'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.ఇక హీరోయిన్ విషయంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చాడు.ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. చరణ్-సుక్కూ కాంబో మళ్లీ కలిసింది. అనుపమ కూడా ఇంకా లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తన కెరీర్లో అనుపమ కొన్ని మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరుకు స్టార్ హీరోల రేంజ్లో మాత్రం ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో, దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్-సుక్కూ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా ఆత్మహత్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యల విపరీతమైపోయాయి. రైతుల కంటే రైతు కూలీలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడైంది. కార్యదర్శల సమీక్షలో ఏపీలోని ఆత్మహత్యల వాస్తవాలు బయటకొచ్చాయి. ఏపీలో ఆత్మహత్యలకు గల కారణాలు..4,456 మంది కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు2,742 మంది ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు447 మంది ప్రేమ విఫలమై ఆత్మహత్యలునిరుద్యోగం వలన 206 మంది ఆత్మహత్యలుమద్యంకి బానిసై 1544 మంది ఆత్మహత్యలుచదువుల ఒత్తిడితో 191 మంది ఆత్మహత్యలుపని ఒత్తిడి వలన 31 మంది మరణాలుఇతర కారణాలతో 4,500 మంది ఆత్మహత్యలు
శ్రీశైలంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
శ్రీశైలం: శ్రీశైలంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యాయి. దాంతో దర్శనం కోసం క్యూలైన్స్ , కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. శ్రీశైలం ఆలయం వద్ద శివస్వాములు ఆందోళన కొనసాగుతోంది. ఈవో డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు శివస్వాములు. శివ భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పి యుగంధర్ బాబు , జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు..లాఠీ తో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొడుతున్న ఏఎస్పి యుగంధర్ బాబు. ఫలితంగా రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండా వెనుతిరుగుతున్న శివదీక్ష స్వామి భక్తులు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని శివ స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివ భక్తులు, శివమాల దారులు పరిస్థితి గందరగోళంగా మారింది.అటవీ ప్రాంతం నుంచి నడక మార్గం ద్వారా శ్రీశైలం(ఫోటో గ్యాలరీ)
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్.. జనసేన హైడ్రామా
తిరుపతి: కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జనసేన హైడ్రామా కొనసాగుతోంది. రేపు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) మరోమారు రైల్వే కోడూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీధర్‌తో పాటు కార్యకర్తలను సదరు కమిటీ విచారించింది. అయినా ఇంతవరకూ పార్టీకి నివేదిక ఇవ్వలేదు త్రిసభ్య కమిటీ.ఇదిలా ఉంచితే,. నిన్నటి జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అంటూ లీకులిచ్చారు. అదే సమయంలో అరవ శ్రీధర్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైప బాధిత మహిళపై పోలీసు కేసులతో పాటు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు వెలుగుచూస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం చేసినదంతా చేసి పార్టీకి సంబంధం లేదంటూ కొత్త డ్రామాకి తెరలేపాడు.
ఓటీటీ ట్రెండింగ్‌లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం
విశాఖ ఉక్కు: ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగు..!
మార్క్రమ్ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోర్
33 ఏళ్ల క్రితం సాధారణ వెబ్ అడ్రస్‌గా రిజిస్టర్.. ఇప్పుడు రూ. 600 కోట్లు!
శ్రీశైలంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ.. నటాషా స్టాంకోవిచ్ బోల్డ్ లుక్స్..!
వివో కీలక ప్రకటన.. త్వరలో మడత ఫోన్
అజిత్‌ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
సార్! అలవాటులో పొరపాటు! ఆ కంపెనీ మనదే!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
కియోసాకీకి కోపమొచ్చింది!
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
క్రికెట్ అభిమానులకు శుభవార్త
అందరూ ఒకటే! మనమే వేరు!!
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
విశ్వక్ సేన్‌కు భవిష్యత్ ఉంది.. గొడవకు 'అర్జున్' ఫుల్స్టాప్
క్షమాపణ చెబితే బెటరేమో సార్.. లేకపోతే మరింత ఊబిలో కూరుకుపోతాం!!
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
IND vs PAK: పాపం బంగ్లాదేశ్!.. బుద్ధి చూపించిన పాకిస్తాన్!
‘మంత్రి పదవి ఇచ్చారు.. ఎమ్మెల్సీ పదవి మాత్రం లేదు’
ఓటీటీ ట్రెండింగ్‌లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం
విశాఖ ఉక్కు: ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగు..!
మార్క్రమ్ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోర్
33 ఏళ్ల క్రితం సాధారణ వెబ్ అడ్రస్‌గా రిజిస్టర్.. ఇప్పుడు రూ. 600 కోట్లు!
శ్రీశైలంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ.. నటాషా స్టాంకోవిచ్ బోల్డ్ లుక్స్..!
వివో కీలక ప్రకటన.. త్వరలో మడత ఫోన్
అజిత్‌ను కలిసేందుకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
సార్! అలవాటులో పొరపాటు! ఆ కంపెనీ మనదే!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
కియోసాకీకి కోపమొచ్చింది!
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
క్రికెట్ అభిమానులకు శుభవార్త
అందరూ ఒకటే! మనమే వేరు!!
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
విశ్వక్ సేన్‌కు భవిష్యత్ ఉంది.. గొడవకు 'అర్జున్' ఫుల్స్టాప్
క్షమాపణ చెబితే బెటరేమో సార్.. లేకపోతే మరింత ఊబిలో కూరుకుపోతాం!!
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
IND vs PAK: పాపం బంగ్లాదేశ్!.. బుద్ధి చూపించిన పాకిస్తాన్!
‘మంత్రి పదవి ఇచ్చారు.. ఎమ్మెల్సీ పదవి మాత్రం లేదు’
ఫొటోలు
‘గాయపడ్డ సింహం’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
దట్టమైన నల్లమల అడవిలో వేలమంది..శ్రీశైలం యాత్ర ప్రారంభం (ఫొటోలు)
గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్.. నెట్టింట ఫోటోలు వైరల్
కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్ జగన్ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్, తేజ సజ్జా (ఫోటోలు)
హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)
'ఎర్రచీర' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సినిమా
దృశ్యం నటి.. ఒకే ఒక్క సీరియల్‌తో సినిమా ఛాన్స్..!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో దృశ్యం-3 ఒకటి. గతంలో విడుదలైన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ ఫ్రాంచైజీలో వస్తోన్న దృశ్యం 3 ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్‌ను అలరించనుంది.అయితే ఈ సినిమాలో ఐజీ గీతా ప్రభాకర్ పాత్రలో మెప్పించిన నటి ఆశా శరత్. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందని తెలిపింది. మిమ్మల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందని పేర్కొంది. ఈ క్లైమాక్స్ చూస్తే మీరంతా కచ్చితంగా షాకవుతారని చెప్పుకొచ్చింది.అసలు ఎవరీ ఆశా శరత్?దృశ్యం ఫ్రాంచైజీలో ఛాన్స్ కొట్టేసిన ఆశా శరత్ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ మొదలైంది. అసలు ఆమె సినిమాల్లో ఎలా వచ్చిందనే దానిపై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తాజాగా ఆశా శరత్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మలయాళ బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఓకే ఒక్క సీరియల్‌తో మూవీస్‌లో అడుగుపెట్టింది.స్వతహాగా డ్యాన్సర్ అయినా ఆశా శరత్.. మలయాళంలో 'కుంకుమ పువ్వు' అనే సీరియల్‌తో నటనారంగ ప్రవేశం చేసింది. ఇందులో లీడ్ రోల్ అయినా ప్రొఫెసర్ జయంతి పాత్ర పోషించింది. ఈ క్యారెక్టర్‌తోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అలా తనకు కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్నప్పుడే దృశ్యం సినిమాలో అవకాశం వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ఫ్రైడే, కర్మయోధ, అర్ధనారి, జకరియాయుడే గర్భిణికల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ దృశ్యం సినిమానే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ వెర్షన్లలో కూడా అదే పాత్రను పోషించింది.ఆశా శరత్ మాట్లాడుతూ.. "నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఆందోళన ఉండేది. సీరియల్లో జయంతి పాత్ర అనేది ఎమోషనల్‌తో కూడుకున్నది. ఒకవేళ ప్రేక్షకులు గీతా ఐపీఎస్ కూడా పోలీసు యూనిఫాంలో ఉన్న జయంతి లాగే ఉందని భావిస్తే ఎలా? అది సినిమాపై, నాపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందా. కానీ వారి స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది. మలయాళీలు చాలా తెలివైనవారు. పాత్రల మధ్య తేడాను ఎలా గుర్తించాలో వారికి బాగా తెలుసు' అని గతంలోనే చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో మోహన్‌లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు.
విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్తున్నారా?.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవలే హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓం శాంతి శాంతి శాంతిః. అనే మలయాళ రీమేక్‌తో పలకరించారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. అంతలోనే మరో సినిమాకు రెడీ అయిపోయారు తరుణ్ భాస్కర్. ఆయన హీరోగా వస్తోన్న. కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ఈవెంట్‌కు హాజరైన తరుణ్ భాస్కర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు హీరోగా చేసిన సినిమా హిట్ కొట్టలేదు కదా.. మీతో సినిమా చేయడానికి నిర్మాత ఎలా ధైర్య చేశారని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి.. ఆ సినిమాతో హిట్ కొడదామన్నారు. అయితే లైఫ్‌లో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏదీ ఆపొద్దు.. ది అందరికీ చెబుతున్నా. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు. అయినా ఎందుకు సార్ నేను ఫెయిల్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని ఫన్నీగా చమత్కరించారు.ఇదే ఈవెంట్లో తరుణ్ భాస్కర్‌కు మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ మ్యారేజ్‌కి మీరు కూడా వెళ్తున్నారా? అని అడిగారు. ఇది విన్న తరుణ్.. నాకైతే ఇప్పటి వరకు ఆహ్వానం లేదు.. ఒక వేళ ఇన్విటేషన్ వస్తే మీకు వెంటనే వాట్సాఫ్‌లో ఫార్వార్డ్ చేస్తాను.. మనిద్దరం కలిసి విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్దామని తరుణ్ భాస్కర్ ఫన్నీగా పంచ్‌లు వేశారు.కాగా.. గాయపడ్డ సింహం చిత్రానికి ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతెన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ మూవీ.. పైసా తీసుకోని తమన్నా, విక్రాంత్!
వాలంటైన్స్ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.స్టార్ అవడానికి ముందే..అయితే విక్రాంత్ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్ తర్వాత అతడు పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. ఉచితంగానే..నేను డైరెక్ట్ చేసిన మఖ్బూల్ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్‌కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్‌కు కూడా వచ్చింది అని విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నాడు.చదవండి: సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్
అప్పుడు ‘షోలే’..ఇప్పుడు ‘ధురంధర్’.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
గత కొన్ని దశాబ్దాలుగా ‘ధురంధర్’లాంటి సినిమా వెండితెరపై రాలేదంటోంది చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే. ‘షోలే’ తర్వాత ఆ స్థాయి విజయం అందుకున్న సినిమా ఇదేనని గర్వంగా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ధురంధర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ధురంధర్ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఇది దర్శకనిర్మాత విజయం కాదు.. ప్రేక్షకులది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా విడుదలై.. విజయం అందుకున్న చిత్రాలు చాలా అరుదు. గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి సినిమాలు రాలేదు. ఈ చిత్రాన్ని ఒకటి ఎక్కువ సార్లు థియేటర్స్‌కి వచ్చి చూశారు. మౌత్ టాక్‌తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు నెలల పాటు థియేటర్స్‌లో అలరించింది. ‘షోలే’ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే అనుకుంటా. ఈ విజయాన్ని మేం డబ్బులతో కొనలేదు. డబ్బులతో సాధించలేని విజయం ఇది’అని జ్యోతి దేశ్‌పాండే అన్నారు. ఇక సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది. కాగా, ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ధురంధర్.. డిజిటల్ స్క్రీన్‌పై కూడా రికార్డు క్రియేట్ చేస్తుంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.
క్రీడలు
భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు 5 డిమాండ్లు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్ జరగడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. తాజా పరిస్థితి చూస్తే, ఈ మ్యాచ్ దాదాపుగా రద్దైయ్యేట్లే కనిపిస్తుంది. ఇదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు భారీ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొద్ది రోజుల కిందట పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాక్ క్రికెట్ బోర్డుతో ఇవాళ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే పీసీబీ ఐసీసీ ముందు ఐదు గొంతెమ్మ కోర్కెలను ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో ఏ ఒక్క దానికి ఐసీసీ అంగీకరించలేదని సమాచారం. భారతీయ క్రీడా జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా సోషల్‌మీడియా పోస్ట్ ఆధారంగా.. పీసీబీ ఐసీసీ ముందు ఈ ఐదు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తుంది. - బంగ్లాదేశ్‌పై శిక్షలు విధించకూడదు - భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ - టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాలి - భారత్-పాక్-బంగ్లాదేశ్‌తో ప్రత్యేక ట్రై-సిరీస్ - అదనపు ఐసీసీ టోర్నమెంట్ కేటాయింపు అయితే, ఈ ఐదు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తుంది. ఈ ఐదు తమ పరిధిలోకి రావని ఐసీసీ తేల్చినట్లు సమాచారం. ఈ ఐదు కాకుండా పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీని ప్రత్యేక ఫండింగ్ కోసం కూడా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ఈ పాక్ డిమాండ్లు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి రావడంతో భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాక్‌తో మ్యాచ్ అవసరం లేదని అంటున్నారు. పాక్‌పై ఐసీసీ శాశ్వత బహిష్కరణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్ తమతో మ్యాచ్ ఆడకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు.కాగా, ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఇది సాధ్యపడదని ఐసీసీ చెప్పడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ ఎంట్రీ ఇచ్చింది. ఈ తతంగం జరుగుతుండగానే పాక్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్‌కు కొమ్ముకాస్తూ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్ నుంచి తప్పించిన తర్వాత పాక్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ ఆడమని ప్రకటించింది.
క్రికెట్ ప్రపంచంలోకి ఎంటరైన ట్రంప్
అనునిత్యం వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా క్రికెట్ ప్రపంచంలోకి కూడా ఎంటరయ్యాడు. భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న తమ జట్టుకు (యూఎస్ఏ) ట్రంప్ మద్దతు ప్రకటించాడు. సోషల్ ట్రూత్‌లో ఓ ప్రత్యేక సందేశం పోస్ట్ చేస్తూ.. టీమ్ యూఎస్ఏ చాలా బలమైంది. అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అని పేర్కొన్నాడు. ట్రంప్ ఇచ్చిన మద్దతు యూఎస్ఏ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. రేపు (ఫిబ్రవరి 10) పాకిస్తాన్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ట్రంప్ సందేశం యూఎస్ఏ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ట్రంప్ మద్దతు అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్‌కు క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేదు. గోల్ఫ్, అమెరికన్ ఫుట్‌బాల్ వంటి క్రీడలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ట్రంప్‌కు 2020లో అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం (ప్రస్తుతం నరేంద్ర మోడి స్టేడియం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుభవం ఉంది. భారత్‌తో వాణజ్యపరమైన సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న వేల, ట్రంప్ ప్రకటన భారతీయుల్లోనూ ఆసక్తి కలిగిస్తుంది. ట్రంప్ మద్దతు ఉంటే క్రికెట్ కూడా విశ్వక్రీడగా మారిపోయే అవకాశం ఉంది.అమెరికాలో క్రికెట్ అభివృద్ధి 2023లో ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్‌తో మొదలైంది. ఆ టోర్నీలో భారత్ తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లందరూ పాల్గొంటారు. 2024 టీ20 ప్రపంచకప్‌కు సహ-ఆతిథ్యం ఇవ్వడంతో అమెరికా ప్రజలకు క్రికెట్ మరింత చేరువైంది. యూఎస్ఏలో ఇప్పటికే 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇదిలా ఉంటే, యూఎస్ఏ జట్టు గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్‌లోనూ ఆ జట్టు మరో సంచలనం సాధించే అవకాశం ఉంది. టోర్నీ ఓపెనర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. ఈ మ్యాచ్‌లో వారి పోరాటానికి క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. టీమిండియా ఆ మ్యాచ్‌ను మాత్రమే గెలిచింది కానీ, యూఎస్ఏ జట్టు మాత్రం క్రికెట్ ప్రపంచాన్నంతా గెలిచింది.
చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) ధాటికి ఒమన్ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్ కలీమ్, కెప్టెన్ జతిందర్ సింగ్, షా ఫైసల్ తలో 5 పరుగులు, షకీల్ అహ్మద్ 4, జితెన్ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్ మీర్జా, కరన్ సోనావలే డకౌట్లయ్యారు.అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్ బెన్నెట్ (48 నాటౌట్), బ్రెండన్ టేలర్ (31 రిటైర్డ్ హర్ట్) రాణించారు. మరుమని 21, సికందర్ రజా 5 (నాటౌట్) పరుగులు చేయగా.. డియాన్ మైర్స్ డకౌటయ్యాడు. ఒమన్ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్ ముజరబానీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్ ఆటగాడు ఆమిర్ కలీమ్ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్ మ్యాచ్ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్ నదీమ్ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ 42, ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ, నెదర్లాండ్స్ ఆటగాడు వాన్‌డర్ మెర్వ్ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్ బరిలో ఉన్నారు.కలీమ్ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్ కెరీర్ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కలీమ్.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి ఒమన్ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
జంగిల్‌రాజ్‌పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
‘లిఫ్ట్’ తాకట్టుపై రాయలసీమ కన్నెర్ర... ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
కొలిక్కివచ్చిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం. అమెరికా టారిఫ్‌లు 18 శాతానికి తగ్గింపు
దేశానికి వికసిత విజన్... 2026-27 బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్‌లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
బిజినెస్
ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!
కొన్ని ఇళ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. బెంగళూరులో ఇద్దరు ఐటీ ఇంజనీర్ సోదరులు నిర్మించిన ఈ అద్భుతమైన 4BHK ట్విన్ హోమ్ సింపుల్ స్టైల్, స్మార్ట్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. లోపల విశాలమైన గదులు, సహజ గాలి ప్రవాహం, ఆధునిక ఆలోచనలతో రూపొందిన ఈ ఇంటిని బిల్డ్ ఎ హోమ్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ నిర్మించింది. ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ శివరాయ్ ఈ ఇంటిని సందర్శించి, ఆ హౌస్ టూర్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఇంట్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలేంటో మనమూ చూద్దామా...రెండు ప్లాట్లు ఒకే ఇల్లు30×40 పరిమాణంలోని రెండు ప్లాట్లను కలిపి, మొత్తం 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ట్విన్ హోమ్‌ను నిర్మించారు. తాము పక్కపక్కనే నివసిస్తూ ఒకే కుటుంబంగా ఉండాలనుకున్నామని అందుకే ఇల్లు ఇలా నిర్మించుకున్నట్లు చెప్పారు. బయట నుండి చూస్తే ఇది ఒకే ఆధునిక ఇంటిలా కనిపిస్తుంది. కానీ లోపలికి అడుగుపెడితే, అచ్చు ఒకేలా ఉండే రెండు పోర్షన్లు కనిపిస్తాయి. క్లీన్ డిజైన్, స్మార్ట్ లేఅవుట్, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలే ఈ ఇంటి ప్రత్యేకత.ఇంటి లోపలి అందండబుల్-హైట్ సీలింగ్‌తో ఉన్న లివింగ్ రూమ్ ఈ ఇంటికి హైలైట్. సహజ సూర్యకాంతి లోపలికి వెల్లువలా ప్రవహించేలా డిజైన్ చేయడం వల్ల, ఆ స్థలం మరింత విశాలంగా, ఆహ్వానకరంగా అనిపిస్తుంది. ఓపెన్-ప్లాన్ కిచెన్, పూజ గది, చిన్న ఆఫీస్-కమ్-బెడ్రూమ్, హాయిగా కూర్చునే బే విండోతో మాస్టర్ బెడ్రూమ్ ఈ ఇంటి సౌకర్యాన్ని పెంచుతాయి.పిల్లల ప్రతి బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ ఏరియా ఉండటం గోప్యతను, సౌకర్యాన్ని అందిస్తుంది. రెండు ఇళ్లను కలిపే కనెక్టింగ్ హాల్వే ఒక వంతెనలా పనిచేస్తుంది. పై అంతస్తులో గెస్ట్ రూమ్, యుటిలిటీ ఏరియా ఉండటంతో, కుటుంబ సభ్యులతో పాటు అతిథులను కూడా సౌకర్యంగా ఆహ్వానించగలిగేలా ఇంటిని రూపొందించారు. యజమానులు ఈ ఇల్లు కేవలం అందంగా మాత్రమే కాకుండా, ఆచరణాత్మకంగా కూడా ఉండేలా జాగ్రత్తగా ప్లాన్ చేసి నిర్మించుకున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shiva Rai (@_mr.swashbuckler_)
యాపిల్ ఫోన్‌నూ మడతెట్టేయొచ్చు..?
శాంసంగ్, వివో, గూగుల్, వన్ ప్లస్ వంటి కంపెనీలన్నీ ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి, విక్రయిస్తున్న తరుణంలో.. యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఈ ఏడాది ఐఫోన్ 18 ప్రో & ప్రో మాక్స్ లాంచ్ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.ఇప్పుడు చాలామంది స్మార్ట్‌ఫోన్ వినియోదాగారులు ఫోల్డబుల్ ఫోన్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఐఫోన్ ఫోల్డ్ కోసం ఓఎల్ఈడీ డిస్ప్లేలను శాంసంగ్ ఉత్పత్తి చేయనుంది. ఎందుకంటే.. శాంసంగ్ అత్యుత్తమ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే టెక్నాలజీ కలిగి ఉంది.ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే దీని ధర కూడా ఎక్కువగా (సుమారు 2399 డాలర్లు) ఉండే అవకాశం ఉందని ప్రముఖ రీసర్చ్ అనలిస్ట్ ఆర్థర్ లియావో పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ పరంగా రెండు విధాలుగా ఉండవచ్చని అంచనా. ఒకటి బుక్ స్టైల్ ఫోల్డ్(ఫోన్ తెరిస్తే టాబ్లెట్ లాంటి పెద్ద స్క్రీన్), మరొకటి ఫ్లిప్-స్టైల్ ఫోల్డ్ (మడిచినప్పుడు చిన్నదిగా మారే డిజైన్).బ్యాటరీ విషయంలో.. పెద్ద స్క్రీన్కు సరిపడే విధంగా అధిక సామర్థ్యం గల బ్యాటరీతో పాటు, పవర్ ఎఫిషియెన్సీపై యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. అనుకున్న విధంగా ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే.. దీనికి కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని సమాచారం.
రూ.123 ఇవ్వాల్సిన చోట.. రూ.3.62 లక్షల కోట్లు!
దక్షిణ కొరియాలోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ బిథంబ్ (Bithumb)లో ఒక టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దీంతో లక్షల కోట్ల బదిలీ జరిగింది. వినియోగదారులకు చిన్న మొత్తంలో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.సాధారణంగా విజేతలకు సుమారు 2,000 కొరియన్ వోన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.123) మాత్రమే ఇవ్వాల్సి ఉండగా.. సిస్టమ్‌లో జరిగిన పొరపాటు వల్ల ప్రతి విజేత ఖాతాకు 2,000 బిట్కాయిన్లు జమయ్యాయి. మొత్తం 695 ఖాతాలకు ఇలా బిట్కాయిన్లు పంపించడంతో, సుమారు 6,20,000 బిట్కాయిన్లు అనుకోకుండా బదిలీ అయ్యాయి. నేటి మార్కెట్ విలువ ప్రకారం.. వీటి విలువ సుమారు రూ.3.62 లక్షల కోట్లు (దాదాపు 40 బిలియన్ డాలర్లు).పొరపాటు జరిగిందనే విషయం తెలుసుకున్న వెంటనే.. సంస్థ నిమిషాల వ్యవధిలోనే సంబంధిత ఖాతాల్లో ట్రేడింగ్ & విత్‌డ్రాయల్స్‌ను నిలిపివేసింది. అనుకోకుండా పంపిన బిట్కాయిన్లను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తానికి 99.7 శాతం బిట్కాయిన్లను తిరిగి రాబట్టగలిగింది.ఈ ఘటనపై స్పందించిన బిథంబ్.. వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఇది హ్యాకింగ్ లేదా భద్రతా లోపం వల్ల జరిగిన తప్పిదం కాదని, కేవలం బహుమతుల పంపిణీ ప్రక్రియలో జరిగిన సాంకేతిక పొరపాటు మాత్రమేనని స్పష్టం చేసింది. అంతే కాకుండా సంస్థకు సంబంధించిన భద్రతా వ్యవస్థలు బాగానే ఉన్నాయని, వినియోగదారుల ఆస్తులకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా వెల్లడించింది.ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగాబిథంబ్ ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన ఈ తప్పిదం.. బిట్‌కాయిన్ ధరపై తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో బిట్‌కాయిన్ విలువ 17 శాతం తగ్గింది. ఈ ఘటనపై దక్షిణ కొరియా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన ఫైనాన్షియల్ సూపర్వైజరీ సర్వీస్ (FSS) ఒక సమావేశం నిర్వహించి విచారణ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో బిథంబ్ సంస్థ పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.
సరికొత్త లుక్‌లో మార్కెట్లోకి కొత్త ఈవీ
ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ ‘పంచ్ ఈవీ’లో సరికొత్త 2026 ఎడిషన్‌ను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో రూపొందిన ఈ మోడల్ ఈ నెల 20వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది.కొత్తదనంతో..కొత్త పంచ్ ఈవీ ఔటర్ బాడీలో టాటా మోటార్స్ కీలక మార్పులు చేసింది. మునుపటి మోడల్లో హెడ్ ల్యాంప్‌లను కలుపుతూ ఉండే బ్లాక్ స్ట్రిప్‌ను ఈ కొత్త మోడల్లో తొలగించారు. ఇది కారుకు మరింత క్లీన్, ప్రీమియం లుక్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన సన్ లిట్ యెల్లో షేడ్ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. దీనికి తోడు కొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయని చెప్పింది.హైటెక్ ఫీచర్లుకారు లోపలి భాగంలో మరింత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 12.3 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో ప్రత్యేకంగా నిలువనున్నాయి. యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.బ్యాటరీ రేంజ్ వివరాలుఈ కారును రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 25 కిలోవాట్‌హవర్ (స్టాండర్డ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. 35 కిలోవాట్‌హవర్ (లాంగ్ రేంజ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని పేర్కొంది.ధర ఎంతంటే..ఈ సరికొత్త మోడల్ ధర మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్‌ను అనుసరించి సుమారుగా రూ.9,99,000 నుంచి రూ.14,44,000 వరకు ఉండవచ్చని అంచనా. మార్కెట్లో ఇంకా విభిన్న కంపెనీలకు చెందిన వివిధ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పోల్చుకొని, ఆటోమొబైల్ నిపుణుల సలహా తీసుకొని వాహనదారులు కార్ల కొనుగోలు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని గమనించాలి.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు!
ఫ్యామిలీ
సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..!
వెయిట్‌లాస్ కోసం ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్‌గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్‌నెస్‌కోచ్ కాగివన్ ప్రభాహరణ్. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్‌ప్యాక్ శరీరంతో స్మార్ట్‌గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్‌కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్‌లాస్ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించాడు.తమిళులు చాలామంది సిక్స్ ప్యాక్ కోసం డైట్ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్ ప్యాక్ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్‌లాస్ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్‌గా తింటే చాలట. వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు. ఆ మూడు తప్పనిసరి..సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్నెస్ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్‌లాస్‌కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్‌లాస్ అవుతామని చెబుతున్నాడు కాగివన్ View this post on Instagram A post shared by Kagivan Prabaharan | Tamil Transformation Coach (@kagsfit) (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!)
శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!
వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్‌కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండటాన్ని ‘టాక్సిక్ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్ యాంగ్’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చె΄్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్‌ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది. అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.హద్దుల్లేని ఆశావాదంఒక విద్యార్థి యావరేజ్ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే ΄ాజిటివ్ యాటిట్యూడ్ నూరి΄ోసినా, ఆ ΄ాజిటివ్ యాటిట్యూడ్‌తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్‌గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆరు రుచులు... అన్ని భావాలుఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్ బారిన పడుతున్నారంటున్నారు.పాజిటివ్‌గా ఆలోచించడం తప్పా?ఇదంతా విన్నాక ‘పాజిటివ్‌గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్‌గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆనందం శాశ్వతం కాదు...పాజిటివ్ థింకింగ్‌లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకు΄ోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. నిర్వహణ: యాసీన్(చదవండి: ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు..! హెచ్చరిస్తున్న అధ్యయనాలు)
ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు
ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్ మ్యూకోజల్) కేన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్‌జే గ్లోబల్ హెల్త్’ జర్నల్ ప్రచురించింది. ఆ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ 1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.(చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..)
సువ్రతుడి వృత్తాంతం
శుక మహర్షి ఒకప్పుడు పరీక్షిత్తు మహారాజుకు మాఘ మహాత్మ్యాన్ని గురించి చెప్పిన కథను సూత మునీంద్రుడు శౌనకాదులకు చెప్పాడు. మాఘ మాసంలో చేసే స్నాన, దాన, వ్రతాదులు అత్యంత పుణ్యఫలాలను ఇస్తాయని చెబుతూ, అందుకు ఉదాహరణగా సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు: పూర్వం నర్మదాతీరంలోని సోమనాథం అనే అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో సజ్జనులైన బ్రాహ్మణులు నిత్య వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు జరిపేవారు. నిత్యం వేదఘోషతో అలరారే ఆ అగ్రహారం సర్వసుభిక్షంగా తులతూగుతూ ఉండేది.ఆ అగ్రహారంలో సువ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను; జ్యోతిష తర్క మీమాంసాది శాస్త్రాలను; సంగీతం, శిల్ప, నృత్యాది చతుష్షష్టి కళలను సాంగోపాంగంగా నేర్చుకున్నవాడై, మంత్రశాస్త్రంలో నేర్పరి అయి ఉండేవాడు. ఇవే కాకుండా, తత్త్వ, యోగ శాస్త్రాలను అభ్యసించి, పద్నాలుగు దేశ భాషలలో మాట్లాడటం, చదవడం, రాయడంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు.ఇన్ని విద్యలు నేర్చిన సువ్రతుడికి అంతులేని ధనాశ ఉండేది. నేర్చిన విద్యలన్నింటినీ ధనార్జన కోసమే వినియోగించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులతో పాటు శుభాశుభ సందర్భాలలో కర్తలు ఇచ్చే గోదాన, హిరణ్య దానాదులు సహా తిలదాన, లవణదానాల వంటి అన్ని రకాల దానాలనూ స్వీకరించేవాడు. అలా విశేషంగా ధనం కూడబెట్టాడు. విశేషంగా వస్తు వాహనాలను సమకూర్చుకున్నాడు. అంతటితో సంతృప్తి చెందక దానంగా స్వీకరించిన గోవులను అంగడిలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. మిగులు ధనాన్ని అవసరంలో ఉన్నవారికి అప్పులుగా ఇచ్చి, అక్రమంగా వడ్డీలు గుంజేవాడు. ఎంత సంపాదించినా, భార్యా పిల్లల కోసమైనా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను అనుభవించేవాడు కాదు. మితిమీరిన లోభంతో ఇలా లక్షలాది వరహాల ధనాన్ని పోగు చేశాడు.కాలక్రమేణా సువ్రతుడు వృద్ధుడయ్యాడు. కాళ్లు చేతులు పట్లు సడలి; కళ్లు కనిపించక, చెవులు వినిపించక శరీర యాతనతో రోజులు వెళ్లదీస్తూ ఉండేవాడు. అలాంటి దశలో కూడా తాను తినక, ఒకరికి పెట్టక కాలం గడప సాగాడు. సంపాదించి పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కనీసం భార్యా కుమారులకైనా చెప్పేవాడు కాదు. అగ్రహారంలో యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు తెలుసుకున్నప్పుడల్లా, శక్తిలేక మూలపడటం వల్ల అక్కడ తనకు దక్కాల్సిన దానాలు దక్కకుండా పోతున్నాయని బాధపడుతూ ఉండేవాడు.సువ్రతుడు మూలపడటం వల్ల కుటుంబ ఆదాయానికి గండిపడింది. ఇల్లు గడవడం కష్టమైంది. చివరకు అన్న వస్త్రాదులకు కూడా లోటు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పకుండా ఉన్నందుకు భార్య, కొడుకులు, కోడళ్లు సువ్రతుడిని నానా రకాలుగా నిందించేవారు. కనీసం ఇంటి ఖర్చుల మేరకైనా డబ్బు తీసి ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు. పైగా, ‘మీరంతా దయ్యాల్లా దాపురించారు. నా ఇంటి నుంచి వెళ్లిపోండి’ అంటూ కుటుంబ సభ్యులందరినీ తిట్టిపోసేవాడు. రోజులు గడిచే కొద్ది పరిస్థితులు గడ్డుగా మారుతుండటంతో సువ్రతుడు ధనం దాచిన చోటు కనిపెట్టాలని ఇంటిల్లిపాది కలసి ఇల్లంతా వెదికారు. చివరకు ఒక బోషాణంలో దాచిన డబ్బు కనిపించింది. ఇక ఆనాటి నుంచి సువ్రతుడి కుటుంబ సభ్యులు ఆ డబ్బును స్వేచ్ఛగా ఖర్చుపెడుతూ, ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తుండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే, ఒకనాటి రాత్రివేళ సువ్రతుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్లను తాళ్లతో కట్టేసి, ఇంట్లో ఉన్న డబ్బును, చేతికందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. దొంగలు ఇల్లంతా దోచుకుంటూ ఉండటం చూసి సువ్రతుడు బిగ్గరగా రోదిస్తూ, సొమ్మసిల్లిపోయాడు. తెల్లవారుతూ ఉండగా సువ్రతుడికి స్పృహ వచ్చింది. మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. ‘ఎన్నో తుచ్ఛమైన దానాలు పట్టి ఎంతో ధనం సంపాదించాను. నేనూ తినలేదు, ఎవరికీ పెట్టలేదు. దానంగా స్వీకరించిన గోవును విక్రయించడం మహాపాపం. అయినా, దానంగా లభించిన ఎన్నో గోవులను అంగడిలో డబ్బుకు అమ్ముకున్నాను. దాన ధర్మాలకు ఖర్చు చేయని ధనం దొంగలపాలవుతుంది. నా కర్మ ఇలా కాలింది. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలమేమి? ధనాన్ని పోగు చేయాలనే లక్ష్యంతో దేవర్షి పితృతర్పణాలను కూడా ఏనాడూ సమర్పించలేదు. గురువులకు దక్షిణలివ్వలేదు. నా లోభత్వమే నన్నింతకు దిగజార్చింది. ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేద్దామన్నా, ఉన్న డబ్బంతా దొంగలపాలైంది. ముదిమితో ఒంట్లోని జవసత్త్వాలు ఉడిగిపోయాయి. కశ్మీర దేశంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ పండితుల వద్ద మాఘపురాణం విన్నాను. మాఘస్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ స్థితిలో నేను చేయదగ్గ పని మాఘస్నానం మాత్రమే’ అనుకున్నాడు.కొడుకులను చేరబిలిచి, తాను చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టి, పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను మాఘస్నానం కోసం నర్మదా తీరానికి తీసుకుపోవలసిందిగా కోరాడు. ‘మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి’ అని మాఘపురాణం చెబుతోంది. మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారికి పాపాలు నశించి, స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందువల్ల నన్ను నర్మదా తీరానికి తీసుకువెళ్లండి’ అని కొడుకులకు చెప్పాడు.కొడుకుల సాయంతో నర్మదా తీరానికి చేరుకున్న సువ్రతుడు మాఘమాసంలో పదిరోజులు పవిత్ర స్నానం ఆచరించాడు. ఒకనాడు యథావిధిగా నర్మదానదిలో స్నానం ముగించుకుని, గట్టు మీదకు వచ్చి, దక్షిణముఖంగా పడుకుని గోవిందనామ స్మరణ చేస్తూ, ప్రాణాలు విడిచాడు. అతడి కుమారులు చూస్తుండగానే, దివ్యవిమానంలో దేవదూతలు అక్కడకు వచ్చారు. సువ్రతుడిని తీసుకుని వారు స్వర్గానికి బయలుదేరారు. మాఘస్నానం ఫలితంగా సువ్రతుడు స్వర్గప్రాప్తి పొందాడు.∙సాంఖ్యాయన
అంతర్జాతీయం
తకాయిచీ అపూర్వ విజయం
టోక్యో: జపాన్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన కీలకమైన ఎన్నికలో ప్రధానమంత్రి సనే తకాయిచీ ఘన విజయం సాధించారు. పార్లమెంట్లో శక్తివంతమైన దిగువ సభలోని 465 సీట్లకుగాను మూడింట రెండొంతుల సీట్లు అవసరం కాగా, తకాయిచీ సారథ్యంలోని లిబరల్ డెమోక్రాటిక్ పారీ్ట(ఎల్డీపీ) ఆ మార్కును సునాయాసంగా అధిగమించింది. ఇప్పటికే 316 సీట్లలో గెలుపు బావుటా ఎగరేసింది. 1955లో ఈ పార్టీని స్థాపించిన తర్వాత లభించిన అతిపెద్ద విజయమిది. 1986లో నకసొనె హయాంలో మాత్రమే ఎల్డీపీ 300 సీట్లను సొంతంగా గెలుచుకుంది. కాగా, జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా గతేడాది అక్టోబర్‌లో పగ్గాలు చేపట్టిన తకాయిచీ, అధికార ఎల్డీపీలో ప్రజామోదం కలిగిన ఏకైక నేతగా ఉన్నారు. గత ఏడు దశాబ్దాలుగా ఈ పారీ్టయే దాదాపుగా అధికారంలో కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస కుంభకోణాలు ఈ పార్టీ ఇమేజీని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సమయంలో ఆమె విధానాలు, పాలనకు ప్రజామోదం లభించింది. ఇదే అవకాశంగా ఆమె కేవలం మూడు నెలల్లోనే పార్లమెంట్‌ను రద్దు చేసి, ఆకస్మికంగా ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను తన పాలనపై రెఫరెండంగా ఆమె ప్రకటించుకున్నారు. చైనాతో ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆమె పలు చర్యలను ప్రకటించారు. అమెరికాతో మరింత సన్నిహిత సంబంధాలను ఆమె కోరుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు తకాయిచీ విధానాలకు ప్రజలిచ్చిన సానుకూల సంకేతంగా చెబుతున్నారు. తన విధానాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫలితాలు వెలువడిన అనంతరం తకాయిచీ ప్రకటించారు. అధికార పక్షానికే మెజారిటీ సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా నిజమైంది. తకాయిచీ సాధించిన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తకాయిచీకి అభినందనలు తెలియజేశారు.
ప్రగతి బాటలో కలిసి నడుద్దాం
కౌలాలంపూర్: ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, మలేషియా తీర్మానించుకున్నాయి. వాణిజ్యంలో అత్యధిక ప్రాధాన్య రంగాలతోపాటు పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, తయారీ, సెమీకండక్టర్ల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని, ప్రగతి బాటలో కలిసి నడవాలని నిర్ణయించాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్, మలేషియా కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఆదివారం మలేషియా పరిపాలనా రాజధాని అయిన పుత్రజయలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్, మలేషియా మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సెమీకండక్లర్ట రంగంలో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంతోపాటు కీలక రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. భేటీ అనంతరం మోదీ, అన్వర్ ఇబ్రహీం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాద భూతాన్ని సమాధి చేయడానికి ప్రపంచదేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు మోదీ బహిర్గతం చేశారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు గానీ, రాజీపడడం గానీ ఉండబోదని స్పష్టంచేశారు. భారత్–మలేషియా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య శతాబ్దాలుగా లోతైన, సౌహార్ధ సంబంధాలు ఉన్నట్లు గుర్తుచేశారు. వ్యూహాత్మక విశ్వాసంతో ఇరుదేశాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. ‘అంతర్జాతీయ’ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి మలేషియాలో భారత కాన్సులేట్ జనరల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటం, నిఘా సమాచారం పంచుకోవడం, మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో మలేషియాతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. రక్షణ బంధాన్ని సైతం విస్తృతపర్చుకుంటామని వివరించారు. కృత్రిమ మేధ(ఏఐ), డిజిటల్ టెక్నాలజీతోపాటు సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రతపై భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి గ్రోత్ ఇంజన్‌గా ఎదుగుతోందని వెల్లడించారు. మలేషియా లాంటి మిత్రదేశాల అండతో ‘ఆసియాన్’ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకుంటామని చెప్పారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ఇండో–పసిఫిక్‌లో ఆసియాన్‌తో కలిసి అభివృద్ది, శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అన్వర్ ఇబ్రహీంతో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, మలేషియా మధ్య స్నేహసంబంధాలు పెరుగుతుండడం ఇరుదేశాలకు మేలు చేస్తుందని వెల్లడించారు. సవాళ్లను అధిగమించాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. భారత్–మలేషియా సంబంధాల విషయంలో అన్వర్ ఇబ్రహీం చక్కటి చొరవ చూపుతున్నారని కొనియాడారు. చరిత్రాత్మక నిర్ణయం: ఇబ్రహీం భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ఇబ్రహీం ప్రశంసించారు. భారత్‌తో భాగస్వామ్యం వల్ల తమకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇరుదేశాల వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలన్నది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు.భారత సంతతి నేతలతో భేటీ మలేషియాలో భారత సంతతి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత్‌తో వారి భావోద్వేగ అనుబంధం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారత సంతతి వ్యక్తులు ప్రజా జీవితంలో సాధిస్తున్న విజయాలు గర్వకారణమని ఉద్ఘాటించారు. మలేషియాలో అభివృద్ధిలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. భారత్, మలేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. భారత్‌ను అభివృద్ధి చేయడంలో మోదీ దార్శనికత, కార్యాచరణ స్ఫూర్తిదాయమని భారత సంతతి నేతలు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో: ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములయ్యేందుకు వారు చూపుతున్న ఆసక్తిని ప్రశంసించారు. ఇంధన రంగంలో పునరుత్పాదక, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎల్ఎన్జీ, పెట్రోకెమికల్స్లో భాగస్వామ్యంపై వారితో చర్చించారు. అలాగే భారత్, మలేషియాకు చెందిన పలు కంపెనీల సీఈఓలతోనూ మోదీ భేటీ అయ్యారు. అనంతరం రెండు రోజుల మలేషియా పర్యటన ముగించుకొని ఆదివారం స్వదేశం చేరుకున్నారు.
అంటార్కిటికా కంటే చల్లగా అమెరికా?
న్యూయార్క్ నగరంలో చంపేస్తోంది. ఈ వీకెండ్ అనగా ఆదివారం తీవ్రమైన చలి నమోదైంది. 3 డిగ్రీల ఫారెన్‌హీట్‌కి తగ్గిపోయాయి. బలమైన చలిగాలుల వల్ల ఈ చలి.. -14 డిగ్రీలలా అనిపిస్తోంది. ఈశాన్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే చలిగాలి.. -40 డిగ్రీలు అనిపించేంతలా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల కారణంగా న్యూయార్క్, ఫిలడెల్ఫియా లాంటి పెద్ద నగరాల్లో కలిపి 4.3 కోట్లమందికి పైగా ప్రజలకు.. తీవ్ర చలి హెచ్చరికలు జారీ చేశారు.కెనడా వైపు నుంచి వచ్చిన ఆర్కిటిక్ గాలులే ఈ తీవ్రమైన చలికి కారణమని వాతావరణ నిపుణులు అన్నారు. గత 10-20 ఏళ్లలో లేనటువంటి చలి ఇది అని చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అంటార్కిటికాలోని మెక్‌మర్డో స్టేషన్లో.. న్యూయార్క్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది.ఈ చలి కారణంగా న్యూయార్క్ సిటీలో ఈ ఏడాది ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో కనీసం 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో 13 మంది హైపోథర్మియా(చలి) వల్లే చనిపోయారట.The beautiful lake in #NYC’s Central Park looks very frozen and frosty today. #NewYork #NewYorkCity pic.twitter.com/JMsKEVdkTo— Inga Sarda-Sorensen (@isardasorensen) February 8, 2026Alerta de frío extremo en la Ciudad de Nueva York EEUU 🇺🇸 Y los vientos no trataron muy bien a los turistas.#newyorkcity Vía @ImMeme0 pic.twitter.com/luofBYaBBm— Geól. Sergio Almazán (@chematierra) February 8, 2026
పాక్‌కు పుతిన్ మెసేజ్..భారత్‌కు దూరం కానున్న రష్యా?
భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్‌కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్‌కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్‌ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్‌కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్‌పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్‌ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.ఇదిలా ఉండగా రష్యా పాక్‌తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు. కాగా ఇప్పుడు రష్యా పాక్‌తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్‌లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.పుతిన్ మెసేజ్‌లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్‌లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్‌తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్‌తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
జాతీయం
చూడడానికి అందంగా ఉంటే చాలదు..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కోడలిని అత్తమామలు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీదర్ జిల్లా బసవ కళ్యాణ పట్టణంలోని ఓం కాలనీలో జరిగింది. అంజనాబాయి (22)కి నాలుగేళ్ల కిందట బసవ కళ్యాణలోని శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. 11 నెలల పాప ఉంది. శేఖర్ పానీపూరి వ్యాపారం చేస్తుండగా ఉదయం వెళ్తే అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో కోడలిని అత్త మామలు సూటిపోటి మాటలతో వేధించేవారు.చూడడానికి అందంగా ఉంటే చాలదు, పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని, ఎలాగైనా డబ్బు సంపాదించి తేవాలని పీడించేవారు. దీంతో అంజనాబాయి పలుమార్లు తన తల్లిదండ్రులకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామలను అరెస్టు చేశారు.
‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల
పట్నా(బిహార్): జన్ శక్తి జనతా దళ్ (జేజేడీ) అధినేత, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తనతో సంబంధం ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఓ మహిళ ఒక బిడ్డ జన్మనిచ్చిందని, దానికి తానే కారకుడిని అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు.ఇది తన వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి జరుగుతున్న కుట్ర అని, ఆ బిడ్డతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేజ్ ప్రతాప్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుట్ర వెనుక తన రాజకీయ ప్రత్యర్థులతో పాటు తన సొంత వర్గానికి చెందిన ఐదుగురు నేతలు ఉన్నారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. ముకేశ్ రౌషన్, సంజయ్ యాదవ్, శక్తి సింగ్ యాదవ్, రమీజ్, సునీల్ సింగ్‌లను ఆయన ఇందుకు కారకులుగా ఆరోపించారు. వీరిలో ఒక రాజ్యసభ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారని పేర్కొంటూ, వీరంతా కలిసి తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.తన పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. గత ఏడాది ఒక మహిళతో తేజ్ ప్రతాప్ ఉన్న ఫోటోలు ఫేస్బుక్లో వైరల్ కావడంతో ఆయనను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నుండి బహిష్కరించారు. అయితే, తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యిందని, కొందరు వ్యక్తులే ఆ పని చేశారని నాడు తేజ్ ప్రతాప్ ఆరోపించారు. అనుష్క యాదవ్, ఆకాష్ భాటి అనే వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ, ఆ బిడ్డకు అసలైన తండ్రి ఎవరో తనకు తెలుసని తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తన పేరును ఈ వివాదంలోకి లాగి, మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని అన్నారు. నిందితులపై కోర్టులో దావా వేస్తానని, న్యాయం కోసం పోరాడతానని పేర్కొన్నారు. బిహార్ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘పరీక్షలంటే ఒక ఉత్సవం’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(సోమవారం) ‘పరీక్షా పే చర్చా’ 2026 రెండో ఎపిసోడ్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి? బోర్డు, పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో ఎలా సిద్ధం కావాలనే అంశాలపై ప్రధాని కీలక సూచనలు చేశారు. పరీక్షలను ఒక భయానక అంశంగా కాకుండా, ఒక ‘ఉత్సవం’లా జరుపుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సానుకూల దృక్పథానికి ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ చర్చా కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా చదువుతో పాటు కళలు, క్రాఫ్ట్స్ ఎలా కొనసాగించాలంటూ కోయంబత్తూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చదువును, కళలను విడివిడిగా చూడవద్దని మోదీ సూచించారు. సైన్స్ ప్రయోగాలను బొమ్మల రూపంలో గీస్తూ, చదివితే సబ్జెక్టు సులభంగా అర్థమవుతుందని, రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కళలు ఒక ఔషధంలా పనిచేస్తాయని ప్రధాని వివరించారు. స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే వారు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, పరిశ్రమ నిపుణులను కలిసి, వారు ఎలా పనిచేస్తారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.పరీక్షా పే చర్చా 2026 ఎడిషన్ గత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఏకంగా 4.5 కోట్ల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇతర అనుబంధ కార్యకలాపాలతో కలిపి మొత్తం 6.76 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 2023లో 38.8 లక్షలుగా ఉన్న రిజిస్ట్రేషన్లు, 2025 నాటికి 3.53 కోట్లకు చేరుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించగా, ఈ ఏడాది ఆ సంఖ్య మరింతగా పెరగడం గమనార్హం.దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ వేదిక దోహదపడింది. ఈ కార్యక్రమం దూరదర్శన్ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియాతో పాటు ఆల్ ఇండియా రేడియో, పలు ప్రైవేట్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. అలాగే పీఎంఓ, విద్యా మంత్రిత్వ శాఖ వెబ్సైట్లు, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఢిల్లీని ఖలిస్థాన్ చేస్తాం.. స్కూళ్లలో బాంబులు పెట్టాం
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ ఈరోజు( సోమవారం) ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.బాంబు స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోహిణి ప్రాంతంలోని వెంకటేశ్వర గ్లోబల్ స్కూల్, శ్రీనివాస పురిలోని లోరిటో కాన్వెంట్ స్కూల్, సిద్దిఖీ నగర్ లోని ఇండియన్ పాఠశాలతో మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి.అయితే ఈ మధ్య కాలంలో పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇలా బెదిరింపు మెయిల్స్ చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను గుర్తించిన అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
ఎన్ఆర్ఐ
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్‌హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్‌లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్‌రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్‌కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్‌కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్‌లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్‌లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్‌లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్‌లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్‌డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్‌కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి
క్రైమ్
చూడడానికి అందంగా ఉంటే చాలదు..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కోడలిని అత్తమామలు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీదర్ జిల్లా బసవ కళ్యాణ పట్టణంలోని ఓం కాలనీలో జరిగింది. అంజనాబాయి (22)కి నాలుగేళ్ల కిందట బసవ కళ్యాణలోని శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. 11 నెలల పాప ఉంది. శేఖర్ పానీపూరి వ్యాపారం చేస్తుండగా ఉదయం వెళ్తే అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో కోడలిని అత్త మామలు సూటిపోటి మాటలతో వేధించేవారు.చూడడానికి అందంగా ఉంటే చాలదు, పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని, ఎలాగైనా డబ్బు సంపాదించి తేవాలని పీడించేవారు. దీంతో అంజనాబాయి పలుమార్లు తన తల్లిదండ్రులకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామలను అరెస్టు చేశారు.
కారును ఢీకొని.. హెల్మెట్‌తో దాడి..
బెంగళూరు: మద్యం మత్తులో కారు డ్రైవరుపై యువతులు హెల్మెట్‌తో దాడికి పాల్పడి వీరంగం సృష్టించిన ఘటన హుళిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి 10 గంటలప్పుడు జరిగింది. స్నేహితులతో కలిసి హోటల్‌కు భోజనానికి వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన లీసా, మ్యాథ్యూ అనే ఇద్దరు యువతులు వీవీ రోడ్డు దోసె క్యాంప్ వద్ద స్కూటర్లో వెళ్తూ ముందున్న కారును ఢీకొట్టారు. ఈ సమయంలో కారు డ్రైవరు అహ్మద్ కారు దెబ్బతినిందని, రిపేరు చేయించాలని వారిని నిలదీశాడు. మత్తులో ఉన్న యువతులు తప్పు నీదే అని అతనితో వాదించి నోటికొచ్చినట్లు దూషించి హెల్మెట్‌తో కొట్టారు. స్థానికులు యువతులను సముదాయించినా రభస సృష్టించారు. జనం హుళిమావు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని యువతులను, స్కూటర్‌ను ఠాణాకు తరలించారు. అక్కడ విచారించి మందలించి నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు.
ప్రియురాలి మోసం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
బెంగళూరు: ప్రేమించి పెళ్లికి సిద్ధమైన సమయంలో ప్రియురాలు మోసం చేసిందని బాడీ బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కిరణ్ (26) జిమ్‌ట్రైనర్‌గా పనిచేయడంతో పాటు బాడీ బిల్డర్‌గా రాష్ట్రస్థాయిలో పేరుగాంచాడు. మూడేళ్ల నుంచి ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు, ఆమె కిరణ్ ఇంటికి వచ్చి తమకు పెళ్లి చేయాలని కోరగా కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. తన అన్న వివాహమైన వెంటనే మన పెళ్లి అని కిరణ్ మాట ఇచ్చాడు. కానీ 15 రోజుల క్రితం యువతి ఓ యువకునితో పెళ్లి నిశ్చయమైందని కిరణ్‌కు పెళ్లిపత్రిక ఇవ్వడంతో ఆవేదన చెందాడు. శనివారం సాయంత్రం కిరణ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆమే కారణమని డెత్‌నోటు తన చావుకు ప్రియురాలు, ఆమె తల్లి కారణమని డెత్‌నోట్ పేరురాసి పెట్టాడని పోలీసులు తెలిపారు. కిరణ్ మృతితో తల్లిదండ్రులు ఆక్రందనలు మిన్నంటాయి. కిరణ్ తన ప్రేయసికి రూ.40 లక్షల వరకూ ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. కాగా, కిరణ్ది పేద కుటుంబం, తండ్రి మార్కెట్లో మూటలు మోసే పనిచేసేవాడు, ప్రమాదంలో ఓ చేతి తెగిపోయి దివ్యాంగునిగా ఉన్నాడు. తల్లిదండ్రులు, సోదరి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా?
కర్ణాటక: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు.. ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్ఆర్ నగర నివాసి హరీష్ ప్రసాద్‌కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది. రూ.2 వేలు పంపి... మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్‌పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్‌కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి.
వీడియోలు
చంద్రబాబుకు బిగ్ షాక్ అంబటికి బెయిల్
పుల్ హ్యాపీ.. అంబటి బెయిల్ పై పొన్నవోలు రియాక్షన్
అమ్మా ఆవేశం నీకే కాదు.. 2029 లో వచ్చే ఆవేశానికి చెంగు పట్టుకుని
వెనుక ఒక పిలకేసుకుని..సినిమా అనుకున్నావా?
TJR : చంద్రబాబు పాలనపై సొంత ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి
నీదీ పవన్ కళ్యాణ్ లాంటి చదువేనా..?? పయ్యావుల కేశవ్ ని ఆటాడుకున్న జడ శ్రవణ్
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట
అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
ఖైదీ 2 సంగతేంటి..? ఉన్నట్టా..? లేనట్టా...?
అంబటిపై నాగబాబు వ్యాఖ్యలు.. కొండా రాజీవ్ అదిరిపోయే కౌంటర్

