం టైటిల్‌ను మార్చే యోచనలో ఉంది. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన నాగిని బ్యూటీ.. సోషల్ మీడియాలో పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర భామ సురభి జ్యోతి నాగిన్ సీరియల్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అంతే కాకుండా ఖుబూల్ హై, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై సీరియల్స్‌తో మెప్పించింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు నటుడు సుమిత్ సూరితో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2024లో పెళ్లి పీటలెక్కి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో మా ఇంటికి కొత్త మెంబర్ రానున్నారని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. మా గొప్ప సాహసయాత్ర ప్రారంభమవుతుంది.. ఈ జూన్‌లో లిటిల్ లవ్ మా ఇంటికి వస్తోందంటూ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. సురభి- సుమిత్ హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆమె భర్త సుమిత్ సూరి 2013లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) -
యానిమల్ నటుడి యాక్షన్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ సుబేదార్. ఈ యాక్షన్ సినిమాకు సురేశ్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుబేదార్ అర్జున్ మౌర్య జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు దేశం కోసం పోరాడిన సైనికుడు.. తన ఇంటిని, కుటుంబాన్ని రక్షించుకోవడానికి శత్రువులతో పోరాటం చేశారనే కోణంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా సుబేదార్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విక్రమ్ మల్హోత్రా, అనిల్ కపూర్, సురేష్ త్రివేణి నిర్మిస్తోన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. వచ్చేనెల మార్చి 5 నుంచి ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీవుతోంది. ఈ చిత్రంలో రాధిక మదన్, సౌరభ్ శుక్లా, ఆదిత్య రావల్, మోనా సింగ్ , ఫైసల్ మాలిక్ కీలక పాత్రల్లో నటించారు. -
నాకు జరిగినట్లు నా కూతురికి జరగనివ్వను!
నాలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వనంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. నా తండ్రి (నటుడు రణ్‌బీర్ కపూర్)కి, నాకు మధ్య కొంచెం గ్యాప్ ఉండేది. మేమిద్దరం అంత స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం కాదు. ఎందుకంటే ఆ జనరేషన్లో తండ్రీకొడుకుల మధ్య అలాంటి సీరియస్‌నెస్సే ఉండేది. ఇద్దరి మధ్య ఒక గోడ ఉండేది. నా కూతురి విషయానికి వచ్చేసరికి ఆ గోడను నేను కూల్చాలనుకుంటున్నాను. తనతో ఒక ఫ్రెండ్‌లా ఉండాలనుకుంటున్నాను. తను నచ్చినవన్నీ చేసేందుకు సపోర్ట్‌గా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్.. 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఈ దంపతులకు కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం రణ్‌బీర్- ఆలియా.. లవ్ అండ్ వార్ సినిమా చేస్తున్నారు. అలాగే రణ్‌బీర్.. రామాయణ మూవీలో రాముడిగా కనిపించనున్నాడు. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి సీతగా కనిపించనుంది. యష్ రావణుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశా: నిఖిల్ -
దృశ్యం 3లో ప్రకాశ్ రాజ్.. కానీ!
ఈ మధ్య ప్రకాశ్ రాజ్ గురించి అనేక రూమర్స్ వస్తున్నాయి. మొన్నటివరకు ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. దీంతో అదంతా ఫేక్ న్యూస్ అని అతడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో మరో రూమర్ నెట్టింట వైరలవుతోంది. హిందీ 'దృశ్యం 3' సినిమాలో అక్షయ్ ఖన్నా తప్పుకున్న విషయం తెలిసిందే! ప్రకాశ్‌రాజ్ క్లారిటీఆ స్థానంలో ప్రకాశ్ రాజ్ నటించనున్నాడన్నది లేటెస్ట్ టాక్. ఈ ఊహాగానాలపై ప్రకాశ్‌రాజ్ స్పందించాడు. తాను దృశ్యం 3లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదన్నాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. హిందీ మూవీ 'దృశ్యం 3'లో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. షూటింగ్ కూడా మొదలైంది. కాకపోతే నేను ఎవరినీ రీప్లేస్ చేయడంలేదు అని వెల్లడించాడు.సూపర్ హిట్ ఫ్రాంచైజీదృశ్యం విషయానికి వస్తే.. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా పలు భాషల్లో రీమేకై అక్కడా విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం మరింత సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దృశ్యం ఫ్రాంచైజీలో మూడో భాగం రాబోతోంది. మలయాళంలో ఇప్పటికే షూటింగ్ పూర్తవగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో 'దృశ్యం 3' తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.దృశ్యం 3 నుంచి అక్షయ్ అవుట్'దృశ్యం 2'లో పోలీస్ అధికారి పాత్రలో యాక్ట్ చేశాడు అక్షయ్ ఖన్నా. ఈ లెక్కన మూడో భాగంలోనూ అతడు ఉండాల్సిన వ్యక్తి! కానీ 'ధురంధర్' సక్సెస్ తర్వాత గర్వం అతడి తలకెక్కిందని, గొంతెమ్మ కోర్కెలు కోరాడని ప్రచారం జరిగింది. నిర్మాత కుమార్ మంగట్ పాఠక్ కూడా అదే నిజమన్నాడు.గొంతెమ్మ కోర్కెలు'అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ, విగ్ కావాలని డిమాండ్ చేశాడు. దృశ్యం 2లో బట్టతలతో కనిపించి ఇప్పుడు జుట్టుతో కనిపిస్తే బాగోదని నచ్చజెప్పాం. అప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకోవడంతో నోటీసులు ఇచ్చాం' అని పేర్కొన్నాడు. దీంతో అతడి స్థానంలో జైదీప్ అహ్లావత్‌ను తీసుకున్నట్లు కూడా తెలిపాడు. ఇంతలోనే ప్రకాశ్ రాజ్ తెరమీదకు రావడం, ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. Started shooting for this engaging franchise #Drishyam3 in hindi. With a wonderful team and a scintillating role to play . Im sure you will love it . ❤️❤️❤️( and yes im not replacing anyone..) 😛😛😛— Prakash Raj (@prakashraaj) February 10, 2026 చదవండి: ఏదైనా జరగరానిది జరిగితే.. శ్రీహాన్ మంచి మనసు -
పాట పాడలేనన్న ‘ధురంధర్’ సింగర్.. నెటిజన్లు ప్రశంసలు
అది ప్రముఖ సింగర్ కచేరి. వేలాది మంది తరలి వచ్చారు. ఆ సింగర్ తన గాత్రంతో సంగీత ప్రియుల్ని మంత్రముగ్థుల్ని చేస్తోంది. అందరూ ఆమె పాటలో లీనమైపోయారు. అంతే.. సడెన్‌గా ఆమె తన పాటను ఆపేసింది.న ఇద్దరు యువకులను చూసిస్తూ.. వాళ్లను పంపించకపోతే పాడేదే లేదంటూ హుకుం జారీ చేసింది. ఇది చూసి అక్కడున్నవారంతా సింగర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా సదరు గాయని చేసిన పనికి ఫిదా అవుతూ.. మంచి నిర్ణయం తీసుకుందంటూ కొనియాడారు. ఇంతకీ ఆ గాయని ఎవరు? మధ్యలోనే పాటను ఆపడానికి గల కారణం ఏంటి?పంజాబ్ సింగర్ జాస్మిన్ శాండ్లాస్ గాత్రానికి లక్షలాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పాటలకు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ‘ధురంధర్’ సినిమాలో ఆమె ఆలపించిన ‘తెను షరాత్‌సికా’ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో హచ్‌చల్ చేస్తోంది. ఈ పాటకు లక్షలాది మంది రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో మిలియన్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే జోష్‌లో ఆమె తాజాగా ఢిల్లీలో సంగీత కచేరి నిర్వహించింది. ఈ కచేరీకి వేలాది మంది సంగీత ప్రియులు వచ్చారు.జాస్మిన్ పాటలను ఆలపిస్తున్న క్రమంలో.. ఇద్దరు ఆకతాయి కుర్రాళ్లు.. అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆమె గమనించారు. వెంటనే పాటను మధ్యలో ఆపేసి.. ‘సెక్యూరిటీ.. దయచేసి అక్కడున్న ఇద్దరు అబ్బాయిలను బటయకు పంపించండి. వాళ్లు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు. నా కచేరీలో మహిళలు సురక్షితంగా లేకుంటే.. పాడడం ఆపేస్తా’ అని ఆమె హెచ్చరించింది. వాళ్లను బయటకు పంపేవరకు ఆమె ఆలపించలేదు. చివరకు అక్కడి సిబ్బంది ఆ ఇద్దరి యువకులను బయటకు పంపడంతో జాస్మిన్ తన కచేరిని కొనసాగించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న యువకుల పట్ల ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తనకోసం వచ్చి మహిళల రక్షణ కోసం ఆమె గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడుతున్నారు. View this post on Instagram A post shared by Gulabi Queen (@lifeofgulabiqueen) -
దురంధర్ హీరోకు బెదిరింపులు.. వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్..!
దురంధర్ హీరో రణ్వీర్ సింగ్‌కు బెదిరింపులొచ్చినట్లు తెలుస్తోంది. కొందరు దుండగులు వాట్సాప్ వాయిస్ చాట్ ద్వారా ఆయనను బెదిరించారు. వాట్సాప్ వాయిస్ సందేశం ద్వారా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం కాస్తా ముంబయి పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు ప్రారంభించారు.తాజా బెదిరింపుల నేపథ్యంలో ముంబయిలోని రణ్వీర్ సింగ్ ఇంటి బయట భద్రతను మరింత పెంచారు. కాగా.. ఇటీవలే ముంబయిలోని జుహులో బాలీవుడ్ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే స్టార్ హీరోకు బెదిరింపులు రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో బెదిరింపు వాయిస్ నోట్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.కాగా.. ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ బెదిరింపులపై రణ్వీర్ సింగ్ కానీ.. అతని టీమ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. -
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.ఇక హీరోయిన్ విషయంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చాడు.ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. చరణ్-సుక్కూ కాంబో మళ్లీ కలిసింది. అనుపమ కూడా ఇంకా లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తన కెరీర్లో అనుపమ కొన్ని మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరుకు స్టార్ హీరోల రేంజ్లో మాత్రం ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో, దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్-సుక్కూ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్ ఇన్ ఏ మెట్రో, వేకప్ సిద్, ‘మెట్రో ఇన్ దినో’ లాంటి సినిమాల్లో నటించారు. Meera's living her dream life. Will a secret turn it into a nightmare?Watch Accused, starring Konkona Sensharma and Pratibha Rannta, out 27 Feb, only on Netflix. #AccusedOnNetflix pic.twitter.com/J1Nuk2x3f1— Netflix India (@NetflixIndia) February 9, 2026 -
బాలీవుడ్ మూవీ.. పైసా తీసుకోని తమన్నా, విక్రాంత్!
వాలంటైన్స్ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.స్టార్ అవడానికి ముందే..అయితే విక్రాంత్ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్ తర్వాత అతడు పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. ఉచితంగానే..నేను డైరెక్ట్ చేసిన మఖ్బూల్ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్‌కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్‌కు కూడా వచ్చింది అని విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నాడు.చదవండి: సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్ -
అప్పుడు ‘షోలే’..ఇప్పుడు ‘ధురంధర్’.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
గత కొన్ని దశాబ్దాలుగా ‘ధురంధర్’లాంటి సినిమా వెండితెరపై రాలేదంటోంది చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే. ‘షోలే’ తర్వాత ఆ స్థాయి విజయం అందుకున్న సినిమా ఇదేనని గర్వంగా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ధురంధర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ధురంధర్ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఇది దర్శకనిర్మాత విజయం కాదు.. ప్రేక్షకులది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా విడుదలై.. విజయం అందుకున్న చిత్రాలు చాలా అరుదు. గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి సినిమాలు రాలేదు. ఈ చిత్రాన్ని ఒకటి ఎక్కువ సార్లు థియేటర్స్‌కి వచ్చి చూశారు. మౌత్ టాక్‌తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు నెలల పాటు థియేటర్స్‌లో అలరించింది. ‘షోలే’ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే అనుకుంటా. ఈ విజయాన్ని మేం డబ్బులతో కొనలేదు. డబ్బులతో సాధించలేని విజయం ఇది’అని జ్యోతి దేశ్‌పాండే అన్నారు. ఇక సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది. కాగా, ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ధురంధర్.. డిజిటల్ స్క్రీన్‌పై కూడా రికార్డు క్రియేట్ చేస్తుంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. -
‘ధురంధర్’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1
ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘ధురంధర్’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్‌లో పాక్ ప్రజలు చూస్తున్న టాప్ 10 సినిమాల్లో దురంధర్ మొదటి స్థానంలో ఉంది.గతేడాది డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. అయితే పాకిస్తాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ హీరోగా నటించగా.. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ధురంధర్ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
అర్థరాత్రి గదిలో మహిళ ఏడుపులు..కాళ్ల శబ్ధం, నాపై శక్తి దాడి : నటి
ప్రముఖ నటి, నృత్యకారిణి సుధా చంద్రన్ పూనకానికి సంబంధించిన ఓ వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సుధా చంద్రన్ ఇంట్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె సడన్‌గా ట్రాన్స్‌లోకి వెళ్లిపోయింది. పూనకంతో ఊగిపోతూ వింతగా ప్రవర్తించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుధా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, మద్యం తాగి అలా ప్రవర్తిస్తుందని కామెంట్ చేస్తూ ఆమెను విమర్శించారు. తాజాగా ఈ విమర్శలపై సుధా చంద్రన్ స్పందించారు. అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని వివరిస్తూనే.. గతంలో తనకు ఎదురైన వింత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. మాములు మనిషి అలా చేయగలడా?‘ఆ సమయంలో(పూనకం వచ్చినప్పుడు) నేను ఏ స్థితిలో ఉన్నానో నాకే తెలియదు. ఏం జరిగిందనే విషయం నా కుటుంబ సభ్యులు చెబితేనే తెలిసింది. కేవలం 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగానని నా భర్త చెప్పాడు. మాములు మనిషి అలా తాగగలడా? అమ్మవారే నాలోకి ప్రవేశించారని నేను చెప్పను. ఎందుకంటే అమ్మవారి శక్తిని మనిషి తట్టుకోలేడు. కానీ ఆమె ఆశిస్సులు నాపై ఉన్నాయని బలంగా నమ్ముతాను. మద్యం తాగి నేను అలా ఊగిపోయానని కొంతమంది విమర్శించారు. అదంతా యాక్టింగ్ అని కూడా అన్నారు. అసలు అలా నటిస్తే నాకొచ్చే లాభం ఏంటి? నమ్మకం లేకపోతే వదిలేయండి అంతేకానీ ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు. నా నమ్మకాలను ఎవరీకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని సుధా చెప్పుకొచ్చింది.A video of actress Sudha Chandran is going viral on social media, showing her completely immersed in devotion during Mata Ki Chowki. The video shows people around her trying to support her as she becomes emotional.1/2#SudhaChandran #MataKiChowki pic.twitter.com/rGZPiSpwT6— Siraj Noorani (@sirajnoorani) January 4, 2026ఏదో శక్తి వచ్చి నాపై పడిందిఇదే ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో తనకు జరిగిన ఓ వింత అనుభవం గురించి సుధా పంచుకుంది. ‘గుజరాత్లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ శక్తి నాపై దాడి చేసింది. ఆ రోజు షూటింగ్ పూర్తి చేసుకొని అర్థరాత్రి 11.30 గంటలకు గదిలోకి వెళ్లాను. నా పక్కన అమ్మ కూడా పడుకొని ఉంది. నేను నిద్రపోవడానికి ట్రై చేశా..కానీ మనసులో ఏదో అలజడి మొదలైంది. అతీంద్రియ సంఘటనలు(పారానార్మల్ యాక్టివిటీ) చోటు చేసుకునే అవకాశం ఉంటే నాకు ముందే తెలిసిపోతుంది. ఆ గదిలో ఏదో శక్తి ఉన్నట్లు నాకు అనిపించింది. వెంటనే లేచి కూర్చున్నా. గదిలో ఉన్న ఓ కబోర్డ్ తెరచి ఉండడం గమనించా. అక్కడ నుంచి ఓ శక్తి నావైపు కదులుతూ వచ్చింది. అది నన్ను చేరినప్పుడు, నా ఛాతీపై భారీ బరువు నొక్కినట్లు అనిపించింది. నేను నోరు తెరవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ శబ్దం బయటకు రావడం లేదు. నా తల్లి నా పక్కనే ఉన్నప్పటికీ, నేను నా చేతులను కదపలేకపోయాను. ఆ శక్తి వింతగా అరుస్తూ నాలోకి ప్రశించినట్లుగా అనిపించింది. వెంటనే నేను కార్తిక్ దేవుడిని పేరుని జపించాను. ఏదోలా నా తల్లి చేతులను టచ్ చేశాను. వెంటనే నా గొంతు వచ్చింది. నా ఛాతీ బరువు కూడా తగ్గింది. మా అమ్మ వెంటనే నాపై విభూతి చల్లింది. నేను సైలెంట్ అయిపోయా’ అని సుధా చెప్పుకొచ్చింది. అలాగే ఓ సినిమా షూటింగ్ కోసం సౌత్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది అట. ‘ షూటింగ్ కోసం సౌత్‌కి వెళ్లినప్పుడు రాత్రిపూట ఓ వ్యక్తి కాళ్ల చప్పుడుతో పాటు మహిళ ఏడుపులు కూడా వినించాయని.. తోటివారిని అడిగితే.. ఈ ప్రాంతంలో అలానే వినిపిస్తాయని చెప్పారు’ అని సుధా చెప్పుకొచ్చింది.సుధా చంద్రన్ కెరీర్ విషయానికొస్తే..‘యే హై మొహబ్బతేన్’, ‘క్యుంకీ సాస్ భీ కబీ బహు థీ’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘నాగిన్’ సిరీస్‌లో యామిని రహేజా అనే పవర్ఫుల్ నెగెటివ్ రోల్ ప్లే చేసింది.తెలుగులో మయూరి మూవీలో హీరోయిన్గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ఆమె దాదాపుగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోషించారు. -
ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పిన కరీనా కపూర్
ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 అయినప్పటికీ వారం రోజుల ముందే సందడి మొదలవుతుంది. రోజ్‌డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే.. అంటూ ఫిబ్రవరి 7 నుంచే రోజుకో రకమైన సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. ఈ క్రమంలో బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ తమలో ఎవరు ముందుకుగా ప్రపోజ్ చేశారో వెల్లడించారు.నగలు బహుమతివీరిద్దరూ జంటగా వోగ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కరీనా కపూర్ మాట్లాడుతూ నా బర్త్‌డే, పెళ్లిరోజుకు సైఫ్ జ్యువెలరీ గిఫ్ట్‌గా ఇస్తుంటాడు అంది. ఇంతలో సైఫ్ కలగజేసుకుంటూ ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు కూడా తనకు బహుమతులిస్తుంటాను అని చెప్పాడు.నాకైతే గుర్తు లేదుఐ లవ్యూ ఎవరు ముందుగా చెప్పారన్న ప్రశ్నకు.. కరీనా అది నేనే అయ్యుంటుంది. అతడు నన్ను ఇబ్బంది పెట్టకూడదనే చూస్తాడు. కాబట్టి నేనే సాహసం చేసి చెప్పుంటాను అంది. అందుకు సైఫ్.. ఇది నిజంగా బాగుంది, నాకైతే ఎవరు ముందు ప్రపోజ్ చేశారన్న విషయం అసలు గుర్తేలేదు అన్నాడు.పెళ్లిసైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 2008లో వచ్చిన తషాన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారులు తైమూర్, జే సంతానం. కాగా సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. గతంలో సైఫ్.. అమృత సింగ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఈ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2004లో విడిపోయారు.చదవండి: అజిత్‌ను కలిసేందుకు క్యూ కడుతున్న హీరోలు -
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దాంతో త్వరలో రానున్న రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథలాజికల్ టచ్ ఇవ్వడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి 2లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగింది. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', హనుతో 'ఫౌజీ' సినిమాల పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రం ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకు రెడీ అవుతున్నాయి. కల్కి 2కు ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతుంది. దాంతో ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ డేట్స్‌ను కేటాయించారు. దీంతో కల్కి 2 షూటింగ్ వర్క్ త్వరలోనే మొదలుకానుంది. హీరో ప్రభాస్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్టుల విడుదలల మధ్య గ్యాప్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని కల్కి 2 విడుదల 2027 దసరా సమయంలో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
లగ్జరీ ఇల్లు కొన్న బాలీవుడ్ హీరో
'హోంబౌండ్' సినిమా హీరో ఇషాన్ ఖట్టర్ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. నవరోజ్ అపార్ట్మెంట్లోని 14వ నెంబర్ ఫ్లాట్‌ను తన సొంతం చేసుకున్నాడు. దీని విలువ రూ.29.37 కోట్లు అని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కింద అదనంగా రూ.1.76 కోట్లు ఖర్చు చేశాడని సమాచారం.సినిమాఇషాన్ ఖట్టర్ చిన్న వయసులోనే ఇల్లు సొంతం చేసుకోవడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్- రాజేశ్ ఖట్టర్ ఇద్దరూ కూడా యాక్టర్సే కావడం విశేషం! ఇషాన్ ఖట్టర్.. గతంలో కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగానూ పని చేశాడు. బియాండ్ ద క్లౌడ్స్, ధడక్, ఖాలీ పీలి ఫోన్ బూత్, పిప్పా వంటి పలు హిందీ సినిమాలు నటించాడు.ఆస్కార్ రేసు నుంచి అవుట్గతేడాది రిలీజైన హోంబౌండ్ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సత్తా చాటింది. అంతేకాదు ఆస్కార్ రేసులో అడుగుపెట్టి అంచనాలు పెంచేసింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో భారత్ నుంచి హోంబౌండ్ మూవీ అధికారికంగా ఎంపికైంది. ఈ విభాగంలో మొత్తం 15 సినిమాలను షార్ట్ లిస్ట్ చేయగా అందులో స్థానం సంపాదించుకుంది. జనవరి 22న మరోసారి షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మాత్రం హోంబౌండ్ ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో ఆస్కార్ నుంచి నిరాశగా వెనుదిరిగింది.చదవండి: తెలుగులో ఏకైక సినిమా.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? -
తెలుగులో ఏకైక మూవీ.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఒకప్పుడు హీరోయిన్గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవడం సహజం. కథానాయికగా అలరించినవారే తర్వాత అమ్మ, అత్త, వదిన పాత్రల్లో అలరిస్తుంటారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీని వదిలేసి వెండితెరకు దూరంగా ప్రశాంతంగా బతుకుతుంటారు. నటి డాలీ మిన్హాస్ మొదటి కోవకు చెందినది. నేడు (ఫిబ్రవరి 8న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై ఈ ప్రత్యేక కథనం..మోడలింగ్ నుంచి సినిమాలవైపుడాలీ మిన్హాస్ అసలు పేరు డాలీ మాట్యూ. తనొక మోడల్. 1988లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. 1989లో మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున పోటీ చేసింది. అలా మోడలింగ్ నుంచి సినిమాల్లో వచ్చింది. డాలీ కథానాయికగా నటించిన మొదటి మూవీ దస్తూర్ (1991). సినిమాలుమిస్టర్ బాండ్, క్షత్రియ, గేమ్, ప్యార్ మే ట్విస్ట్, గుడ్ లక్, దిల్ దడక్కనే దో వంటి పలు సినిమాలు చేసింది. హిందీతో పాటు పంజాబీ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో శ్రీమాన్ బ్రహ్మచారి అని ఒకే ఒక్క సినిమా చేసింది. 1992లో వచ్చిన ఈ సినిమాలో సురేశ్ హీరోగా నటించాడు. చివరగా కబీర్ సింగ్ (2019) మూవీలో హీరో తల్లి పాత్రలో కనిపించింది.సీరియల్స్‌కు షిఫ్ట్తొలి సినిమా దర్శకుడు అనిల్ మాట్యూతో ప్రేమలో పడిన డాలీ అతడినే పెళ్లి చేసుకుంది. రానురానూ సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. ఇస్ ప్యార్‌కో క్యా నామ్ ధూ?, ఏక్ బార్ ఫిర్, చోటీ సర్దామి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. మహాయోధ, శక్తిమాన్ సీరియల్స్‌లో నెగెటివ్ పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రేమ్ లీలా సీరియల్ చేస్తోంది. అలా ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన డాలీ ఇప్పుడు బుల్లితెరపై నటిగా రాణిస్తోంది.చదవండి: జీవితంలో సంతోషంగా లేను.. దమ్ము శ్రీజ -
దురంధర్‌కు అదే పెద్ద మైనస్.. అలా జరిగితే భారీ వసూళ్లు: అమిర్ ఖాన్
గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ మూవీ గురించి స్టార్ హీరో అమిర్ ఖాన్ మాట్లాడారు. అలా జరిగి ఉంటే దురంధర్‌కు ఇంకా వసూళ్లు వచ్చేవని అన్నారు. మనదేశంలో థియేటర్ల కొరత వల్లే దురంధర్ వసూళ్లు ఇంకా తగ్గాయని వెల్లడించారు. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలంటే దేశానికి మరిన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముందని తెలిపారు.ధురంధర్ లాంటి సినిమాకు చైనీస్ సినిమాలకు లభించినంత థియేటర్స్ ఉండి ఉంటే..మరింత భారీ వసూళ్లు సాధించి ఉండేదని అన్నారు. భారత్‌లో తగినన్ని థియేటర్స్ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. చైనాలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మన దేశంలో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు.థియేటర్స్ మరింత అవసరం..ఇండియాలో మరిన్ని థియేటర్స్ నిర్మించాల్సిన అవసరముందని తాజా ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కేవలం 9 వేల స్క్రీన్లు మాత్రమే ఉన్నాయని.. చైనాలో సుమారు లక్ష స్క్రీన్లు ఉన్నాయని తెలిపారు. అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు భారీగా బిజినెస్ జరుగుతుందదన్నారు. కేవలం చైనాలో మాత్రమే అక్కడి పెద్ద సినిమాలు బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తాయన్నారు. మనం మన స్క్రీన్ల సంఖ్య పెంచితేనే అది సాధ్యమవుతుందని అమిర్ ఖాన్ సూచించారు.గతేడాది చైనీస్ చిత్రం 'నె ఝా 2' ఆ దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీతో పోలిస్తే 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ధురంధర్.. దేశీయంగా 115 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు) మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 150 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూలు చేసిందని తెలిపారు.మరింత భారీ వసూళ్లు..మనదేశంలో కూడా మరిన్ని స్క్రీన్లు అందుబాటులో ఉంటే భారతీయ సినిమాలు గొప్ప విజయాన్ని సాధించేవని అమిర్ ఖాన్ తెలిపారు. మనదేశంలో రూ.1000 కోట్ల వసూలు చేసిన దురంధర్.. 5 వేల స్క్రీన్స్ కాకుండా.. 15,000 స్క్రీన్లలో విడుదలై ఉంటే మరింత భారీ విజయం సాధించి ఉండేదన్నారు. థియేటర్స్ సంఖ్య పెరిగినప్పుడే నిజమైన మార్పు కనిపిస్తుందని.. ఎందుకంటే ప్రస్తుతం మనదేశంలో ఒక్క స్క్రీన్ కూడా లేని జిల్లాలు చాలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ అన్నారు. కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే.. గత సంవత్సరం 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 'హ్యాపీ పటేల్', రజనీకాంత్ 'కూలీ' చిత్రాల్లో అతిథి పాత్రలలో మెరిశారు. -
దాంపత్యం బానే ఉందా? బిగ్‌బాస్ విన్నర్ భార్య కౌంటర్!
హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ షోలో నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలవగా, నటి ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచింది. ఫర్హానా అభిమానులు మాత్రం తమ కంటెస్టెంటే అసలైన విన్నర్ అని, గౌరవ్ కాదని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు గౌరవ్ భార్య, నటి ఆకాంక్ష చమోలాను ట్రోల్ చేస్తున్నారు.డ్యాన్స్ వీడియోలపై ట్రోలింగ్ఆకాంక్ష ఇటీవలే తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా కున్వర్ అమర్, అలీ హసన్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. మరో వీడియోలో అవీజ్ దర్బార్తో కలిసి స్టెప్పులేసింది. ఇది చూసిన జనాలు.. తన వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లున్నాయి, అందుకే ఎప్పుడు చూసినా వేరేవాళ్లతోనే కనిపిస్తుందని విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై ఇన్ఫ్లుయెన్సర్ జయతి ఘాటుగా స్పందించింది. ప్రజలు తమ పనులన్నీ వదిలేసి ఆకాంక్షపై పడ్డారని మండిపడింది.ఆకాంక్షపై ఇంత ద్వేషం ఎందుకు?గౌరవ్ గెలుపు ఆకాంక్షకు ఎందుకు సమస్యగా మారిందో అర్థం కావడం లేదంది. తను ఏం చేసినా జడ్జ్ చేస్తున్నారని, సహనటులతో డ్యాన్స్ చేస్తుంటే కూడా తప్పుపడుతున్నారంది. అనుపమ సీరియల్లో గౌరవ్ సహనటులతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినప్పటికీ అతడినెవరూ ప్రశ్నించలేదని, కానీ ఆకాంక్ష తన పని తాను చేసుకుపోతుంటే కూడా వేలెత్తి చూపిస్తున్నారని మండిపడింది. వాళ్లు యాక్టర్స్ అని.. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిదని అభిప్రాయపడింది.నిజాయితీగా ఉన్నా..ఈ వీడియోను ఆకాంక్ష తిరిగి షేర్ చేస్తూ తనకు సపోర్ట్ చేసిన యువతిని మెచ్చుకుంది. అలాగే తన వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ ఒకరినొకరు మోసం చేసుకోకుండా నిజాయితీగా ఉండటం అవసరం. అది చాలా సర్వసాధారణమైన విషయం. మంచి భార్యగా ఉంటూనే వృత్తిపరంగా నా పని నేను చేసుకుంటున్నాను అని పేర్కొంది. ఆకాంక్ష నటించిన దిల్ ఢోకా ఔర్ డిజైర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12న షెమారోమి ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతోంది.చదవండి: అలా అన్నందుకు బాధేసింది: అమితాబ్ బచ్చన్ -
నన్ను అలా అన్నందుకు బాధలేదు.. కానీ..: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశాన్ని ఓ విదేశీ జర్నలిస్ట్ అలా అని పిలవడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఒక దేశంలో ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనప్పుడు అక్కడి స్థానిక అభిమానుల నుండి తనకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. విమానంలో ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తనను జాగ్రత్తగా హోటల్‌కు తీసుకెళ్లారని వెల్లడించారు. ఇటీవల టీమ్ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.అమితాబ్ మాట్లాడుతూ.. "ఒక దేశం నన్ను ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించింది(ఆ దేశం పేరు వెల్లడించను). దీనికి నేను వెళ్లడానికి అంగీకరించా. ఆ దేశానికి వెళ్లినప్పుడు విమానంలో ఓ వార్తాపత్రికను చూశా. అందులో నా సినిమాలలో ఒక చిత్రం ఉంది. ఆ దేశ భాష అర్థం కాక అందులో ఏమి రాశారని నేను ఎయిర్ హోస్టెస్‌ను అడిగా. అది ఒక భారతీయ సినిమా పోస్టర్ అని.. ఆ దేశానికి చెందిన నటుడు ఇక్కడికి వస్తున్నాడని పత్రికలో రాశారని ఆమె చెప్పింది" అని అన్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ తనను అభిమానుల గుంపు చుట్టుముట్టడంతో ఆశ్చర్యపోయానని వెల్లడించారు.ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఈ దేశంలో మన సినిమాల పట్ల ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. విమానం దిగిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ వరకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డా. పరిస్థితి ఎంత గందరగోళంగా మారిందంటే పోలీసులు వచ్చి నన్ను కారులో ఎక్కించి నా హోటల్‌కు తీసుకుని వెళ్లారు. నా జీవితంలో మొదటిసారిగా నా ఇమ్మిగ్రేషన్ హోటల్లో జరిగిందని' అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు.విదేశీ జర్నలిస్ట్ కామెంట్స్..అయితే తనకు ఆత్మీయ స్వాగతం లభించినప్పటికీ.. ఓ విదేశీ జర్నలిస్ట్ తనపై రాసిన కథనం చూసి బాధపడ్డానని తెలిపారు. మూడవ ప్రపంచ దేశానికి చెందిన ఈ మూడో రకం నటుడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారని కథనంలో రాసుకొచ్చాడని వెల్లడించారు. అయితే తనను మూడో రకం నటుడు అన్నందుకు బాధలేదని.. నా భారతదేశాన్ని మూడవ ప్రపంచ దేశం అని పిలవడం బాధ కలిగించిందని తెలిపారు.అందుకే తాజాగా తనకెదురైన అనుభవాన్ని క్రికెట్‌తో ముడిపెట్టి ట్వీట్ చేశారు. అండర్-19 క్రికెట్ ఇండియా.. ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలిచారు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లుగా వరల్డ్‌లోనే మొదటి స్థానంలో ఉన్నాం.. మనం మూడో ప్రపంచం కాదు.. మనం మొదటి ప్రపంచం.. భారత్ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు. అంధులు, స్త్రీలు, పురుషులు, ఇప్పుడు 19ఏళ్ల వయస్సు క్రికెటర్స్ కూడా ఈ విషయాన్ని నిరూపించారని ట్విటర్లో పంచుకున్నారు. కాగా.. ఇటీవల జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. T 5649 - U19 Cricket INDIA .. WORLD CHAMPIONS !ठोक दिया दुश्मन को !!Blind , Women's , Mens Cricket ALL world Champions .. we are NUMBER 1 .. ONE .. on top , FIRST in World ..We are NOT 3rd World .. we are FIRST World !!BHARAT MATA KI JAI 🇮🇳 🇮🇳🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) February 7, 2026 -
డేట్ ఫిక్స్
ఈ వేసవిలో ‘భూత్ బంగ్లా’ తలుపులు తెరుచుకుంటాయని అంటున్నారు అక్షయ్ కుమార్. హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. ఈ చిత్రంలో టబు, వామికా గబ్బి, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత మే 15న రిలీజ్ చేయనున్న ట్లుగా ప్రకటించారు.రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సినిమా మార్చి 19న రిలీజ్‌కు సిద్ధమైన కారణంగానే, ఏప్రిల్ 2 నుంచి మే 15కు అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ సినిమా రిలీజ్ వాయిదా పడిందనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. అయితే తాజాగా ‘భూత్ బంగ్లా’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మరి... మరోసారి కూడా ‘భూత్ బంగ్లా’ విడుదల తేదీ మారుతుందా? లేక ఏప్రిల్ 10నే ఈ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందా? అనేది చూడాలి. ఇక పద్నాలుగు సంవత్సరాల తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్లో వస్తున్న ఈ ‘భూత్ బంగ్లా’ సినిమాపై బాలీవుడ్లో అంచనాలు ఏర్పడ్డాయి. -
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలోనే 'షరారత్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఆయేషా ఖాన్‌పైనా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. కానీ కొందరు ఈమెని.. బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన తమన్నా, నోరా ఫతేహితో పోలుస్తున్నారు. తనని వాళ్లతో పోల్చడం నచ్చలేదని ఆయేషా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'తమన్నా, నోరా ఫతేహితో నన్ను పోలుస్తున్నా రీల్స్.. సోషల్ మీడియాలో నేను కూడా చూశాను. కానీ అది నాకు నచ్చట్లేదు. వాళ్లిద్దరూ అద్భుతమైన మహిళలు. నోరా స్టేజీ ఫెర్ఫార్మెన్స్, ఎనర్జీ చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. తను చేసిది నేను ఎప్పటికీ చేయలేను' అని నోరా గురించి మాట్లాడింది. తమన్నా గురించి కూడా మాట్లాడిన ఆయేషా ఖాన్.. 'తమన్నా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. 'ఆజ్ కీ రాత్' పాటలో ఆమెని చూసి నేను ఫిదా అయిపోయా. ఇండస్ట్రీకి నేను కొత్త. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పుకొచ్చింది.'ధురంధర్'లో ఐటమ్ సాంగ్‌లో కలిసి చేసిన క్రిస్టల్‌తో మనస్పర్థలు అని వస్తున్న పుకార్లపైనా ఆయేషా స్పందించింది. అవన్నీ కేవలం రూమర్సే. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా.. తెలుగులోనూ ముఖచిత్రం, ఓం బీమ్ బుష్, మనమే తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ 'ధురంధర్' మూవీ ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. -
'ధురంధర్' సినిమా కోసం 3 కేరవాన్స్ అడిగిన హీరో?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. ధురంధర్: ద రివేంజ్ మూవీ మార్చి 19న విడుదల కానుంది.మూడు కేరవాన్స్ఇదిలా ఉంటే ధురంధర్ సినిమా సెట్లో రణ్వీర్ సింగ్ ఏకంగా మూడు కేరవాన్స్ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు నిజమిదే!ధురంధర్ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో షూట్ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్ డిమాండ్ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్ కోసం రణ్వీర్ సింగ్ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు. Hamza VanHamza's staff VanHamza's Normal Van 😭😭🙏🏻#RanveerSingh what you actually do with so many vans? #Dhurandhar pic.twitter.com/yQ7oiDKvTY— Bunny (@cinephilesonly) February 1, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్ -
లుక్స్‌పై ట్రోలింగ్.. నేనూ హర్ట్ అవుతా: హీరోయిన్
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంది. తన ఫేస్ కట్ సరిగా లేదని, దవడకు సర్జరీ చేయించుకోవాలని.. ఇలా చాలామంది నానామాటలు అన్నారు. కొన్నిసార్లు ఈ విమర్శల వల్ల బాధపడ్డప్పటికీ వీలైనన్ని సార్లు ఈ కామెంట్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడానికే ప్రయత్నిస్తున్నానంటోంది షనయా.పాజిటివ్‌గా తీసుకుంటా..జూమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షనయా కపూర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాలారకాల కామెంట్లు వస్తుంటాయి. నా పని గురించి కావొచ్చు, లేదంటే నా డ్యాన్స్, యాక్టింగ్ ఎలా ఉందని చెప్తుంటారు. అయితే కొన్నిసార్లు కాస్త కఠినంగా చెప్పినప్పటికీ దాన్ని నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. వాళ్ల అభిప్రాయాలు వింటాను. వాళ్ల విమర్శలు కొంత బాధపెట్టవచ్చేమో కానీ చాలా విషయాలు తెలియజేస్తాయి.వాటిని లెక్కచేయనువాళ్లు ఏది కోరుకుంటున్నారో తెలుసుకునే కదా ముందడుగు వేయాలి. వాటిని పట్టించుకోకపోతే ఎలా? కానీ, నా లుక్స్ గురించి, ఫేస్ గురించి, శరీర సౌష్ఠవం గురించి కామెంట్స్ చేస్తే మాత్రం లెక్కచేయను. వాటిని లైట్ తీసుకుంటాను. ఈ ట్రోలింగ్ వల్ల కొన్నిసార్లు బాధనిపిస్తుంది. అప్పుడు అమ్మ(నటి మహీప్ కపూర్)తో నా బాధ చెప్పుకుంటాను. ఎందుకంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.సినిమాషనయా.. 'ఆంఖోన్ కీ గుస్తాఖియన్' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ప్రస్తుతం షనయా 'తు యా మే' మూవీ చేస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది.చదవండి: చాలామంది మోసం చేశారు: యాక్షన్ కింగ్ అర్జున్ -
బ్యాక్ టు బాలీవుడ్?
బ్యాక్ టు బాలీవుడ్ అంటున్నారట హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ‘వైట్ టైగర్, లవ్ ఎగైన్, హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్, జడ్జ్మెంట్ డే ’వంటి వరుస ఇంగ్లిష్ చిత్రాల తర్వాత ఇటీవల తెలుగు మూవీ ‘వారణాసి’ ఒప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. అయితే హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుంచి ‘క్రిష్ 4’ చిత్రం రానుంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించనున్నారు హృతిక్ రోషన్. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలని అనుకుంటున్నారు.ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందట. ఇందులో భాగంగానే ప్రియాంకా చోప్రాను సంప్రదించగా, ఆమె ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని భోగట్టా. ‘క్రిష్ 3, క్రిష్ 4’ చిత్రాల్లో ప్రియాంకా చోప్రా నటించారు. దీంతో ‘క్రిష్ 4’లో కూడా ఆమె నటిస్తే బాగుంటుందని హృతిక్ రోషన్ భావిస్తున్నారట. ‘క్రిష్ 4’ చిత్రానికి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, 2019లో వచ్చిన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం తర్వాత ప్రియాంకా చోప్రా హిందీలో అంగీకరించే చిత్రం ఇదే అవుతుంది. మరి... ‘క్రిష్ 4’తో ప్రియాంక బ్యాక్ టు బాలీవుడ్ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
జోడీ రిపీట్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీ రిపీట్ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్ మరో హీరోయిన్గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.హిందీలో ‘బదాయి హో, మైదాన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్ శర్మ ఓ రొమాంటిక్ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్ కపూర్‌కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాహిద్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్ స్క్రీన్‌పై రిపీట్ అవుతుంది. జియో స్టూడియోస్‌తో కలిసి సునీల్ ఖేతర్ పాల్ ఈ సినిమాను నిర్మించనున్నారట.మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు. -
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్‌లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్‌గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్‌లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026 -
ప్రేమకు వయసుతో పని లేదన్న నటి! భర్త చనిపోయాక..
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించింది హిందీ బుల్లితెర నటి సుజానే బెర్నెర్ట్. లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటోంది. సుజానె భర్త, నటుడు అఖిల్ మిశ్రా 2023లో మరణించాడు. ఆ తర్వాత బాధలో కూరుకుపోయిన ఆమెకు అర్జున్ హర్దాస్ అనే వ్యక్తి బాసటగా నిలిచాడు.రెండేళ్ల ప్రేమఢిల్లీకి చెందిన ఇతడి సాన్నిహిత్యంలో త్వరగానే బాధ నుంచి బయటపడింది సుజానె. వీరిద్దరూ తమకు తెలియకుండానే ప్రేమలో పడ్డారు. అలా రెండేళ్లుగా కలిసుంటున్నారు. ఈ విషయం గురించి సుజానె మాట్లాడుతూ.. ప్రేమకు వయసుతో పనేంటి? ఈ ఫలానా వయసువరకే ప్రేమలో పడొచ్చు అని ఎక్కడా రాసిలేదే.. స్వచ్ఛమైన ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.ప్రేమికుల రోజు కోసం వెయిటింగ్ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే రోజు కోసం ఆయన ఎంతో ఎదురుచూస్తున్నాడు. నాకు ఎప్పుడెప్పుడు కానుకలు ఇవ్వాలా? అని తాపత్రయపడుతున్నాడు. అలా అని ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్‌గా జరుపుకోవాలని ప్లాన్ చేసుకోవడం లేదు. కేవలం మా ఆనందాన్ని పంచుకుంటామంతే! అని చెప్పుకొచ్చింది. సుజానె (Suzanne Bernert)- అఖిల్ మిశ్రా 2009లో పెళ్లి చేసుకున్నారు. 2023లో అఖిల్ మిశ్రా కన్నుమూశాడు. ఆ తర్వాత పరిచయమైన అర్జున్‌తో సుజానె ప్రేమలో పడగా అప్పటినుంచి వీరిద్దరూ కలిసుంటున్నారు. సీరియల్స్, సినిమాసుజానె.. ప్యార్ కా పెహ్లా నామ్: రాధా మోహన్, యే రిష్తా క్యా కెహ్లాతా హై, చక్రవర్తి అశోక సామ్రాట్ వంటి పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. వెండితెరపై నో ప్రాబ్లమ్, లవ్ రెసిపీ, ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, తీర్పు వంటి పలు సినిమాలు చేసింది. చివరగా యాత్ర 2 మూవీలో సోనియా గాంధీ పాత్రను పోషించింది. View this post on Instagram A post shared by Suzanne Bernert (@suzannebernert) చదవండి: హీరోకి వాచ్ గిఫ్ట్ ఇచ్చిన పుష్ప నటుడు -
ఓటీటీలో స్వలింగ సంపర్కుల స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఒక సినిమాకు అవార్డ్ వచ్చిందంటే అందులో కంటెంటే ప్రధాన కారణం. చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే అవార్డులు వచ్చేస్తుంటాయి. అలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డ్ అందుకున్న తొలి మరాఠీ సినిమా సబర్ బొండా. ఈ మూవీని క్యాక్టస్ పియర్స్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది ఆ తర్వాత అమెరికాలో జరిగిన సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సబర్ బొండా అనే పేరుతో ఈ సినిమా ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ సినిమాని గోథెన్బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సురాజ్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రోహన్ పరశురామ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీని టాలీవుడ్ హీరో రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. Between rituals of loss and moments of connection, a new sense of belonging emergesWatch Sabar Bonda (Cactus Pears), Sundance Film Festival award winner, now on Netflix#SabarBondaOnNetflix @LotusVisualPro @bhushaan_manoj @suraaj_suman pic.twitter.com/egLzFRgDmv— Netflix India (@NetflixIndia) February 6, 2026 -
ఒక్కమాటతో తారక్‌పై గౌరవం రెట్టింపు: పూజా బేడీ
ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బేడీ చాలా తక్కువ సినిమాలే చేసింది. వాటిలో చిట్టెమ్మ మొగుడు (1993), శక్తి (2011) అని రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీలో పూజా బేడీ కీలక పాత్రలో నటించింది. ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది పూజా బేడీ. నెగెటివ్ పాత్రఆమె మాట్లాడుతూ.. శక్తి సినిమా నేను సోనూసూద్‌కు భార్యగా నటించాను. నాది ప్రతికూల ఛాయలున్న పాత్ర. ఓ సీన్లో హీరో నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆడవారితో ఫైట్ చేయలేనని నిరాకరించారు. అప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగింది. ఇప్పుడున్న సినీప్రపంచంలో ఇలాంటి విలువలు పాటించేవాళ్లు చాలా అరుదు అని తెలిపింది.తారక్ సినిమాజూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన చివరగా వార్ 2లో కనిపించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. అలాగే దేవర 2 సినిమా కూడా లైన్లో ఉంది.చదవండి: అడ్జస్ట్ అవ్వాల్సిందే.. అమ్మతో అనేసరికి: నటి -
ఈ ఐటం సాంగ్ బ్యూటీ నటిగా సక్సెస్ అయ్యేనా?
నోరా ఫతేహి ఐటం సాంగ్ స్పెషలిస్ట్. దిల్బర్ సాంగ్‌తో సెన్సేషన్ సృష్టించింది. శరీరాన్ని రబ్బర్లా సాగదీస్తూ, విల్లులా వంచుతూ స్టెప్పులేయడంలో ఆమె దిట్ట. తన ఎనర్జీకి, అందానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 6న) ఆమె 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..కెరీర్నోరా ఫతేహి కెనడా నటి. కెనడాలోని టోర్నటోలో పుట్టిపెరగడంతోపాటు అక్కడే చదువుకుంది. రోర్ (2014) సినిమాతో నటిగా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ మరుసటి ఏడాది టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా.. అనే ప్రత్యేక పాటలో అదరగొట్టింది. అక్కడినుంచే తన ఐటం సాంగ్స్ జర్నీ మొదలైంది. బాహుబలి మూవీలో 'మనోహరి..' అంటూ ప్రభాస్‌ను చుట్టుముట్టేసే సాంగ్‌తో మరింత ఆదరణ పొందింది.నటిగా కలిసిరాని అదృష్టంతెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఐటం సాంగ్స్ చేసింది. అయితే తనకు నటిగా కనిపించాలన్న కోరిక ఎక్కువ. అలా రెండేళ్లుగా ఐటం సాంగ్స్‌పై ఫోకస్ తగ్గించేసి యాక్ట్రెస్‌గా సినిమాలు చేస్తోంది. తెలుగులో మట్కా సినిమా చేయగా ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడే కాదు హిందీలోనూ తను నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో నటిగా బ్రేక్ రావడం లేదు. దీంతో మళ్లీ గతేడాది చివర్లో థామా మూవీలో స్పెషల్ సాంగ్‌లో కాలు కదిపింది. బిగ్‌బాస్ షోలోనూ..నోరా డ్యాన్సర్, నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రస్తుతం నోరా ఫతేహి.. కన్నడలో కేడీ: ద డెవిల్, తమిళంలో కాంచన 4 సినిమాలు చేస్తోంది. మరి వీటితోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి! నోరా ఫతేహి.. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. డ్యాన్స్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ జలక్ దిక్లాజా 9వ సీజన్లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇదే షోకి జడ్జిగా వ్యవహరించడం విశేషం. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
అడ్జస్ట్మెంట్ తప్పదు.. అమ్మతో చెప్పేసరికి!: స్పైడర్ నటి
మలయాళ నటి కని కుస్రుతి సొంత భాషతో పాటు తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో స్పైడర్ మూవీలో విలన్ తల్లిగా యాక్ట్ చేసింది. తాజాగా ఈ నటి అస్సి అనే హిందీలో సినిమా యాక్ట్ చేసింది. ఇందులో అత్యాచార బాధితురాలిగా కనిపించనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.అంత ఈజీ కాదుఅయితే కుస్రుతి ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకుంది. గతంలో ఈ విషయం గురించి కని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. తీరా ఇక్కడికి వచ్చాక అదంత ఈజీ కాదని తెలుసుకున్నాను. కొందరు దర్శకనిర్మాతలు లైంగిక వాంఛలు తీర్చితే అవకాశాలిస్తామన్నారు. ఓపక్క అడ్జస్ట్ అవమని ఒత్తిళ్లు, మరోపక్క నటిగా పరిమితులు విధించేవారు. అమ్మతోనూ అదేమాటకొందరైతే నేరుగా మా అమ్మతో మాట్లాడారు. ఫలానా సినిమాలో మీ కూతురు కనిపించాలంటే తను అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్నారు. ఇవన్నీ భరించలేకపోయాను. ఈ ఇండస్ట్రీలో బతకడం కష్టమని వెనక్కు వచ్చేశాను. థియేటర్ డ్రామాలు చేసుకుంటూ పోయాను. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.సినిమాకని కుస్రుతి సినిమాల విషయానికి వస్తే.. 2003లో అన్యర్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిర్యానీ, కేరళ కేఫ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కిల్లర్ సూప్, పోచర్, నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది.చదవండి: నా కొడుకు దుబారా ఖర్చు చేస్తున్నాడా? బిల్లు చూపించు: సునీల్ శెట్టి -
నా కొడుకు భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడా? ఏదీ బిల్లు తీసుకురా..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "సంకీ". సాజిద్ నజియావాలా నిర్మించిన ఈ సినిమా 2025లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ, ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. దీనికి హీరో అహాన్ శెట్టియే కారణమంటూ రూమర్స్ మొదలయ్యాయి. అతడి మితిమీరిన ఖర్చుపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాత సినిమాను అర్ధాంతరంగా ఆపేశాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌ను సునీల్ శెట్టి ఖండించాడు. బిల్లు చూపించండిఆయన మాట్లాడుతూ.. నా కొడుక్కి అతడి పరిమితులేంటో తెలుసు. దాన్ని దాటి ఎప్పుడూ ఖర్చు చేయడదు. ఇదంతా ఉట్టి ప్రచారమే.. ఒకవేళ అహాన్ భారీగా ఖర్చు చేస్తున్నాడంటే నిర్మాత అందుకు సంబంధించిన బిల్లును తీసుకురమ్మనండి. దాని సంగతేంటో నేనూ చూస్తాను. వారి బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి అవతలివారిపై నిందలు వేయడం సమంజసం కాదు. ఇది మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు అహాన్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంటి నుంచే భోజనంనేను సెట్‌కు వెళ్లినప్పుడు కూడా నా భోజనం, నీళ్లు నేనే తెచ్చుకుంటాను. నా సిబ్బందిని సెట్లో పెట్టిన ఆహారమే తినమని చెప్తాను. ఒకవేళ బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానంటే ఆ బిల్లు నేనే కడతాను, నిర్మాత కాదు! నా సిబ్బందే కాదు అహాన్ స్టాఫ్ (మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, ఇతరత్రా) కూడా ఇదే పాటిస్తారు. వాడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. అలాంటివాడిపై కావాలనే ఇలాంటి నిందలేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహాన్ శెట్టి 2021లో వచ్చిన తడప్ సినిమాతో నటుడిగా కెరీర్ ఆరంభించాడు. అతడు నటించిన రెండో చిత్రమే సంకీ. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. అహాన్ చివరగా బోర్డర్ 2 సినిమాలో నటించాడు. -
నా ఫస్ట్ మూవీ తెలుగులో.. ఇంతవరకు రిలీజవ్వలేదు
తెలుగు సినిమాతోనే తన ప్రయాణం మొదలైందంటున్నాడు బాలీవుడ్ నటుడు నకుల్ మెహతా. కానీ తెలుగులో నటించిన తొలి సినిమా ఇంతవరకు రిలీజవలేదని చెప్తున్నాడు. నకుల్ మాట్లాడుతూ.. తెలుగు మూవీతోనే నా కెరీర్ మొదలైంది. హైదరాబాద్ వెళ్లి మూడు నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడు హీరోయిన్ శ్రియా పేరు బాగా వినిపించింది. ఖాళీగానే ఉన్న సమయంలో తన సినిమాలు చూసేవాడిని. నా సినిమా ముందుకు కదల్లేదుతన కెరీర్ కూడా అప్పుడప్పుడే మొదలైంది. కానీ ఆరంభం నుంచే సక్సెస్‌ఫుల్‌గా రాణించింది. నా సినిమా మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో నేను మళ్లీ ముంబై వచ్చేసి యాడ్స్ చేసుకుంటూ నా దారి నేను చూసుకున్నాను. నటుడినవ్వాలన్న కోరిక మొదట్లో అంత బలంగా లేదు. కాకపోతే నా చుట్టూ ఉంండేవారంతా నన్ను యాక్టింగ్ వైపు వెళ్లమని చెప్పేవారు. నాక్కూడా అందరినీ ఎంటర్టైన్ చేయడం అంటే ఇష్టం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా..అలా తెలుగు సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకున్నాను. కానీ ఆ భాష నాకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అయితే మన చుట్టూ ఉన్న మనుషులు సరిగా ఉంటే అన్నీ సర్దుకుపోవచ్చనిపించింది. ఈ అనుభవం నాకు బాగానే పనికొచ్చింది. కెమెరా ముందు నటించడాన్ని మరింత ప్రేమించాను. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు నావంతు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అదే సక్సెస్శ్రియా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఎంతో సక్సెస్‌ను చూసింది, స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. నా దృష్టిలో సక్సెస్ అంటే జనం మనల్ని ప్రేమించడమే! కాగా నకుల్.. ఇష్క్బాజ్ సీరియల్‌తో గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో అభిమాని (2005) సినిమాలో యాక్ట్ చేశాడు. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. చివరగా స్పేస్ జెన్: చంద్రయాన్ అనే సిరీస్‌లో యాక్ట్ చేశాడు.చదవండి: ధురంధర్ 2లో దర్శకుడి సతీమణి -
50వ పుట్టినరోజు: రూమర్స్‌కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిషేక్ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ఐశ్వర్య, “Happy HAPPY 50th Birthday dearest Babyyy-Papa with lots of love, peace, happiness, contentment and best health. God Blesssss. Stay Golden… Shine on Love” అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఇదే సందర్భంగా సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా స్పందించారు. “అభిషేక్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు అతనికి మరింత ధైర్యం, శక్తి ఇస్తాయి” అని పేర్కొన్నారు.అభిషేక్ బచ్చన్‌కు సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. నటుడు జాకీ ష్రాఫ్ వీడియో సందేశం ద్వారా “Big Hugs” అంటూ అభినందనలు తెలిపారు. రితేష్ దేశ్‌ముఖ్, “నువ్వు నాకు అన్నయ్యలాంటివాడివి. నీకు ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం కలగాలి” అంటూ భావోద్వేగ సందేశం పంపారు. అజయ్ దేవగన్ మాత్రం హాస్యంగా, “Happy Birthday Abbas Ali… I mean @bachchan” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉండగా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. “మా వివాహంపై వస్తున్న రూమర్స్ అన్నీ పూర్తిగా అబద్ధాలు. వాటిని కావాలని కొందరు వ్యాప్తి చేస్తున్నారు. ఆమెకు నా గురించి తెలుసు, నాకు ఆమె గురించి తెలుసు. మేము ప్రేమతో, స్థిరమైన కుటుంబంగా ముందుకు సాగుతాం.. అదే ముఖ్యమైనది” అని స్పష్టం చేశారు. దీంతో వారి జంటపై వస్తున్న రూమర్స్‌కు వీరిద్దరూ మరోసారి చెక్ పెట్టారు.మొత్తంగా అభిషేక్ బచ్చన్ 50వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం, సినీ ప్రముఖులు, అభిమానులు అందించిన ప్రేమాభిమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. -
యానిమల్ సినిమా.. ఒప్పుకోవాలంటే భయమేసింది: హీరో
సందీప్‌రెడ్డి వంగా సత్తా ఉన్న దర్శకుడు. అర్జున్‌రెడ్డి సినిమాతోనే తన టాలెంట్ చూపించాడు. అదే సినిమాను హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత అతడు తెరకెక్కించిన మూవీ యానిమల్. రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్లో విడుదలై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ జపాన్‌లో ఫిబ్రవరి 13న విడుదల కానుంది.భయపడ్డా..ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ మాట్లాడుతూ.. గతంలో నేను ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ పాత్రలే చేశాను. యానిమల్ కథ చెప్పగానే నా పాత్ర గురించి విని భయపడ్డాను. కానీ సందీప్‌రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకంతో ధైర్యాన్ని కూడదీసుకున్నాను. సినిమాలో నేను పోషించిన రణ్విజయ్ పాత్ర భయంకరంగా ఉంటుంది. అది బాగా నచ్చిందికాకపోతే అతడిలో చాలా భావోద్వేగాలుంటాయి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ఈ పాయింట్ ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం పైకి కనిపించదు. నా జనరేషన్లోని అందరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. తల్లితో ఉన్నంత క్లోజ్‌గా తండ్రితో ఉండం. దూరాన్ని మెయింటైన్ చేస్తాం. అదే ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పుకొచ్చాడు.ఎప్పుడో ఫిక్సయ్యా..సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. రణ్‌బీర్‌కు అంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొత్త. అందువల్ల కథ చెప్పగానే తాను చేయగలనా? లేదా? అని భయపడిపోయాడు. కథ చెప్పిన తర్వాత స్క్రిప్ట్ అతడి చేతికిచ్చాను. కొంత టైం తీసుకున్నాకే ఓకే చెప్పాడు. అయితే ఈ కథ రాసుకుంటున్నప్పుడే నేను రణ్‌బీర్‌ను ఫిక్సయిపోయాను అని తెలిపాడు. ఇకపోతే యానిమల్కు సీక్వెల్‌గా యానిమల్ పార్కింగ్ 2028లో రానుంది. -
మళ్లీ యాక్ట్ చేస్తాననుకోలేదు: రియా ఎమోషనల్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి కెరీర్, జీవితం చిన్నాభిన్నమైంది. సుశాంత్ మృతి, డ్రగ్స్ కేసులో రియా అరెస్టయి జైలు జీవితం కూడా గడిపొచ్చింది. 5 ఏళ్లపాటు ఎన్నో నిందలు మోసింది. చివరకు సుశాంత్ మృతి కేసుకు, రియాకు ఎటువంటి సంబంధం లేదని 2025లో సీబీఐ కేసు క్లోజ్ చేయడంతో ఆమెకు ఉపశమనం లభించింది. రీఎంట్రీకానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక తన కెరీర్ క్లోజ్ అయినట్లేనని రియా ఎంతో దిగులుచెందింది. అలాంటి సమయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి పిలుపొచ్చింది. ఫ్యామిలీ బిజినెస్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం అందుకుంది. రెండు రోజుల క్రితమే సిరీస్ టీజర్ వదిలారు. తన రీఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రియా. 7 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. నిజంగా నమ్మలేకపోతున్నాను.కెరీర్ ముగిసిందనుకున్నా అంతా ఒక కలలా ఉంది. మళ్లీ నటిస్తానని అస్సలు ఊహించలేదు. యాక్టర్ అవ్వాలని 17 ఏళ్ల వయసులో బలంగా అనుకున్నాను. నా జర్నీ మొదలుపెట్టాను, కానీ మధ్యలోనే ఆగిపోయింది. అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. నటనకు చరమగీతం పాడక తప్పదనుకున్నాను. ఇంతలోనే మళ్లీ యాక్ట్ చేసే అవకాశం.. ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పులు. అయినా ఇదెంత బాగుందో అని చెప్పుకొచ్చింది.నా జీవితంలో రెండో చాప్టర్ ఈ వీడియోకు సెట్‌కు వెళ్లి ఏడేళ్లవుతోంది. నటి అవ్వాలన్న కోరికతో 17 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టినప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఇది నా జీవితంలో ఇది రెండో చాప్టర్. నా ప్లాన్స్‌లో నేనుంటే జీవితం నన్నిలా సర్ప్రైజ్ చేసింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగ్రాచ్యులేషన్స్, నీకు అంతా శుభమే జరగాలి అని కామెంట్లు చేస్తున్నారు.సినిమారియా చక్రవర్తి వీడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్‌కీ మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, జిలేబి వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. రియా చివరగా 2019లో వచ్చిన చెహ్రె మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఏడ్చేసిన భూమిక -
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ, బాలీవుడ్లో మాత్రం పెళ్లయ్యాకే కాదు, తల్లయ్యాక కూడా హీరోయిన్లు ఓ వెలుగు వెలుగుతున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి పలువురు హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా కూడా అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.నా కూతురే ఒక అద్భుతంహీరోయిన్ ప్రియాంక చోప్రా- సింగర్ నిక్ జోనస్ దంపతులకు 2022లో కూతురు మాల్తీ మేరీ చోప్రా జన్మించింది. అయితే మాల్తీ మూడు నెలలు ముందుగా పుట్టిందని, అప్పుడు చాలా బాధ అనుభవించామంటున్నాడు నిక్ జోనస్. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. 'నా కూతురు ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటీవలే తనకు నాలుగేళ్లు నిండాయి. కిలో కంటే తక్కువ బరువుభవిష్యత్తులో తను గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తను చేసే పనులన్నీ నేను కళ్లారా చూస్తూ ఆస్వాదించాలి. తన జననం అంత ఈజీగా జరగలేదు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాం. ఆ తల్లికి 2022 ఏప్రిల్‌లో డెలివరీ డేట్ ఇచ్చారు. తీరా డెలివరీ ముందే అవొచ్చన్నారు. కిలో కంటే తక్కువ బరువుతో పాప పుట్టింది. అప్పుడంతా కరోనా కాలం. పుట్టిన మూడు నెలలకే మాల్తీ అనారోగ్యంపాలైంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. ఫలించిన నిరీక్షణమూడున్నర నెలల్లో ఆరుసార్లు రక్తమార్పిడి చేశారు. నేను, నా భార్య రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ప్రియాంక సానుకూల దృక్పథంతో చాలా ధైర్యంగా నిలబడింది. ఈ విషయంలో తనే నాకు ఇన్స్పిరేషన్.. అలా మేమిద్దరం కుంగిపోకుండా, ఓపికగా తనకు బాగవుతుందని ఎదురుచూశాం. మా నిరీక్షణ ఫలించింది. నా బిడ్డ అనారోగ్యాన్ని జయించింది. బరువు పెరిగి ఆరోగ్యంగా మా చేతుల్లోకి వచ్చింది' అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు నిక్.చదవండి: చంద్రహాస్‌పై కేసు నమోదు -
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్‌స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్ సాధ్యపడొచ్చని అంచనా.650 కోట్ల రేంజ్లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది. ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్ అని చెప్పొచ్చు. -
దురంధర్-2 క్రేజ్.. బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతేనా?
గతేడాది డిసెంబరులో రిలీజై సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఛావా, కాంతార-2ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఘనత సాధించింది.కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, బాహుహలి, పుష్ప లాంటి సినిమాలను అధిగమించింది. ఇదే మూలవీ దక్షిణాది భాషల్లో కూడా విడుదలై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.దక్షిణాది భాషల్లో సీక్వెల్ రిలీజ్కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సారి దక్షిణాది మార్కెట్లోనూ దురంధర్-2 విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.భారతీయ చిత్రాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, పుష్ప-2, బాహుబలి-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దురంధర్ మూవీ హిందీలో మాత్రమే రిలీజై కేజీఎఫ్, బాహుబలి, పుష్ప చిత్రాల రికార్డులను దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.ఆ రికార్డ్స్ గల్లంతేనా?ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దంగల్, పుష్ప-2, బాహుబలి-2 లాంటి చిత్రాలను రికార్డులను అధిగమించేలా కనిపిస్తోంది. దురంధర్‌కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది సాధ్యమేనని అనిపిస్తోంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ వల్ల టాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా పడుతున్నాయి. డకాయిట్, పెద్ది సినిమాలు పోస్ట్ పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించారు. దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ చిత్రాలు తప్పుకోవడం చూస్తే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమేనని అర్థమవుతోంది. -
జెనీలియా వేగన్‌గా ఎందుకు మారిపోయిందో తెలుసా?
జెనీలియా.. ఈ పేరు చెప్పగానే చాలామందికి హ..హ.. హాసిని అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రెడీ వంటి పలు సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది. తర్వాత హిందీ, మరాఠి సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే గతేడాది జూనియర్ మూవీతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి తప్పకుండా టైం కేటాయిస్తుంది. భర్త రితేశ్, పిల్లలు రియాన్, రాహుల్‌తో సరదాగా గడుపుతుంది. అయితే కొడుకు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో జెనీలియా పూర్తి శాకాహారిగా మారిపోయిందన్న విషయం మీకు తెలుసా?కొడుకు అమాయక ప్రశ్నజెనీలియా (Genelia D'souza) జంతు ప్రేమికురాలు. కానీ చిన్నప్పటినుంచి పుష్టిగా మాంసం లాగించేది. ఒకరోజు ఆమె పెద్ద కొడుకు రియాన్ స్కూల్ నుంచి రాగానే తల్లిని ఓ ప్రశ్న అడిగాడు. అమ్మా.. నువ్వు మన ఫ్లాష్ (కుక్క)ను ప్రేమిస్తావు, కానీ కోడిని మాత్రం తింటావు. రెండింటికి మధ్య తేడా ఏముంది? రెండూ జంతువులే కదా? అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న ఆలోచనవైపు నడిపించింది. భార్యాభర్తలిద్దరూ..అలా జెనీలియా 2017లో శాకాహారిగా మారింది. నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తోంది. అయితే మొదట్లో కోడిగుడ్లు, చీజ్, ఇతరత్రా డెయిరీ పదార్థాలు మాత్రం ఆహారంలో తీసుకునేది. శాఖాహారం తీసుకున్నప్పుడు తన శరీరంలో పాజిటివ్ మార్పులు వచ్చాయని సంతోషించింది. జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఒకప్పుడు మాంసప్రియుడే. కానీ ఒకానొక సమయంలో అది కరెక్ట్ కాదనిపించడంతో 2016లో నాన్‌వెజ్ తినడం మానేశాడు.వేగనిజం2020లో కరోనా తాండవిస్తున్న సమయంలో దంపతులిద్దరికీ ఇంట్లో బోలెడంత సమయం దొరికింది. అప్పుడే వీరిద్దరూ నెమ్మదిగా డెయిరీ పదార్థాలకు కూడా స్వస్తి పలికి వేగన్‌కు జై కొట్టారు. వేగన్ అంటే.. జంతు సంబంధిత ఆహారాలకు (మాంసంతో పాటు పాలు, గుడ్లు, నెయ్యి వంటివి) దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. దీన్నే వేగనిజం అని కూడా అంటారు.చదవండి: బుల్లెట్ సునీల్‌గా రాజశేఖర్.. గ్లింప్స్ చూశారా? -
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది చంద్రికా దీక్షిత్. సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ అమ్మాయి హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొంది. తాజాగా.. భర్త యుగం గేరాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కింది. భర్త మోసం చేస్తున్నాడంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో చంద్రిక మాట్లాడుతూ.. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలేనా అని అడుగుతున్నారు. రెండు నెలలుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? నావల్ల కావట్లే..అన్నింటినీ మౌనంగా భరిస్తున్నాను. నా బాధేంటో మీకు చెప్పనా? అటు పిల్లాడిని, ఇటు ఇంటిని.. అన్నింటినీ మ్యానేజ్ చేసుకుంటున్నాను. అన్ని బాధ్యతలు నేనే నిర్వర్తిస్తున్నాను. అయినా అతడు (భర్త) ఇలా చేస్తుంటే నేనేం చేయాలి? (ఫోన్లో చాటింగ్ స్క్రీన్‌షాట్, భర్తతో క్లోజ్‌గా ఉన్న ఓ అమ్మాయి ఫోటోలు చూపిస్తూ) ఈ అమ్మాయి ఎప్పుడూ నా భర్త చుట్టూనే తిరుగుతోంది. నా భర్త, నా ఇల్లు అని ఏదేదో అంటోంది. ఈ ఫోటోలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నా మెదడును పని చేయనివ్వడం లేదు. నావల్ల కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.గుర్తుపెట్టుకో..దీనిపై ఆమె భర్త యుగం గేరా స్పందించాడు. నీకు అవసరమైంది నువ్వు చూపించావు. నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ, అదేమంత పెద్ద తప్పు కాదు. సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నావ్.. అలాంటివి నాదగ్గర చాలా ఉన్నాయి. నేను అనుకుంటే చాలా చేయగలను. కానీ నేనేమీ చేయను. ఇంకోటి.. నీ రెస్టారెంట్ నావల్లే నడుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకో అని కౌంటరిచ్చాడు. కాగా చంద్రికా.. ఆర్టిస్ట్ యుగం గేరాను పెళ్లి చేసుకుంది. యుగం గేరా.. చంద్రిక కంటే రెండుమూడేళ్లు చిన్నవాడు. ఈ దంపతులకు కుమారుడు రుద్ర సంతానం. View this post on Instagram A post shared by Chandrika Gera (@chandrika.dixit) చదవండి: అందుకే పిల్లల్ని కనలేదు: ప్రముఖ నటి -
అతడి వల్లే 4 ఏళ్లు సినిమాలకు దూరమయ్యా: మాధవన్
ఒకతను చేసిన చిన్న పని వల్ల నాలుగేళ్లు సినిమాలకే దూరంగా ఉన్నానంటున్నాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్. సాలా ఖడూస్ (2016) సినిమాకు ముందు బ్రేక్ తీసుకున్నానని, అది తనకెంతో పనికొచ్చిందంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో ఓ తమిళ పాట చిత్రీకరణ కోసం ఆరెంజ్ ప్యాంట్, గ్రీన్ షర్ట్ ధరించి రోడ్డు మధ్యలో నిల్చున్నాను. నేనెవరో చూపిస్తా అన్నంత కోపంఅక్కడే కూర్చున్న ఓ రైతు నన్ను నిర్లక్ష్యంగా ఓ చూపు చూశాడు. అది నాకసలు నచ్చలేదు. చెన్నైకి రా.. నేనెవరో నీకు చూపిస్తా అని మనసులో అనుకున్నాను. కానీ ఎందుకో ఆ చూపు నన్ను వెంటాడింది. నన్ను ఆలోచింపజేసేలా చేసింది. నిజంగానే అసలు నేనేం చేస్తున్నాను అని అంతర్మథనానికి లోనయ్యాను. అందుకే బ్రేక్ తీసుకున్నాను. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. అదిప్పటికీ పనికొస్తోందిసినిమాలు మానేసి ప్రదేశాలు తిరగడం మొదలుపెట్టాను. రిక్షా తొక్కేవారి దగ్గరి నుంచి చాలామందితో మాట్లాడాను. వారి జీవనశైలి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఇలా అన్నింటినీ పరిశీలించాను. ఆ పర్యటన నాకెన్నో పాఠాలు నేర్పింది. ఎలాంటి పాత్రలు చేయాలి? ఎలాంటి సినిమాల్లో కనిపించాలన్నదానిపై స్పష్టత వచ్చింది. ఆ నాలుగేళ్లలో నేర్చుకున్నదాని ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మాధవన్ చివరగా ధురంధర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ధురంధర్ 2తో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాడు.చదవండి: నాకు స్టార్డమ్ తెచ్చిన మూవీ అదే.. : మహేశ్‌బాబు -
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్‌కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్‌కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్‌పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్‌లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని కొన్ని భాగాలను పాకిస్తాన్‌లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?
'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్‌పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్‌లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్‌లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్‌కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా అవతరించాడు? భారత్‌పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్లో చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది
గతేడాది డిసెంబరులో రిలీజై సెన్సేషన్ సృష్టించిన హిందీ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ చిత్ర సీక్వెల్.. వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)విలన్ రహమాన్ డకాయిట్‌ని హంజా అలీ చంపడంతో తొలి పార్ట్‌ని ముగించారు. హంజా అలీ.. లయరీ ప్రాంతానికి డాన్ ఎలా అయ్యాడు? భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా విలన్స్‌ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలతో సీక్వెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ చివరలో వేసిన విజువల్స్ నే ఇప్పుడు టీజర్ గా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
ది ఇండియా హౌస్‌తో ఎంట్రీ
నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ కథానాయికగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కంపోజర్ శాశ్వత్ సచ్దేవ్ ‘ది ఇండియా హౌస్’ ద్వారా తెలుగులోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘ధురంధర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370’ చిత్రాలతో పాపులర్ అయిన శాశ్వత్ సచ్దేవ్ మా సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఐదు ఆకట్టుకునే పాటలను కంపోజ్ చేశారాయన. 1905 నాటి రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ‘ది ఇండియా హౌస్’ విప్లవం, ప్రేమ, త్యాగం.. వంటి భావోద్వేగాలో అద్భుతంగా ఉండబోతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, కెమెరా: కేకే సెంథిల్ కుమార్. -
కూతురు తెచ్చిన అదృష్టం.. హీరోల రేంజ్ మారిపోయింది!
ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..పాప తెచ్చిన సంతోషంబాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ 2023లో 'యానిమల్' మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్‌బీర్ కెరీర్లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్‌బీర్- ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్‌బీర్‌కు బాగా కలిసొచ్చింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా యానిమల్ పార్క్ రాబోతోంది.అదృష్టంబాలీవుడ్లో మరో స్టార్ జోడీ రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్‌లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్వీర్ కెరీర్‌కు కూడా మంచి బూస్ట్ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కూడా సీక్వెల్ వస్తోంది. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది.పెద్ది కూడా బ్లాక్‌బస్టర్!టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్‌చరణ్-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్‌కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్ నెక్స్ట్ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్‌కు మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్ విన్నర్‌ను గెస్ చేస్తే రూ.50 లక్షలు! -
15 ఏళ్లకే రోడ్డుపైకి.. ఎన్నో అవమానాలు: అమాల్ మాలిక్
సినిమా బ్యాక్‌గ్రౌండ్ వల్ల కెరీర్ తొలినాళ్లలో తనను ఉద్యోగం నుంచి పీకేశారంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్. ఇతడి తండ్రి డబూ మాలిక్ సంగీత దర్శకుడిగా, సింగర్‌గా బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చిన్న కొడుకు, సింగర్ అర్మాన్ మాలిక్ కూడా తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పెద్ద కొడుకు అమాల్ మాలిక్ మాత్రం ఆ స్థాయి గుర్తింపు అందుకోలేకపోయాడు. 15 ఏళ్లకే..ఇటీవలే ఇతడు హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొన్నాడు. తాజాగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమాల్ మాలిక్ మాట్లాడుతూ.. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు రోడ్డుపైకి వచ్చి పని వేట మొదలుపెట్టాను. దాదాపు 10 ఏళ్లు ఎంతో కష్టపడ్డాను. అసిస్టెంట్‌గా పని చేశాను. పోస్ట్ ప్రొడక్షన్లో ఉండే సినిమాల హార్డ్ డిస్కులు తీసిపెట్టుకునేవాడిని. తర్వాత దానితో డబ్బు సంపాదించొచ్చన్నది నా ఆశ.అవమానంఅయితే నా పేరు పక్కన మాలిక్ ఉందన్న విషయం తెలియగానే వెంటనే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేవారు. ఇతడు ఆ కుటుంబం నుంచి వచ్చాడు, ఒకవేళ మన సినిమాలోని మ్యూజిక్‌ను బయటవాళ్లకు అమ్మేసినా అమ్మేస్తాడు అని అవమానించి మరీ పక్కనపెట్టేవారు. దానివల్ల నాకు, తమ్ముడికి సరిగా పని దొరక్కపోయేది. మాకు బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి మా జర్నీలో కష్టాలే లేవని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు అని చెప్పుకొచ్చాడు.సంగీత దర్శకుడిగా..అమాల్ మాలిక్.. సల్మాన్ ఖాన్ జై హో సినిమాతో సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఏక్ పహేలీ లీలా, హీరో, క్యాలెండర్ గర్ల్స్, హేట్ స్టోరీ 3, ఎయిర్‌లిఫ్ట్, బాఘీ, బద్రీనాథ్ కీ దుల్హానియా వంటి పలు చిత్రాల్లో పాటలు కంపోజ్ చేశాడు.చదవండి: 50 మంది సెలబ్రిటీలతో గేమ్ షో -
ఓటీటీలో దురంధర్ క్రేజ్.. ఏకంగా పాకిస్తాన్లో నంబర్‌వన్‌గా ట్రెండింగ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.ఈ మూవీని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్ దూసుకెళ్తోంది. పాకిస్తాన్‌లోనూ ఈ మూవీ నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది. -
50 మంది సెలబ్రిటీలతో కొత్త రియాలిటీ షో..
మన దేశంలో రియాలిటీ షోలకున్న క్రేజే వేరు. సినిమాల్లో, టీవీలో, సోషల్ మీడియాలో కనిపించే సెలబ్రిటీలు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తెలుసుకోవాలని అభిమానులు తెగ తహతహలాడుతుంటారు. అలాంటి వారికోసం ఎన్నో గేమ్ షోలు, రియాలిటీ షోలు పుట్టుకొచ్చాయి. తాజాగా ద 50 గేమ్ షో మొదలైంది. అసలు ఆ షో ఏంటి? దాని స్పెషాలింటీ ఏంటి? అన్నది ఓసారి చూసేద్దాం..50 మంది సెలబ్రిటీలుబిగ్బాస్ షోలో 20 మందికి అటుఇటుగా సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపిస్తారు. వందరోజులపాటు టాస్కులు, గేమ్స్ ఇస్తారు. చివర్లో ఒకరిని విజేతగా ప్రకటించి రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ద 50 షో కూడా ఇంచుమించు ఇలాంటిదే! కాకపోతే ఇక్కడ సెలబ్రిటీలు పది మందో ఇరవైమందో కాదు, ఏకంగా 50 మంది ఉన్నారు. వీళ్లందర్నీ ఒక పెద్ద రాజభవనంలాంటి మహల్లో ఉంచుతారు. దీన్నే లయన్ హౌస్ అంటారు.ప్రైజ్‌మనీ ఎవరికంటే?సమయానుసారం టాస్కులు ఆడిస్తారు. ఎప్పుడుపడితే అప్పుడు ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడుపడితే అప్పుడు ఎందుకంటే ద 50 అనేది కేవలం యాభై రోజుల గేమ్ షో. మరి అన్నీ దాటుకుని చివరిదాకా వచ్చినవారికేమైనా ఉంటుందా? అంటే ఇప్పటికైతే అలాంటి ప్రైజ్‌మనీ ఏమీ ప్రకటించలేదు. కాకపోతే ఎవరు గెలుస్తారో గెస్ చేసిన అభిమాని/ ప్రేక్షకులకు మాత్రం ప్రైజ్‌మనీ దక్కుతుంది. అది కూడా అక్షరాలా రూ.50 లక్షల రూపాయలు.నో హోస్ట్లెస్ సింక్వాంటె (సింక్వాంటె అంటే 50 అని అర్థం) అనే ఫ్రెంచ్ షో ఆధారంగా 'ద 50' రియాలిటీ షోని డిజైన్ చేశారు. అయితే మాతృకలో ఉన్న అనేక నిబంధనలను ఇక్కడ కాస్త సడలించారు. ఈ షోకి హోస్ట్ అంటూ ఎవరూ ఉండరు. బిగ్‌బాస్‌లో ఎలాగైతే కనిపించని వ్యక్తి ఆదేశాలు ఇస్తాడో.. ఇక్కడ కూడా సింహం మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడిస్తాడు, ఛాలెంజ్‌లు విసురుతాడు, ఎలిమినేట్ చేస్తాడు. ఫిబ్రవరి 1న ఈ షో మొదలైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో రోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుండగా.. కలర్స్ టీవీలో రాత్రి 10.30కి ప్రసారమవుతోంది.కంటెస్టెంట్లు వీళ్లే..తేజస్వి మదివాడ (తెలుగమ్మాయి), కరణ్ పటేల్, ఊర్వశి ఢోలకియా, రజత్ దలాల్, మిస్టర్ ఫైజు, దివ్య అగర్వాల్, మోనాలిసా, విక్రాంత్ సింగ్ రాజ్‌పుత్, శినీ దోశి, రిది డోగ్రా, దుశ్యంత్ కుక్రేజా, శివ్ ఠాక్రే, నీలం గిరి, చాహత్ పాండే, హమీద్ బర్క్జీ, డింపాల్ సింగ్, మాక్స్టర్న్, సుమైరా షైఖ్, లవ్‌కేశ్ కటారియా, సివెత్ తోమర్, నేహాల్ చుదసమ, కృష్ణ ష్రాఫ్, సప్న చౌదరి, నిక్కీ తంబోలి, అర్బాజ్ పటేల్, వన్హాజ్ సింగ్, ప్రిన్స్ నరౌలా, యువికా చౌదరి, అర్చనా గౌతమ్, బేబికా ధుర్వె, జాన్వీ కిల్లెకర్, యంగ్ సామీ, అద్నాన్ షైఖ్, లక్షయ్ కౌశిక్, అర్చిత్ కౌశిక్, దిగ్విజయ్ రాతే, నటాలియా జన్జోజ్సెక్, ఖన్జాదీ, ఫైజ్ బలోచ్, రచిత్ రోజా, సిద్దార్థ్ భరద్వాజ్, డినో జేమ్స్, ఆర్య జదావో, సౌరభ్ గాడ్గె, మనీషా రాని, ఆరుశి చావ్లా, రిద్దిమా పండిట్, శ్రుతికా అర్జున్, భవ్య సింగ్, ఇమ్మోర్టల్ కాక.. పార్టిసిపెంట్లుగా లయన్ హౌస్‌లో అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) చదవండి: ఎక్కువ పారితోషికం.. సినిమాను నాశనం చేస్తున్నారు: నటుడు -
రూ.70 కోట్ల పారితోషికం.. అది తెలివితక్కువ పని: నటుడు
సినిమాలు ఆడినా, ఆడకపోయినా పారితోషికం మాత్రం పైసా తగ్గకుండా ఖతాలో పడాల్సిందే! అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు స్టార్ హీరోలు. కనీసం సినిమా బడ్జెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోకుండా భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్.స్టార్ హీరోల కెపాసిటీఇతడు నటించడంతో పాటు సహనిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం 'బ్రేక్ కే బాద్'. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు సినిమా బడ్జెట్‌ను బట్టి హీరోలను ఎంపిక చేసేవారు. అది చాలా మంచి పద్ధతి. స్టార్ హీరోకు ఎక్కువమంది జనాల్ని థియేటర్‌కు రప్పించే సత్తా ఉంది. కొందరు నటులకు అంత కెపాసిటీ ఉండదు.బాధ్యత కనిపించట్లే..కాబట్టి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా తీస్తున్నప్పుడు స్టార్ హీరోలను ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదు. అయితే నా ముందున్న తరాలు సినిమా కోసం ఎంతో కష్టపడేవి. అలా అని వారి జేబులో నుంచి డబ్బు తీసి పెట్టేవారు కాదు. కాకపోతే సినిమా కోసం బాధ్యతగా పనిచేసేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోలే సినిమాను చంపేస్తున్నారు. ఉదాహరణకు ఒక సినిమా బడ్జెట్ రూ.30 కోట్లు అనుకుందాం. సినిమా గురించి ఆలోచించరా?నేను మాత్రం అదేం పట్టించుకోకుండా నా రెమ్యునరేషన్ రూ.40 కోట్లు తీసుకుంటే అప్పుడు బడ్జెట్ ఒక్కసారిగా రూ.70 కోట్లు అవుతుంది. ఇదెంతవరకు కరెక్ట్? సినిమా బడ్జెట్‌ను కచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి. కొన్ని డీసెంట్‌గా ఉండే సినిమాలకు అంత డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఆమిర్ ఖాన్.. మూవీ రిలీజయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి దాంట్లో వాటా తీసుకుంటాడు. అది తెలివితక్కువ పనిఅంతే తప్ప.. నేను స్టార్ హీరోని, రూ.60 కోట్లు ఇవ్వు, రూ.75 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేయడు. అలా చేస్తే అంతకంటే తెలివితక్కువపని మరొకటి ఉండదు. సినిమాను మీరే దెబ్బతీసినవాళ్లవుతారు. సినిమాను నాశనం చేసి మీరు మాత్రం ఎదిగినవాళ్లవుతారు. ఇదెలా ఉంటుందంటే.. మీరెలాంటి చెత్త సినిమా తీస్తున్నారో ఎవరికి తెలుసు? నా డబ్బులైతే నాకిచ్చేయండి. సినిమా ఎటు పోతే నాకేంటి? అని గాలికొదిలేసినట్లుగా ఉంటుంది అని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: కూతురే నా సర్వస్వం.. నా బ్యాగ్‌లో ఏముందో తెలుసా?: దీపికా -
దుల్కర్-మృణాల్ మళ్లీ జంటగా.. ఈసారి గత జన్మలు
'సీతారామం'.. టాలీవుడ్ మర్చిపోలేని సినిమాల్లో ఒకటి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ తమ యాక్టింగ్, కెమిస్ట్రీ.. దీన్ని అద్భుతమైన మూవీగా మార్చేశారు. అప్పటినుంచి వీళ్లిద్దరూ మరోసారి ఎప్పుడు కలిసి నటిస్తారా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. 'సీతారామం' సీక్వెల్ గురించి కూడా అప్పుడప్పుడు రూమర్స్ వినిపించేవి. ఆ చిత్రం కాదు గానీ ఇద్దరూ మరోసారి కలిసి నటించారు. అదీ ఓ ఆల్బమ్ సాంగ్ కోసం. అదిప్పుడు యూట్యూబ్‌లో రిలీజైంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)'బిగీ బిగీ' అంటూ సాగే ఆల్బమ్ సాంగ్‌కి ఏఆర్ రెహమాన్ సంగీంతమందించారు. రెహమాన్ కొడుకు అమీర్, జస్లిన్ కలిసి పాడారు. మెలోడీ సాంగ్‌కి వినడానికి బాగుంది. విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే రిపీట్స్ వినేంతలా అయితే ఈ పాట లేదు. ట్రైనులో వెళ్తున్న దుల్కర్, మృణాల్.. ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ల గత జన్మలు గుర్తొస్తాయి అన్నట్లు విజువల్స్ చూపించారు. కెమిస్ట్రీ కూడా పర్లేదనిపించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్) -
కూతురే నా లోకం.. నా బ్యాగులో ఏముందంటే?: దీపికా
తల్లయ్యాక ప్రతి మహిళలో ఒక మార్పు కచ్చితంగా వస్తుంది. అప్పటివరకు ఉన్న ప్రాధాన్యతలు పక్కనపెట్టి కన్నబిడ్డే సర్వస్వంగా బతుకుతుంది. ఆ బిడ్డ కంటే ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదంటుంది. అందుకు ఇండియన్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా అతీతురాలు కాదు. పాప పుట్టాక తనే ప్రపంచంగా బతికేస్తున్నానంటోంది. తనే నా సర్వస్వంతాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె మాట్లాడుతూ.. ఇప్పుడు దువా (దీపికా కూతురి పేరు)యే నా ప్రపంచం. తనకు ఆకలేస్తే తినడానికి ఏదైనా ఫుడ్ నా బ్యాగ్‌లో ఉంటుంది. ఈ మధ్యే తను తిని వదిలేసిన తెప్లా (ఒకరకమైన చపాతీ) ముక్క బ్యాగ్‌లో అలాగే ఉండిపోయింది. రెండు రోజుల తర్వాత దాన్ని చూసి పారేశాను. పాపకు వీలైనన్నిసార్లు ఐ లవ్యూ చెప్తూనే ఉన్నాను. తనతో హెడ్, షోల్డర్, నీస్, టూస్.. అంటూ పాటలు పాడుతున్నాను అని చెప్పుకొచ్చింది.సినిమాఇక తాను హీరోయిన్ అవకపోయుంటే ఇంటీరియర్ డిజైనర్ అయ్యేదాన్ని అని దీపికా పేర్కొంది. అయితే తన భర్త, హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నేను మంచి లాయర్ అవాల్సింది అని అంటుంటాడని తెలిపింది. దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2024లో కూతురు దువా జన్మించింది. ప్రస్తుతం దీపికా.. కింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రణ్వీర్ సింగ్ ఇటీవలే ధురంధర్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు.చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ -
ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?
స్వతహాగా బాలీవుడ్ నటి అయినప్పటికీ.. 'సీతారామం' సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకుర్. ఈమె మంచి యాక్టరే. కానీ రీసెంట్ టైంలో హీరో ధనుష్‌ని ఈమె పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై మృణాల్ టీమ్ కూడా కొన్నిరోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈమె కూడా ఈ విషయమై స్పందించినట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)'నా పని మాత్రమే నాకు గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటాను. గాసిప్స్ కాదు. కానీ ఇప్పుడు నా ప్రమేయం లేని కొన్నింటిలో నా పేరు వినిపిస్తోంది. 'సో కాల్డ్ పెళ్లి కాంట్రవర్సీ' సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ధనుష్ నాకు సోదరుడు లాంటోడు. మా మధ్య గౌరవం, ప్రొఫెషనలిజం మాత్రమే ఉన్నాయి. అంతకు మించి ఇంకేం లేవు. అసలు జనాలు.. ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు పుకార్లు సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇన్నాళ్లు ఏం మాట్లాడలేదు అంటే ఏదో దాచిపెడుతున్నానట్లు కాదు. నా వ్యక్తిగత జీవితం గురించి జనాలకు క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదని అర్థం. ఇన్నేళ్ల కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. రూమర్స్ దాన్ని తగ్గించాలని చూడొద్దు. లైక్స్, షేర్స్ వల్ల ఇబ్బంది ఏముంటుందిలే అనుకోవచ్చు. కానీ వాటి వల్ల జీవితాలపై గట్టి ప్రభావమే పడొచ్చు' అని మృణాల్ చెప్పినట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.ట్విటర్ అకౌంట్ చూస్తే మృణాల్ ఠాకుర్దే అనుకుంటున్నారు గానీ అది ఫ్యాన్ పేజీలా అనిపిస్తుంది. బహుశా ఈమె టీమ్ వైపు నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. మృణాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'దో దివానే షెహర్ మైన్'.. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. ఈమె నటించిన తెలుగు మూవీ 'డెకాయిట్'.. మార్చి 19న రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ) -
ఇంత సెన్సేషన్ ఊహించలేదు, ఇకనైనా అవకాశాలొస్తే బాగుండు!
'రంభ హో హోహో..' ఈ పాట ఒకప్పుడు చాలా ఫేమస్. ధురంధర్ సినిమాలో ఈ సాంగ్‌ను వాడుకోవడంతో మరోసారి వైరల్ అయింది. అయితే ఈ పాటకు 70 ఏళ్ల నటి కల్పనా అయ్యర్ హుషారుగా స్టెప్పులెయ్యడం అంతకంటే ఎక్కువ వైరలవుతోంది. 1981లో వచ్చిన అర్మాన్ సినిమాలోని పాటే రంభ హో హో. ఈ డిస్కో సాంగ్‌లో కల్పనా అయ్యర్ స్టెప్పులేసింది. పెళ్లిలో డ్యాన్స్దాదాపు 45 ఏళ్ల తర్వాత మరోసారి ఈ పాటపై కాలు కదిపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కల్పనా అయ్యర్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ కుమారుడి పెళ్లికి వెళ్లాను. అతడిని నా కొడుకులాగే భావిస్తాను. అందుకే ఫ్యామిలీతో కలిసి ఆ పెళ్లికి హాజరయ్యాను. అందరూ డ్యాన్స్ చేయమని కోరితే అప్పటికప్పుడు స్టెప్పులేశా.. అదేమీ ముందుగా ప్లాన్ చేసుకోలేదు.చాలా స్పెషల్ఆ వీడియోను సాధారణంగా సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఇంకేముంది, కొద్ది గంటల్లోనే చాలా వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే వీడియో కనిపిస్తోంది. అందరూ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులోనూ నాలుగు దశాబ్దాల కిందట డ్యాన్స్ చేసిన పాట మరోసారి గుర్తింపు తెచ్చుకుంటుంటే మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది. అవకాశాలు వస్తే అంతే చాలుఈ సాంగ్‌ను ధురంధర్ మూవీలో వాడారని విన్నాను. అందుకు దర్శకుడు ఆదిత్య ధర్‌కు కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే! ఆయన వల్లే ఇప్పటి జెనరేషన్ ఆ పాటను మళ్లీ పాడుకోగలుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీని చాలా మిస్ అయ్యాను. ఈ వైరల్ పాపులారిటీ మూలాన అవకాశాలు వస్తే కెమెరా ముందు నటిస్తాను అంటోంది. మరి కల్పనా కోరిక నెరవేరుతుందా? మరోసారి వెండితెరపై కనిపిస్తుందా? అన్నది చూడాలి! వందకు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన కల్పనా.. చివరగా హమ్ సాత్ సాత్ హై (1999) మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by RISE & INSPIRE 💫 (@rise_and_inspire_org) చదవండి: కవలలు పుట్టాక రామ్‌చరణ్ ఫస్ట్ పోస్ట్. -
ఆడవాళ్లపై ఇలాంటి ట్రోల్సా? చెండాలం: యాంకర్ ఫైర్
ఒకప్పుడు ఆడ, మగ క్లోజ్‌గా కనిపిస్తే చాలు వాళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని రూమర్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు కేవలం కలిసి కనిపించినా సరే.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, యాంకర్ షెఫాలి బగ్గా డిన్నర్‌కు వెళ్లడంతో వీరు లవ్‌లో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) పోస్టర్ వైరలవుతోంది.యాంకర్ ఫైర్ఇందులో చాహల్ కుర్చీలో కూర్చోగా అతడి పక్కన మాజీ భార్య ధనశ్రీ వర్మ, ఆర్జే మహవశ్, షెఫాలి ఉన్నారు. ఈ ఫోటో మొదట చాహల్ కంట పడింది. అది చూసిన అతడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని మిస్ అయ్యారంటూ సెటైర్లు వేశాడు. తాజాగా ఈ ఏఐ పోస్టర్‌పై షెఫాలి మండిపడింది. ఇదెంత చెండాలం.. ఆడవారిని ఇలా చూపించడం సిగ్గుచేటు. మీ మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుంది. మీ పనేదో మీరు చూసుకుంటే బెటర్ అని కౌంటరిచ్చింది.పెళ్లి- విడాకులుఇకపోతే చాహల్.. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 2024లో విడిపోయారు. 2025లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యాంకర్ ఆర్జే మహవశ్‌తో కొంతకాలం రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సడన్‌గా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ అయిపయిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. బిగ్‌బాస్‌తో ఫేమస్అనంతరం షెఫాలీతో కనిపించడంతో మళ్లీ ప్రేమలో పడ్డాడని పలువురు భావించారు. కానీ ఇప్పుడు యాంకర్ ఇచ్చిన కౌంటర్‌తో అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. కాగా షెఫాలి న్యూస్ యాంకర్. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పార్టిసిపేట్ చేయడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.చదవండి: అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ -
దురంధర్ రంభ హో ఫీవర్ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్ డ్యాన్స్ వైరల్ వీడియో
ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, జీవితంలో వర్తమాన క్షణాలను ఆస్వాదించడానికి వయసుతో పనేముంది. సమయం, సందర్భం కలిసి వస్తే మనసు నాట్యమయూరే అవుతుంది. ఇక నాట్యంలో ఆరితేరిన వారైతే.. ఇక చెప్పేదేముంది ఉరిమే ఉత్సాహంతో ఉర్రూతలూగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నా ఈ వీడియోను చూస్తే ఎంతటివరైనా కాలు కదపాల్సిందే.. పక్కా.! ఆ సోషల్ మీడియా సెన్సేషన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కల్పనా అయ్యర్. వయసు 70 ఏళ్లు అయితేనేం అందమైన డ్యాన్స్‌తో మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తన కరియర్లో ఐకానిక్ సాంగ్ ‘రంభా హో హో హో’ పాటకు అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. తాజాగా ఈ పాటను దురంధర్‌లో వాడుకోవడంతో మరింత ఇంట్రస్టింగ్మారింది. దురంధర్ సినిమా అటు కలెక్షన్లనుంచి ఇటు వివాదాల కారనంగా అనేక కారణాలతో వార్తల్లో నిలిచింది. ఐకానిక్ రెట్రో పాట 'రంభ హో' వాడుకోవడం వాటిలో ఒకటి.1981లో వచ్చిన 'అర్మాన్' చిత్రంలో ఈ పాటలో నటించిన సీనియర్ నటి కల్పనా అయ్యర్, దాదాపు 40 ఏళ్ల తరువాత ఆ మ్యాజిక్‌ను పునఃసృష్టించారు. దీంతొ అభిమానులు నాస్టాల్జియాతో పులకరించారు. స్వయంగా కల్పనా తన ఇన్‌స్టాఖాతాలో శుక్రవారం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇలా అన్నారు. “ఒక స్నేహితురాలు నాకు ఈ క్లిప్‌ను పంపింది, ఇది నిన్న రాత్రిది, ఇలా చేశానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. చాలా కాలంగా డ్యాన్స్ చేయలేదు. ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. సిద్ధాంత్ పెళ్లి.” అని ఆమె పేర్కొన్నారు. నలుపు-బంగారు బ్లౌజ్ ఊదా రంగు పట్టు చీరలో ఆమె స్టెప్పులుకు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా కల్పనా అయ్యర్‌పై ప్రశంసల జల్లుకురుస్తోంది ఎవరీ కల్పనా అయ్యర్బాలీవుడ్లో విలన్ పాత్రలకు, ముఖ్యంగా 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రంలో తన నటనకు బాగా గుర్తుండిపోయే కల్పనా అయ్యర్, మిస్ ఇండియా 1978 పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్ 1978లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, టాప్ 15 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. ఎక్కువగా బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రలను పోషించారు. 1980 నాటి 'ప్యారా దుష్మన్' చిత్రంలోని "హరి ఓం హరి", ఆ తర్వాత 1981లో 'అర్మాన్' చిత్రంలోని "రంభ హో" వంటి జనాదరణ పొందిన డ్యాన్స్ నంబర్లతో డ్యాన్సింగ్ క్వీన్‌గా పాపులర్ అయ్యారు. View this post on Instagram A post shared by striloka (@strilokaa) -
ముంబయిలో కలకలం.. స్టార్ డైరెక్టర్ ఇంటిపై కాల్పులు.!
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు.. వెంటనే బైక్‌పై పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల భారీ భద్రతను మోహరించారు. ముంబయి పోలీసు కమిషనర్ దేవన్ భారతి ఈ సంఘటనను ధృవీకరించారు. అయితే రోహిత్ శెట్టి కుటుంబం ఈ సంఘటనపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.సినిమా కెరీర్..కాగా.. రోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్‌గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు. -
ఎప్స్టీన్ ఫైల్స్‌లో మీరా నాయర్
న్యూయార్క్: జెఫ్రీ ఎప్స్టీన్పై అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన దర్యాప్తు పత్రాల్లో బాలీవుడ్ దర్శకురాలు, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు సైతం ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ప్రియురాలు మాక్స్వెల్ ఇచ్చిన విందుకు మీరా నాయర్ హాజరైనట్లు ఓ ఈమెయిల్ సందేశాన్ని ఈ పత్రాల్లో ప్రస్తావించారు. మాక్స్వెల్ ఇంట్లో జరిగిన ఓ సినిమా ప్రదర్శనకు, ఆ తర్వాత జరిగిన విందులో ఆమె పాల్గొన్నట్లు ఇందులో ఉంది. 2009 అక్టోబర్ 21న ఈ ఈమెయిల్‌ను అమెరికన్ ప్రచురణకర్త పెగ్గీ సీగెల్ మరొకరికి పంపించారు. బిల్ క్లింటన్, జెఫ్ బెజోస్ కూడా హాజరైనట్లు మెయిల్లో పోస్టుచేశారు. ఈ సినిమా మహిళలకు బాగా నచ్చిందని పేర్కొన్నారు. అయితే, అది ఏ సినిమా అన్నది మెయిల్లో స్పష్టంగాలేదు. అందుబాటులో ఉన్న వివరాలను బట్టి చూస్తే అది ‘అమెలియా’అనే చిత్రం. మీరా నాయర్ దర్శకత్వం వహించారు. అమెరికా పైలట్ అమెలియా ఇయర్హర్ట్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిల్లరీ స్వాంక్, రిచర్డ్ గెరే నటించారు. విమానంలో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ప్రయత్నంలో అమెలియా 1937లో పసిఫిక్ సముద్రంపై ఉండగా అదృశ్యమయ్యారు. అయితే, ఎప్స్టీన్ పత్రాల్లో తన పేరు ప్రస్తావనకు రావడంపై మీరా నాయర్ ఇంకా స్పందించలేదు. -
వీర జవాన్‌గా సల్మాన్.. ఇది రొమాంటిక్ లుక్ కాదు!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హిట్టు కోసం పరితపిస్తున్నాడు. గతకొంతకాలంగా ఆయన చేసిన సినిమాలేవీ విజయాన్ని సాధించడం లేవు. దీంతో ప్రస్తుతం అతడు నటిస్తున్న "బ్యాటిల్ ఆఫ్ గల్వాన్" సినిమాపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ వదిలారు. అందులో ఓ సన్నివేశంలో సల్మాన్ లుక్, యాక్టింగ్‌పై ట్రోల్స్ వచ్చాయి.సల్మాన్‌పై విమర్శలుసైనికుడు చూపించే ధైర్యసాహసాలు అతడి ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి సల్మాన్ తాజాగా కౌంటరిచ్చాడు. ఈ మేరకు ఐఎస్పీఎల్ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్) ఈవెంట్లో మాజీ క్రికెటర్, యాంకర్ మహ్మద్ కైఫ్‌తో సల్మాన్ సంభాషిస్తున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో కైఫ్.. సల్మాన్‌ను బ్యాటిల్ ఆఫ్ గల్వాన్‌లో ఎలా పోజిచ్చాడో అలా ఓ లుక్కివ్వమన్నాడు. నేను కల్నల్నిఅప్పుడు సల్మాన్.. ఇప్పుడు కొంతమంది ఇది రొమాంటిక్ లుక్ అనుకుంటారు.. కానీ, ఇది కల్నల్ పోజ్. తన జట్టును, సైనికులను ఎలా ముందుకు తీసుకెళ్లాలో బాగా తెలిసిన కల్నల్ ఇలాగే ఉంటాడు అంటూ ట్రోలర్స్‌కు చురకలంటించాడు . బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా విషయానికి వస్తే.. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిత్రాంగద సింగ్, అభిలాష్ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్‌బాబు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశభక్తి మూవీ ఏప్రిల్ 17న విడుదల కానుంది. LATEST: Salman Khan Hits back at all the trolls regarding Battle of Galwan teaser!"Mai colonel hu movie me, Mujhe Calm rehna parega. Kuch log bs faltu ka troll karte. Mai chila bhi sakta hu, but suit ni karega" #SalmanKhan #BattleOfGalwan pic.twitter.com/MY1PY3LgeA— Being ADARSH⚡ (@IBeingAdarsh_) January 31, 2026చదవండి: ఐశ్వర్యరాయ్ తొలి సంపాదన ఎంతంటే? -
ఐశ్వర్యరాయ్ తొలి సంపాదన ఎంతో తెలుసా?
బాలీవుడ్లో రిచెస్ట్ హీరోయిన్, అందాలరాశి ఎవరంటే ముందు ఐశ్వర్యరాయ్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు సినిమా రంగాన్ని ఏలిన ఐష్ ఆస్తి విలువ దాదాపు రూ.900 కోట్లు ఉంటుందని అంచనా.. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం అంత ఈజీ కాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్న ఐశ్వర్య తొలి సంపాదన ఎంతో చూసేద్దాం..తొలి సంపాదన ఎంతంటే?బాలీవుడ్ నిర్మాత శైలేంద్ర సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకులను గురించి వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఐశ్వర్యరాయ్‌ను తొలిసారి చూసినప్పుడు ఆమెకు 18 లేదా 19 ఏళ్లు ఉంటాయనుకుంటా.. ఐదువేల రూపాయలకే మూడు యాడ్స్‌లో నటించింది. అలా మొదలైందిఒకదాంట్లో అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడో ఉందంతే! కానీ ఐశ్వర్య లుక్స్ అందరినీ ఆకర్షించేవి. దాంతో వాణిజ్య ప్రకటనలో నటించమని ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అలా అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఈయన ఫిరాఖ్, ఫిర్ మిలేంగే, పేజ్ 3 వంటి పలు సినిమాలు నిర్మించాడు.జర్నీ1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. జీన్స్ అనే తమిళ చిత్రంతో అందరి కంట్లో పడింది. దేవదాస్, జోధా అక్బర్, ఏ దిల్ హై ముష్కిల్, హమ్ దిల్‌దే చుకే సనం వంటి పలు చిత్రాలతో స్టార్ హీరోయిన్గా మారింది. కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ డ్యాన్స్‌తో అద్భుతః అనిపిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. చివరగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో యాక్ట్ చేసింది. 2009లో కేంద్రం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేయాలనుకున్నా: ఆలియా -
సోషల్ మీడియా డిలీట్ చేయాలనుకున్నా: ఆలియా
అమ్మ అన్న పిలుపుతో ఆడదాని లోకమే మారిపోతుందంటారు. హీరోయిన్ ఆలియా భట్ కూడా అందుకు అతీతురాలు కాదు. తల్లయ్యాక తన ప్రపంచమే మారిపోయిందంటోంది ఆలియా. మాతృత్వం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గర్భిణీగా ఉన్న తొమ్మిది నెలల్లో చాలా మార్పులొస్తాయి. శరీరమే కాదు మన ఆలోచన విధానాలు కూడా మారుతుంటాయి. డిలీట్ చేయాలన్న ఆలోచనఎప్పుడైతే కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డను కళ్లారా చూస్తామో అప్పుడు పూర్తిగా మనల్ని మనమే మర్చిపోతాం. తనే ప్రపంచంగా మనకే తెలియనంతగా మారిపోతాం. మళ్లీ ఒకప్పటిలా ఉండాలనుకున్నా అది అసాధ్యం. చాలాసార్లు సోషల్ మీడియా డిలీట్ చేయాలనిపించేది. కానీ నా కెరీర్ ప్రారంభం నుంచి నన్ను సపోర్ట్ చేసినవారితో బంధాన్ని తెంచుకోవడం ఇష్టం లేక ఆ ఆలోచన విరమించుకున్నాను. కొన్నిసార్లు నా వ్యక్తిగత విషయాల్ని అందరితో పంచుకోవాలనిపించడం లేదు. నేను కూడా ట్రై చేయాలిఅది నా పర్సనల్ అని నా అభిప్రాయం. నా ఫోన్లో మొత్తం రాహా ఫోటోలే ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు ఫోటోలు దిగడానికి ప్రయత్నించాలి అని చెప్పుకొచ్చింది. ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వీరికి కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం ఆలియా, రణ్‌బీర్.. లవ్ అండ్ వార్ సినిమా చేస్తున్నారు. నిర్మాతగా డోంట్ బీ షై సినిమా చేస్తోంది.చదవండి: సినిమాలు వర్కవుట్ కాకపోతే సీరియల్స్? చంద్రహాస్ ఏమన్నాడంటే? -
ఓటీటీలో తగ్గిన దురంధర్ రన్‌టైమ్.. అసలు కారణలేంటి?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ్టటిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ల వర్షన్ కంటే ఓటీటీలో 9 నిమిషాల నిడివి తగ్గడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఓటీటీకి వచ్చే సినిమాలు దాదాపు ఇంకా సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దురంధర్ మూవీని కట్ చేయడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకు ఆ తొమ్మిది నిమిషాలు ఎందుకు తొలగించారన్న దానిపై ఆడియన్స్‌లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.రన్‌టైమ్ అసలు వెర్షన్ కంటే ఎందుకు తక్కువగా ఉందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభంలో 3 గంటల 34 నిమిషాలు ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, బూతులను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కోసం అనవసరమైన సీన్స్ తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంజయ్ దత్ సీన్స్‌పై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలను సవరించాలని చిత్రనిర్మాతను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఆ తర్వాత కొత్త వర్షన్ జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 4, జనవరి 5 నాటి సెన్సార్ సర్టిఫికేట్ల ప్రకారం సవరించిన రన్‌టైమ్ సుమారు 209 నిమిషాలు(సుమారు 3 గంటల 29 నిమిషాలు). అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌లోని వర్షన్ సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. అంతేకాకుండా యాడ్స్ కూడా ఓటీటీలో కనిపించకపోవచ్చని.. ఇది కూడా రన్‌టైమ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏదైనా సీన్స్ తొలగించారో లేదో అధికారికంగా ప్రకటించలేదు.నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌కు ఒక సినిమాను కత్తిరించడానికి హక్కు లేదు. అయితే మేకర్స్ అనవసర సీన్స్ తొలగించినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలు అందించిన వర్షన్ మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓటీటీలు ప్రాథమికంగా కేవలం పంపిణీదారులుగా మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప సినిమాలో ఏవైనా మార్పులు జరిగితే అవి కేవలం నిర్మాత వైపు నుంచే జరగాలి. లేదంటే కొన్నిసార్లు ప్లాట్‌ఫారమ్ అభ్యర్థన మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా.. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 'ధురందర్' సీక్వెల్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. -
ఒకప్పుడు తాగుడుకు బానిసనయ్యా..: హృతిక్ రోషన్ సోదరి
అలవాట్లకు బానిసవడం ఈజీయేమో కానీ దాన్ని వదిలించుకుని బయటకు రావడం కష్టం. కానీ, ఆ కష్టాన్ని తను జయించానంటోంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్. మద్యపానం అనే వ్యసనం నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాలను తాజాగా గుర్తు చేసుకుంది.అదే పెద్ద విషయంసునయన మాట్లాడుతూ.. సమస్యను అంగీకరించడం అన్నింటికంటే పెద్ద విషయం. ఒక్కసారి మనం తప్పు చేస్తున్నామని గుర్తించామంటే అక్కడే మార్పు మొదలవుతుంది. తిండి, మద్యపానం.. ఇతరత్రా ఎన్నో అలవాట్లు వ్యసనంగా మారుతుంటాయి. మనం అందులో పూర్తిగా మునిపోతున్నామన్నది మనకే అర్థం కాదు. నేను తాగుడుకు బానిసయ్యాను. తర్వాత ఒకానొక సమయంలో స్వీట్లు, జంక్ ఫుడ్ ఎక్కువ లాగించడం మదలుపెట్టాను. ఒక్క అడుగువాటన్నింటినీ వదిలించుకోవడం, దూరం పెట్టడం అంత ఈజీ కాదు. ధృడ సంకల్పం, మనచుట్టూ ఉండేవారి సపోర్ట్‌తోనే వ్యసనాల నుంచి బయటకు రాగలం. ఒక్క అడుగు ముందుకేసి వాటిని జయించొచ్చు. భయపడకుండా ముందడుగు వేయండి. ఓపెన్‌గా మాట్లాడండి అని ఓ వీడియో షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు హృతిక్ రోషన్ స్పందిస్తూ లవ్యూ దీదీ అని కామెంట్ పెట్టాడు. తండ్రి రాకేశ్ రోశన్ సైతం నువ్వొక ఇన్స్పిరేషన్ అని కామెంట్ చేశాడు.వ్యసనంగా..గతంలోనూ సునయన తన తాగుడు వ్యసనం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. కొద్దిగా మొదలైన తాగుడు తర్వాత తీవ్రంగా మారిందని తెలిపింది. పొద్దున్నుంచి రాత్రి వరకు తాగడం ఒకటే పనిగా పెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే మద్యపానం సేవించడం వల్ల తాను ఏం చేస్తున్నాననే విషయాలను కూడా మర్చిపోతున్నట్లు తెలిపింది. డీ అడిక్షన్ సెంటర్‌కు కూడా వెళ్లానని, చివరకు ఈ వ్యసనంపై విజయం సాధించానంది.చదవండి: ఫలక్‌నుమాదాస్.. విశ్వక్‌తో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే? -
అమ్మానాన్న ఏడ్చేశారు.. ఎన్నటికీ మర్చిపోలేను: సారా
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ బాలీవుడ్ మూవీ 'ధురంధర్'తో హీరోయిన్గా మారింది. యలీనా జమైల్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఆరోజు మర్చిపోలేనుసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సారా అలీ ఖాన్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా తను హీరోయిన్ అయ్యాక పేరెంట్స్ రియాక్షన్ గురించి చెప్పుకొచ్చింది. ధురంధర్ సినిమాలో నన్ను చూసి అమ్మానాన్న సంతోషంతో ఏడ్చేశారు. ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటన నా జీవితంలోనే ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత విదేశాల్లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాను. ధురంధర్అంతలోనే యుఫోరియా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ధురంధర్ సినిమాకు సంతకం చేశాను. కానీ అదే మొదటగా రిలీజైంది అని తెలిపింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.చదవండి: ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి మూవీ.. ఎక్కడంటే? -
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు వెండితెరకు కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ టాలీవుడ్లో కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీలో రాషా హీరోయిన్గా నటిస్తోంది. ఫస్ట్ లుక్శుక్రవారం (జనవరి 30న) ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో రాషా కుర్తీలో క్యూట్‌గా కనిపిస్తోంది. తన పాత్ర పేరును మంగ అని ప్రకటించారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.హిందీలో..వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీకే ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే హీరో జయకృష్ణకు ఇదే తొలి సినిమా కాగా రాషా తడానీ మాత్రం హిందీలో ఆజాద్ సినిమాలో నటించింది. ఇందులో ఉయ్ అమ్మా.. అనే పాటలో అద్భుతంగా స్టెప్పులేసి జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. Marking a beautiful beginning ✨ Presenting #RashaThadani as ‘MANGA’ to Telugu Cinema from #SrinivasaMangapuram ❤️🔥Get ready to witness her enchanting performance on the big screens soon 🫶An @DirAjayBhupathi FilmA @gvprakash Musical#JayaKrishnaGhattamaneni @AshwiniDuttCh… pic.twitter.com/zYdxmCCsfM— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 30, 2026 -
స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!
బాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ అర్జిత్‌సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఇటీవల అందరినీ ఆశ్చర్య పరిచారు. కరియర్ పీక్‌లో ఉండగా సంగీత ప్రపంచానికి వీడ్కోలు పలకడం, ప్లేబ్యాక్ సింగర్ ఇకపై కొత్త ప్రాజెక్టులను తీసుకోనని అర్జిత్‌సింగ్ ప్రకటించి సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేశాడు. ఇప్పటికే ఉన్న కమిట్మెంట్లను నెరవేరుస్తానని, స్వతంత్రంగా సంగీతాన్ని కొనసాగిస్తానన ప్రకటించాడు. ప్లే బ్యాక్ సింగింగ్ నుండి వైదొలగాలనే అతని నిర్ణయం తర్వాత, అతని తదుపరి అడుగుపై ఊహాగానాలు మొదలయ్యాయి.అర్జిత్‌సింగ్ త్వరలోనే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. 2026 ఎన్నికలకు ముందు కాకుండా, తొలుత అతను క్షేత్రస్థాయిలో ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నాడట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి ఎన్నికలలో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఎన్డిటివి నివేదిక పేర్కొంది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగం కాకపోవచ్చని ఆ నివేదిక తెలిపింది. బెంగాలీ చిత్ర పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ, సింగ్ మొదట క్షేత్రస్థాయిలో ఎన్నికలలో పోటీ చేయడం గురించి ఆలోచించవచ్చని ఆ నివేదిక పేర్కొంది. కెరీర్‌ను రాజకీయ రంగంలోకి మార్చే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాడని సన్నిహిత వర్గాల సమాచాం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా, జియాగంజ్‌కు చెందినవాడు అర్జిత్ సింగ్. 2005లో “ఫేమ్ గురుకుల్” అనే రియాలిటీ షోలో పోటీదారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే పోటీ నుండి మధ్యలోనే నిష్క్రమించాడు. రియాలిటీ షో తర్వాత, అతను కొన్ని సంవత్సరాలు ప్రీతమ్‌కు సంగీత సహాయకుడిగా పనిచేసి, ఆ తర్వాత 2011లో ప్లేబ్యాక్ గాయకుడిగా అరంగేట్రం చేశారు.గత కొన్నేళ్లుగా ఎన్నో హిట్ సాంగ్స్‌కు అదీ ప్రేమగీతాలకు మారుపేరుగా నిలిచాడు. బాలీవుడ్ నుండి వచ్చిన దాదాపు ప్రతి పెద్ద హిట్ చిత్రంలో సింగ్ పాడిన కనీసం ఒక పాట తప్పనిసరిగా ఉంటుంది. బాలీవుడ్ లెజెండ్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్.రణబీర్ కపూర్ వంటి ప్రముఖ తారలకు ప్లేబ్యాక్ సింగర్‌గా తన సత్తా చాటుకున్నాడు. 38 ఏళ్ల అర్జిత్‌సింగ్ తన రాజకీయ జీవితంపై వస్తున్న ఊహాగానాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
అత్తారింట్లో ఇంకా ఆ ప్రయోగం చేయలేదు: శోభిత
పెళ్లి తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ నటించిన మొదటి చిత్రం 'చీకటిలో'. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం శోభిత బాగానే కష్టపడింది. పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ క్రమంలోనే తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. పెళ్లయినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంట్లో వంట చేయలేదు. ఆ దిశగా ఎప్పుడూ ప్రయోగాలు చేయలేదు. కానీ ఎప్పుడూ ఫోన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను. రోజూ ఆర్డర్ పెడతా..చైతన్య షోయూ రెస్టారెంట్ నుంచే కాకుండా ఇతర హోటల్స్ నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాను. రోజూ కచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటాను. ఇంకా దగ్గరివాళ్లకు ఫోన్ చేసి హైదరాబాద్‌లో మంచి పునుగులు, సమోసాలు, మిరపకాయ్ బజ్జీ, టిఫిన్స్.. ఎక్కడ దొరుకుతాయ్? అని అడుగుతూ ఉండేదాన్ని. మంచి భోజనం ఎక్కడుందని అడిగి తెలుసుకుని మరీ వెళ్లి తింటాను అని చెప్పుకొచ్చింది.సినిమాఅయితే ఎంత తిన్నా, ఏం తిన్నా వర్కవుట్స్ మాత్రం తప్పనిసరి అని చెప్తోంది. ఈమె చివరగా చీకటిలో సినిమాలో క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. ఆమని, ఈషా చావ్లా, విశ్వదేవ్ రాచకొండ కీలక పాత్రలు పోషించారు. శోభిత ప్రస్తుతం తమిళంలో వెట్టువమ్ మూవీలో యాక్ట్ చేస్తోంది.చదవండి: ఓటీటీలో రాజాసాబ్ -
దురంధర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. అదొక్కటే నిరాశ
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈనెల 30 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ థియేట్రికల్ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటలా 34 నిమిషాలు కాగా.. ఓటీటీలో దాదాపు 9 నిమిషాలు తగ్గించారు. ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా రన్‌టైమ్ తగ్గడం ఆడియన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.కాగా.. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, కాంతార-2 చిత్రాలను దాటేసింది. అంతేకాకుండా తాజాగా దేశీయంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. It’s official! 🔒🔥Dhurandhar drops on Netflix TONIGHT! pic.twitter.com/gsAGMURqj7— Fozzy (@fozzywrites) January 29, 2026 -
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరిగిపోయింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మీ ముందు వచ్చేస్తోంది. ఇప్పటికే రిలీజై క్రేజ్ దక్కించుకున్న కొహరా వెబ్ సిరీస్ సీజన్-2 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో మోనా సింగ్, బరున్ సోబ్తి కీలక పాత్రల్లో నటించారు.ఈ నేపథ్యంలోనే కొహరా సీజన్-2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే హత్యల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మర్డరీ మిస్టరీ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు ఇష్టపడేవారు కొహరా చూసేయండి. -
కాంతార ‘సీన్’ వివాదంలో కొత్త ట్విస్ట్
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. కాంతార చిత్రంలోని ఓ దైవ సన్నివేశాన్ని ఇమిటేట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఈ కేసుపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.అసలేం జరిగిందంటే 2025లో గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్స్ ఫెస్టివల్ జరిగింది. కాంతార చిత్రంలో హిరో రిషబ్ పోషించిన పంజుర్లి, గులిగ అనే దైవంశకు చెందిన క్యారెక్టర్లను పోషించారు. అయితే ఈ కార్యక్రమంలో రణవీర్ సింగ్ ఆ క్యారెక్టర్లను కామెడీగా అనుకరించారు. దీంతో రణవీర్ సింగ్‌పై కన్నడీగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే తన తప్పు తెలుసుకున్న రణవీర్ సింగ్ వారికి క్షమాపణ చెప్పారు. అనంతరం రిషబ్ షెట్టి చాలా బాగా ఆ పాత్రలను పోషించాడు అని చెప్పడం కోసమే అలా చేశానని వివరణ ఇచ్చారు.అయితే దైవాంశకు చెందిన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ దీనిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196,299,302 ల ప్రకారం కేసు ఫైలు చేశారు. దీనిపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.అయితే గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది. -
సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్
ప్రభాస్ నటిస్తున్న కల్కి-2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి ప్రభాస్ సెట్స్ పైకి అడుగుపెట్టనున్నాడని, దాదాపు 10 రోజుల కాల్షీట్లు కేటాయించాడని సమాచారం. ఈ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. కల్కి ఫ్రాంచైజీ నుంచి దీపికా పదుకోన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె పోషించిన సుమతి పాత్ర కథలో చాలా కీలకమైనది. కల్కి పార్ట్-2 మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. కానీ అలాంటి ముఖ్యమైన పాత్ర నుంచి దీపిక తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట సాయిపల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. కల్కి చిత్ర యూనిట్ కూడా ఆమెను ఈ పాత్రకు అనుకూలంగా భావిస్తోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే నిజంగానే సాయిపల్లవినే ఫైనల్ చేశారా లేదా ఊహించని విధంగా మరో నటిని పరిచయం చేస్తారా అనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది. దాంతో ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. దీపికను పార్ట్-1లో చూసిన ప్రేక్షకులు, అదే పాత్రలో మరో హీరోయిన్‌తో కనెక్ట్ అవ్వగలరా అనేది పెద్ద ప్రశ్న. ఈ సవాల్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. -
కుమారుడి పేరు రివీల్ చేసిన ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ కమెడియన్ భారతి సింగ్, హర్ష్ లింబాచియా దంపతులు తమ కుమారుడి పేరును రివీల్ చేశారు. డిసెంబర్ 19న రెండో బిడ్డకు జన్మనిచ్చిన భారతి సింగ్ ఇవాళ తన కొడుకు నామకరణ వేడుకను నిర్వహించారు. తమ ముద్దుల కుమారుడికి యశ్వీర్ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేక్ చేశారు. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు నైస్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. వీరికి ఇప్పటికే లక్ష్ అనే కుమారుడు ఉన్నారు. ఈషా సింగ్, కరిష్మా తన్నా, అదా ఖాన్, కిష్వర్ మర్చంట్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.కాగా.. నటి, కమెడియన్ భారతి సింగ్ పలు సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోస్‌లోనూ పాల్గొంది. ది కపిల్ శర్మ షో, ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి షోలలో మెరిసింది. ఇటీవల ప్రసవం తర్వాత వెంటనే లాఫ్టర్ చెఫ్స్ ఫన్ అన్లిమిటెడ్ సీజన్- 3 సెట్స్‌లో కనిపించింది. ఈ దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు లక్ష్ సింగ్ లింబాచియా ఉన్నాడు. వీరికి 2022లో మొదట కుమారుడు జన్మించాడు. ఈ జంట కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Bharti Siingh (@bharti.laughterqueen) -
దురంధర్ అరుదైన రికార్డ్.. పుష్ప-2, బాహుబలి-2 తర్వాత..!
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది.తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఇండియాలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్-2 చిత్రాన్ని దాటేసింది. పుష్ప-2, బాహుబలి-2 సినిమాల తర్వాత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇండియాలో రూ.1002 కోట్ల వసూళ్లు సాధించింది. మనదేశంలో వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ మూవీగా అవతరించింది. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(రూ.760) పేరిట ఉన్న ఈ రికార్డ్‌ను తుడిచిపెట్టేసింది.అరుదైన రూ.1000 కోట్ల క్లబ్రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' మూవీతో పాటు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి. ఈ జాబితాలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్'(రూ.1,471 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి- 2: ది కన్‌క్లూజన్ (రూ.1417 కోట్లు) రెండోస్థానంలో ఉంది. ఈ జాబితాలో మూడో చిత్రంగా దురంధర్(రూ.1002) నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2(రూ.1001) కోట్లతో నాలుగో ప్లేస్ దక్కించుకుంది.కాగా.. ఈ స్పై థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇందులో రణ్వీర్ ప్రధాన పాత్రలో నటించగా.. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురందర్ -2 మార్చిలో విడుదల కానుంది.భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు1 పుష్ప 2 -రూ.1471 కోట్లు2 బాహుబలి 2- రూ.1417 కోట్లు3 ధురందర్- రూ.1002 కోట్లు4 కేజీఎఫ్ చాప్టర్ 2- రూ.1001 కోట్లు5 ఆర్ఆర్ఆర్- రూ.916 కోట్లు6 కల్కి 2898 ఏడీ- రూ.767 కోట్లు7 జవాన్- రూ.760 కోట్లు8 కాంతార చాప్టర్ 1- రూ.741 కోట్లు9 ఛావా- రూ.716 కోట్లు10 స్త్రీ 2- రూ.713 కోట్లు -
స్టేజ్‌పై నటికి చేదు అనుభవం.. ఫోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే నిర్వాహకులు తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగింది?పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా, బొంగావ్‌లో 'నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్' ఆధ్వర్యంలో ఈ నెల 25న అర్ధరాత్రి ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. మిమీ చక్రవర్తి ప్రదర్శన ఇస్తున్న సమయంలో నిర్వాహకులలో ఒకరైన తన్మయ్ శాస్త్రి అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఆపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను స్టేజ్ దిగి వెళ్ళిపోవాలని ఆదేశించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ అనుచిత ప్రవర్తనపై మిమీ చక్రవర్తి సోమవారం బొంగావ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కళాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.ఈ ఘటనపై మిమీ చక్రవర్తి ఎక్స్ (ట్విటర్) వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. మైకులో అందరి ముందూ తనను అవమానించేలా మాట్లాడారని, ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రిపబ్లిక్ డే వేళ స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుకుంటాం కానీ, మహిళా కళాకారులకు కనీస గౌరవం, భద్రత కరువయ్యాయని’ అంటూ తనకు ఎదురైన చేదు ఘటన గురించి వివరించింది.As we celebrate Republic Day, we speak of freedom and equality.But the independence and dignity of women and artists are still too easily violated.I have built my image and career on my own over the years. Staying silent today would only normalise the humiliation of artists.…— Mimi chakraborty (@mimichakraborty) January 26, 2026 -
ఆ కారణాల వల్లే సినిమాలకు అర్జిత్ సింగ్ గుడ్‌బై
తన గాత్రంతో ప్రేమ పల్లకిలో ఊరేగిస్తాడు.. అంతలోనే అలక తెప్పిస్తాడు. సడన్‌గా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అలా అర్జిత్ సింగ్ గొంతు పలికించే భావాలకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో వందలాది పాటలు పాడాడు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ ప్రతిభ చూపిన ఆయన సడన్‌గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు.సడన్‌గా ఎందుకిలా?అయితే ఉన్నపళంగా సినిమా పాటలకు విరామం ప్రకటించడం వెనక కారణాలేమై ఉంటాయని అభిమానులు చర్చ మొదలుపెట్టారు. ఇంతలో అతడే తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. ఇప్పటివరకు సినిమా పాటల రూపంలో అలరించిన అర్జిత్ సింగ్ మరో రూపంలో ముందుకు రానున్నట్లు ప్రకటించాడు.సంగీతంలో కొత్త అంశాలు నేర్చుకోవాలని..ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్కు ఒక్క కారణమంటూ లేదు. చాలా అంశాలు భాగమై ఉన్నాయి. చాలారోజులుగా ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ధైర్యం కూడదీసుకుని మీతో పంచుకున్నాను. నాకు పాటల్ని ఒకేలా పాడటం ఇష్టముండదు. అందుకే వేదికలపై దాన్ని కాస్త మార్చి పాడుతుంటాను. నేను ఇండస్ట్రీలో చాలా త్వరగా ఎదిగాను. ఇక్కడే ఆగిపోకుండా ఇంకా డిఫరెంట్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను. ఇండిపెండెంట్ సంగీతంపై దృష్టి సారిస్తాను.పూర్తి చేస్తా..మరో విషయం ఏంటంటే.. కొత్త గాయకుల పాటలు వినాలనుంది. వాళ్లు తమ టాలెంట్‌తో నాకు స్ఫూరిస్తున్నారు. కాబట్టి వారిని ప్రోత్సహించాలన్నది కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే ఒప్పుకున్న పాటల్ని మధ్యలో వదిలేయనని.. వాటిని పూర్తి చేసి తీరతానని వెల్లడించాడు.సినిమాఅర్జిత్ సింగ్.. హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ.. ఇతర భాషల్లోనూ పాటలు పాడాడు. కనులను తాకే ఓ కల.. (మనం), అదేంటి ఒక్కసారి.. (స్వామి రారా), దేవ.. దేవ.. (బ్రహ్మాస్త్ర) ఇలా ఎన్నో సాంగ్స్ ఆయన పాడినవే! సంగీతరంగంలో అతడు అందించిన సేవలకు గానూ అర్జిత్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. సినిమా పాటలు ఇకపై పాడనన్న అర్జిత్.. ఇండిపెండెంట్ సింగర్‌గా ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడన్నమాట!చదవండి: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్ -
నేనే హీరో.. నేనే విలన్: రణ్‌బీర్ కపూర్
‘యానిమల్:పార్క్’ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదిప్రారంభం అవుతుందని తెలిపారు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌కపూర్. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘యానిమల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా, బాబీడియోల్ విలన్ గా, ఓ కీలక పాత్రలో త్రిప్తి దిమ్రీ నటించారు. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 1న విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఈ చివర్లో ‘యానిమల్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్:పార్క్’ రానున్నట్లుగా మేకర్స్ తెలిపారు.తాజాగా ఈ ‘యాని మల్’ సినిమా సీక్వెల్‌పై ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌కపూర్ స్పందించారు. ‘‘సందీప్‌రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాను ఓ ఫ్రాంచైజీలా మూడు భాగాలుగా తీయాలని నాతో అన్నారు. తొలిభాగం ఆల్రెడీ వచ్చేసింది. రెండోభాగం ‘యానిమల్: పార్క్’ సినిమా చిత్రీకరణను 2027లో స్టార్ట్ చేస్తాం. ఈ సినిమాలో నేను రెండు పాత్రల్లో కనిపిస్తాను. హీరోగా నటించడంతో పాటుగా, విలన్ గానూ కనిపిస్తాను. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని చెప్పుకొచ్చారు రణ్‌బీర్‌కపూర్. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ: పార్టు 1, రామాయణ: పార్టు 2’ చిత్రాలతో పాటుగా, ‘లవ్ అండ్ వార్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ దీపావళికి ‘రామాయణ: పార్టు 1, వచ్చే దీపావళికి రామాయణ:పార్టు 2’ చిత్రాలు రిలీజ్ కానున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘లవ్ అండ్ వార్’ చిత్రం 2027లో రిలీజ్ కానుంది.రాణీముఖర్జీ గొప్ప నటి: రణ్‌బీర్ కపూర్నటిగా బాలీవుడ్ హీరోయిన్ రాణీముఖర్జీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయంపై కూడా రణ్‌బీర్‌కపూర్ స్పందించారు. ‘‘భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో రాణీముఖర్జీ ఒకరు. నా తొలి చిత్రం ‘సావరియా’లో రాణీతో కలిసి నటించాను నేను. కష్టపడి నటించాలని నాకు చెబుతూ, నన్నుప్రోత్సహించిన తొలి వ్యక్తి తనే. ఆ సినిమా చిత్రీకరణ సమయం లో ఆమెతో నాకు జరిగిన సంభాషణలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాణీముఖర్జీ 30 ఏళ్ళ సినీ జర్నీని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా అద్భుతం. ఇప్పటికీ ఆమె ఎంచుకునే పాత్రలు, సినిమాలు సిల్వర్‌స్క్రీన్ పై మహిళలను గొప్పగా చూపించేలా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఇక రాణీముఖర్జీ నటించిన ‘మర్దానీ 3’ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. -
ప్రముఖ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ రిటైర్మెంట్ ప్రకటన
ప్రముఖ బాలీవుడ్ సింగర్ తన కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. ప్లే బ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకొనని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఇన్ని రోజులుగా నాపై ప్రేమ, అభిమానం చూపిన వారందరికీ థాంక్స్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేయనని వెల్లడించారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందన్నారు. అయితే తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించలేదు. సినిమాలకు గుడ్‌బై చెప్పిన అర్జిత్ ఇండిపెండెంట్ సింగర్‌గా కొనసాగుతారని సమాచారం. View this post on Instagram A post shared by Arijit Singh (@arijitsingh) -
దేశభక్తి టచ్ చేస్తే చాలు.. కాసుల పంట పండాల్సిందే!
బాలీవుడ్ ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'నేషనలిజం' ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వెండితెరపై త్రివర్ణ పతాకం కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. 'ఉరి', 'గదర్ 2' నుంచి మొదలైన ఈ ఊపు, ఇప్పుడు 'ధురంధర్', 'బోర్డర్ 2' వరకు కొనసాగుతోంది. సామాన్యుడిలో ఉండే దేశభక్తిని భావోద్వేగంతో కలిపి వెండితెరపై చూపించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన దేశభక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.450 కోట్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక వీరగాథలకు దేశభక్తి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది.రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక స్పై థ్రిల్లర్‌గా వచ్చి, దేశభక్తిని అద్భుతంగా పండించిన ఈ చిత్రం కేవలం ఏడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,285 కోట్లకు పైగా వసూలు చేసి 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది.ఇక గతవారం (జనవరి 23) రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' ప్రస్తుతం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. 1971 ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్కును చేరుకుంది. నిన్న ఒక్క రోజులోనే ఇండియాలో ఈ చిత్రం రూ.59 కోట్లు రాబట్టిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇలానే కొనసాగితే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. .సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్(1997) చిత్రానికి సీక్వెల్ ఇది. -
విజయ్ సేతుపతి మూకీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
పేరుకే తమిళ నటుడు అయినప్పటికీ పాన్ ఇండియా లెవల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి నుంచి ఇప్పుడు ఓ మూకీ సినిమా రాబోతుంది. అదే 'గాంధీ టాక్స్'. నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టారు గానీ ఇన్నాళ్లకు థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారమే (జనవరి 30) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు 'దేవర' నిర్మాత గుడ్‌న్యూస్)ఇందులో విజయ్ సేతుపతి సరసన అదితీ రావు హైదరీ హీరోయిన్. అరవింద స్వామి కీలక పాత్రధారి. కిశోర్ పి బెలేకర్ దర్శకత్వం వహించారు. ప్రతి స్టోరీకి మాటలు అవసరం లేదు. కొన్ని చూడటంతోనే మనసుని హత్తుకుంటాయి. ఈసారి స్క్రీన్ పై మాటలుండవు. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది అని ట్రైలర్‌తో చెప్పుకొచ్చారు. డబ్బు అనేది నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు కారణమైంది అనేది ఇందులో చూపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్) -
అలా అయితేనే పెళ్లి.. వింత కండిషన్ పెట్టిన నటి
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి, నటుడు అర్బాజ్ పటేల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై తాజాగా నిక్కీ తంబోలి స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తమ పెళ్లికి ఓ వింత కండీషన్ కూడా పెట్టుకున్నారట. అదేంటే.. నిక్కీ లేదా అర్బాజ్.. ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రియాల్టీ షోలో విన్నర్‌గా గెలిస్తే పెళ్లి చేసుకుంటారట. గెలుపు అనేది పాజిటివ్ ఎనర్జీ అని.. విజయం తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెడతామని నిక్కీ చెప్పుకొచ్చింది.కాగా, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న 'ది ఫిఫ్టీ' రియాలిటీ షోలో ఈ జంట కలిసి పాల్గొంటోంది. ఇందులో మొత్తం 50 మంది సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. ఈ షోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
ప్రెగ్నెన్సీ.. మహిళ ఒక ఆవులా కనిపిస్తుంది: శ్రియ
ప్రెగ్నెన్సీ జర్నీలో భార్యకు భర్త తోడుండాలంటోంది హీరోయిన్ శ్రియా శరణ్. ఆ సమయంలో భర్త తోడు ఎక్కువ కావాలనిపిస్తుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా మాట్లాడుతూ.. మహిళ గర్భం దాల్చినప్పుడు తన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపులో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటోందంటే అదొక అద్భుతమైన అనుభవం. అతడిదే బాధ్యతకానీ ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు భావోద్వేగాలు అదుపులో ఉండవు. కడుపులో ఓ బిడ్డను మోస్తూ తిరగాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు నీలాగే కనబడవు. ఆ సమయంలో ఆడవారి శరీరం ఒక ఆవులా కనిపిస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే! నేను గర్భం దాల్చినప్పుడు ఎక్కువ బాధగా అనిపించేది. నా భర్త నాతో ఎక్కువసేపు ఉంటే బాగుండనిపించేది. అదే సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పనికి వెళ్లాలనిపించేది. ఇలా నా ఎమోషన్స్ అదుపులో ఉండేవి కాదు అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రియా.. రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను 2018లో పెళ్లి చేసుకుంది. 2021లో వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు రాధా శరణ్ కొశ్చీవ్ జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నేనున్నాను, ఛత్రపతి, మనం వంటి పలు సినిమాల్లో నటించింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. కొన్ని ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. చివరగా మిరాయ్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం హిందీ దృశ్యం 3లో నటిస్తోంది.చదవండి: తరుణ్ భాస్కర్‌తో డేటింగ్? తొలిసారి పెదవి విప్పిన హీరోయిన్ -
బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నా: బాలీవుడ్ హీరో
కష్టాలు దాటుకుని సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న తారలు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే ఒకరు. చిన్న వయసులోనే బండెడు కష్టాలు చూశానంటున్న ఈయన తాజాగా వాటిని ఓ సారి గుర్తు చేసుకున్నాడు. విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను. అప్పటివరకు కాఫీ షాప్‌లో పని చేశాను. రోజులో 16 గంటలు పనినా చదువు ముందుకు సాగాలంటే ఆ ఉద్యోగం చేయడం తప్పనిసరి. ముంబైలోని ఓ రెస్టారెంట్లో కూడా పని చేశాను. అదే సమయంలో ఓ డ్యాన్స్ గ్రూప్‌కు అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్ చేశాను. ప్రతిరోజు నాలుగు లోకల్ ట్రైన్స్ మారేవాడిని. 16 గంటలు పనిచేసేవాడిని. పార్లీజీ బిస్కెట్, నీళ్లు.. ఈ రెండింటితోనే కడుపు నింపుకునేవాడిని. తర్వాత నేనొక షో చేశాను. దానికోసం దాదాపు 8 నెలలపాటు కష్టపడ్డాను. డబ్బు కూడా సగమే..తీరా ఆ షో ప్రసారమే కాలేదు. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సగమే ఇచ్చారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయిందని చాలా బాధపడ్డాను. కొన్నేళ్ల తర్వాత ఆ షోను అర్ధరాత్రి టీవీలో ప్రసారం చేశారు. ఇలాంటి సమస్యలు యాక్టర్స్‌కు చివరి నిమిషం వరకు తెలియవు. అయితే ఈ షో కోసం నేనెంత కష్టపడ్డానో గుర్తించిన ఓ మహిళా నిర్మాత తన బ్యానర్లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా బుల్లితెరకు.. అక్కడినుంచి వెండితెరకు పరిచయమయ్యాను అని గుర్తు చేసుకున్నాడు.సీరియల్, సినిమావిక్రాంత్ మాస్సే.. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు), ఖుబూల్ హై వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేశాడు. సినిమాల్లో రాణించాలన్న ఆశతో బుల్లితెరకు గుడ్‌బై చెప్పాడు. లూటేరా చిత్రంతో 2013లో తొలిసారి వెండితెరపై కనిపించాడు. 12th ఫెయిల్ మూవీతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఓ రోమియో సినిమా చేస్తున్నాడు. షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది.చదవండి: ఫ్లాప్ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే: చిరంజీవి కౌంటర్? -
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
టాలీవుడ్లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్‌లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్‌పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్‌ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
పద్మ అవార్డుల ప్రకటన.. మమ్ముట్టి, ధర్మేంద్రకు ఏమొచ్చాయంటే?
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, క్రీడలు తదితర రంగాల నుంచి మొత్తంగా 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఇందులో 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. అలానే 13 మందికి పద్మభూషణ్ వరించాయి. ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారులు దక్కాయి.హిందీ చిత్రసీమకు విశేష సేవలందించిన దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టిని పద్మభూషణ్ వరించింది. ప్రముఖ నటుడు మాధవన్‌ని పద్మ శ్రీ దక్కించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్.. పద్మశ్రీలుగా ఎంపికయ్యారు. -
బాలీవుడ్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు
సౌత్ టు నార్త్.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ప్రకాశ్ రాజ్. దాదాపు 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీయే బలమైన సినిమాలు చేస్తోందని.. హిందీ సినిమా తన మూలాలు కోల్పోయిందంటున్నాడు. శనివారం నాడు కోజికోడ్‌లో కేరళ లిటరేటర్ ఫెస్టివల్‌కు ప్రకాశ్ రాజ్ హాజరయ్యాడు. సహజత్వం లేదుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తమిళం, మలయాళంలో బలమైన సినిమాలు తీస్తున్నారు. కానీ హిందీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడి సినిమాలు ఆత్మను, సహజత్వాన్ని కోల్పోయాయి. పైకి అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే అంతా ప్లాస్టిక్‌లా ఉంటుంది.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని విగ్రహాలలాగా! కానీ దక్షిణాదిలో ఇప్పటికీ చెప్పడానికి బోలెడన్ని కథలున్నాయి. ఫోకస్ అంతా దానిపైనేదళితుల సమస్యలను తమిళ యంగ్ డైరెక్టర్స్ తెరపై చాలా చక్కగా చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక బాలీవుడ్ కేవలం వాటికి అనుగుణంగా సినిమాలు తీయడంపైనే శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయతను కోల్పోయింది. కేవలం డబ్బు, లుక్స్, రీల్స్, ప్రమోషన్స్.. వీటిపైనే ఫోకస్ చేసింది. దానివల్లే హిందీ చిత్రపరిశ్రమ ప్రేక్షకులకు కాస్త దూరమైంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: కూతురి చిన్ననాటి కోరిక.. రూ.50 లక్షల గిఫ్ట్ ఇచ్చిన నటి -
విడాకులు.. కొత్త కారు కొన్న బుల్లితెర నటి
బుల్లితెర నటి మహి విజ్ ఇటీవలే వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టింది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలుకుతూ భర్త జే భానుషాలితో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఆమె కొత్త కారు కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మినీ కూపర్ ఇంటికి తీసుకొచ్చామంటూ మహి వీడియో షేర్ చేసింది. దానిపై జే స్పందిస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు.కూతురికి గిఫ్ట్ఇకపోతే తారకు నాలుగేళ్ల వయసున్నప్పుడు మినీ కూపర్ కావాలని అడిగింది. అప్పుడు అంత అవసరం, స్థోమత లేక కొనలేదు. కానీ ఇప్పుడు తన కోరిక నెరవేర్చే సమయం వచ్చిందంటోంది మహి. అందుకే తనకెంతో ఇష్టమైన కూపర్ కారును గిఫ్టుగా ఇచ్చానంటోంది. మహి.. తెలుగు సినిమా తపనలో హీరోయిన్గా నటించింది. సినిమాల్లో అదృష్టం కలిసిరాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయింది. సీరియల్స్జే భానుషాలి.. మూవీస్ చేయడంతోపాటు సీరియల్స్ చేశాడు. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లోనూ పాల్గొన్నాడు. జే- మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ జంటగా నాచ్ బలియే డ్యాన్స్ షో 5వ సీజన్లో పాల్గొని ట్రోఫీ గెలిచారు. ఈ జంటకు కూతురు తార సంతానం. బాబు రాజ్వీర్, పాప ఖుషిల బాధ్యతను కూడా ఈ దంపతులే చూసుకుంటున్నారు. గతేడాది చివర్లో ఇద్దరూ విడిపోయారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: బిగ్‌బాస్ సోనియా బారసాల ఫంక్షన్ -
ఆర్జేతో బ్రేకప్.. 'బిగ్‌బాస్' బ్యూటీతో ప్రేమలో పడ్డ చాహల్?
యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతానికి టీమిండియా తరఫున పెద్దగా మ్యాచులేం ఆడట్లేదు. కానీ ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో పంజాజ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు.. వ్యక్తిగత మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అయిపోతూనే ఉన్నాడు. తాజాగా మూడోసారి ప్రేమలో పడినట్లు కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్ బ్యూటీతో డిన్నర్ డేట్‌కి వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)టీమిండియాకు ఆడుతున్న టైంలోనే చాహల్.. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. 2020-25 వరకు దాదాపు ఐదేళ్ల పాటు కలిసున్న వీళ్లిద్దరూ గతేడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్జే మహావశ్ అనే అమ్మాయితో చాహల్ కొన్నాళ్ల పాటు సన్నిహితంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్లే పలుమార్లు వీళ్లిద్దరూ కలిసి కనిపించారు. మరి కారణాలేంటో తెలీదు గానీ రెండు మూడు రోజుల క్రితం ఆర్జే మహ్వశ్, చాహల్.. ఇన్ స్టాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంటే బ్రేకప్ చెప్పేసుకున్నట్లే!ఇప్పుడు చాహల్.. బిగ్‌బాస్ 13 హిందీ ఫేమ్, యాంకర్ సెఫాలీ బగ్గాతో జంటగా కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అని బాలీవుడ్ మీడియా గుసగుసలాడుకుంటోంది. ఏదేమైనా ఇలా పలువురు అమ్మాయిలతో చాహల్ కనిపిస్తుండటం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది.(ఇదీ చదవండి: పరోటా మాస్టర్‌కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్)Yuzi Chahal 𝗱𝗮𝘁𝗶𝗻𝗴 a new girl - He moves on faster than the speed of light. 😅- 𝟮𝟭 𝗝𝗮𝗻: Chahal and RJ Mahvash unfollow each other.- 𝟮𝟰 𝗝𝗮𝗻: Chahal spotted at dinner with a new girl, Shefali Bagga.ONE YEAR BACK :-- 𝟰 𝗝𝗮𝗻 𝟮𝟬𝟮𝟱: Chahal and Dhanashree… pic.twitter.com/L4FxUbNn8m— Jara (@JARA_Memer) January 25, 2026 -
హృతిక్ రోషన్‌కి ఏమైంది..? టెన్షన్లో ప్యాన్స్!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా వాకింగ్ స్టిక్‌తో నడుస్తూ కెమెరాలకు చిక్కాడు. ముంబైలో నిర్వహించిన డైరెక్టర్ గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకకు హృతిక్ చేతి కర్రతో హాజరయ్యాడు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు వెళ్లినప్పుడు హృతిక్ హుషారుగా ఫోటోగ్రాఫర్లను పలకరిస్తూ వెళ్లేవాడు. కానీ ఈ సారి మాత్రం వాకింగ్ స్టిక్ సాయంతో సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు. ఈ మధ్యే బర్త్ డే పార్టీలో ఫిట్‌గా కనిపించిన హృతిక్ రోషన్ ఇలా చేతి కర్రలతో నడుస్తూ కనిపించడం ఫ్యాన్స్‌లో ఆందోళన చెందుతున్నారు. ‘హృతిక్‌కు ఏమైంది?’ అంటూ ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 'వార్ 2' సినిమాలోని ఒక సాంగ్ రిహార్సల్ సమయంలోనే హృతిక్ కాలికి గాయం అయినట్లు సమాచారం. హృతిక్ ప్రస్తుతం ‘క్రిష్ 4’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నేనో విధ్వంసం
‘పఠాన్’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో షారుక్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, షారుక్ కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 24న రిలీజ్ చేయనున్నట్లుగా ‘డేట్ అనౌన్స్మెంట్’ వీడియోతో ప్రకటించారు. ‘భయం లేదు... నేనో విధ్వంసం’ అంటూ షారుక్ ఖాన్ డైలాగ్ చెప్పడం, యాక్షన్ విజువల్స్ ఈ వీడియోలో కనిపిస్తాయి. ఈ చిత్రంలో షారుక్‡పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. -
ప్రభాస్ ‘స్పిరిట్’పై క్రేజీ గాసిప్.. గోపీచంద్ కీలక పాత్ర?
ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా చుట్టూ పుకార్లు ఆగడం లేదు. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొన్ని రూమర్లకు క్లారిటీ ఇచ్చినా, మరికొన్ని మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌తో పాటు ఈ సినిమాలో హీరో గోపీచంద్ కూడా నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ‘స్పిరిట్’లో ఓ కీలక పాత్ర కోసం ఆయనను ఎంపిక చేశారట. అయితే అది పాజిటివ్ క్యారెక్టరా లేక నెగెటివ్ క్యారెక్టరా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులు. తనకు అవకాశం దొరికితే ప్రభాస్ సినిమాలో తప్పకుండా నటిస్తానని గోపీచంద్ గతంలోనే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ‘స్పిరిట్’తో ఆ అవకాశం నిజమవుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోయిన గోపీచంద్ మార్కెట్ కొంత డల్ అయింది. అలాంటి సమయంలో ప్రభాస్ సినిమా వంటి భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర చేయడం ఆయన కెరీర్‌కు మళ్లీ బూస్ట్ ఇవ్వొచ్చని అభిమానులు భావిస్తున్నారు. విలన్ పాత్రపై గాసిప్ ఇప్పుడు నాకు విలన్ పాత్రలు చేయాలని లేదు. కానీ ఆ పాత్రలో డెప్త్ ఉంటే మాత్రం చేస్తాను. ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని గోపీచంద్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. సందీప్ వంగ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ‘యానిమల్’ చూసినవారికి తెలిసిందే. అందుకే ‘స్పిరిట్’లో గోపీచంద్‌ను విలన్‌గా చూపించబోతున్నారనే గాసిప్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై సినిమా యూనిట్ మాత్రం స్పందించలేదు. గోపీచంద్ నిజంగా ‘స్పిరిట్’లో నటిస్తున్నారా? ఆయన పాత్ర ఏదీ? అన్నది మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు మిస్టరీనే. -
ఇంట్లో అందరూ హీరోయిన్సే.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ బాలీవుడ్ హీరోయిన్. తెలుగులోనూ ఒక సినిమా చేసింది. ఈమె అక్క, తల్లి, అమ్మమ్మ అందరూ హీరోయిన్సే కావడం విశేషం. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? తనే రియా సేన్. ఈరోజు ఆమె 45వ పుట్టినరోజు(జనవరి 24). ఈ సందర్భంగా తన కెరీర్‌ను ఓసారి చూసేద్దాం.ఫ్యామిలీ మొత్తం..రియా సేన్‌ది బెంగాలీ కుటుంబం. ఆమె తల్లి మూన్‌మూన్ సేన్, అమ్మమ్మ సుచిత్రా సేన్ ఇద్దరూ పేరున్న నటీమణులే. ఆ రక్తమే తనలో, తన అక్క రైమా సేన్లో ప్రవహించింది. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీనే ఎంచుకున్నారు. హీరోయిన్స్‌గా రాణించారు. రియా సేన్ ఐదేళ్ల వయసులోనే తన తల్లి సినిమాలో కూతురిగా యాక్ట్ చేసింది. అక్కాచెల్లెళ్లకు అచ్చిరాని టాలీవుడ్టీనేజ్కు రాగానే తాజ్‌మహల్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా మారింది. తమిళంలోనే కాకుండా హిందీ, బెంగాలీ, మలయాళ, ఇంగ్లీష్, ఒడియా భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక మూవీ 'నేను మీకు తెలుసా?'. ఈ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఇక్కడ అవకాశాలే రాలేదు. దాంతో టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి బాలీవుడ్లోనే సెటిలైంది. ఈమె అక్క రైమా సేన్ కూడా తెలుగులో ధైర్యం అని ఒకే ఒక్క సినిమా చేయడం గమనార్హం!సినిమా, పెళ్లిరియా బాలీవుడ్లో స్టైల్, ఝంకార్ బీట్స్, ఖయామత్, అప్న సప్న మనీ మనీ, లవ్ కిచిడీ.. ఇలా అనేక సినిమాలు చేసింది. మధ్యలో ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. ఓటీటీలో రాగిని ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్, పాయిజన్, మిస్‌మ్యాచ్ 2, కాల్ మీ బే వెబ్ సిరీస్‌లలో కనిపించింది. 2017లో వ్యాపారవేత్త శివం తివారిని రియా సేన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. అయితే ఆ తర్వాత మాత్రం తన పెళ్లి గురించి రియా ఎప్పుడూ ఓపెన్ అవలేదు. View this post on Instagram A post shared by Raima Sen Dev Varma (@raimasen) చదవండి: స్టార్ హీరోకు తల్లిగా అడిగారు.. అయిష్టంగానే చేశా: మీనా -
ఆ పాటలు పాడినందుకు పైసా ఇవ్వలేదు: సింగర్
యాక్టర్సే కాదు సింగర్స్ కూడా లక్షల్లో ఏకంగా కోట్లల్లో సంపాదిస్తున్నారు. అయితే అందరి పరిస్థితి అలా లేదంటున్నాడు బాలీవుడ్ సింగర్ కృష్ణ బ్యూరా. ఇతడు చక్‌దే ఇండియాలో మౌలా మేరే లేలే మేరీ జాన్, ఆషిక్ బనాయా ఆప్నేలో ఆప్కీ కాశిశ్ వంటి పలు సాంగ్స్ ఆలపించాడు. తనకు సరైన పారితోషికం ఇవ్వలేదని చెప్తున్నాడు.సరైన పారితోషికం లేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ కృష్ణ మాట్లాడుతూ.. బాలీవుడ్లో సింగర్స్ కోసం ఎటువంటి విధివిధానాలు లేవు. ఆర్టిస్ట్‌కు ఒకరోజుకు ఇంత అని ఎలా ఇస్తారో.. సింగర్‌ను స్టూడియోకు పిలిపించినప్పుడు కనీసం రూ.10 వేలయినా ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఆప్ కీ కాశిశ్ పాటకు నాకు రూ.10 వేలిచ్చారు. అందులో రూ.900 టీడీఎస్ కట్ అయింది. చక్‌దే ఇండియాలో ఒక పాట పాడినందుకు మళ్లీ అంతే ఇచ్చారు.పైసా రాలేరాజ్ మూవీలోని సోనియా ఓ సోనియా పాటకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోకో కహా దుండెరే బండె, మేరా ఇంతకం దేకేగి పాటలకు పైసా పారితోషికం ఇవ్వలేదు. నా 23 ఏళ్ల కెరీర్లో సినిమా పాటలు పాడి పెద్దగా సంపాదించిందే లేదు. మేము బయట షోలు, కచేరీల ద్వారా బాగా సంపాదిస్తామని ఇక్కడ నిర్మాతలు అనుకుంటారు. డిమాండ్ ఉంటేనేపోనీ, మొమహమాటం పక్కనపెట్టి డబ్బు అడిగామనుకో.. నెక్స్ట్ టైం నీకు పాడే ఛాన్స్ ఇవ్వరు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. కొందరు పాటకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు తీసుకుంటారు. ఒక్క సాంగ్‌కు రూ.50 లక్షలు, రూ.3 కోట్ల వరకు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. సింగర్స్‌కు డిమాండ్ ఉంటేనే వారు అడిగినంత ఇస్తారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: పెళ్లికి పిలిచి అవమానించాలా? అసభ్యంగా ఫోటోలు, వీడియోలు: నటి ఆగ్రహం -
నడుముపై చేయి వేసి.. అవమానంతో చచ్చిపోయా!
యాక్టర్స్ సినిమాలు, సీరియల్స్, యాడ్స్, షోలతో పాటు బయట ఈవెంట్స్ కూడా చేస్తుంటారు. నటి మౌనీ రాయ్ కూడా అలాంటి ప్రోగ్రామ్స్‌కు తరచూ వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఆ కార్యక్రమం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నడుముపై చేయి వేసిన అంకుల్స్'కర్నాల్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ ఇద్దరు అంకుల్స్ చాలా చెత్తగా ప్రవర్తించారు. వాళ్లకు తాత వయసుంటుంది. నేను స్టేజీపైకి వెళ్తుంటే ఆ అంకుల్స్‌తో పాటు వారి కుటుంబంలోని మగవారు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా నడుముపై చేయి వేసి ఫోటోలు దిగారు. సర్, చేయి తీసేయండి అని వినయంగా చెప్పినా వెగటుగా ప్రవర్తించారు. స్టేజీ ఎక్కాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పరిస్థితి మరింత ఘోరంఎదురుగా ఉన్న ఇద్దరు అంకుల్స్ చెండాలమైన కామెంట్స్ చేస్తూ అసభ్య సంజ్ఞలు చూపించారు. దయచేసి అలా చేయొద్దు అని చెప్పగానే నాపై గులాబీలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు నేను డ్యాన్స్ మధ్యలోనే ఆపేసి స్టేజీ దిగి వచ్చేయాలనుకున్నాను. కానీ కోపాన్ని ఆపుకుని నా పర్ఫామెన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా వాళ్లు అలాగే నీచంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆ ఫంక్షన్ నిర్వాహకులు, కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు వచ్చి వాళ్లను వారించలేదు. కనీసం పక్కకు కూడా తీసుకెళ్లలేదు.తలుచుకుంటనే భయంగాఅవమానంతో చచ్చిపోయా.. మానసిక క్షోభకు లోనయ్యాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల గురించి తలుచుకుంటనే భయంగా ఉంది. ఇలా నీచంగా ప్రవర్తించేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. మాకు వచ్చిన కళను నమ్ముకుని మేము బతుకుతున్నాం. వీళ్ల కూతురితోనో, అక్కాచెల్లితోనే వేరేవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకుంటారా? మగవాళ్లమన్న అహంకారమా?కొంచెమైనా సిగ్గుండాలి! ఇంకో విషయం.. స్టేజీ కాస్త హైట్‌లో ఉంది. దాంతో ఈ అంకుల్స్.. లో యాంగిల్లో వీడియోలు తీశారు. కొందరు అది చూసి వీడియోలు షూట్ చేయడం ఆపమని చెప్పినందుకు వారిపైనే అరిచారు. ఎందుకంత ధైర్యం? మగవాళ్లమన్న అహంకారమా? ఇలాంటివారిని తిట్టేందుకు తిట్లు కూడా రావడం లేదు. పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని దీవించేందుకు ఈ ప్రోగ్రామ్స్‌కు పిలుస్తారు, రివర్స్‌లో మాకు జరిగేది ఇలాంటి వేధింపులు, అవమానం!' అని మౌనీరాయ్ ఆవేదన వ్యక్తం చేసిందిద.సీరియల్స్, సినిమాలుమౌనీరాయ్.. క్యూంకీ సాస్‌భీ కబీ బహుతీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. జర నచ్కే దిఖా 1 సీజన్ విన్నర్‌గా నిలిచింది. నాగిని సీరియల్‌తో ఫుల్ ఫేమస్ అయింది. గోల్డ్, మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర, ద భూతిని సినిమాల్లో నటించింది. కేజీఎఫ్ 1లో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: చెట్ల మందులు వాడా.. చాలా గలీజ్‌గా ఫీలయ్యా: శివజ్యోతి -
సల్మాన్ దేశభక్తి సినిమా.. మాతృభూమి సాంగ్ రిలీజ్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్సెస్ రేసులో చాలా వెనకబడిపోయాడు. ప్రస్తుతం 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో ఓ దేశభక్తి సినిమా చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పుడీ మూవీ నుంచి 'మాతృభూమి' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ఇందులో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మానే స్వయంగా నిర్మిస్తుండగా.. గతంలో రామ్ చరణ్‌తో 'జంజీర్(తుఫాన్)' లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిన అపూర్వ లఖియా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి ట్రెండ్ నడుస్తోంది. మరి దాన్ని సల్మాన్ సినిమా అందుకుని హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ) -
ఆ హీరోకు యాక్టింగే రాదు, ఏదో కవర్ చేస్తాడంతే!
బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించింది రిమి సేన్. ఇప్పుడు మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పేసి దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తోంది. ఇండియాలో ఏజెంట్లను ఏదో తప్పుపనిచేసేవారిలా చూస్తారు, కానీ అక్కడ దర్జాగా బతుకుతున్నానని చెప్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లోని ఓ టాప్ హీరోకు యాక్టింగ్ రాదని గాలి తీసింది. అదే సమయంలో అతడి తెలివితేటల్ని మెచ్చుకుంది.యాక్టింగ్ రాదన్న కామెంట్స్ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు జాన్ అబ్రహం. రిమి సేన్ మాట్లాడుతూ.. జాన్ అబ్రహం నాకు వ్యక్తిగతంగా తెలుసు. అతడు మొదట్లో మోడల్‌గా పని చేశాడు. యాక్టింగ్ అనేదే రాదు. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుతుంటే అతడు పట్టించుకునేవాడు కాదు. అతడు కేవలం తన యాక్టింగ్‌కు బదులుగా స్టైలిష్‌గా, స్క్రీన్‌పై మరింత బాగా కనిపించే పాత్రల్ని మాత్రమే ఎంచుకునేవాడు. ఉదాహరణకు యాక్షన్ సినిమాలు. తెలివైనవాడుఆ సినిమాల్లో అతడు బాగా కనిపించేవాడు, అప్పుడు జనాలు అతడేం చేస్తున్నాడనేది పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రకంగా అతడు చాలా తెలివైన నటుడు. అయితే పాపులారిటీ పెరుగుతూ ఉండేసరికి అతడే నెమ్మదిగా యాక్టింగ్ నేర్చుకున్నాడు. పదేపదే కెమెరా ముందుకు వస్తూ ఉంటే అది మనకు ఎంతో కొంత అనుభవం నేర్పుతుంది కదా. అలా తనపై తనకు నమ్మకం ఏర్పడ్డాక నటనకు అవకాశమున్న పాత్రల్ని ఎంచుకున్నాడు. రానురానూ..తన పరిధులేంటో తనకు బాగా తెలుసు కాబట్టే మొదట్లో యాక్షన్.. రానురానూ పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే అతడిని తెలివైనవాడని చెప్తుంటాను. తర్వాత నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు, బిజినెస్‌మెన్‌గా రాణించాడు అని రిమి సేన్ చెప్పుకొచ్చింది. జాన్ అబ్రహం, రిమి సేన్.. ధూమ్, గరం మసాలా, హ్యాట్రిక్ సినిమాల్లో కలిసి నటించారు. జాన్ అబ్రహం సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా టెహ్రాన్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో రెండు సినిమాలున్నాయి.చదవండి: కీర్తి సురేశ్ హోంటూర్.. ఇల్లులాగే లేదు -
ప్రియుడితో ప్రముఖ బుల్లితెర నటి ఎంగేజ్మెంట్..!
ప్రముఖ బుల్లితెర నటి అద్రిజా రాయ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అనుపమ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో నిశ్చితార్థం చేసుకోనుంది. ఈనెల 25న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది.కాగా.. 'అనుపమ' సీరియల్లో రాహి పాత్రతో నటి అద్రిజా రాయ్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇమ్లీ, కుండలి భాగ్య, దుర్గ ఔర్ చారు లాంటి సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్‌ఫ్రెండ్స్ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో జనవరి 25న ఫామ్‌హౌస్‌లో నిశ్చితార్థానికి రెడీ అయిపోయింది. ఈ నిశ్చితార్థం వేడుకకు కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు.అయితే తాము పెళ్లి విషయంలో తొందరపడటం లేదని ఆద్రిజా రాయ్ వెల్లడించింది. మేము ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయడం లేదని చెప్పింది. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లి ఎప్పుడు జరిగినా బెంగాలీ, దక్షిణ భారత (తమిళ) సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకోవడం నా కల అని వెల్లడించింది. ఇటీవల తన నిశ్చితార్థానికి ముందు ఆద్రిజా తన కాబోయే భర్తతో కలిసి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకుంది. -
స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు
మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్.. ఇతడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నాడు. తీరా పెళ్లికి కొన్ని గంటల ముందు ఇది కాస్త రద్దయింది. దీంతో పలాష్ గురించి రకరకాల రూమర్స్ వినిపించాయి. స్మృతితో వివాహం పెట్టుకుని మరో మహిళతో రిలేషన్ నడిపాడనే పుకార్లు వచ్చాయి. ఆ విషయాన్ని అందరూ మెలమెల్లగా మరిచిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో పలాష్‌పై చీటింగ్ కేసు నమోదు కావడంతో మరోసారి హాట్ టాపిక్ అయిపోయాడు.స్వతహాగా మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్.. సినిమాలని కూడా డైరెక్ట్ చేస్తుంటారు. అలానే సాంగ్లీకి చెందిన ఫిలిం ఫైనాన్సర్ విద్యన్ మానేతో పలాష్‌కి 2023లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే తాను 'నజరియా' అనే మూవీ తీస్తున్నానని, దానికి పెట్టుబడి పెడతారా అని పలాష్, మానేని కోరాడు. త్వరగా దీన్ని పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేస్తే పెట్టుబడితో పాటు లాభాలు కూడా వస్తాయని మానేకు హామీ ఇచ్చాడు. అలానే మూవీలో యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానని పలాష్ నమ్మబలికాడు. దీన్ని నమ్మిన మానే.. విడతల వారీగా రూ.40 లక్షలు పలాష్‌కి ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నెలలు గడుస్తున్నా సినిమా పూర్తి కాకపోవడంతో.. తన డబ్బులు తిరిగి ఇచ్చేయమని మానే పలాష్‌ని అడిగాడు. తొలుత ఇస్తానని హామీ ఇచ్చిన పలాష్.. తర్వాత ఫోన్ కాల్స్ ఎత్తడం మానేశాడు. నంబర్ కూడా బ్లాక్ చేశాడు. దీంతో మానే.. పోలీసులని ఆశ్రయించాడు. పలాష్‌పై ఫిర్యాదు చేశాడు. తన నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, ఆ మొత్తాన్ని తనకు ఇప్పించాలని కోరాడు. దీంతో పలాష్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బాధితుడు ఇచ్చిన ఆధారాలు పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పుకొచ్చారు.రెండు నెలల క్రితం స్మృతితో పెళ్లి రద్దు, ఇప్పుడేమో పలాష్‌పై పోలీస్ కేసు చూస్తుంటే కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లకు తోడు రూ.40 లక్షల మోసం గురించి తెలిసే స్మృతి.. తన పెళ్లిని వద్దనుకుందా అని మాట్లాడుకుంటున్నారు. స్మృతితో విడిపోయిన తర్వాత పలాష్.. కెరీర్‌పై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం మరాఠీ నటుడు శ్రేయస్ తల్పడేతో ఓ మూవీని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ) -
ఆస్కార్ నామినేషన్స్‌లో ‘సిన్నర్స్’ సంచలనం
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో రూపొందిన ఈ అమెరికన్ పీరియాడికల్ హారర్ సినిమా 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఏకంగా 16 నామినేషన్స్ దక్కించుకుని, ఆస్కార్ నామినేషన్స్‌లో ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నటులు డానియల్ బ్రూక్స్, లూయిస్ ఫుల్మన్ నామినేషన్లను ప్రకటించారు.పలు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, నటుడు, సపోర్టింగ్ యాక్ట్రస్, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే వంటి విభాగాలు) నామినేషన్స్ దక్కించుకుని, ‘సిన్నర్స్’ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. గతంలో ‘ఆల్ అబౌట్ ఈవ్’ (1950), ‘టైటానిక్’ (1997), ‘లా లా ల్యాండ్’ (2016) చిత్రాలు 14 నామినేషన్స్‌ను దక్కించుకున్న రికార్డును తాజాగా ‘సిన్నర్స్’ చిత్రం అధిగమించింది. ఇక ‘సిన్నర్స్’ తర్వాత ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి 13 నామినేషన్స్ దక్కాయి. ‘ఫ్రాకింగ్స్టన్’, ‘మార్టీ సుప్రీం’, ‘సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలు తొమ్మిది నామినేషన్స్‌ను దక్కించుకోగా, ‘హ్యామ్‌నెట్’ సినిమాకు 8 నామినేషన్స్ దక్కాయి. అలాగే ఈ ఏడాది కొత్తగా ‘క్యాస్టింగ్ డైరెక్టర్’ విభాగాన్ని ప్రవేశపెట్టి, ఈ విభాగంలో నామినేషన్స్‌ను ప్రకటించారు. ⇒ ఉత్తమ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ‘సిన్నర్స్, ఎఫ్1, ది సీక్రెట్ ఏజెంట్, బగోనియా, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’... ఇలా పది చిత్రాలు పోటీ పడుతున్నాయి. దర్శకత్వం విభాగంలో రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), క్లోయి జావ్ (హ్యామ్‌నెట్), జాష్ షాఫ్డీ (మార్టీ సుప్రీం),పాల్ థామస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), ట్రియర్ (సెంటిమెంటల్ వాల్యూ), యాక్టర్స్ విభాగంలో తిమోతి చాలమేట్, లియోనార్డో డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరాలు, యాక్ట్రస్ విభాగంలో ‘ఎమ్మా స్టోన్, కేట్ హడ్సన్, రోజ్ బర్న్, జస్సీ బక్లీ, రెనాటా’ పోటీ పడుతున్నారు. ⇒ యాక్టింగ్ విభాగంలో అతి పిన్న వయసు (30 ఏళ్లు)లో మూడు నామినేషన్స్ దక్కించుకున్న వ్యక్తిగా తిమోతి చాలమేట్ నిలిచారు. ∙బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ‘సిన్నర్స్’కుగాను రూత్ ఈ. కార్టర్ నామినేషన్ దక్కించుకున్నారు. ఇది ఆమెకు ఐదో నామినేషన్. ఆస్కార్ చరిత్రలో ఐదు నామినేషన్స్ దక్కించుకున్న బ్లాక్ ఉమన్‌గా కార్టర్ నిలిచారు. ∙ఇదే సినిమాలోని నటనకు గాను 73 ఏళ్ల డెల్రోయ్ లిండోకి ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఇది డెల్రోయ్కి తొలి ఆస్కార్ నామినేషన్ కావడం విశేషం. ∙యాక్టింగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ (‘ది సీక్రెట్ ఏజెంట్’ సినిమా) దక్కించుకున్న తొలి బ్రెజిలియన్ నటుడిగా వాగ్నర్ మౌరా రికార్డు సాధించారు.⇒ వార్నర్ బ్రదర్స్ స్టూడియో సంస్థ నిర్మాణంలోని సినిమాలకు 30 ఆస్కార్ నామినేషన్స్ దక్కడం విశేషం. భారతీయ సినిమాకి నిరాశ: ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిందీ చిత్రం ‘హోమ్ బౌండ్’ను ఇండియా తరఫున పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ∙ఆస్కార్ కన్సిడరేషన్ కోసం ఓటింగ్ పోటీలో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కాంతార: చాప్టర్1, మహావతార్ నరసింహా, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్నైట్’ చిత్రాలకూ నామినేషన్ దక్కకపోవడం నిరాశపరిచే విషయం. -
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా వారణాసి. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరూ మళ్లీ పాన్ వరల్డ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ రామ్ చరణ్ కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి ఆయన రూపొందిస్తున్న కథ పాన్ వరల్డ్ స్థాయిలో యూనివర్సల్ అపీల్ కలిగిన జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంకా హీరోకు నెరేషన్ ఇవ్వలేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే చరణ్‌ను కలసి కథ వినిపించనున్నారు. ప్రస్తుతం సుకుమార్, ఆయన టీమ్ ఈ పనిపైనే దృష్టి సారించారు. మహేష్ బాబు స్వంత బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను స్వంత బ్యానర్ జిఎంబిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొదట్లో డొమెస్టిక్ మార్కెట్‌కు సరిపడే సినిమా చేయాలని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఒక దర్శకుడు చెప్పిన లైన్ మహేష్‌ను ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆ కథ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. జిఎంబితో పాటు మరో బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందని సమాచారం. ఇకపై పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి టాప్ హీరోలు ఇకపై కేవలం మన మార్కెట్‌కు సరిపడే కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. వారి దృష్టి మొత్తం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులపైనే ఉంది. టాలీవుడ్లో ఇకపై ప్రతి పెద్ద సినిమా గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందనుందనే చెప్పాలి. -
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎవర్గ్రీన్ స్టార్స్‌గానే కొనసాగుతారు. అలాంటి హీరోను పట్టుకుని ఓ నటి అంకుల్ అనేసిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అన్నది ఎవరినో కాదు, లక్షలాది మంది మనసుల్ని దోచుకున్న కింగ్ షారూఖ్ ఖాన్‌ను! అసలు ఎవరా నటి? ఏంటీ కథ ఓసారి చూసేద్దాం..అక్కడ మొదలైందిసౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇటీవలే జాయ్ అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీ పెరీ, మిల్లీ బాబీ బ్రౌన్ వంటి పలువురు హాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ కూడా వెళ్లాడు. అలాగే టర్కిష్ నటి హండె ఎర్సెల్ కూడా ఆ వేడుకలో పాల్గొంది. ఆమె స్నేహితురాలు, నటి అమీనా ఖలీల్.. షారూఖ్‌తో కలిసి అవార్డులు ప్రదానం చేసింది. దాన్ని హండె తన ఫోన్లో వీడియో తీసింది. దాంతో హండె కూడా షారూఖ్ ఖాన్‌కు పెద్ద అభిమాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం తీశారు.ఎవరీ అంకుల్?ఇంతలోనే నెట్టింట మరో పోస్ట్ ప్రత్యక్షమైంది. అందులో ఏముందంటే.. హండే తన స్నేహితురాలిని మాత్రమే వీడియో తీశానని రాసుంది. షారూఖ్‌ను చూపిస్తూ ఎవరీ అంకుల్ అని రాసుకొచ్చింది. అతడికి తాను అభిమానిని కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపేయమని కోరినట్లుగా ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్‌షాట్ తెగ వైరలయింది.అది ఫేక్దీంతో నెటిజన్లు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇంతకీ హండె షారూఖ్ అభిమానియేనా? అయినా అంత పెద్ద హీరోను పట్టుకుని అంకుల్ ఎలా అనేసింది? అని విమర్శించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించింది హండె. వైరలవుతున్న స్క్రీన్‌షాట్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె షారూఖ్ అభిమానా? కాదా? అన్నది పక్కనపెడితే ఆయన్ను అంకుల్ అనైతే అనలేదు అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. కాగా హండె ఎర్సెల్.. ఇంటాక్సికేటెడ్ బై లవ్, చేజింగ్ ద విండ్ అని రెండు టర్కిష్ సినిమాలు చేసింది. వెండితెరపైకి రావడానికి ముందు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ చేసింది. అవకాశామొస్తే బాలీవుడ్‌లోనూ యాక్ట్ చేస్తానంది.ఫేక్ స్క్రీన్‌షాట్ (ఫోటోలో ఎడమవైపు)చదవండి: వాళ్లంతా వేశ్యలూ.. నువ్వూ అదే అవుతానంటే ఎలా?: నటిపై అమ్మ ఫైర్ -
'యాక్టర్స్ అందరూ వేశ్యలు.. నువ్వూ అదే చేస్తానంటే చస్తా!'
సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీలోకి వెళ్తామనగానే పేరెంట్స్ అంత ఈజీగా అస్సలు ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే అనుమతించరు. తన ఇంట్లో అయితే అమ్మ చచ్చిపోతానని బెదిరించిందంటోంది బాలీవుడ్ నటి సయాని గుప్తా.మంచి జీతంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా చదువైపోగా ఓ ఉద్యోగం సంపాదించాను. మంచి సంపాదన.. సీజన్లో కనిపించింది. బాగానే డబ్బులు వచ్చేవి. ఏడాదిన్నరపాటు జాబ్ చేశాను, కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలన్నది నా కల. అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. చేతి మణికట్టు కోసుకుని చస్తానని బెదిరించింది. తను యాక్టర్స్‌ను వేశ్యలు అని పిలిచేది. అమ్మ సపోర్ట్ లేదునేను కూడా నటిగా మారతానన్న ఆలోచన తట్టుకోలేకపోయింది. చిన్నప్పటినుంచి నేను ఎక్కడా ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా ఇంట్లోనే బంధించేది. యాక్టర్స్ అందరూ వేశ్యలూ.. అటువైపే వెళ్లొద్దు అనేది. నాన్న మాత్రం నేనేం చేసినా సపోర్ట్ చేసేవాడు. అలా ఆయన అంగీకారంతో ఎఫ్టీఐఐ (ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)లో చేరాను. సినిమాఅప్పుడు నెలరోజులపాటు అమ్మ నాతో మాట్లాడటమే మానేసింది. ఆ తర్వాత ఓసారి క్యాంపస్‌కు వచ్చాక తన ఆలోచనా విధానం మారిపోయింది. సయానీ గుప్తా.. జాలీ ఎల్ఎల్బీ 2, ఆక్సన్, పాగలైట్, ఆర్టికల్ 15, జ్విగాటో వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్లో కనిపించింది.చదవండి: పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉంటుంది: అనిల్ రావిపూడి -
అమెను ఇప్పటికే పెళ్లి చేసుకున్నా.. కానీ..: అమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ గతేడాది అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆరు పదుల వయస్సులోనూ తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉందంటూ బర్త్ డే రోజే పెద్ద షాకిచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లిపై నెట్టింట చర్చ నడుస్తోంది. అమిర్ ఖాన్- గౌరీ వివాహ బంధంతో ఒక్కటవుతున్నారా? అనే టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. గౌరీని వెంటనే పెళ్లి చేసుకోవాలనే ప్రణాళిక ఏదీ లేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నేను, గౌరీ ఒకరి పట్ల ఒకరం చాలా చాలా నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. మీ అందరికీ తెలుసు.. ప్రస్తుతం మేము భాగస్వాములం.. మేమిద్దరం కలిసే ఉన్నామని వెల్లడించారు. ఇక పెళ్లి విషయానికొస్తే ఆమెను నా మనసుతో ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతానికి పెళ్లిని అధికారికంగా చేసుకోకపోయినా.. అలా చేసుకోవాలా? వద్దా? అనేది భవిష్యత్తులో ఇద్దరం నిర్ణయించుకుంటామని అమిర్ ఖాన్ అన్నారు.కాగా.. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. గతేడాది పుట్టినరోజు ఆమిర్ తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. తాము ముంబైలో ఒక విలాసవంతమైన కొత్త ఇంటికి మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే తెలిపారు. కాగా.. మొదట ఆమిర్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ జన్మించారు. దాదాపు 16 సంవత్సరాల వివాహం తర్వాత 2002లో వారు విడిపోయారు. ఆ తర్వాత అమిర్ 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు సరోగసీ ద్వారా ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. ఆమిర్ కిరణ్ రావుతో 2021లో విడిపోయారు. ఇద్దరితో విడాకులు తీసుకున్నప్పటికీ కుటుంబంలో జరిగే ఈవెంట్లకు అమిర్ ఖాన్ హాజరవుతున్నారు. విడిపోయిన ఇద్దరు భార్యలతో స్నేహపూర్వక రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. -
నటుడు, ఎమ్మెల్యే రెండో పెళ్లి.. స్పందించిన మొదటి భార్య
బెంగాలీ నటుడు, ఖరగ్‌పూర్ ఎమ్మెల్యే హిరాన్ చటర్జీ రెండో పెళ్లి చేసుకున్నారు. వారణాసిలో మోడల్ రితికా గిరిని వేదమంత్రాల సాక్షిగా వివాహమాడారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిణామాలపై నటుడి మొదటి భార్య ఆనందిత చటర్జీ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. మీలాగే నేనూ ఆన్లైన్లో ఫోటోలు చూశాను. దీనిగురించి నా వద్ద ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. ఇది ఇల్లీగల్ మ్యారేజ్.. వారి పెళ్లి చెల్లదు అని పేర్కొంది.ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే..ఇంకా మాట్లాడుతూ.. నేను, హిరాన్ 2000వ సంవత్సరం డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నాం. మొదట్లో బాగానే ఉన్నాం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో హిరాన్.. ఖరగ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే ఓ మహిళతో రిలేషన్లో ఉన్నాడని రూమర్స్ వినిపించాయి. మొదట్లో నమ్మలేదు, లైట్ తీసుకున్నా.. కానీ, తర్వాత విషయం చిన్నది కాదని అర్థమైంది.హిరాన్ చటర్జీ-రితికా గిరి పెళ్లి ఫోటోజీర్ణించుకోలేకపోయా..మా కూతురి వయసు కంటే రెండేళ్లు పెద్ద అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. అది జీర్ణించుకోలేకపోయాను. 2022లో అతడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి విడిగా జీవిస్తున్నాను. నా కూతుర్ని చూసేందుకు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఏవేవో కథలు చెప్పేవాడు. రితికా గిరి అనే అమ్మాయి చచ్చిపోతానని బెదిరిస్తోందని, వేధింపులకు గురి చేస్తోందని బాధపడేవాడు. అప్పుడు మాతో కలిసి ఉండమని చెప్పాను.ఈ గొడవలకు దూరంఅలా 2024లో నా కూతురి 18వ బర్త్‌డే సమయంలో మాతోపాటే ఉన్నాడు. మేమంతా కలిసి బ్యాంకాక్ వెళ్లి అక్కడ తన బర్త్‌డే సెలబ్రేట్ చేశాం. సరిగ్గా అదే సమయంలో ఆ ఆమ్మాయి నాకు ఫోన్ చేసి బెదిరించింది. తను చెప్పినట్లుగానే మళ్లీ నా భర్తతో కలిసిపోయింది. ఈ వ్యవహారంతో నేను చాలాకాలంగా టార్చర్ అనుభవిస్తున్నా.. అతడు రెండో పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పుకొచ్చింది.రెండో భార్య ఏమందంటే?ఈ క్రమంలో హిరాన్ చటర్జీ రెండో భార్య రితికా గిరి సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తనది చిన్న వయసు కాదని పేర్కొంది. హిరాన్ అతడి మొదటి భార్యకు ఎప్పుడో విడాకుల నోటీసు పంపాడని తెలిపింది. కాబట్టి తమ పెళ్లి చెల్లుతుందని క్లారిటీ ఇచ్చింది. అయితే పెళ్లి ఫోటోల్ని మొదట షేర్ చేసిన రితికా.. తర్వాత కాసేపటికి వాటిని డిలీట్ చేసింది.చదవండి: ప్రేమలో ఉన్నా.. అతడు ముస్లిం కాదు: ఫరియా అబ్దుల్లా -
ఎవరు మీరంతా? కూతురి ముఖం దాచేసిన బిపాసా!
హీరోయిన్ బిపాసా బసు- నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ దంపతులు కూతురు దేవిని తీసుకుని బయటకు వెళ్లారు. సెలబ్రిటీలు ఎక్కడుంటే అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమయ్యే పాపరాజీ(ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు) బిపాసా దంపతులను ఫాలో అయ్యారు. హీరోయిన్ను, ఆమె కూతురు దేవిని ఫోటోలు తీశారు. దీంతో బిపాసా కాస్త అసహనానికి లోనైంది. వెంటనే కూతురు ముఖాన్ని దాచేసింది. అసలు ఎవరు మీరంతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా కోపంతోనే ఓ బిల్డింగ్‌లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.చిగురించిన లవ్ స్టోరీ2015లో వచ్చిన ఎలోన్ సినిమా షూటింగ్లో కరణ్ సింగ్- బిపాసా కలుసుకున్నారు. వెండితెరపై జంటగా కనిపించిన ఈ జోడీ రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో పడింది. ఏడాదిపాటు ప్రేమకబుర్లు చెప్పుకున్న వీరు 2016 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2022లో కూతురు దేవి జన్మించింది. సినిమాసినిమాల విషయానికి వస్తే.. తెలుగులో టక్కరిదంగ సినిమాలో నటించింది. బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన బిపాసా కొంతకాలంగా మూవీస్‌కు దూరంగా ఉంటోంది. చివరగా డేంజరస్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె భర్త కరణ్ సింగ్ కూడా నటించాడు. ఇతడు చివరగా ఫైటర్ మూవీలో యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Bollywood Reporter (@bollywoodreporter.in) చదవండి: ఓటీటీలో మోగ్లీ మూవీ.. ఎక్కడంటే? -
ఓటీటీకి దురంధర్.. ఆ డేట్ ఫిక్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈనెల 30 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్స్ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే ముందు నుంచే జనవరి 30 నుంచి స్ట్రీమింగ్కు రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే దురంధర్ ఈ నెలాఖర్లోనే ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ దురంధర్ స్ట్రీమింగ్ కానుంది. The wait ends on January 30.Experience #Dhurandar on Netflix power, performance, and presence.#RanveerSingh #OTTRelease#Dhurundhar #Netflix pic.twitter.com/jpm66gvAhL— Abhi (@Abhi1879734) January 21, 2026 -
యానిమల్ బ్యూటీ యాక్షన్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
షాహిద్ కపూర్ హీరోగా వస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఓ రోమియో. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ హిందీలో కాకుండా ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేయడం విశేషం. ఈ చిత్రంలో అవినాష్ తివారి, విక్రాంత్ మస్సే, నానా పటేకర్, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
భారత్‌లో ఈజీ కాదు, అందుకే దుబాయ్ చెక్కేశా..
ఒకప్పుడు హిట్ సినిమాల హీరోయిన్.. ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్. భారత్ కన్నా విదేశాల్లో బతకడం, సంపాదించడమే ఈజీ అని దుబాయ్‌కు చెక్కేసింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూతో సడన్‌గా లైమ్ లైట్లోకి వచ్చింది. తనే హీరోయిన్ రిమీ సేన్.భారత్‌లో అలా లేదుహీరోయిన్ రిమీ సేన్ మాట్లాడుతూ.. దుబాయ్ నాకు సాదర స్వాగతం పలికింది. ఇక్కడి జనాభాలో 95% మంది ప్రవాసులే ఉన్నారు. ఇక్కడివారు అందరి గురించి ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ మసీదులతో పాటు గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అది మన భారత్‌లో లేదు. భారత్‌లో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలు మార్చేస్తుంది.అనుకూలంగా లేదుదీనివల్ల ప్రజల జీవితాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ట్యాక్సులు కూడా చాలా ఎక్కువ. నా దృష్టిలో ఇండియా ఇప్పుడు వ్యాపారం చేసేందుకు అనుకూలమైన దేశం కాదు. దుబాయ్‌లో వ్యాపార నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ సెటిలయ్యా.. అని చెప్పుకొచ్చింది.సినిమారిమీ బెంగాలీ అమ్మాయి. ఆమె అసలు పేరు శుభమిత్రాసేన్. 2001లో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్లో హంగామా, ధూమ్, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్, ఫిర్ హేరా ఫేరీ, గోల్మాల్ 2, ధూమ్ 2, థాంక్యూ.. ఇలా అనేక సినిమాలు చేసింది. చివరగా షాగిర్డ్ (2011) సినిమాలో కనిపించింది. 30 ఏళ్ల వయసులోనే నటనకు గుడ్‌బై చెప్పేసింది. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) చదవండి: ఇంకా నిద్రపోతున్నారా? హీరోకు అవమానకర ప్రశ్న -
సూపర్‌స్టార్ ఇంట్లో 'గోల్డెన్ టాయిలెట్'.. నటుడి సెల్ఫీ వైరల్
స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వాటిని రకరకాలుగా ఖర్చు పెడుతుంటారు. కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన వాటికి కూడా డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు అలానే ఓ ప్రముఖ నటుడు బాత్రూంలో కమోడ్‌ని బంగారంతో చేయించుకున్నాడు. ఇప్పుడు దాంతో ఓ నటుడు సెల్ఫీ దిగడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)తెలుగులో 'ఎమ్సీఏ' సినిమాలో విలన్‌గా చేసిన విజయ్ వర్మ.. ప్రస్తుతం హిందీలో మూవీస్, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కొన్నాళ్ల ముందు వరకు హీరోయిన్ తమన్నాతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఇతడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌తో సెల్ఫీ దిగాడు. అయితే ఈ సెల్ఫీని 2016లో తీసుకున్నాడు. రీసెంట్ వైరల్ ట్రెండ్ దృష్టా.. ఇప్పుడు ఆ ఫొటోని పోస్ట్ చేశాడు.2016 నాకు మైలురాయి లాంటిది. బిగ్ బీ, సుజిత్ సర్కార్లతో 'పింక్' సినిమా చేశాను. నా దేవుడు సచిన్‌ని కలిశాను. బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌తో సెల్ఫీ దిగాను అని విజయ్ వర్మ రాసుకొచ్చాడు. అలానే దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ని తన అభిమాన హీరోగానూ వర్ణిస్తూ ఆయనతో దిగిన ఫొటోను కూడా విజయ్ వర్మ షేర్ చేశాడు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?) View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma) -
సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్
చాలామంది హిట్టు కొట్టగానే సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు, ఫ్లాప్ రాగానే ఒక్కసారిగా డీలా పడిపోతారు. అయితే ఈ జయాపజయాలను ప్రభాస్ అస్సలు లెక్క చేయడంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ "ది రాజాసాబ్". ఇందులో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. చతికిలపడ్డ రాజాసాబ్మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో అన్నింటికంటే ముందుగా దిగింది. భారీ అంచనాలతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. నెగెటివ్ టాక్ వల్ల మంచి కలెక్షన్స్ రాబట్టలేపోయింది. అయితే ప్రభాస్ వీటినేవీ పట్టించుకోడంటోంది నిధి అగర్వాల్.తలదూర్చడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చడు. తన పనేదో తను చేసుకుపోతాడు. ఫేక్‌గా ఉండలేడు. చాలా మంచి వ్యక్తి. ఆయనంత హుందాగా నేను ఉండగలనా? అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కానీ, ఆయనతో కలిసి పని చేశాక మరో విషయం అర్థమైంది. తనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎంతో నిష్కల్మషంగా ఉంటాడు. ప్రేమగా మాట్లాడతాడు.ప్రభాస్‌ను కలిస్తే..ఎవరైనా సరే.. ఆయన్ను కలిసినప్పుడు తను ఓ స్టార్ హీరో అన్న విషయమే మర్చిపోతారు. ఐదేళ్ల పిల్లాడిని కలిసినట్లే ఉంటుంది. అంత సింపుల్‌గా ఉంటాడు. దేనికీ లెక్కలేసుకోడు, కమర్షియల్‌గా ఉండటం రాదు. పైగా తనకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. తనతో పనిచేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. నా జీవితంలో నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి ప్రభాసే.. సినిమా కోసం తనవంతు కృషి చేస్తాడు. దాని రిజల్ట్ గురించి అసలు పట్టించుకోడు అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. చదవండి: 40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోలింగ్ పట్టించుకోనంటున్న బ్యూటీ -
కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!
ప్రస్తుతం ఎవరితో మాట్లాడినా సరే ఆరోగ్యం ఉండండి, డైట్ పాటించండి అని చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలకు ఈ విషయంలో పట్టింపులు చాలా ఎక్కువ. స్క్రీన్ పై కనిపించాలి, గ్లామర్‌గా ఉండాలంటే మన తినే చాలా ఆహార పదార్థాలకు వాళ్లు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఇప్పుడు అదే చెప్పారు. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్నెస్ కోచ్‌గా చేసిన ఈయన ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రైనర్ వినోద్ చన్నా.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, డైట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో చెప్పాడు. దాని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. 'జాన్ పాటిస్తున్న డైట్ వల్ల ఆయన శరీరం పూర్తిగా ఆ ఆహార విధానానికి అలవాటు పడిపోయింది. జాన్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. నాలుగు ఫుడ్స్ తినమని చెబితే అవి మాత్రమే తింటాడు. వేరే వాటిని అస్సలు ముట్టుకోడు. అంత కఠినంగా ఉంటాడు'(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)'ఓసారి సినిమా షూటింగ్లో జాన్ ఉన్నప్పుడు తైవాన్ రాజకుమార్తె వచ్చారు. డైనింగ్ టేబుల్‌పై ఉన్న ఫుడ్ అంతా అయిపోయిందని నాతో చెప్పింది. కానీ జాన్ ఆ ఆహారాన్ని అస్సలు టచ్ చేయడని, ఆ విషయంలో నాకు వంద శాతం నమ్మకం ఉందని ఆమెతో చెప్పాను. షుగర్(చక్కెర)కు జాన్ చాలా ఏళ్లు దూరంగా ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతైనా తీసుకోమని చెప్పాను. అయినా సరే నో చెప్పాడు''పొరపాటున జాన్ గనుక చక్కెర ఉన్న ఆహారం తీసుకుంటే.. అతడికి దగ్గు వచ్చే అవకాశముంది. ఎన్నో ఏళ్లుగా కఠినమైన డైట్ పాటించడం వల్ల ఇప్పుడు జాన్.. బెండకాయ, వంకాయ లాంటివి తినలేడు. ఒకవేళ తీసుకున్నా సరే అతడి కడుపు వాటిని జీర్ణించుకోలేకపోతోంది. శరీరం ఓ నిర్దిష్ట ఆహారానికి అలవాటు పడితే అకస్మాత్తుగా వచ్చే మార్పులని తీసుకోలేదు. జీర్ణ సమస్యలు వస్తాయి' అని వినోద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ విషయంలో ఫిట్నెస్, డైట్ పాటించే వాళ్లమధ్య హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్) -
భారీ బడ్జెట్.. వరల్డ్ క్లాస్ మేకింగ్.. ప్రధాని బయోపిక్ విశేషాలివే..!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌గా వస్తోన్న చిత్రం "మా వందే". ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ "మా వందే రూపంలో ప్రేక్షకులను చూపించనున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయనున్నారు.ఈ మూవీని ప్రపంచంలో తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్లో హీరోగా నటించిన జేసన్ మమొవాను "మా వందే" చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్‌లా కాకుండా సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 22వ తేదీ నుంచి కశ్మీర్లో ప్రారంభం కానుంది. -
మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్
గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తెగ ట్రెండ్ అయిపోయింది. తమిళ హీరో ధనుష్‌ని వాలంటైన్స్ డే నాడు పెళ్లి చేసుకోనుందనే పుకార్లే దీనికి కారణం. ఒకటి రెండు రోజుల పాటు అందరూ ఈ వార్త నిజమేనని అనుకున్నారు. ఇదంతా ఫేక్ అని మృణాల్ టీమ్ ఇదంతా ఫేక్ అని చెప్పడంతో అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇదలా ఉండగానే ఓ రొమాంటిక్ మూవీని మృణాల్ రెడీ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)'దో దివానే షెహర్ మైన్' పేరుతో తీసిన ఈ రొమాంటిక్ సినిమాలో మృణాల్ సరసన సిద్ధాంత్ చతుర్వేది నటించాడు. ఫిబ్రవరి 20న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. సిద్ధాంత్-మృణాల్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి? ఎందుకంటే ఈమె గత రెండు చిత్రాలు.. సన్నాఫ్ సర్దార్ 2, ద ఫ్యామిలీ స్టార్.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. చూడాలి మరి ఈసారి ఏం చేస్తుందో?(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే) -
నా కూతురు తిరిగి కొడుతుందేమోనని భయం: రాణీ ముఖర్జీ
జెనరేషన్ మారుతోంది. మొన్నటి తరంలా నిన్నటి తరం లేదు, నిన్నటి తరంలా నేటితరం లేదు. ఇప్పుడంతా హైటెక్ స్పీడ్.. అయితే ఇదే కొన్నిసార్లు తనను భయానికి గురి చేస్తోందంటోంది బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాన్న (రామ్ ముఖర్జీ) ఉన్నప్పుడు నా సినిమాలు చూసి పర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పేవాడు. ఆయన వెళ్లిపోయాక ఫీడ్‌బ్యాక్ పొందడమే కష్టమైపోయింది. నా కూతురు తట్టుకోలేదుకానీ భగవంతుడు నాన్నను కోల్పోయిన లోటును కూతురితో భర్తీ చేశాడు. అయితే నా కూతురు నా సినిమాలు ఎక్కువగా చూడదు. ఎందుకంటే నేను ఏడ్చే సన్నివేశాలను చూసి తను తట్టుకోలేదు.. అదే సంతోషంతో డ్యాన్స్ చేసే సీన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. నేను నటించిన హిచ్కి, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, బంటీ ఔర్ బబ్లీ సినిమాలు చాలా ఇష్టపడుతుంది.మేకప్ వేసుకున్నా బాధేకుచ్ కుచ్ హోతాహై మూవీ మాత్రం చూడలేదు. ఎందుకంటే అందులో నేను మొదటి సన్నివేశంలోనే చనిపోతాను. అది తను తట్టుకోలేదు. అలాగే నేను మేకప్ వేసుకుంటే కూడా తనకు నచ్చదు. నువ్వు నా అమ్మలా కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. మేకప్ తీసేయగానే ఇప్పుడు నువ్వు నా అమ్మవి అని చెప్తుంది. ఎంతైనా తను జెన్ ఆల్ఫా (2010 - 2024 మధ్య జన్మించినవారు) కిడ్. అదే నా చిన్నతనంలో..ఒక్కోసారి కోపంతో నాపై అరిచేస్తుంటుంది. అప్పుడు తను చెప్పేది నేను ఓపికగా వినాల్సిందే! అదే నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చెంపదెబ్బలు కొట్టేది. అదే పని నేను చేశాననుకోండి, నా కూతురు తిరిగి కొట్టినా కొట్టొచ్చు. తను చాలా మంచి అమ్మాయి అయినప్పటికీ తనకు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.సినిమారాణీ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో కూతురు అధీర జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగానూ రాణీ ముఖర్జీ.. ఉత్తమ నటిగా గతేడాది జాతీయ అవార్డు అందుకుంది. ప్రస్తుతం మర్దానీ 3 మూవీ చేస్తోంది.చదవండి: కోహ్లితో రిలేషన్? స్పందించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంజనా -
క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే
హీరోయిన్ పూజా హెగ్డేకి అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి. ఈమె నటించిన 'జన నాయగణ్' లెక్క ప్రకారం ఈ పాటికే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు. పాన్ ఇండియా హీరో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే, అతడిని లాగిపెట్టి కొట్టానని చెప్పంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే.. ఓ స్టార్ హీరోతో తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 'నా కెరీర్ మొదట్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. కానీ షూటింగ్ టైంలో ఓ రోజు.. ఆ హీరో, అనుమతి లేకుండా నా క్యారవాన్‌లోకి వచ్చేశాడు. అసభ్యంగానూ ప్రవర్తించాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ హీరోని లాగిపెట్టి కొట్టాను. వెంటనే సదరు హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఆ హీరోతో నటించడానికి నేను ఇష్టపడలేదు. దీంతో నా సీన్స్ అన్నీ డూపుని పెట్టి తీశారు' అని పూజ చెప్పుకొచ్చింది.మరి పూజా హెగ్డేని ఇబ్బంది పెట్టిన ఆ పాన్ ఇండియా హీరో ఎవరా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కెరీర్ ప్రారంభంలో అంటే హృతిక్ రోషన్ 'మొహంజదారో'లో ఈమె నటించింది. దక్షిణాదిలోనూ ఈ మూవీ రిలీజైంది. నాలుగేళ్ల క్రితం ప్రభాస్ 'రాధేశ్యామ్'లో నటించింది. పూజా చేసిన పాన్ ఇండియా మూవీస్ అంటే ఇవే. మరి వీరిద్దరిలో ఎవరైనా పూజతో అసభ్యంగా ప్రవర్తించారా? లేదంటే ఈమె ఏమైనా కట్టుకథ చెబుతోందా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. ఇకపోతే పూజా చేతిలో ప్రస్తుతం కాంచన 4, దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా, ఓ హిందీ మూవీ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం! తొలివారం కలెక్షన్ ఎంతంటే?) -
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా 2025 జనవరి 27న కన్నుమూసింది. కడదాకా తోడుంటానని మాటిచ్చిన భార్య ఇలా అర్ధాంతరంగా వదిలేసి పోవడంతో భర్త, నటుడు పరాగ్ త్యాగి గుండెపగిలేలా ఏడ్చాడు. భార్య బ్రష్‌తో పళ్లు తోముకుంటూ, ఆమె బట్టలను తడుముకుతూ ఆవిడ జ్ఞాపకాల్లోనే కాలం గడిపేస్తున్నాడు. షెఫాలిపై ప్రేమకు గుర్తుగా ఛాతిపై భార్య ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు.అదే కారణంఇకపోతే షెఫాలి.. బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఉపవాసం ఉన్నరోజు ఓ ఇంజక్షన్ తీసుకున్న కాసేపటికే గుండెపోటుతో మరణించిందని అప్పుడు వార్తలు వెలువడ్డాయి. దాన్ని గతంలోనే పరాగ్ కొట్టిపారేశాడు. అయితే తన భార్య చావుకు అసలు కారణం చేతబడి అని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలామంది ఇలాంటివి నమ్మరు. కానీ, నేను నమ్ముతాను. చేతబడులు జరుగుతున్నాయి.ఒక్కసారి కాదు, రెండుసార్లుచాలామంది వారు పడే కష్టాల కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. అలా నా భార్యపై చేతబడి చేశారు. కానీ, ఎవరు చేశారనేది నాకు తెలీదు. ఏదో తప్పు జరుగుతోందని నాకు రెండుసార్లు అనిపించింది. అయితే మొదటిసారి పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకున్నాయి. రెండోసారి మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి. చేయిదాటిపోయిందినాకు దైవభక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగిపోయినప్పుడు ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని నేను ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యను తాకినప్పుడు కూడా ఏదో జరుగుతోందని అర్థమైంది. తనను కాపాడమని భగవంతుడిని ఎంతగానో వేడుకున్నాను. కానీ అంతా చేయిదాటిపోయింది అని చెప్పుకొచ్చాడు. షెఫాలి జరివాలా (Shefali Jariwala).. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లోనూ పాల్గొంది.చదవండి: మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం: అనసూయ ఆవేదన -
సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక
గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలతో సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్ వద డిజాస్టర్‌గా నిలిచింది. అదే సికందర్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.గతేడాది ఒక్కటే ఫ్లాప్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్‌కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్ సల్మాన్‌ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్ మూవీ గురించి రష్మిక స్పందించింది.నాకు చెప్పిన కథ వేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్, రిలీజ్ డేట్, ఎడిటింగ్.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.చదవండి: ఆ ఇద్దరే బిగ్‌బాస్ విజేతలు.. మరో సర్ప్రైజ్ ఏంటంటే? -
నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్
కొన్నిసార్లు మన అభిప్రాయాలు ఇతరులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లుగా పవర్ షిఫ్ట్ నెలకొందని, సృజనాత్మక లేనివారే క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు మతపరమైన అంశం కూడా కారణం కావొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రెహమాన్. అర్థం చేసుకున్నారుఅంతేకాకుండా ఆ ప్రభావం తనపై పడినట్లు తనకు అనిపించలేదు కానీ, పడిందన్నట్లుగా కొందరు గుసగుసలాడుకున్నట్లు తెలిసిందని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు తప్పుపట్టారు. తాజాగా ఈ వివాదంపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. భారతదేశం నా ఇల్లు.. నా గురువు.. నాకు స్ఫూర్తి. కొన్నిసార్లు మన అభిప్రాయాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నాను. బాధ పెట్టాలనుకోలేదుకానీ, నా ఆలోచన మాత్రం ఎప్పుడూ సంగీతం గౌరవించబడటమే.. సంగీతానికి సేవ చేయడమే.. అలాగే నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోవడం లేదు. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో నేను భారతీయుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. కృతజ్ఞతతో ఉంటా..అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేవ్స్ సమ్మిట్ -2025లో ఝాలా ప్రదర్శన, రూహ్- ఎ-నూర్, సన్ షైన్ ఆర్కెస్ట్రాకు మార్గదర్వకత్వం వహించడం, ఇండియాస్ ఫస్ట్ మల్టీకల్చరల్ వర్చ్యువల్ బ్యాండ్ 'సీక్రెట్ మౌంటైన్'ను బిల్డ్ చేయడం, హన్స్ జిమ్మర్తో కలిసి రామాయణ సినిమాకు సంగీతం అందిస్తుండటం.. ఇలా ప్రతీది నా జర్నీని బలోపేతం చేస్తుందనుకుంటున్నాను. ఈ దేశానికి కృతజ్ఞతతో ఉంటాను. జై హింద్, జయహో.. అంటూ వీడియోలో మాట్లాడారు రెహమాన్. మా తుఝే సలామ్, వందేమాతరం అంటూ ఓ స్టేడియంలో ఆడియన్స్ పాడుతున్న విజువల్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. View this post on Instagram A post shared by AR Rahman: Official Updates (@arrofficialupdates) చదవండి: 20 ఏళ్ల వయసులో తమన్నాకు చేదు అనుభవం -
ప్రభాస్ vs సల్మాన్ ఖాన్.. బాక్సాఫీస్ పోటీ?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఒకసారి బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో ప్రభాస్ పోటీ పడ్డారు. ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కూడా తలపడే అవకాశం కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీ వీకెండ్‌తో పాటు ఈద్ పండుగ సీజన్‌కి దగ్గరగా ఉండటంతో భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శక ద్వయం రాజ్-డీకేతో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027 రంజాన్ సీజన్లో విడుదల చేయాలనే ప్లాన్ జరుగుతోంది. సల్మాన్ ఖాన్‌కు రంజాన్ సీజన్‌పై ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. గతంలో అనేక సినిమాలను ఆయన ఈ సీజన్లో విడుదల చేసి విజయాలు సాధించాడు. అందుకే రాజ్-డీకే సినిమా కూడా అదే టైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఆ సీజన్‌ను లాక్ చేసుకున్నాడు. అదే సమయంలో సల్మాన్ సినిమా కూడా సిద్ధమవుతుందనే ప్రచారం నడుస్తోంది. రాజ్-డీకే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన వెంటనే ఈ రెండు భారీ సినిమాల మధ్య పోటీపై స్పష్టత వస్తుంది. బాలీవుడ్లో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం ఆనవాయితీ కావడంతో ఈ పోటీపై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. 2027 రంజాన్ బాక్సాఫీస్‌లో ప్రభాస్ స్పిరిట్ vs సల్మాన్ ఖాన్ – రాజ్-డీకే సినిమా పోటీ ఒకవేళ నిజమైతే ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద క్లాష్‌గా నిలిచే అవకాశం ఉంది. -
నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ: యంగ్ హీరోయిన్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అర్జున్ ఇటీవలే దురంధర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన యుఫోరియా మూవీతో అలరించేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. టాలీవుడ్ మీ ఫేవరేట్ హీరో అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ ఆసక్తికరమైన పేరు చెప్పింది. తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.కాగా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా చిత్రంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటింటారు. ఈ సినిమాకు నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
పెళ్లయిన నిర్మాతతో డేటింగ్ రూమర్స్.. స్పందించిన ఐటమ్ బ్యూటీ..!
బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న బ్యూటీ నోరా ఫతేహీ. పలు సూపర్ హిట్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో అభిమానులను మెప్పించింది. తన గ్లామర్‌తో బాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కన్నడ చిత్రం కేడీ: ది డెవిల్, తమిళ చిత్రం కాంచన 4లో కనిపించనుంది.అయితే సినీ కెరీర్ సంగతి పక్కన పెడితే.. ఇటీవల నోరాపై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ టి సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌తో రిలేషన్‌పై ఉన్నారని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నోరా స్పందించింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. తనపై వచ్చిన వీడియోను చూసి వావ్ అంటూ స్మైలీ ఎమోజీని జోడించింది. దీంతో నోరా ఫతేహీ టాపిక్ బాలీవుడ్ చర్చనీయాంశంగా మారిపోయింది.కాగా.. 2005లో నటి దివ్య ఖోస్లాను భూషణ్ కుమార్ వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో ఒక కొడుకు జన్మించారు. అయితే తనపై వస్తున్న రూమర్స్‌పై భూషణ్ కుమార్ మాత్రం స్పందించలేదు. నోరా ఫతేహి వ్యక్తిగత జీవితం గురించి కొత్త కొత్త ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. గతంలో మొరాకో ఫుట్‌బాల్ క్రీడాకారుడు అచ్రాఫ్ హకీమి రిలేషన్లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. -
హీరో కూతురికి నామకరణం.. సాక్షాత్తూ అమ్మవారి పేరు!
బాలీవుడ్ జంట రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ పెళ్లిరోజు నాడే (నవంబర్ 15న) పాప పుట్టడంతో సంతోషంలో మునిగిపోయారు. తాజాగా తమ ఇంట్లోకి సంతోషాల మూటను తీసుకొచ్చిన చిన్నారి చేతి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాపకు "పార్వతి పాల్ రావు" అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. సాక్షాత్తూ అమ్మవారి పేరునే కూతురికి పెట్టుకున్నారన్నమాట! ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు పాప పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. 2021లో పెళ్లిరాజ్ కుమార్ రావు- పాత్రలేఖ ఇద్దరూ సినిమా యాక్టర్సే. 2014లో సిటీలైట్స్ సినిమా షూటింగ్లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ రానురానూ మరింత బలపడింది. పెద్దలు కూడా వారి ప్రేమాయణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2021 నవంబర్ 15న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గతేడాది న్యూజిలాండ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు పాత్రలేఖకు తాను గర్భవతిని అన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే భారత్ తిరిగొచ్చేసిది. అయితే బిడ్డ పుట్టాక మళ్లీ న్యూజిలాండ్ ట్రిప్‌కు వెళ్లి ఆ ప్రదేశాన్ని మొత్తం చుట్టేస్తానంటోంది.సినిమారాజ్ కుమార్ రావు.. 2010లో సినీ జర్నీ మొదలుపెట్టాడు. రణ్, లవ్ సెక్స్ ఔర్ ఢోకా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, స్త్రీ. తలాష్, లవ్ సోనియా, హిట్, శ్రీకాంత్, భేడియా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. పాత్రలేఖ విషయానికి వస్తే.. ఈమె లవ్ గేమ్స్, నానూకీ జాను, బద్నాం గాలి, పూలె వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) -
ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రెహమాన్‌పై కంగనా ఫైర్
లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన మతపర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. తన మతం వల్లే ఎనిమిదేళ్లుగా అవకాశాలు రాలేదంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రెహమాన్‌ను తీవ్రంగా దుయ్యబట్టింది హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.మీలాంటి మనిషిని చూడలేఈ మేరకు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది. ప్రియమైన ఏర్ రెహమాన్.. నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ, మీకంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. నేను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం అందించమని కోరేందుకు మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నించాను. కనీసం కథ చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయినా సినిమా ఒక ప్రొపగాండా అన్న భావనతో మీరు దానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి అని మండిపడింది. ఇదే క్రమంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.చీరలో వెళ్లేందుకు నోతన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం నన్ను వాడుకుంది. కానీ, ఓ రోజు అయోధ్య రామజన్మభూమికి వెళ్లేటప్పుడు మాత్రం తన చీర ఇచ్చేందుకు మసాబా నిరాకరించింది. అప్పుడు అవమానభారంతో కారులోనే ఏడ్చేశాను. ఓపక్క వీళ్లే ఇలా చేస్తుంటే ఏఆర్ రెహమాన్ మాత్రం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు అని కంగనా మండిపడింది.చదవండి: ఒక్కడు మూవీలో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా? -
‘తస్కరి–ది స్మగ్లర్స్ ’ వెబ్ సిరీస్ రివ్యూ.. సీక్రెట్స్ ఆఫ్ స్మగ్లింగ్
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్ అనే సిరీస్ ఒకటి. ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాంమనకు తెలిసిన 64 కళలలో చోర కళ అనేది చతురత, నైపుణ్యంతో కూడుకున్నది. ఆ చోర కళలో ఓ విభాగమే ఈ స్మగ్లింగ్. ఇప్పటిదాకా అడపా దడపా వార్తలలో వినపడినట్టు లేక అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో చూపించడం ద్వారానే స్మగ్లింగ్ అనేది సామాన్యులకు కాస్త పరిచయం. ఈ స్మగ్లింగ్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ రూపొందింది. నీరజ్ పాండే ఈ సిరీస్‌కి కథ అందించి, స్వీయదర్శకత్వంలో రూపొందించారు. ఏడు భాగాలతో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ స్మగ్లింగ్ జరిగే విధానాన్ని, కస్టమ్స్ ఆ స్మగ్లింగ్‌ని అరికట్టే పద్ధతులను సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా దాదాపు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో ఈ సిరీస్‌కు ప్రాణం పోశారు. ఈ సిరీస్ కథ మొత్తం ముంబై శివాజీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నేపథ్యంలో నడుస్తుంది. ఈ ఎయిర్‌పోర్టులో కథానాయకుడు అర్జున్ మీనా కస్టమ్స్ ఆఫీసరుగా పని చేస్తుంటాడు. తాను పని చేస్తున్న ఎయిర్‌పోర్టులో ఇతర దేశాల నుండి కొన్ని కోట్ల రూపాయల విలువ గల స్మగ్లింగ్ జరుగుతోందని, అది కూడా అరబ్ దేశాలలో ఉన్న బడా చౌదరి వల్ల జరుగుతోందని తెలుసుకుంటాడు అర్జున్. ఇదే సమయంలో కొత్తగా తమకు వచ్చిన బాస్ ప్రకాశ్‌తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. కానీ బడా చౌదరి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కస్టమ్స్ వాళ్ళని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. మరి... బడా చౌదరి స్మగ్లింగ్ బండారాన్ని అర్జున్ బయటపెడతాడా? లేదా అన్నది మాత్రం ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ కాస్త పేలవంగా అనిపించినా సిరీస్ మొత్తం చూసినవారికి స్మగ్లింగ్ సీక్రెట్స్ బాగానే తెలుస్తాయి. ఈ వీకెండ్‌కి ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ మంచి కాలక్షేపం. – హరికృష్ణ ఇంటూరు -
మార్చి రిలీజ్‌లపై సందేహాలు.. ఏవి వస్తాయి? ఏవి వాయిదా?
సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్‌లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. అందువల్ల మార్చిలో రిలీజ్ అవ్వడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమాకు ఇంకా ముప్పై రోజుల షూట్ మిగిలి ఉంది. సంక్రాంతి తర్వాత నాన్‌స్టాప్‌గా షూట్ చేసినా, రిలీజ్‌కు కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ టైమ్ ఒక్క నెలలో పూర్తవడం కష్టమే. కానీ ఇటీవల రిలీజ్ చేసిన రామ్ చరణ్ పోస్టర్లలో మాత్ర మార్చి నెల రిలీజ్ అంటూ ప్రకటించారు. చూడాలి ఆ టైమ్‌కు పెద్ది రిలీజ్ అవుతుంతో లేదో. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించిన దురంధర్ 2 మాత్రం బాలీవుడ్ స్టైల్లో డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కువగా వాయిదా లేకుండా వస్తుందని అంచనా. అయితే మార్చి నెల ఎగ్జామ్స్ సీజన్. దాంతో ఆ టైమ్‌లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే సందేహం ఉంది. దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా 2027 మార్చికి ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ కూడా అదే టైమ్‌లో వస్తుందని టాక్ ఉంది. కానీ అధికారిక డేట్ మాత్రం ఇంకా రాలేదు. సంక్రాంతి రిలీజ్‌ల మాదిరిగానే ప్రీ సమ్మర్ రిలీజ్లు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ ఉన్నా, పెద్ద సినిమాలు వేసవి హాలిడేలకు దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్‌లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మార్చి 2026లో ప్రకటించిన సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2027 మార్చి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాలతో హాట్‌గా మారనుంది. -
2016.. నా జీవితమే నరకప్రాయం: కంగనా రనౌత్
2026కి వెల్కమ్ చెప్పే క్రమంలో అందరూ 2025ను ఓసారి రివైండ్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి కొంత స్పెషల్‌గా ఏకంగా పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016 అంటూ దశాబ్దపు కాలం క్రితం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ 2016ని తన జీవితంలోనే ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఏడాదిగా అభివర్ణించింది.2016ని ఎందుకు మిస్ అవుతున్నారో?వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత దారుణ పరిస్థితులను చూశానంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందరూ సడన్‌గా 2016ని ఎందుకు మిస్ అవుతున్నారో? నాకైతే ఆ ఏడాది ఒక పీడకల. క్వీన్, తను వెడ్స్ మను సినిమాలతో ఘన విజయాలు అందుకుని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నాకు 2016 జనవరిలో ఓ పెద్ద షాక్ తగిలింది. నా సహనటుడు నాకు లీగల్ నోటీసులు పంపాడు.సంచలనంఅది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానివల్లే ఇండస్ట్రీ ఇన్సైడర్స్, ఔట్‌సైడర్స్ అని రెండుగా చీలిపోయింది. విజయం విషపూరితమైపోయింది. జీవితం నరకప్రాయంగా మారింది. ఎన్నో న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చింది. 2026లో ఇలా హ్యాపీగా ఉంటానని.. ఆ వివాదాన్ని కొంతకాలానికే అందరూ మర్చిపోతారని అప్పుడే తెలిసుంటే అంత బాధపడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు 2016లో కాకుండా 2026లో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది.ఏమిటా వివాదం?గతంలో కంగనా రనౌత్- హృతిక్ రోషన్ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ ఎంతోకాలం కొనసాగలేదు. భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో 2016వ సంవత్సరం ప్రారంభంలో కంగనా తన ఇంటర్వ్యూలలో హృతిక్ రోషన్‌ను ఎక్స్‌గా పేర్కొంటూ కొన్ని కామెంట్స్ చేసింది. దీంతో హృతిక్.. కంగనా తనకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోర్టు చుట్టూ తిరగడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. సినిమాల విషయానికి వస్తే.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో యాక్ట్ చేసింది. చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మించింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
అమ్మాయితో వివాహేతర సంబంధం.. స్టార్ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య గోవిందాపై ఆయన సతీమణి సునీత ఆహుజా(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. గోవిందాకు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత గోవిందా(Govinda) పర్సనల్ లైప్‌పై రకరకాల పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం సునీత, గోవిందా వేరు వేరుగా ఉంటున్నారు. విడాకులు కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని స్వయంగా సునీతనే చెప్పింది. అయితే తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనేది వందశాతం నిజమని చెబుతోంది. తాజాగా మిస్ మాలినికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అదే విషయంపై మట్లాడారు. ‘చాలా మంది అమ్మాయిలు మీ దగ్గరు వస్తారు. కానీ మీరు తెలివి తక్కువ వారు కాదు. 63 ఏళ్ల వయసు వచ్చింది. టీనా(కూతురు)కి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. యశ్(కొడుకు)కి కెరీర్ ఉంది. నిన్ను క్షమించే ప్రస్తక్తే లేదు గోవిందా’ అని భర్త గోవిందకు సునీత వార్నింగ్ ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నేపాల్ అమ్మాయిని. ఖుక్రీ(కత్తి) బయటకు తీస్తే.. అందరూ ఇబ్బంది పడతారు. అందుకే జాగ్రత్తగా ఉండమని అతని చెప్పా’ అని సునీత అన్నారు.కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు. -
భర్త వల్లే సినిమాలకు దూరం? హీరోయిన్ ఏమందంటే?
ఒకప్పుడు గ్లామర్‌తో అల్లాడించిన హీరోయిన్ సనా ఖాన్ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. 2020 అక్టోబర్‌లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.నేనే కోరుకున్నా..తాజాగా ఈ రూమర్‌పై సనాఖాన్ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే.. అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్‌తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. నా భర్త వల్లే..గతంలో హిజాబ్ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.అందుకే సినిమాలు వదిలేశా..ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.సినిమాహీరోయిన్ సనా ఖాన్.. గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతం వల్లేనేమో! -
8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతంవల్లేనేమో!
సంగీత ప్రపంచంలోనే అగ్రజుడు ఏఆర్ రెహమాన్. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ తన సత్తా చూపించాడు. పుట్టుకతోనే హిందూ అయిన ఇతడు తర్వాత ముస్లిం మతానికి మారిపోయాడు. అయితే తాను ముస్లిం అవడం వల్ల బాలీవుడ్లో సరైన అవకాశాలు రాలేదంటూ అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఔట్ సైడర్తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. రోజా, బాంబే, దిల్సే వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించినప్పటికీ నేను బాలీవుడ్లో ఔట్‌సైడర్ (ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి)లానే ఫీల్ అయ్యేవాడిని. కానీ తాల్ సినిమా పాటలు అందరి ఇంట్లోకి చేరాయి. ఇప్పటికీ ఎంతోమంది ఉత్తరాదివాళ్లు ఆ మూవీ పాటలు వింటూనే ఉంటారు. ఎందుకంటే అందులో కొంత పంజాబీ, కొంత హిందీ మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది.8 ఏళ్లుగా తగ్గిన అవకాశాలుఅప్పుడు నాకు పంజాబీ సంగీతంపై మరింత ఆసక్తి కలిగింది. అలా సుక్వీందర్ సింగ్‌ను కలిశాను. తనతో కలిసి చేసిన 'చయ్య చయ్య', 'జై హో..' పాటలు ఎంత ఆదరణ పొందాయో మీ అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిదేళ్లుగా నాకు బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. బహుశా దీనికి ఇండస్ట్రీలో మారిన పవర్ షిఫ్ట్ ఒక కారణమైతే.. నా మతం కూడా మరో కారణం కావొచ్చు. ఏదేమైనా నాకు నా కుటుంబానితో గడిపేందుకు సమయం దొరికిందనుకుంటాను. అవే నా దగ్గరకు..అయినా పనికోసం నేను పాకులాడటం లేదు. పనే నా దగ్గరకు రావాలని అనుకుంటాను. నా వృత్తిపట్ల నాకున్న నిబద్ధతే నాకు అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. మతమే అడ్డంకైతే ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు వచ్చేవే కాదని పలువురు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. రామాయణం మూవీలో ఛాన్స్ నీ మతం చూసే ఇచ్చారా? అని మండిపడుతున్నారు. చదవండి: ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? -
ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? అసలు నిజమిదే!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ రూమర్ తెగ వైరలవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఏంటి.. నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.ఇంత సడన్‌గా పెళ్లేంటి?అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో మృణాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఉట్టి రూమర్సేనని హీరోయిన్ టీమ్ కొట్టిపారేసింది. ఫిబ్రవరిలో ఆమె సినిమా రిలీజ్ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది.. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడన్‌గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్ తిరిగి ప్రశ్నించింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరో సృష్టించారని చెప్తోంది. దీంతో మృణాల్ పెళ్లి రూమర్స్‌కు ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. ధనుష్ చివరగా తేరే ఇష్క్ మే మూవీతో పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం కార మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ చివరగా సన్ ఆఫ్ సర్దార్ మూవీతో పలకరించింది. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో హీరోయిన్గా నటించిన డెకాయిట్ మార్చిలో విడుదల కానుంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.చదవండి: నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు.. :శర్వానంద్ -
తమన్నా ఐటం సాంగ్‌కు 100 కోట్ల వ్యూస్..
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్‌తో వైరల్ అవుతోంది తమన్నా భాటియా. అలా ఆమె స్పెషల్‌గా స్టెప్పులేసిన పాట ఒకటి వన్ బిలియన్ వ్యూస్ వ్యూస్ దాటింది. అదే 'స్త్రీ 2' మూవీలోని 'ఆజ్ కీ రాత్'. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఫస్ట్ వ్యూ నుంచి 1 బిలియన్ (100 కోట్ల) వరకు.. మీ ప్రేమకు థాంక్స్' అని రాసుకొచ్చింది.సినిమాతమన్నా 2005లో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. శ్రీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. 100% లవ్, బద్రీనాథ్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, ఆగడు, బాహుబలి, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. చివరగా ఓదెల 2 మూవీలో నటించింది. ప్రస్తుతం హిందీలోనే మూడు సినిమాలు చేస్తోంది.ఐటం సాంగ్‌తో మరింత క్రేజ్అల్లుడు శీను మూవీలో 'రావే నా లబ్బర్ బొమ్మ' అనే ఐటం సాంగ్‌లో తొలిసారి స్టెప్పులేసింది. జై లవకుశలో 'స్వింగ్ జర', సరిలేరు నీకెవ్వరులో 'డాంగ్ డాంగ్', జైలర్‌లో 'నువ్వు కావాలయ్యా..', స్త్రీ 2లో 'ఆజ్ కీ రాత్', రైడ్ 2లో 'నషా' వంటి ఐటం సాంగ్స్‌తో తమన్నా ఫుల్ పాపులర్ అయిపోయింది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?


