జూలై 3
Appearance
జూలై 3 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 184వ రోజు (లీపు సంవత్సరములో 185వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 181 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1608: క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు.
- 1767: ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి అతని పేరుతోనే పిట్కేర్న్ దీవి అని పేరు పెట్టారు.
- 1767: అడ్రెస్సీవిసెన్ అనే పేరుగల నార్వే దేశపు వార్తాపత్రిక మొదటిసారిగా ముద్రించారు. ఆ పత్రికను నేటికీ ముద్రిస్తున్నారు.
- 1819: అమెరికా లోని, న్యూయార్క్ నగరంలో, ది బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ అనే సేవింగ్స్ బ్యాంక్ మొట్టమొదటగా మొదలు పెట్టారు.
- 1863: అమెరికన్ సివిల్ వార్‌లో భాగంగా జరిగిన గెట్టిస్ బర్గ్ యుద్ధం అంతమయ్యింది.
- 1884: డౌ జోన్స్ అండ్ కంపెనీ ముద్రణా సంస్థ మొట్ట మొదటి సారి స్టాక్ ఏవరేజ్ని ముద్రించింది. ఈ సంస్థని ముగ్గురు విలేకరులు ' ఛార్లే స్ డౌ ', 'ఎడ్వర్ద్ జోన్స్ ', 'ఛార్లెస్ బెర్గ్ స్ట్రెస్సెర్ ' మొదలు పెట్టారు.
- 1886: ' కార్ల్ బెంజ్ ' పేటెంట్ పొందిన 'మోటారు వేగన్ ' ని మొట్ట మొదటి సారిగా అధికారికంగా విడుదల చేసాడు.
- 1886: మొట్టమొదటి లినో టైపు యంత్రాన్ని (పుస్తక ముద్రణలో వాడే యంత్రం) 'ది న్యూ యార్క్ ట్రిబ్యున్ ' అనే వార్తా పత్రిక వాడింది. అంతకు ముందు, పత్రికా ముద్రణలో, అత్యంత శ్రమతో కూడి, చేతితో కూర్చే ' టైప్ సెట్టింగ్ విధానం ' వాడేవారు.
- 1890: అమెరికాలో 43వ రాష్ట్రంగా ఇదాహొ చేరింది.
- 1928: జాన్ లాగీ బేర్డ్ మొదటి రంగుల టెలివిజన్‌ని ప్రసారం చేసాడు.
- 1981: న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మొట్టమొదటిసారిగా 'కొత్తరకం జబ్బు' గా పేర్కొన్నారు. తరువాత, ఆ జబ్బు కే, ఎయిడ్స్ అని పేరు పెట్టారు.
- 1988: గల్ఫ్ తీరంలో వున్న అమెరికా యుద్ధ నౌక పొరపాటున ఒక ఇరానియన్ విమానాన్ని కూల్చి వేసింది.
- 1994: టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో (రోడ్డు ప్రమాదాలలో ) ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ చెప్పింది.
- 1996: స్టోన్ ఆఫ్ స్కోన్ స్కాట్లాండ్ తిరిగి చేరుకుంది.
- 2001: వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలిపోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు.
- 2006: స్పెయిన్ లోని వేలెన్ సియాలో జరిగిన వేలెన్ సియా మెట్రో ప్రమాదంలో 43మంది మరణించారు.
- 2006: భూమికి 4,32,308 కిలోమీటర్ల ( 2,68,624 మైళ్ళు) దూరంలో ఆస్టరాయిడ్ 2004 ఎక్స్.పి.14 అనే గ్రహ శకలం ప్రయాణించింది.
- 2009: మార్క్ II.5 స్కై ట్రెయిన్ పేరు గల కార్లు కెనడా లోని వాన్ కూవర్ మెట్రో నగరంలో ప్రవేశపెట్టారు.
జననాలు
[మార్చు]- 1851: చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. (మ.1930)
- 1898: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు. ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (మ.1976)
- 1903: నారు నాగ నార్య, సాహితీవేత్త. (మ.1973)
- 1914: విశ్వనాథశర్మ, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
- 1918: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974)
- 1924: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (మ.1999)
- 1924: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (మ.1993)
- 1927: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత. (మ.2000)
- 1928: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో ఒక నేపథ్యగాయని. (మ.1990)
- 1931: సురభి బాలసరస్వతి, తెలుగు చిత్రాల నాయిక, ప్రతినాయక, హాస్య నటి.
- 1939: లకంసాని చక్రధరరావు, "తెలుగు వ్యుత్పత్తి కోశం" సంపాదకుడు
- 1949: అనుమాండ్ల భూమయ్య, తెలుగు కవి.
- 1951: రిచర్డ్ హాడ్లీ, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
- 1962: టామ్ క్రూజ్, అమెరికా దేశ నటుడు, చలన చిత్ర నిర్మాత.
- 1971: జూలియన్ అసాంజే, ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
- 1980: హర్భజన్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
మరణాలు
[మార్చు]- 1910: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషిచేసిన వాడు. (జ.1877)
- 1996: చకిలం శ్రీనివాసరావు, నల్గొండ లోక్‌సభ సభ్యులు. (జ.1922)
- 2015: తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1924)
- 2016: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (జ.1975)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- నేషనల్ ప్రైడ్ క్లామ్ డే.
- అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం .
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 3
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 2 - జూలై 4 - జూన్ 3 - ఆగష్టు 3 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |