ప్రియురాలిని చంపి.. ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఎంబీఏ విద్యార్దిని తన ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. హత్య చేసిన తర్వాత ఆమె ఆత్మతో మాట్లాడేందుకు నిందితుడు తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. .అసలేమి జరిగిందంటే?24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని ఫిబ్రవరి 11(మంగళవారం) సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తన స్నేహితుల బర్త్‌డే పార్టీకి వెళ్తున్నానని, రాత్రి 11.00 గంటలకు వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ ఎప్పటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చాడు. ఇదే సమయంలో ఆమె మొబైల్ నెంబర్ నుంచి అభ్యంతరకర ప్రైవేట్ వీడియో తన కాలేజ్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ అయింది. కాలేజీ యాజమాన్యం ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. ఆ వీడియోలో కనిపించకుండా పోయిన యువతితో పాటు మరో యువకుడు ఉన్నాడు. అతడే ఆమె క్లాస్మేట్, ప్రియుడు పీయూష్ ధనోటియా. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తెస్తుండగా, పీయూష్ నిరాకరించేవాడు. ఇదే విషయంలో ఫిబ్రవరి 12న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో పీయూష్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు. అక్కడ ఒక హోటల్లో ఉంటూ యూట్యూబ్‌లో "ఆత్మలను ఎలా పిలవాలి?" అని వెతికి, కుంకుమ, గాజులు, పసుపుతో తాంత్రిక పూజలు నిర్వహించాడు. చనిపోయిన తన ప్రియురాలి ఆత్మతో మాట్లాడాలని అతను ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.వెలుగులోకి వచ్చింది ఇలా..ఇండోర్‌లోని ద్వారకాపురి ప్రాంతంలో పీయూష్ ధనోటియా అద్దెకు ఉండేవాడు. అక్కడే వారిద్దరూ కలిసేవారు. అయితే హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ద్దె గది నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, యువతి మృతదేహం నగ్నంగా మంచంపై పడి ఉంది.
Tirumala: 3న శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: చంద్రగ్రహణం సందర్భంగా వచ్చే నెల 3న శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల (మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు చంద్ర గ్రహణం) వరకు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్టు చెప్పారు. సోమవారం ఆయన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు తిరుమలలో తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20 నుంచి మార్చి 5 వరకు పుష్కరిణీ స్నానానికి భక్తులకు అనుమతి ఉండదని చెప్పారు.పుష్కరిణి, ప్రవేశ, నిష్కమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది, పుష్కరిణిలో అందుబాటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పోత్సవాల కారణంగా ఈనెల 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, వచ్చేనెల 3న కుమారధార తీర్థ ముక్కోటి సందర్భంగా భక్తులను ఉదయం 5 నుంచి 9గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు.
Hyderabad: ట్రాఫిక్ క్లియర్ కంటే చలాన్లకే ప్రాధాన్యం?
హైదరాబాద్: సిటీ ట్రాఫిక్ పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ క్లియర్ చేయడంపై కంటే చలాన్ల మీదే వారికి ఎక్కువ దృష్టి ఉంటుందనే విమర్శలకు ఊతమిచ్చే ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. చేతిలో కెమెరా, మొబైల్ ఫోన్ పట్టుకుని కేవలం చలాన్ల కోసమే రోడ్లపై వేచి చూసే పోలీసులు చాలాచోట్ల కనిపిస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఫొటో తీయడమే వారి డ్యూటీ. ఈ క్రమంలో సోమవారం ఓ వ్యక్తి టీఎస్ 10ఎఫ్డీ 8002 కారును ఆర్పీరోడ్‌లోని దర్గా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉదయం 10.15 గంటలకు నిలిపి, మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ మధ్య సమయంలో కారుకు ఉదయం 10.29, 10.50, మధ్యాహ్నం 12.18 గంటలకు వరుసగా మూడు చలాన్లు వేశారు ట్రాఫిక్ పోలీసులు. అవి కూడా వేర్వేరు సెక్షన్లకు కాదు. అన్నీ కూడా క్యారేజ్ వే లో పార్కింగ్ పేరిటే కావడం గమనార్హం. ఇదీ మహంకాళి ట్రాఫిక్ పోలీసులు చేసిన ఘన కార్యం. రాణిగంజ్, ఆర్పీరోడ్‌లోని షాపుల ముందు నిత్యం పార్క్ చేసే వాహనాలను మాత్రం పట్టించుకోరు.
‘శత’క్కొట్టిన నిసాంక
పల్లెకెలె: పాథుమ్ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్‌లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్ నిసాంక అజేయంగా లిఖించాడు. దీంతో ‘హ్యాట్రిక్’ విజయాలతో లంక జట్టు ‘సూపర్–8’కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆ్రస్టేలియా ముందుకెళ్లే అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు జింబాబ్వే ‘వరుస ఓటమి’లపైనే ఆసీస్ ‘సూపర్–8’ భవితవ్యం ఆధార పడింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దాసున్ షనక నేతృత్వంలోని లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కెపె్టన్ మిచెల్ మార్‡్ష (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 56; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. 8.2 ఓవర్ల వరకు వికెట్ కోల్పోలేదు. ఇంతవరకు జోరుగా సాగిన ఆసీస్ అనూహ్యంగా మిగతా 11.4 ఓవర్లలో మరో 77 పరుగులే చేసి 10 వికెట్లను కోల్పోయింది. ఇన్‌గ్లిస్ (27; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (22; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండు పదుల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాక్స్‌వెల్ రివర్స్ స్వీప్‌తో బౌండరీకి యత్నించగా... బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద నిసాంక కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచాడు. లంక బౌలర్లలో హేమంత 3, చమీర 2 వికెట్లు తీశాడు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది. నిసాంక రెండో వికెట్‌కు కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్)తో 97 పరుగులు, తర్వాత పవన్ రత్నాయకే (28 నాటౌట్; 6 ఫోర్లు)తో అబేధ్యమైన మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. ఆ్రస్టేలియా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 20న ఒమన్ జట్టుతో ఆడుతుంది. ఆసీస్ కంటే ముందే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌లు (నేడు ఐర్లాండ్‌తో; 19న శ్రీలంకతో) ఆడుతుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఒక్కటి గెలిచినా ‘సూపర్–8’కు అర్హత పొందుతుంది. ఒకవేళ జింబాబ్వే రెండింటిలో ఓడిపోయినా... రన్‌రేట్‌లో ఆ్రస్టేలియాకంటే మెరుగ్గా ఉంటేచాలు ‘సూపర్–8’ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు
కుమారస్వామి ఆవహిస్తే? కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్
ప్రముఖ హీరోయిన్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!
11 మున్సిపాలిటీ ఛైర్మన్లకు నేడు ఎన్నిక
కేసీఆర్‌కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..
మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది?
మాజీ ఎంపీ కూతురితో యువ హీరో నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే?
'ఈ బిడ్డ నా జీవితకాల కోరిక'.. బిగ్‌బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్
T20 WC 2026: యూఎస్ఏకు మరో విజయం.. అదే జరిగితే పాక్ ఇంటికే..!
పాక్‌తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!
రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
డ్యాన్స్‌తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి
రెడ్‌బుక్ అప్పులు అసమర్ధ పాలన
బంగారం రివర్స్! కొనేవారికి గుడ్‌న్యూస్
తిలక్ వర్మపై గంభీర్ సీరియస్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
ఘోరంగా ఓడిపోయా! మీకు దండం పెడతా నేనిచ్చిన గిఫ్ట్‌లను తిరిగి ఇచ్చేస్తే గిఫ్ట్‌ల షాపు పెట్టుకొని బతుకుతాను!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వివాదాల పరిష్కారం.. వస్తులాభాలు
అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్
IND vs PAK: ‘వర్షం పడాలని కోరుకుంటున్నా’
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్..
అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు
కుమారస్వామి ఆవహిస్తే? కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్
ప్రముఖ హీరోయిన్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!
11 మున్సిపాలిటీ ఛైర్మన్లకు నేడు ఎన్నిక
కేసీఆర్‌కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..
మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది?
మాజీ ఎంపీ కూతురితో యువ హీరో నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే?
'ఈ బిడ్డ నా జీవితకాల కోరిక'.. బిగ్‌బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్
T20 WC 2026: యూఎస్ఏకు మరో విజయం.. అదే జరిగితే పాక్ ఇంటికే..!
పాక్‌తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!
రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
డ్యాన్స్‌తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి
రెడ్‌బుక్ అప్పులు అసమర్ధ పాలన
బంగారం రివర్స్! కొనేవారికి గుడ్‌న్యూస్
తిలక్ వర్మపై గంభీర్ సీరియస్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
ఘోరంగా ఓడిపోయా! మీకు దండం పెడతా నేనిచ్చిన గిఫ్ట్‌లను తిరిగి ఇచ్చేస్తే గిఫ్ట్‌ల షాపు పెట్టుకొని బతుకుతాను!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వివాదాల పరిష్కారం.. వస్తులాభాలు
అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్
IND vs PAK: ‘వర్షం పడాలని కోరుకుంటున్నా’
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్..
అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
ఫొటోలు
హైదరాబాద్ : మణికొండలో కాలనీలను ముంచెత్తిన వరద (ఫొటోలు)
విశాఖ : సముద్ర తీరాన శౌర్య సింహనాదం (ఫొటోలు)
అల్లు శిరీష్, నయనిక వాలెంటైన్స్ డే ఎలా జరుపుకున్నారంటే.. (ఫోటోలు)
విశాఖపట్నం : ఆర్కే బీచ్ ఆధ్యాత్మిక సాగరంగా మారింది (ఫొటోలు)
శ్రీశైలంలో కనుల పండువగా మల్లన్న రథోత్సవం (ఫొటోలు)
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)
‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)
'పెద్ది' సెట్లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)
సినిమా
రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: స్టార్ హీరోయిన్
ప్రేమలో మోసపోయిన సినీ తారల్లో నటి మమతమోహన్‌దాస్ ఒకరు. ఈమె బహు భాషా నాయకి. మలయాళం, తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా రాణించారు. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, రుద్రంగి సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో శివప్పధికారం, గురు ఎన్ ఆళు, తడయార తాక్క,ఎనిమి,మహారాజా తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ప్రభు జయరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మైడియర్ సిస్టర్ చిత్రంలో అరుళ్‌నిధితో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ మధ్య క్యాన్సర్ మహ్మమారి బారిన పడ్డారు. అయితే దాని నుంచి పోరాడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మళ్లీ నటించడం మొదలెట్టిన మమత మోహన్‌దాస్ (Mamta Mohandas) తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి నుంచి బయప పడి మళ్లీ నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందన్నారు. అలా మలయాళ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడితో డేటింగ్‌కు వెళ్లానని చెప్పారు. అయితే అతను మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్న విషయం తనకు ఆ తరువాతనే తెలిసిందన్నారు. దాంతో తన మనసు ముక్కలైయ్యిందన్నారు. ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానన్నారు. దీని గురించి ఆ నటుడిని అడగ్గా చాలా లైట్‌గా తీసుకున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం ఆ ఘటనను జీర్ణించుకోలేకపోయానన్నారు. తన మాజీ భర్తతో మొదటిసారి పరిచయం ఎలా అయిందో కూడా ఆమె పంచుకున్నారు. ఒక కార్యక్రమంలో తనను చూసి వివాహం చేసుకుందామని ఆకాంక్షను వ్యక్తం చేశారని, అందుకు తాను తన తల్లిదండ్రులను అడగమని చెప్పానట్లు గుర్తు చేసుకున్నారు. అలా అప్పుడు తమ పెళ్లి జరిగిందని చెప్పారు. కాగా వివాహ బంధంపై తనకు నమ్మకం ఉందని, అది ఎప్పటికీ చెరగదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మాదిరిగానే అర్థం చేసుకోగలిగిన వ్యక్తి తారసపడితే కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి మమత మోహన్‌దాస్ పేర్కొన్నారు. మమతకు 2011 నవంబరు 11న బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌తో నిశ్చితార్థం జరిగింది. వీరికి 2011 డిసెంబరు 28న కోజికోడ్‌లో వివాహం జరిగింది. 2012 డిసెంబరు 12న అంటే కేవలం ఏడాదిలోనే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ కారణంగానే వారిద్దరూ విడిపోయారని కొన్ని కథనాలు కూడా వచ్చాయి.
ఫౌజి షూటింగ్లో..
వరుస పాన్ ఇండియన్ ఫిల్మ్స్‌తో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఫౌజి’ ఒకటి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ సీన్స్ తెరకెక్కిస్తుండగా అదుపు తప్పి ప్రభాస్ కింద పడటంతో చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయట. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘‘ఏదైనా సినిమా షూటింగ్స్‌లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమే. ప్రభాస్‌కి పెద్ద గాయాలు కాలేదు.ఆయన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడింది. అది కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. అభిమానులు కంగారుపడొద్దు’’ అంటూ పేర్కొనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజి’ విడుదల కానుంది. కాగా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘స్పిరిట్, కల్కి 2898 ఏడీ 2’ వంటి సినిమాలున్నాయి.
ప్రేక్షకుల నోట ఆ మాట వినాలని ఉంది: శివానీ నాగారం
‘‘వేగంగా వంద సినిమాలు చేయడం కంటే.. నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఐదు సినిమాలు చేసినా చాలు’ అనుకునే మనస్తత్వం నాది. వెంట వెంటనే సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావు అని కొందరు నాతో అన్నారు. కానీ, ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట ప్రేక్షకుల నోట వినాలని ఉంది. సెలక్టివ్‌గా సినిమాలు చేసే సాయిపల్లవి, నిత్యామీనన్గార్ల బాటలోనే నేను కూడా పయనిస్తాను’’ అని చెప్పారు హీరోయిన్ శివానీ నాగారం. సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘హే బల్వంత్!’ (హే భగవాన్ టైటిల్‌ను హే భల్వంత్! గా మార్చారు). గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ మాట్లాడుతూ–‘‘నా స్వస్థలం హైదరాబాద్. గాయనిగా కెరీర్‌ను ప్రారంభించాను. యాక్టర్‌గా తొలిసారి సుహాస్‌తో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ మూవీ చేశాను. ఇప్పుడు మళ్లీ సుహాస్‌తో ‘హే బల్వంత్’ చేశాను.నా పాత్రలో అమాయకత్వంతో పాటు కామెడీ కూడా ఉంటుంది.నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్గార్ల కామెడీ నవ్విస్తుంది. సెకండాఫ్‌లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది. తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలకు చాన్స్ వచ్చింది.. వివరాలు త్వరలోనే చెబుతాను. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే ఓటీటీ ్ర΄ాజెక్ట్స్ చేస్తాను. అవకాశం వస్తే సింగర్‌గాను నిరూపించుకోవాలని ఉంది’’ అని చెప్పారు.
పవర్ఫుల్ సెయాన్
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘సెయాన్’ టైటిల్ ఖరారైంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో శివ కార్తికేయన్ చేస్తున్న రెండో సినిమా ఇది.సోమవారం ‘సెయాన్’ సినిమా టైటిల్‌ని ప్రకటించి, శివ కార్తికేయన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘సెయాన్’. పవర్ఫుల్ అండ్ డైనమిక్ క్యారెక్టర్లో శివ కార్తికేయన్ కనిపిస్తారు. కమర్షియల్ మాస్ అంశాలు, భావోద్వేగాలు, వినోదం.. వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్.
క్రీడలు
ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక.. ఇక లగేజి సర్దుకోవడమే!
టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56), కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) మొదటి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఒక దశలో 104/0 తో ఉన్న ఆస్ట్రేలియాను లంక స్పిన్నర్లు దూషన్ హేమంత, దునిత్ వెల్లలాగే కట్టడి చేశారు. కేవలం 77 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ తన 10 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో హేమంత మూడు వికెట్లు పడగొట్టగా.. చమీరా, కమిందు మెండిస్, వెల్లలాగే తలా వికెట్ సాధించారు.నిస్సాంక సూపర్ సెంచరీ..అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే చేధించింది. లంక ఓపెనర్ పాథుమ్ నిస్సాంక అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన నిస్సాంక.. చివరి వరకు క్రీజులో నిలబడి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.నిస్సాంక 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. అతడితో వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (51), పవన్ రత్నాయకే(28) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిష్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.ఆసీస్ ఇంటికే!ఈ విజయంతో గ్రూపు-బి నుంచి శ్రీలంక సూపర్-8కు అర్హత సాధించింది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఆసీస్ మాత్రం తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూపు పాయింట్ల పట్టికలో జింబాబ్వే(4 పాయింట్లు) రెండో స్దానంలో ఉంది. ఆసీస్ సూపర్-8కు చేరాలంటే జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లలో ఐర్లాండ్, శ్రీలంకపై ఓడిపోవాలి. అదేవిధంగా ఒమన్‌పై ఆసీస్ భారీ విజయం సాధించాలి.
భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని మూడేళ్ల ముందే తెలుసు: శ్రీశాంత్
మాజీ భారత క్రికెటర్ S. Sreesanth ‘Rooted For Life’ పోడ్కాస్ట్లో తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. Dr. Pradeep Sethi గారితో జరిగిన ఈ సంభాషణ క్రికెట్‌కి మాత్రమే పరిమితం కాకుండా జీవితం, నమ్మకం, మనోబలం వంటి ఎన్నో అంశాలపై సాగింది. చిన్ననాటి కష్టాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత ఆలోచనలు, ప్రపంచ కప్ వరకు తీసుకెళ్లిన సూత్రాలు – అన్నింటినీ శ్రీశాంత్ మనస్ఫూర్తిగా పంచుకున్నారు.ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీశాంత్ అందరినీ – మతం, కులం అనే తేడా లేకుండా గౌరవించాలనే తన నమ్మకాన్ని చెప్పారు. జీవితం ఎత్తుపల్లాలు చూపినప్పుడు నిలబడటానికి ఒక బలమైన “బేస్” ఉండాలి అని ఆయన అభిప్రాయం. వినయం, ఆత్మగౌరవం రెండూ కలిసి నడవాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం గొప్పతనానికి మూలం అని స్పష్టం చేశారు.ఈ పోడ్కాస్ట్లో హృదయాన్ని తాకే భాగం ఆయన చిన్నప్పటి ఆరోగ్య సమస్యల గురించి. మొదటిసారి తనకు వచ్చిన ట్యూమర్ శస్త్రచికిత్స, ఆ సమయంలో తన తండ్రి చూపిన అచంచలమైన భక్తి గురించి శ్రీశాంత్ గారు భావోద్వేగంగా చెప్పారు.Ettumanoor Mahadeva Temple వద్ద ఒక రూపాయి కానుక, చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసిందని, అది తనకు ఒక అద్భుతం లాంటిదని వివరించారు. భగవాన్ శివుడితో తన ఆధ్యాత్మిక అనుబంధం గురించి చెబుతూ, తన చేతిపై త్రిశూలం ఆకారంలో ఉన్న జన్మమచ్చను కూడా ప్రస్తావించారు.తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహా అందరినీ కుటుంబ సభ్యుల్లా గౌరవించాలనే విలువలు తన తండ్రి నేర్పారని చెప్పారు. మహాబలి కథ, ఓనం పండుగ ఉదాహరణగా తీసుకుని, మతం కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు.సంతోషం, ఆనందం మధ్య తేడా గురించి మాట్లాడుతూ – విజయం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం కావొచ్చు, కానీ అంతరానందం మనలో నుంచే వస్తుందని అన్నారు. మంచి అయినా చెడు అయినా ప్రతి అనుభవం మనకు “తజుర్బా” ఇస్తుందని, అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుందని చెప్పారు.ICC World Twenty20 విజయానికి వెనుక ఉన్న “సీక్రెట్” గురించి మాట్లాడినప్పుడు, కప్ గెలవబోతున్నామనే నమ్మకం తనలో ముందే ఉన్నదని చెప్పారు. ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్టు మూడు సంవత్సరాల ముందే ఊహించుకున్నానని వెల్లడించారు. ఆ టోర్నమెంట్లో తన కెరీర్‌కి మలుపుతిప్పిన క్యాచ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.PRIDE – అంటే “Personal Responsibility in Delivering Excellence” – అనే తత్వం తన జీవితానికి ఆధారం అని చెప్పారు. జట్టులోంచి తప్పించబడిన సందర్భాలు, ఓటములు ఎదురైనప్పుడు కూడా క్రమశిక్షణ, రొటీన్, పాజిటివ్ సెల్ఫ్-టాక్ తనను నిలబెట్టాయని వివరించారు. తాత్కాలిక ప్రతిభ కంటే అలవాట్లు, క్రమబద్ధతే విజయానికి మూలం అని అన్నారు.తన పోటీ స్వభావం గురించి మాట్లాడుతూ, క్రీడల్లో ధైర్యం మరియు అజాగ్రత్త మధ్య ఉన్న సన్నని రేఖను వివరించారు. అస్టిగ్మాటిజం సమస్య, ఫాస్ట్ బౌలింగ్‌లో ఉన్న శారీరక ఒత్తిడి, అవుట్‌స్వింగ్ యార్కర్ సాధనలో చూపిన పట్టుదల గురించి పంచుకున్నారు.మైదానంలో తన సంబరాలు ఈగో వల్ల కాదు, ఆటపై ఉన్న నిజమైన ప్రేమ, ఉత్సాహం వల్లేనని చెప్పారు. విజయం ప్రయాణంలో ఇతరులను కూడా భాగస్వాములను చేయడం, పాజిటివ్ సందేశాలు పంచడం ఎంత ముఖ్యమో వివరించారు.ఈ పోడ్కాస్ట్లో కుటుంబం ప్రాధాన్యం, ప్రజా జీవితంలో మేనేజర్ల కంటే కుటుంబ సభ్యుల పాత్ర, ప్రపంచానికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ పంచాల్సిన అవసరం వంటి అంశాలు కూడా చర్చించబడ్డాయి. చివరగా తన నానమ్మ నేర్పిన జీవన పాఠాలు, యోగా ద్వారా సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో శ్రీశాంత్ గారు సూచనలు ఇచ్చారు.
భారత్ చేతిలో ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్ కీలక నిర్ణయాలు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో ఘోర ఓటమి ఎదురైన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న (ఫిబ్రవరి 15) మ్యాచ్ ముగిసిన వెంటనే పీసీబీ అర్దరాత్రి వేల అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్టార్ ఆటగాళ్ల పేర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది అని తెలుస్తుంది.వీరిద్దరిని తక్షణమే జట్టు నుంచి తప్పించాలని కొలొంబోలో ఉన్న దేశ ప్రతినిధులకు పీసీబీ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. పాక్ తదుపరి ఆడబోయే నమీబియా మ్యాచ్‌లో బాబర్, అఫ్రిది స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీం షా, ఫకర్ జమాన్, ఖ్వాజా నఫాయ్ పేర్లు పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.భారత్ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శనపై పాక్ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. స్టార్ ఆటగాళ్లను తప్పించే విషయంలో పీసీబీ కంటే పాక్ ప్రభుత్వ జోక్యమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్ ప్రభుత్వంపై కూడా ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా భారత్‌తో మ్యాచ్ ఆడమని ప్రకటించడమెందుకు, ఆతర్వాత తిరిగి ఆడటమెందుకని దుమ్మెత్తిపోస్తున్నారట. దేశ ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో బాబర్, అఫ్రిది సహా మరికొంత మంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్ ప్రభుత్వం పీసీబీకి సిఫార్సు చేసినట్లు వినికిడి.పాక్ ప్రజలు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుంచి ఓవరాక్షన్ చేస్తున్నాడని మెజార్జీ పాక్ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. నఖ్వీని పీసీబీ అధ్యక్ష హోదాతో పాటు మంతివర్గం నుంచి కూడా బహిష్కరించాలని పాక్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. నఖ్వీ భారత్ చేతిలో ఓటమి తర్వాత తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు పలువురు పాక్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌ను కూడా పరుష పదజాలంతో మందలించాడని తెలుస్తుంది.కాగా, భారత్‌తో మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్, యూఎస్ఏపై అతికష్టం మీద గెలిచిన పాక్.. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో యూఎస్ఏ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్ ఆటుఇటైతే పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే భారత్‌తో పాటు యూఎస్ఏ సూపర్-8కు చేరుకుంటుంది.
T20 WC 2026: ఇంగ్లండ్‌ను భయపెట్టిన మరో పసికూన
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్ గండంగా నడుస్తుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లీష్ టీమ్‌ను ప్రతి జట్టూ భయపెడుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్ చేతిలో ఘోర పరాభవాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్న బ్రూక్ సేన.. ఇవాళ (ఫిబ్రవరి 16) మరో పసికూన ఇటలీ చేతిలోనూ ఇంచుమించు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఇటలీ, క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్‌ను భయపెట్టింది. అనుభవాన్నంతా రంగరించి ఈ ఇంగ్లండ్ బయటపడింది కానీ, ఏమరపాటుగా ఉండి ఉంటే మాత్రం చుక్కెదురయ్యేదే.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఇటలీ బౌలర్లు తొలుత తెగ ఇబ్బంది పెట్టారు. ఆది నుంచి వరుస విరామాల్లో ఇంగ్లండ్ వికెట్లు తీశారు. ఆఖర్లో విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకోబట్టి ఇంగ్లండ్ గట్టెక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లను ఇటలీ బౌలర్లు ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. కొన్ని పరుగులు చేసేలోపే వికెట్లు తీశారు. జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఇంగ్లండ్ 200 పరుగుల మార్కును తాకలేకపోయేది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ 28, బట్లర్ 3, బేతెల్ 23, బాంటన్ 30, బ్రూక్ 14, సామ్ కర్రన్ 25, ఓవర్టన్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఇటలీ బౌలర్లలో స్టీవార్ట్, కలుగమగే చెరో 2, స్మట్స్, అలీ హసన్, బెన్ మనెంటి తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఆదిలో తడబడినప్పటికీ.. బెన్ మనెంటి (60), జస్టిన్ మోస్కా (43), గ్రాంట్ స్టివర్ట్ (45) ఇంగ్లండ్ శిబిరంలో గుబులు రేపారు. మనెంటి.. మోస్కాతో కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను భయపెట్టాడు. బెన్ మనెంటి క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇంగ్లండ్ ఫ్యాన్స్ వణికిపోయారు. మనెంటి భారీ సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మనెంటి ఔటయ్యాక కూడా ఇటలీ కాసేపు పోరాడింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకొని మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఇటలీ పని అయిపోయిందన్న దశలో స్టీవర్ట్ తన మెరుపు విన్యాసాలతో మరోసారి ఇంగ్లండ్‌ను దడదడలాడించాడు. స్టీవర్ట్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి ఎనిమిదో వికెట్‌కు జస్ప్రీత్ సింగ్‌తో కలిసి 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు.దీంతో ఇటలీ గెలుపుకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. స్టీవర్ట్ ఉన్న ఊపులో ఇటలీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సమయంలో సామ్ కర్రన్ స్టీవర్ట్ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 19 ఓవర్లో కర్రన్ రెండు వైడ్లు వేసినా, మరో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన స్టీవర్ట్ వికెట్ తీశాడు. అక్కడే ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించాయి. కర్రన్ ఇచ్చిన ఊపుతో చివరి ఓవర్లో ఓవర్టన్ రెచ్చిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి ఇటలీని ఆలౌట్ చేశాడు. తద్వారా ఇటలీ 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఇటలీ ఓడినా, గర్వంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇటలీ తమకంటే చాలారెట్లు మెరుగైన నేపాల్‌పై సంచలన విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఏపీలో వ్యవసాయం.. బాబు సర్కారులో అపాయం
ఆంధ్రప్రదేశ్‌లో శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను గాలికొదిలేసిన బాబు సర్కారు
పన్నుల బాదుడు, అప్పుల పద్దు తప్ప సంపద సృష్టి, సూపర్ సిక్స్ అమలు జాడలేని ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ మంటలు... విద్యార్థుల ఫీజుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, ప్రజా సమస్యలపై గొంతెత్తాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం
ఏపీలో సూపర్ సిక్స్ మోసాల ఖరీదు లక్షన్నర కోట్ల రూపాయలు.. రాష్ట్ర గవర్నర్‌తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నోటీసుపై 120 మంది విపక్ష ఎంపీల సంతకాలు
ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు ఎడారే!. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడు ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆప్కాస్’ ఉద్యోగాలకు మంగళం
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
బిజినెస్
రూ.215 లక్షల కోట్లకు రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ వేగవంతమైన వృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. 2025 నాటికి భారత రిటైల్ మార్కెట్ రూ.90–95 లక్షల కోట్ల పరిమాణంతో ఉండగా, 2035 నాటికి అంటే వచ్చే పదేళ్లలో రూ.210–215 లక్షల కోట్ల స్థాయికి విస్తరిస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారత్ మంచి పనితీరు చూపిస్తుండడంతోపాటు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకోనున్నట్టు గుర్తు చేసింది. భారత రిటైల్ రంగం తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశించిందంటూ.. స్పష్టత, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, ఏఐ ఆధారిత పరివర్తనపై దృష్టి సారించిన సంస్థలను విజయం వరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను బీసీజీ, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. వినియోగదారులతో అనుబంధం, నిర్వహణ నమూనాలు, నైపుణ్యాల విషయంలో నిర్మాణాత్మక మార్పులను స్వీకరించే సంస్థలు రూ.200 లక్షల కోట్ల రిటైల్ మార్కెట్లో గణనీయమైన విలువను సొంతం చేసుకుంటాయని ఈ నివేదిక తెలిపింది. కస్టమర్లకు ప్రత్యేకమైన విలువను అందించడం, స్థిరమైన లాభదాయకతను కొనసాగించేందుకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొంది. వినియోగదారుల నిర్ణయాలను, ముఖ్యంగా ఏఐ ప్రభావితం చేస్తుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. టెక్నాలజీ పాత్ర కీలకం.. ‘‘భారత రిటైల్ ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. వచ్చే దశాబ్ద కాలంలో రూ.200 లక్షల కోట్లకు విస్తరించనుంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ సంస్థల నగదు ప్రవాహాలు స్పష్టమైన పురోగతిని చూపిస్తున్నాయి. విస్తరణలో ఏఐ వంటి టెక్నాలజీల విస్తృత వినియోగం, అత్యుత్తమ నిర్వహణ, ప్రత్యేకమైన విలువను అందించే సంస్థలే విజేతలుగా నిలుస్తాయి’’అని బీసీజీ ఎండీ అభీక్సింఘి తెలిపారు. ఏజెంటింక్ కామర్స్ అన్నది ప్రయోగాత్మక దశ నుంచి ఆచరణ దశకు వచ్చేసిందని.. పరిశోధన, కొనుగోలు నిర్ణయాలను జెన్ఏఐ ప్రభావితం చేస్తోందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటికే 42 శాతం మంది వినియోగదారులు జెన్ఏఐని వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘వినియోగదారులు ఉత్పత్తిని గుర్తించడం, పరిశీలించడం, కొనుగోలు చేయడాన్ని అంతర్జాతీయంగా ఏజెంటిక్ కామర్స్ ప్రభావితం చేస్తోంది. భారత్‌లో డిజిటల్ వినియోగం బలంగా ఉంది. కనుక పట్టణ ప్రాంతాల్లో ఏఐ ఆధారిత షాపింగ్, ముఖ్యంగా జెన్ జెడ్‌లో వేగవంతం అవుతుంది’’అని బీసీజీ ఎండీ, పార్ట్నర్ భారత్ మిమానీ తెలిపారు. ఉత్పత్తులు, సరఫరా చైన్, మార్కెటింగ్, సేవలు ఇలా అన్నింటా ఏఐ వినియోగంతో 40–60 శాతం అధిక ప్రయోజనాలను రిటైలర్లు పొందగలరని ఈ నివేదిక తెలిపింది. ‘‘డిమాండ్ బలంగా ఉంది. వినియోగదారులు వివేకంతో వ్యవహరిస్తున్నారు. రిటైలర్లు ఆవిష్కరణలకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ పరివర్తనను ఒక ప్రాజెక్టుగా కాకుండా క్రమశిక్షణగా పరిగణించే సంస్థలు, అన్ని ఫార్మాట్లలో స్థిరమైన సేవలు అందించేవి వచ్చే దశాబ్దంలో విజేతలుగా నిలుస్తాయి’’ అని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ అభిప్రాయపడ్డారు.
వంటింటిపై ధరల దాడి.. రెట్టింపైన ఖర్చుల వేడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా కాస్త శాంతించినట్లు కనిపించిన టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యుడికి షాక్ ఇచ్చింది. 2026 జనవరి నెలకు టోకు ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 1.81 శాతానికి ఎగబాకింది. డిసెంబర్ 2025లో ఇది కేవలం 0.83 శాతంగా ఉండగా.. ఒక్క నెల వ్యవధిలోనే 1%‡ పెరగడం గమనార్హం. నవంబర్‌లో మైనస్‌లో ఉన్న ద్రవ్యోల్బణం, ఇప్పుడు వేగంగా పెరుగుతుండటం ఆర్థిక వర్గాలను సైతం కలవరపెడుతోంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గణాంకాలను విడుదల చేసింది. తయారీ రంగం, ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది. ఎందుకింతలా పెరిగింది? ప్రధానంగా తయారీ రంగంలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జనవరితో పోలి్చతే ఈసారి ’బేసిక్ మెటల్స్’ (లోహాలు), టెక్స్టైల్స్ (వ్రస్తాలు), రసాయనాలు, మోటారు వాహనాలు, యంత్ర పరికరాల ధరలు ప్రియమయ్యాయి. ఫ్యాక్టరీ గేటు వద్దే ధరలు పెరగడంతో, అది అంతిమంగా వినియోగదారుడిపై భారం మోపే అవకాశముంది. అలాగే ఆహారేతర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం సూచీ పైకి ఎగసింది. రంగాలవారీగా పరిస్థితి ఇలా.. టోకు ధరల సూచీలో అత్యధిక వాటా కలిగిన తయారీ రంగం విభాగంలో ద్రవ్యోల్బణం 2.86 శాతానికి చేరింది. ప్రధానంగా లోహాలు, వ్రస్తాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరగడం ఇందుకు కారణం. ఆహార పదార్థాలు, ఖనిజాలు ఉండే ప్రాథమిక వస్తువులు విభాగంలో ద్రవ్యోల్బణం 2.21 శాతంగా నమోదైంది. డిసెంబర్‌తో పోలి్చతే (3.12%) ఇది కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికీ ధరలు ఎగువ స్థాయిలోనే ఉన్నాయి. సామాన్యుడికి నేరుగా సంబంధమున్న ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్లో సున్నా (0.00%) వద్ద ఉండగా, జనవరి నాటికి 1.41 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాలు, గోధుమలు, పండ్లు, కూరగాయల ధరల్లో కదలికలు ఇందుకు కారణమయ్యాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, విద్యుత్ వంటి అంశాలున్న ఇంధనం, విద్యుత్ విభాగం మాత్రం ప్రజలకు కాస్త ఊరటనిచి్చంది. ఇందులో ద్రవ్యోల్బణం –4.01 శాతం (మైనస్)గా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు. గత మూడు నెలల ట్రెండ్.. టోకు ధరల సూచీ గమనాన్ని గమనిస్తే.. స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. నవంబర్ 2025: –0.13% (ధరల తగ్గుదల) డిసెంబర్ 2025: 0.83% (స్వల్ప పెరుగుదల) జనవరి 2026: 1.81% (భారీ పెరుగుదల) నవంబర్, డిసెంబర్ 2025 నెలలకు సంబంధించిన తుది గణాంకాలను కేంద్రం సవరించింది. నవంబర్ రేటును –0.13 శాతంగా ఖరారు చేసింది. మొత్తం మీద టోకు ధరల పెరుగుదల ప్రభావం రానున్న రోజుల్లో చిల్లర ధరలపై పడే అవకాశం లేకపోలేదు.
డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?
పోటీ ప్రపంచంలో చదివి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సాహసం అయితే.. ఉన్న జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓరాకిల్, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం.. ఖర్చులను తగ్గించుకోవడానికి, పునర్వ్యవస్థీకరణ పేరుతో లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏఐ కూడా తోడైంది. దీంతో టెక్ రంగంలో తీవ్రమైన అలజడి మొదలైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటే.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సమయంలో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే బాబా వంగా.. అంధురాలైనప్పటికీ, భవిష్యత్తును ముందుగానే చూడగల శక్తి తనకు ఉందని అనేక మంది విశ్వసించారు. రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ దాడులు, హిందూ మహాసముద్రం సునామీ వంటి కొన్ని ప్రధాన సంఘటనలు.. ఆమె అంచనాలకు సరిపోలినట్టు కొందరు భావించారు. ఈ కారణంగానే ఈమె పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఒక టెక్ ప్రపంచానికి సంబంధించిన విషయం వైరల్ అయింది.2026 సంవత్సరం AI రంగంలో ఒక కీలక మలుపు అవుతుందని, అది మన రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవ నియంత్రణకు మించి వెళ్లే అవకాశం ఉందని బాబా వంగ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!ప్రస్తుతం ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, చాట్‌బాట్స్, ఆటోమాటిక్ వాహనాలు వంటి సాంకేతికతలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. AI మనుషులను భర్తీ చేస్తుందా? లేక మానవులకు తోడ్పడే సాధనంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.బాబా వంగా అంచనాలు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే చెబుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' కూడా ఏఐ కారణంగా.. మరో ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, ముఖ్యంగా ఐటీ సర్వీస్, బీపీఓ రంగాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు.
మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్‌గార్డ్ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ఫ్యామిలీ
91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గానా..!
ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్నెస్ కోచ్‌లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్‌గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్‌గా ఉండటమే కాదు..ఫోర్స్‌తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్ బామ్మ అంటే..ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్‌కు వెళ్లే ఐకానిక్ ట్రెక్కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్ వంటి సెషన్లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్‌లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్ కదూ..!. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!)
ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!
ఏడేళ్ల చిన్నారి..తన వయసుకు అనితరసాధ్యమైన దాన్ని అవలీలగా చేధించింది. పెద్దపెద్ద ఈతగాళ్ల డ్రీమ్ ఎలిఫెంటా ద్వీపం నుంచి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు ఈదడం. కానీ ఈ చిన్నారి చాలా అవలీలగా చేసి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అత్యంత సవాలుతో కూడిన సముద్ర మార్గంలో ఈదడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..?..అస్సాంకి చెందిన ఏడేళ్ల కియుచెంఘన్ ఫుకాన్ ఈ ఘనత సాధించింది. ఆ చిన్నారి ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియాకు 3 గంటల 29 నిమిషాల్లో ఈదింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆ ఘనతను పూర్తి చేసింది. కియుచెంఘన్ ఎలిఫెంటా ద్వీపం నుంచి మధ్యాహ్నం 2:36 గంటలకు తన ఈత ప్రారంభించి సాయంత్రం 6:05 గంటలకు గేట్‌వే ఆఫ్ ఇండియాకు చేరుకుంది. ఈ ప్రదేశం బలమైన ప్రవాహాలు, మారుతున్న సముద్ర పరిస్థితులకు ప్రసిద్ధిచెందింది. ఇది అరేబియా సముద్రంలో అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి కఠినతరమైన సముద్ర మార్గాన్ని ఏడేళ్ల ప్రాయంలో అవలీలగా జయించి.. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కాగా, కియుచెన్ఘాన్ ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. హేమంగా ఫుకాన్ రిమ్లి, హజారికా ఫుకాన్ దంపతుల కుమార్తె. ఆ చిన్నారి కుటుంబం గౌహతిలోని సిక్స్ మైల్లో నివసిస్తుంది. ఈ చిన్నారి గౌహతిలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అక్వాటిక్ కాంప్లెక్స్‌లో స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇక అస్సాం స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ దాస్ ఈ విజయాన్ని అస్సాంకే గర్వకారణంగా పేర్కొన్నారు. అస్సాం క్రీడా మంత్రి నందితా గార్లోసా ఈ చిన్నారి స్విమ్మర్‌ని అభినందించారు. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయి కూడా ఈ చిన్నారినే. View this post on Instagram A post shared by OPEN WATER SWIMMING ACADEMY, INDIA (@owsaindia) (చదవండి: డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..)
మహాశివరాత్రికి సాత్విక వంటకాలు..! హెల్దీగా ఉపవాసం చేద్దాం ఇలా
మహాశివరాత్రికి సాత్వికంగా ఉండే వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి రహిత ఆహారాలు తీసుకుంటుంటారు. ఎలాగో మహాశివరాత్రి అంటేనే ఉపవాసం. అయితే చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం ఉంటారు. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు అంతలా కఠిన ఉపవాసాలు ఉండటం కష్టమే. ఒక పక్క అత్యంత పవిత్రమైన రోజు, మరోవైపు శరీరం సహకరించక అవస్థలు పడే వాళ్లు..ఇలాంటి సాత్విక వంటకాలను తీసుకుంటూ..హెల్దీగా ఉపవాసం చేయొచ్చని పెద్దలు చెబుతున్నారు. అంతేగాదు పురాణాలు సైతం శరీరాన్ని కష్టించేలా భక్తి అవసరం లేదని, చక్కగా తింటూనే పూజలు చేయండనే చెబుతున్నారు. పైగా ముందు భుక్తి తర్వాతే భక్తి అన్నారు. అయినా పొట్టలో కాసింత ఆహారం ఉంటేనే ఆధ్యాత్మికతవైపు, భక్తివైపుకి మనసు మళ్లేది. కాబట్టి ఈ పుణ్యప్రదమైన శివరాత్రి రోజున హాయిగా చేసుకుని తిసే సాత్విక వంటకాలేంటంటే..మిల్లెట్లు, దగ్గరన నుంచి సుబుదాను, కుట్టు అట్ట, సింఘార పిండి, పాలు, పండ్లు, నట్స్ తదితరాలను హాయిగా తీసుకోవచ్చట. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి ఎక్కువసేపు ఉపవాసం ఉండేలా, పూజలు చేసుకునేందుకు సౌకర్యవంతగాను ఉంటుంది కూడా. ఆరోగ్యకరమైన సాత్విక వంటకాలు..సబుదాన ఖిచ్డి కాస్త ఓదార్పునిచ్చి..ఆకలిని నియంత్రణలో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. పైగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కూడా. ఎలా చేస్తారంటే..కావలసినవి..సబుదాన – 1 కప్పుఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 మీడియంవేయించిన వేరుశనగలు (తురిమినవి) – ¼ కప్పుజీలకర్ర – ½ స్పూన్పచ్చిమిర్చి (తరిగినవి) – 1సెంధా నమక్ – రుచికి సరిపడానెయ్యి – 1 టేబుల్ స్పూన్‌తయారీ..ముందుగా సబుదానా(సగ్గుబియ్యం) కడిగి 4–5 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర పచ్చిమిర్చి,బంగాళాదుంపలు బాగా వేయించాలి. అవి ఉడికాక నానబెట్టిన సబుదాన, వేరుశెనగ పొడి, ఉప్పు జల్లి, ఓ రెండు నిమిషాలు ఉడికించండి. అంతే సబుదాన ఖిచ్డి రెడీ..!.సామా కే చావల్ ఖిచ్డిసామా కే చావల్ అని పిలువబడే బార్న్యార్డ్ మిల్లెట్ ఉపవాస భోజనాన్ని తేలికగా, పోషకంగా చేస్తుంది. ఈ సాత్విక్ ఖిచ్డి సరళంగా అనిపిస్తుంది కానీ ఓదార్పునిస్తుంది, మహాశివరాత్రి సమయంలో ఎక్కువసేపు ఉపవాసం ఉండటానికి సరైనది.కావలసినవి సమా కే చావల్ – 1 కప్పుఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 చిన్నవిజీలకర్ర – ½ స్పూన్అల్లం (తురిమినది) – 1 స్పూన్ఉప్పు: తగినంతనెయ్యి – 1 టేబుల్ స్పూన్నీళ్ళు – 2 కప్పులుతయారీ: ముందుగా మిల్లెట్లు బాగా కడగాలి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయించాలి, ఆ తర్వాత అల్లం, బంగాళ దుంప, మిల్లెట్, నీరు కలపాలి. మిల్లెట్ మెత్తగా ఉడికిపోతే..రెడీ అయిపోయినట్లే.కుట్టు అట్ట చీలాకుట్టు అట్ట చీలా వ్రత భోజనాలకు వెచ్చదనం తోపాటు తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎలా చేస్తారంటే..కావల్సినవి..కుట్టు అట్ట – 1 కప్పుఉడికించిన బంగాళాదుంప (గుజ్జు) – 1 చిన్నవిపచ్చిమిర్చి (ఐచ్ఛికం) – ½ స్పూన్ఉప్పు: తగినంతనీరు – ¾ కప్పునెయ్యి – 1 స్పూన్‌తయారీ విధానం..కుట్టు అట్ట, బంగాళాదుంప, కారం, ఉప్పు, నీరు కలపండి.నునుపైన పిండిలా కలపాలి. వాటి చిన్నసైజు బజ్జీల్లా పాన్‌లో వేయించాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తే చాలు. పెరుగుతో వడ్డించి తింటే రుచి అదుర్స్.వ్రత్ వాలే ఆలూసంక్లిష్టమైన మసాలా దినుసులు లేకుండా సింపుల్‌గా చేసే వ్రత్ వాలే ఆలూ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.కావలసినవి :ఉడికించిన బంగాళాదుంపలు – 2 మీడియంజీలకర్ర – ½ స్పూన్పచ్చిమిర్చి – 1ఉప్పు: తగినంతనల్ల మిరియాలు – ¼ స్పూన్నెయ్యి – 1 టేబుల్ స్పూన్‌తయారీ: నెయ్యి వేడిచేసి జీలకర్ర, తరిగిన బంగాళ దుంపలు బాగా వేయించి. దించేముందు కారం, ఉప్పు, నల్లమిరియాలు, చల్లుకోవాలి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి.లౌకి ఖీర్లౌకి ఖీర్ మహాశివరాత్రి ఉపవాసానికి తీపి వంటకం ఇచ్చే శక్తి అమోఘమైంది. మరి ఇదేలా చేస్తారంటే..ఇక్కడ లౌకి అంటే అనపకాయ అని అర్థం.కావలసినవి:తురిమిన లౌకి(అనపకాయ ముక్కలు)- 1 కప్పుపాలు - 2 కప్పులుబెల్లం - 3 టేబుల్ స్పూన్లుఏలకుల పొడి - ¼ స్పూన్తరిగిన గింజలు - 1 టేబుల్ స్పూన్‌తయారీ..తురిమిన లౌకిని పాలలో తక్కువ మంట మీద ఉడికించాలి.మెత్తగా, కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మరిగించండి.బెల్లం వేసి బాగా కలపండి. ఏలకులు పొడి వేసి సర్వ్ చేయండి. ఇది మహాశివరాత్రి ఉపవాసానికి బెస్ట్ డెజర్జ్.(చదవండి: పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!)
కథాకళి: నాతిచరామి
నా మిత్రుడు లీలాచరణ్ మందు మానేశాడని విని నేను నమ్మలేదు. అదే నిజమైతే అది ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది. లీలాచరణ్ భార్య, తల్లిదండ్రులు, స్నేహితులు, వాడితో పరిచయం ఉన్న ఎవరికైనా అది నమ్మలేని నిజమే. లీలాచరణ్ వయసు డెబ్బె ఏడు. వాడిని వాడు అంటున్నానంటే నా వయసుని మీరు ఊహించొచ్చు.నా కో–స్టూడెంట్‌గా పరిచయమయ్యే నాటికే లీలాచరణ్కి ఆల్కహాల్ అలవాటు ఉంది. అప్పుడే కొత్తగా ఆంధ్రాలో ప్రొహిబిషన్ తీసేశారు. ఓసారి మేథ్స్ టీచర్ వాడి నుంచి వాసన వస్తూంటే పట్టుకున్నప్పుడు మాకా సంగతి తెలిసింది. వాడి తండ్రి విద్యుత్ శాఖలో ఏదో కీలకమైన పోస్ట్‌లో ఉండడంతో పైసంపాదన చాలా వచ్చేది. పిల్లల మీద ప్రేమతో ఆయన వాళ్ళు అడిగినంత కాదనకుండా ఇస్తూండేవారు. లీలాచరణ్ తను తాగడమే కాక, కంపెనీకి మమ్మల్ని తన వెంట తీసుకెళ్ళి మా డ్రింక్ ఖర్చు కూడా తనే భరించేవాడు. నేను, మా క్లాస్‌లో చాలామంది మొదటిసారి మందు తాగింది లీలాచరణ్తోనే. ఆ కారణంగా లీలాచరణ్ మిత్రబృందం ఓ మందలా ఉండేది. కాలేజ్‌లో కూడా లీలాచరణ్ నా క్లాస్మేట్. వయసు పెరిగే కొద్దీ వాడిలో మందు అలవాటు కూడా పెరగసాగింది. లీలాచరణ్ తాగుడికి పరాకాష్ట గురించి చెప్పడానికి రెండు మూడు సంఘటనలని ఉదహరిస్తే చాలు. పెళ్ళిరోజున వాడు ఇంట్లోంచి మాయమయ్యాడు. మా మిత్రబృందం రైలు పట్టాల దగ్గర కూర్చుని తాగుతున్నవాడిని వెతికి తెచ్చాం.‘‘ఒరేయ్. బార్లో ఉంటే నన్ను పట్టుకుంటారని ఇక్కడికి వస్తే ఇక్కడా తగలడ్డారా మిత్రద్రోహుల్లారా!’’ దారిలో వాపోయాడు.ఈ కాలం పెళ్ళికూతుళ్లయితే ‘వాడికి నాకంటే మందు ముఖ్యమా? ఆ సీసాకి తాళి కట్టమనండి’ అని కోపంగా అరిచి వెళ్ళిపోయేవాళ్ళు. కాని 1970లలోని ఆడపిల్లల పరిస్థితి వేరు.వాడి తాగుబోతుతనాన్ని ఉదహరించదగ్గ రెండో సంఘటన. లీలాచరణ్ ఆ రాత్రి పన్నెండున్నరైనా ఇంటికి రాలేదని, వెతకమని మా ఇంటివారికి ఫోన్ చేసి నాకు చెప్పమని అతని భార్య చెప్పింది. నేను వెంటనే చెప్పులు తొడుక్కుని వెతకడానికి బయలుదేరాను. వాడు వెళ్ళే అన్ని బార్లకి వెళ్ళాను. ఓ బార్‌లోని వాళ్ళు చెప్పారు.‘‘మీవాడు చాలా తాగాడండి. ఎంత తాగాడంటే ఒంటి మీది లుంగీ ఊడిపోయిందని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు.’’నేను రోడ్లన్నీ తిరుగుతూంటే ఒంటి మీద కేవలం చొక్కా మాత్రమే ఉన్న, అండర్వేర్ కూడా లేని లీలాచరణ్ ఓచోట లైట్ స్తంభంతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు.మరో సంఘటన, స్కూటర్ని నడుపుతూ దాన్ని ఓ లారీ కిందకి పోనించాడు. వాడి అదృష్టం, స్కూటర్ పిప్పి పిప్పి అయింది కాని వాడికి ఏం కాలేదు. వాడు ఇంటికి శంషాద్ బేగం పాట ‘తుమ్హారీ యాద్ సతాతీ హై’ అని పాడుతూ చేరుకున్నాడు.అతని భార్య సాధ్వి అనే పదానికి సరైన నిర్వచనం. నాతిచరామి అనే వాగ్దానానికి వాడు కట్టుబడి లేడు. వాడిని తాగద్దు అంటే మండిపడతాడని గ్రహించిన ఆవిడ పెళ్ళైన మూడో నెల నించే ఆ మాటని మానుకుంది. ‘‘మిత్రమా. నాకు రమ్మంటే ప్రాణమా లేక నా భార్యంటే ప్రేమా అన్నది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రెంటిలో ఏది లేకపోయినా జీవించలేను.’’ తాగనప్పుడు ఓసారి నాకు చెప్పాడు.అలాంటి లీలాచరణ్ మందు మానేశాడని, అది నిజమని తెలిశాక నేను వాడి ఇంటికి వెళ్ళాను.‘‘నా నుంచి ఎప్పటిలా ఏ సువాసనలు రానందుకు మన్నించు మిత్రమా.’’ నన్ను చూసి నవ్వుతూ చెప్పాడు.‘‘నిజమేనన్న మాట?’’ అడిగాను.‘‘చిత్తం. నా చిత్తాన్ని కత్తితో నరికి పారేశాను.’’‘‘ఇంత కాలానికి ఆ కత్తి ఎలా దొరికింది?’’ ప్రశ్నించాను.‘‘ఓసారి అన్నా గుర్తుందా, నాకు ఆ రెంటిలో దేని మీద ఎక్కువ ప్రేమో తెలీడం లేదని? ఇప్పుడు తెలిసింది. నా భార్య అంటేనే ప్రేమ.’’ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.‘‘నీ తాగుడు ఆమెకి ఇష్టం లేదని ఇంత కాలానికి గ్రహించి మానేశావంటే నమ్మను. డాక్టర్ ఇంకా ఎన్ని రోజులని చెప్పారు?’’ నవ్వుతూ అడిగాను.‘‘ఆరోగ్యం చెడింది నాకు కాదు. మా ఆవిడకి. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో నేను తాగిన మత్తులో ఉండడంతో గోల్డెన్ అవర్‌లో కాక, ఆలస్యంగా మర్నాడు మధ్యాహ్నం హాస్పిటల్‌కి తీసుకెళ్ళబట్టి కాళ్ళు చచ్చుపడ్డాయి. వెంటనే తేవాల్సిందని డాక్టర్ మందలించాడు. ప్రతి రాత్రి మూడు దాటాక ఆవిడని బాత్రూంకి తీసుకువెళ్ళాలి. మనిషి సహాయం లేకుండా నడవలేదు. కాబట్టి మేలుకుని ఉండాలని మందు మానేశాను.’’‘అయ్యో’ అనకుండా ఉండలేకపోయాను.‘‘దేవదాసు, రోమియోలని మించిన ప్రేమ నీది.’’ మనస్ఫూర్తిగా చెప్పాను.‘‘నాది కాదురా పిచ్చి వెధవా. పార్వతీ, జూలియట్లని మించిన ప్రేమ మా ఆవిడది. చాలాకాలం క్రితం ఆవిడకి అనారోగ్యం వచ్చినప్పుడు, డాక్టర్ ప్రతి రాత్రి తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పిన మాత్రని నా మీద ప్రేమతో వేసుకోవడం మానేసింది. ఆ మాత్రలో నిద్రని కలిగించే లక్షణం ఉంది. నేను తాగినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తానో, అసలు వస్తానో, రానో ఆ సమయంలో తను మెలకువగా ఉండాలని దాన్ని వేసుకోవడం మానేసింది. దాంతో డాక్టర్ హెచ్చరించినట్లుగానే ఆవిడ రోగం ఇంత దూరం వచ్చింది. ఆ సంగతి నాకు చెప్పి ఉంటేనా...’’నవ్వుతూ చెప్పినా లీలాచరణ్ కళ్ళల్లో తడిని స్పష్టంగా చూశాను. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి
అంతర్జాతీయం
ఎయిర్‌పోర్ట్‌లో టూరిస్ట్ వీరంగం.. వయాగ్రా మాత్రలతో!
హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ బ్రిటిష్ టూరిస్ట్ బీభత్సం సృష్టించాడు. టెర్మినల్-1 వద్ద ఉన్న 10 సెల్ఫ్ చెక్-ఇన్ కియోస్క్ (Kiosks) మెషిన్లను ఇనుప రాడ్డుతో అతడు ద్వంసం చేశాడు. అతడి ప్రవర్తన చూసి అక్కడున్న ఇతర ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.సెక్యూరిటీ సిబ్బంది వచ్చేలోపే 37 ఏళ్ల బ్రిటిష్ టూరిస్ట్ తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని హాంకాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే అతడి వద్ద అనుమతి లేని వయాగ్రా మాత్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.దీంతో అతడిపై విమానాశ్రయ ఆస్తులను ధ్వంసం చేసిన కేసుతో పాటు నిషేధిత మందులను కలిగి ఉన్నందుకు కూడా అదనపు కేసులను నమోదు చేశారు. కాగా కొన్ని దేశాల్లో వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా వంటి మందులను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరం.అయితే అతడు విమానాశ్రయానికి వచ్చేటప్పటికి బాగానే ఉన్నాడు. అయితే టిక్కెట్ కొనుగోలు చేసే సమయంలో సిబ్బందితో అతడికి వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అతడు వీరంగం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. View this post on Instagram A post shared by AsiaOne (@asiaonecom)
లేడీ వేశంలో ఉగ్రవాది.. అయినా వదిలేదిలే..!
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ తన సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఉగ్రవాదులు స్థావరాలను నిర్వీర్యం చేస్తూ వారికి ఎటువంటి సహాయం అందకుండా అష్ట దిగ్భందనం చేస్తుంది. ఈ నేపథ్యంలో జైషే-ఏ- మహ్మద్ తీవ్రవాది సైపుల్లా ఖాన్ భద్రతా బలగాల కళ్లుగప్పుతూ మారు వేశంలో తిరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.జైష్-ఏ-మహమ్మద్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖాన్ ప్రస్తుతం భద్రతా బలగాల కంటపడకుండా ఉండడానికి నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ గుర్తించకుండా ఉండడానికి గడ్డం తీసి ఆడవారిలా బుర్ఖాలు ధరించి తిరుగుతున్నట్లు దోడా సూపరిండెంట్ సందీప్ మెహతా అన్నారు. అంతే కాకుంగా కొన్నికొన్ని సార్లు ఎవరికి అనుమానం రాకుండా స్థానికుల మద్ధతు పొందేందుకు ఆద్యాత్మిక గురువు వేశం వేసి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.గత రెండు నెలలుగా అతని కోసం కిష్వారా, దోడా ప్రాంతాలలో గాలింపులు చేపడుతున్నామని ఈ నేపథ్యంలోనే జనవరి 19న అతని రహస్య స్థావరాన్ని కనుగొని దానిని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ స్థావరం 12 వేల అడుగుల ఎత్తులో బంకర్ల మాదిరిగా నిర్మించారని తెలిపారు. ఈ స్థావరం ధ్వంసం అయిన తర్వాత అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతని ఉనికిని గుర్తించకుండా ఉండడానికి పలుమార్లు తన వేశాలు మారుస్తున్నాడని తెలిపారు. భద్రతా బలగాలు అతని సహచరుడు ఆదిల్‌ను హత్య చేశాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీకి చిక్కకుండా ఉండేందుకు అతను మరింత జాగ్రత్త పడుతున్నట్లు సూపరిండెంట్ సందీప్ మెహతా పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌కు మోదీ.. షెడ్యూల్ ఫిక్స్..!
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.ఇజ్రాయెల్ ప్రధాని ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. "భారత ప్రధాని వచ్చేవారం ఇజ్రాయెల్ పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం అద్భుతమైన సంబంధాలున్నాయి. ఇప్పుడు మరిన్ని అంశాలపై చర్చించబోతున్నాం. మనందరికి తెలుసు ఇండియా చిన్న దేశం కాదు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం. చాలా శక్తివంతమైనది. చాలా పాపులరైంది" అని అన్నారు.ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో రెండు దేశాల సిద్ధాంతం ప్రతిపాదిస్తూనే టెల్ అవీవ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.. "నా మిత్రుడు ప్రధాని నెతన్యూహుతో ఇదివరకే ఫోన్లో సంభాషించాను. ఇజ్రాయెల్-ఇండియా వ్యూహాత్మక సంబంధాలపై చర్చించాము. రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం దిశగా చర్చలు జరుపుతున్నాము. అదేవిధంగా టెర్రరిజాన్ని మాత్రం ఎట్టిపరిస్థితిలో సహించేది లేదు. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించేందుకు భారత్ తన పూర్తి సహాకారాన్ని అందిస్తుంది." అని మోదీ అన్నారు. భారత ప్రధాని ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని భారత్‌లో పర్యటించాల్సి ఉండగా పలు కారణాలతో ఆయన పర్యటన రద్దైంది.
పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరిక
భారతీయ పోలీసులపై పాకిస్తాన్ హనీ ట్రాప్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. పాక్ నిఘా వర్గాలు సోషల్ మీడియా వేదికగా భారత పోలీసులను లక్ష్యంగా చేసుకుని 'హనీ-ట్రాప్' (అందమైన యువతుల ఫోటోలతో బురిడీ కొట్టించడం)కు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) పోలీసు సిబ్బందికి తాజాగా కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.పాకిస్తాన్ నిఘా సంస్థల "హనీ-ట్రాపింగ్" ప్రయత్నాలు పెరుగుతున్నట్టు గమనించిన, MHA ఈ ముప్పును ఎదుర్కోవడానికి, సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై మంత్రిత్వ శాఖ వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) విడుదల చేసింది.ఈ మార్గదర్శకాలను గత ఏడాది నవంబరు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్మెంట్ జారీ చేసింది. పోలీసు అధికారులతో స్నేహం చేసి, సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా సేకరించడానికి Facebook, X, Instagram, WhatsApp, Telegram, LinkedIn వంటి ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడుకుంటాయి.ముఖ్యమైన మార్గదర్శకాలు (SOP):సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో తాము పోలీసు అధికారులమని బహిర్గతం చేయకూడదు.అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనామకుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించ వద్దు. ముఖ్యంగా యువతుల ఫోటోలతో ఆకర్షించే ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.ఆన్లైన్ పోస్ట్‌లు కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో (WhatsApp, Telegram, etc.) అధికారిక పత్రాలను లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదు.ఉద్యోగాలు, ఉచిత పర్యటనలు లేదా ప్రభుత్వ ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ధృవీకరించని యాప్‌లను డౌన్లోడ్ చేయడం, తెలియని లింక్స్ క్లిక్ చేయడం, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పత్రాలను పంచుకోవడం చేయకూడదు.ఇదీ చదవండి: అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు : ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్ డే సర్ప్రైజ్ఒకవేళ హనీ-ట్రాప్‌కు గురైతే ఏం చేయాలి?ఒకవేళ హనీ-ట్రాప్‌కు గురైతే ఏం చేయాలనేదానిపై కూడా సూచనలు అందించింది. ఒకవేళ ఎవరైనా అధికారి హనీ ట్రాప్ ఉచ్చులో పడినట్లు అనుమానం వస్తే, తక్షణమే సదరు అధికారికి చెందిన డిజిటల్ పరికరాలను (ఫోన్లు, ల్యాప్టాప్స్) వెంటనే స్వాధీనం చేసుకోవాలి.ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. స్టేట్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఈ నిబంధనల అమలును పర్యవేక్షిస్తుంది. దృఢమైన పాస్వర్డ్లు, రెండు-కారకాల ప్రామాణీకరణ, పరిమిత యాప్ అనుమతులు, సాధారణ గోప్యతా తనిఖీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లకు ఆయా పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రహస్య సమాచారాన్ని లీక్ చేస్తే క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్
జాతీయం
విభాగాల వారీగా టాపర్లు వీరే
జేఈఈ మెయిన్ -2026 సెషన్ 1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరిగిన బీఈ, బీటెక్ పేపర్ 1 ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది. 13,04,653 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 96.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఎన్టీఏ తెలిపింది. 326 నగరాల్లోని 658 సెంటర్లలో జేఈఈ మెయిన్ -2026 సెషన్ 1 పరీక్ష నిర్వహించారు. ఇందులో ఇండియా వెలుపల నిర్వహించిన 15 సెంటర్లు కూడా ఉన్నాయి. కాగా ఈసారి పేపర్ 1లో 12 మంది 100 పర్సంటైల్ సాధించారు. బాలికలు ఎవరూ 100 పర్సంటైల్ సాధించలేకపోయారు. గతేడాది రెండు సెషన్లలో కలిసి మొత్తం 24 మంది 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. జనరల్- ఈడబ్ల్యూఎస్శ్రేష్ట్ జసోరియా (రాజస్థాన్)బాలికల విభాగంఆషి గ్రేవాల్ (హరియాణా)పీడబ్ల్యూబీడీహర్ష్ జైన్ (మధ్యప్రదేశ్)ఎస్టీ విభాగందక్ష్ షెహ్రా (రాజస్థాన్)ఎస్సీ విభాగందేవ శ్రీవేద్ (ఆంధ్రప్రదేశ్)ఓబీసీ- ఎన్సీఎల్నరేంద్రబాబుగారి మహిత్ (ఆంధ్రప్రదేశ్)100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరే1. శ్రేయస్ మిశ్రా (ఢిల్లీ)2. నరేంద్రబాబు గారి మోహిత్ (ఆంధ్రప్రదేశ్)3. శుభమ్ కుమార్ (బిహార్)4. కబీర్ చిల్లర్ (రాజస్థాన్)5. చిరాన్‌జిబ్ కార్ (రాజస్థాన్)6. భవేశ్ పత్రా (ఒడిశా)7. అనయ్ జైన్ (హరియాణా)8. అర్నవ్ గౌతమ్ (రాజస్థాన్)9. పసల మోహిత్ (ఆంధ్రప్రదేశ్)10. మాధవ్ విరాదియా (మహారాష్ట్ర)11. పురోహిత్ నిమయ్ (గుజరాత్)12. వివన్ శరద్ మహీశ్వరి (తెలంగాణ)
JEE Mains Results: తెలుగు విద్యార్థుల సత్తా
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) సాయంత్రం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. తాజా జేఈఈ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, ఒక తెలంగాణ విద్యార్థి ఉన్నారు. శరత్ మహేశ్వరి, నరేంద్ర, మోహిత్ అనే తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించిన జాబితాలో ఉన్నారు. ఓపెన్ కేటగిరిలో పసల మోహిత్ అనే విద్యార్థి 100 పర్సెంటైల్ సాధించగా, ఓబీసీ కేటగిరిలో టాపర్‌గా నరేంద్ర బాబు నిలిచారు. జేఈఈ మెయిన్స్ పరీక్షను 13.04 లక్షల మంది విద్యార్థులు రాశారు. కాగా, దేశవ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2025 తొలి సెషన్‌కు 13.80 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. అదేవిధంగా 95 నుంచి 96 శాతం మంది పరీక్షలకు హాజరు కాగా, రెండు సెషన్లలోనూ భారీగా పోటీ పెరిగింది. జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో 100 పర్సెంటైల్ సాధించిన వారు వీరేశ్రేయస్ మిశ్రా-ఢిల్లీనరేంద్ర బాబు- ఆంధ్రప్రదేశ్శుభమ్ కుమార్-బిహార్కబీర్ చిల్లర్-రాజస్తాన్చిరాన్జిబ్ కార్-రాజస్తాన్భవేశ్ పత్రా-ఒడిశాఅనయ్ జైన్-హర్యానాఅర్నవ్ గౌతమ్-రాజస్తాన్పసల మోహిత్-ఆంధ్రప్రదేశ్మాధవ్ విరాదియా-మహరాష్ట్రపురోహిత్ నిమయ్-గుజరాత్వివన్ శరద్ మహీశ్వరి-తెలంగాణ
పెళ్లికి ముందు ఎవరినీ నమ్మొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సహజీవన ఘటనలపై సర్వోన్నతన్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకరికొకరు అపరిచితులే. బంధం ఎంత గాఢమైనదైనా సరే పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకోవడందాకా ఎందుకు వెళ్తున్నారో మాకైతే అర్థంకావట్లేదు. మేము పాతకాలం మనుషులమే కావచ్చు.. కానీ పెళ్లికి ముందు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆచితూచి అడుగులేయాలి’’అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ దాఖలైన ఓ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే? నిందితుడు 2022లో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా 30 ఏళ్ల మహిళకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే నిందితుడికి అప్పటికే వివాహమైంది. ఆ విషయాన్ని దాచిపెట్టి, సదరు మహిళతో ఢిల్లీలో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ఆమెను తనతో పాటు దుబాయ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా పెళ్లి ప్రస్తావన తెచ్చి సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండా సాన్నిహిత్య వీడియోలను రికార్డ్ చేశాడు. పెళ్లి గురించి అడిగితే ఆ వీడియోలను బయటపెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంత జరుగుతున్నా బాధితురాలిని కాదని 2024 జనవరి 19వ తేదీన నిందితుడు పంజాబ్‌లో మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో బెయిల్ కోసం నిందితుడు ప్రయతి్నంచగా అక్కడ చుక్కెదురైంది. దీంతో అతను బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మీకెందుకు అంత చనువు? సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ’పెళ్లికి ముందు ఎంత చనువున్నా సరే, వారు అపరిచితుల కిందే లెక్క. ఒకవేళ ఆ మహిళకు పెళ్లి, సాంప్రదాయంపై అంత పట్టింపు ఉంటే, పెళ్లి కాకుండానే అతనితో దుబాయ్ ఎందుకు వెళ్లింది?’అని ప్రశ్నించారు. ‘నేటి కాలంలో ఇలాంటి కేసులు చూస్తుంటే మాకు అర్థం కావడం లేదు. పెళ్లికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి. యువత జాగ్రత్తగా ఉండాలి’అని హితవు పలికారు. మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమై, పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా అని ప్రభుత్వ న్యాయవాది బదులివ్వగా ‘పెళ్లి చేసుకోవాలనుకోవడం వేరు. పెళ్లి కాకుండానే అన్నీ జరిగిపోవడం వేరు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఇద్దరి అంగీకారంతో కొనసాగిన శారీరక బంధంలా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ‘పరస్పర సమ్మతితో కొనసాగిన ఇలాంటి కేసుల్లో విచారణలు జరిపి, దోషులుగా తేల్చి జైలుకు పంపడంలో హేతుబద్ధత లేదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. అవసరమైతే బాధితురాలికి నిందితుడు తగు నష్టపరిహారం ఇవ్వాలి’అని జస్టిస్ నాగరత్న సూచించారు. ఇద్దరూ మాట్లాడుకుని వివాదపరిష్కారానికి అవకాశాన్ని పరిశీలించాలని కేసును బుధవారానికి వాయిదా వేశారు.చదవండి: కొలీగ్‌పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. ఏం చేయను?
ఆయనొక ఐఏఎస్.. మూడో భార్య కూడా ఐఏఎస్..!
ఐఏఎస్ ఆఫీసర్.. మరో ఐఏఎస్‌ను పెళ్లాడటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్న వ్యక్తికి.. మూడో పెళ్లి చేసుకున్న క్రమంలో కూడా ఐఏఎస్ అధికారిణే భార్యగా వస్తే అది అరుదైన విషయంగానే భావించాలి. చట్టపరంగానే ఇద్దరి భార్యలకు బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు మూడో వివాహం చేసుకున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అయితే అంతకుముందు వివాహం చేసుకున్న ఇద్దరూ భార్యలు ఐఏఎస్ అధికారిణులే గాక, ఇప్పుడు తాజాగా చేసుకున్న ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరే కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్ మూడోసారి వివాహం చేసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది.2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్. ఇప్పటివరకు వివాహం చేసుకున్న ముగ్గురు భార్యలూ IAS అధికారులే కావడం విశేషం. తాజా వివాహం ఫిబ్రవరి 11న కూనో నేషనల్ పార్క్‌లో జరిగింది. ఈసారి ఆయన 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అంకిత ధాక్రేతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన ఐఏఎస్ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్‌కి చెందిన అవి ప్రసాద్.. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్‌లో చేరారు. ఆపై ఏడాదికి అఖిల భారత సర్వీస్‌లో 13వ ర్యాంకు సాధించి ఐఏఎస్ హోదా పొందారు.
ఎన్ఆర్ఐ
Operation CyStrike: నకిలీ వీసా రాకెట్.. గుట్టురట్టు చేసిన సీబీఐ
కువైట్ నకిలీ ఈ-వీసాలను సృష్లించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛేదించింది. అంతర్జాతీయ సైబర్ నేరాల అదుపులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సై-స్ట్రైక్ (Operation CyStrike)తో ముఠా ఆటకట్టించారు. జనవరి 30న ఢిల్లీతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, నకిలీ వీసాలు, నకిలీ నియామక పత్రాలతో పాటు రూ. 60,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు కువైట్ అధికారిక ఈ-వీసా వెబ్సైట్లను పోలిన నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించారు. తద్వారా నిరుద్యోగులను ఆకర్షించి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా కేవలం భారతీయులనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మరియు సింగపూర్ వంటి దేశాల్లోని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంది. గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు వీరు నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు eservicemoi-kw.com అనే వెబ్‌సైట్‌ను ప్రధాన నకిలీ పోర్టల్‌గా గుర్తించారు.కువైట్ వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఎలక్ట్రానిక్ వీసా దరఖాస్తుల కోసం www.indianvisaonline.gov.in మాత్రమే అధికారిక పోర్టల్ అని స్పష్టం చేసింది. అనధికారిక వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వైఎస్సార్సీపీ గల్ఫ్ దేశాల కన్వీనర్ల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. గల్ఫ్ దేశాలలో వైఎస్సార్సీపీ కన్వీనర్లను నియమిస్తూ.. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.కువైట్-ముమ్మడి బాలిరెడ్డి, రియాధ్(సౌదీ అరేబియా)-ప్రొఫెసర్ సయ్యద్ రబ్బానీ, జుబైల్- శేఖ్ మహెబూబ్ ఇలాహీ, బహ్రెయిన్- ఒర్సు నాగరాజు, దుబాయి-సయ్యద్ అక్రం, ఒమాన్- జి.జి. భాస్కర్‌రావులను కన్వీనర్లుగా పార్టీ నియమించింది.
లండన్‌లో పానీ పూరీ అమ్ముతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్..!
కార్పోరేట్ లైఫ్‌ని వద్దనుకుని మరి ఆతిథ్య రంగాన్ని ఎంచుకుంది భారత సంతతి మహిళ. ఒకప్పుడు శామ్మ్సంగ్ డిజైనర్‌గా పనిచేసిన ఆమె లండన్‌లో తన భర్తతో కలిసి సప్పర్ క్లబ్‌ని రన్ చేస్తుంది. అక్కడ ఆమె పానీపూరితో అపరిచిత భారతీయలును ఒకచోటకుకు చేర్చడమే కాదు వివిధ భారతీయ వంటకాలను పరిచయం చేస్తోంది, లాభాలు ఆర్జిస్తోంది కూడా. అయినా ఐఐటీ చదివి ఇలాఇదే ఎందుకంటే..ఆ దంపతులే అంకిత ఖాంతే, భర్త అమన్ కృష్ణ కలిసి 'ది బౌజీ క్లబ్' అనే సప్పర్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పుట్టిన ఖాంతే నాగ్‌పూర్‌లో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసి, ఐఐటీ గుహతిలో మాస్టర్ డిగ్రిని పూర్తి చేసింది. ఆ తర్వాత 2024లో అమన్ కృష్ణను వివాహం చేసుకుని యూకేకి వెళ్లి స్థిరపడింది. ఇక ఆమె భర్త కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని ఓబ్రాలో జన్మించాడు. అతడు ఐఐటీ ధన్‌బాద్ కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐఐటీ హైదరాబాద్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేశాడని చెప్పుకొచ్చింది. తామిద్దరం లండన్ స్థిరపడ్డాక జాబ్ మార్కెట్‌ని పూర్తిగా స్టడీ చేశాం. అంతకుముందు తాను బెంగళూరులో శామ్సంగ్లో ప్రొడక్ట్ డిజైనర్‌గా మూడేళ్లు పనిచేసినట్లు పేర్కొంది. స్నేహితులను అందరికి ఒక చోటకు చేర్చి హోస్టింగ్ చేయడం తనకు హాబీ అని ఆ అలవాటే..ఇలా 'ది బౌజీ క్లబ్' నిర్వహించాలనే ఆలోచనకు నాందిపలికిందన్నారు. పైగా దీని సాయంతో ఇంకా కొత్తవారు పరిచయమవ్వక ఇబ్బంది పడుతున్న భారతీయ ఎన్నారైలకు ఇది హెల్ప్ అవ్వడమే కాకుండా ఆహారంతోనే సులభంగా అందర్నీ ఒకచోటకు చేర్చగలమని దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. మొదట్లో కొంతమంది స్నేహితులతో ప్రారంభించామని, ఆ తర్వాత టిక్కెట్టు పొందాక సప్పర్ క్లబ్‌గా మారిందని చెప్పుకొచ్చింది. కొన్ని ఈవెంట్ల తర్వాత ప్రతి మొదటి పదినిమిషాలు చాలా ముఖ్యమైనవి అర్థమైందో దాంతో ..పానీపూరిని ఐస్ బ్రేకర్‌గా పరిచయం చేశాం. అలా ప్రతి విందులో ఇది సిగ్నేచర్ విందుగా పానీపూరితోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది అంకిత. నెలకు సుమారు పది నుంచి 12 మంది ఆతిథ్యం ఇస్తామని..ఇక్కడ ఏడు కోర్సుల ఇండియన్-ఫ్యూజన్ మెనూను అందిస్తున్నట్లు వెల్లడించింది. టికెట్ట ధర ఒక్కొక్కరికి రూ. 6000. అయితే ఈ జంట ఎంత టర్నోవర్ వస్తుందో మాత్రం వెల్లడించలేదు. పండుగ సమయల్లో ఆ పండు నేపథ్య సిరీస్‌తో ఫుడ్‌ని అందిస్తారట కూడా. అంతేగాదు తాము ఐఐటీ గ్రాడ్యుయేట్లు కావడంతోనే వేగంగా అర్థంచేసుకోవడం, రిస్క్ తీసుకోవడం వంటివి చేయగలిగామని సగర్వంగా చెబుతోంది అంకిత. సప్పర్ క్లబ్ అంటే ఏమిటి?ప్రైవేట్ డిన్నర్ పార్టీ, రెస్టారెంట్‌కి మాధ్యమంగా ఉంటుంది ఈ సప్పర్ క్లబ్. దీన్ని సామాజికి భోజన అనుభవంగా చెప్పొచ్చు. విభిన్న నేపథ్యాలున్న వ్యక్తులంతా ఒకచోట చేరి హాయిగా నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించే అనుభూతిని అందిస్తుంది. రెస్టారెంట్లో కూడా ఇలానే ఉన్నా..అక్కడ వేరువేరుగా డైనింగ్ టేబుల్‌పై కూర్చొని ఆస్వాదిస్తాం. ఇక్కడ అలా కాదు ఒకచోట సమావేశమైన వ్యక్తుల్లా సహపంక్తి భోజనంలా తింటారు ఈ సప్పర్ క్లబ్లో. (చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..)
Budget 2026 : NRIలకు గుడ్‌న్యూస్, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా 2026-27 బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులకు శుభ వార్త చెప్పారు. లోక్‌సభలో తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న ఆమె భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి, మరింత ప్రపంచ మూల ధనాన్ని ఆకర్షించేందుకు సీతారామన్ ఈ రోజు మూడు కీలక అంశాలను ప్రకటించారు కార్పొరేట్ బాండ్లకు మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్‌వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి కొత్త మార్గం, లిస్టెడ్ కంపెనీలలోఅటువంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులను పెంచడం.NRI లకు గుడ్న్యూస్పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (PIS) ద్వారా NRIలు ఇప్పుడు భారతీయ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు RBI ఆమోదించిన ప్రత్యేక బ్యాంక్ ఖాతా ద్వారా భారతీయ స్టాక్లను కొనుగోలు చేయడానికి , విక్రయించడానికి అనుమతిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా భారతీయ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే లక్ష్యంతో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు (PROI) ఇకపై భారతీయ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత పరిమితిని 5 శాతం పెట్టుబడి పరిమితిని 10 శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. అయితే అటువంటి పెట్టుబడిదారులందరికీ కలిపి పరిమితిని 10శాతం నుంచి 24శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పు తీవ్రమైన విదేశీ వ్యక్తిగత పెట్టుబడిదారులు భారతీయ కంపెనీలలో మరింత అర్థవంతమైన వాటాలను తీసుకోవడానికి వీలు ల్పిస్తుంది. ధరల ఆవిష్కరణను, వాటాలను మరింతగా పెంచుతుంది. దీర్ఘకాలిక మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. పోర్ట్‌ఫోలియో పెట్టుబడి పథకం ద్వారా నేరుగా భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం, చాలా విదేశీ పోర్ట్‌ఫోలియో ప్రవాహాలు రిజిస్టర్డ్ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) లేదా నిర్దిష్ట నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) మార్గాల ద్వారా వస్తాయి. ఇది సాధారణ విదేశీ వ్యక్తికి సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి పెట్టుబడిదారులకు నియంత్రిత, ప్రామాణిక ఈక్విటీ పెట్టుబడి మార్గాలను సులభ తరం చేస్తుంది.అలాగే కార్పొరేట్ బాండ్ల కోసం ప్రతిపాదిత మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్‌వర్క్ భారత రుణ మార్కెట్లోని అతిపెద్ద సమస్యలలో ఒకటైన పూర్ లిక్విడిటీని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద, నియమిత సంస్థలు ఎంపిక చేసిన కార్పొరేట్ బాండ్లలో నిరంతర కొనుగోళ్లు, అమ్మకాల కోట్లను అందించేలా సాయపడతాయి. పెట్టుబడిదారులు మరింత సులభంగా మరియు సరసమైన ధరలకు స్థానాల్లోకి ఎంట్రీకి, ఎగ్జిట్‌కి సహాయపడుతుంది. ఇది సేవర్లు , సంస్థలకు సమానంగా, కార్పొరేట్ బాండ్లను బ్యాంకు రుణాలు, స్థిర డిపాజిట్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కంపెనీలు మరింత పోటీ ధరల వద్ద డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది.
క్రైమ్
షవర్‌కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ స్టూడెంట్ బలవన్మరణంచింతల్: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలో నివాసముంటున్న అశోక్‌బాబు కుమార్తె నాగలిఖిత (17) జీడిమెట్లలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తన గదిలో చదువుకోవడానికి వెళ్లింది. కాసేపటి తరువాత చెల్లెలు గీతిక సాయి గది తలుపు తట్టగా స్పందన రాలేదు. అపార్ట్మెంట్ వాచ్‌మన్ సహాయంతో తలుపు తాళం విరగొట్టి లోపలికి వెళ్లగా చున్నీని మెడకు కట్టుకొని మంచానికి చున్నీని కట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. షవర్‌కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య ఫిలింనగర్: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్ సంధ్యారాణి(20) షేక్‌పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని ఫాల్కన్ వ్యాలీ కాలనీలో హాస్టల్లో ఉంటోంది. ఆదివారం ఉదయం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రేక్పాస్ట్ చేసిన అనంతరం సెలవు దినం కావడంతో అంతా పడుకున్నారు. అదే సమయంలో సంధ్యారాణి బాత్రూమ్లోకి వెళ్లి చున్నీతో షవర్‌కు ఉరేసుకుంది. కాసేపటి తరువాత మిత్రులు బాత్రూమ్ తట్టగా లోపలి నుంచి గడియ వేసి ఉంది.దీంతో హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చారు. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా షవర్‌కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీంతో ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ చావుపై ఎలాంటి విచారణ చేయవద్దని మృతురాలు వాట్సప్ మెసేజ్ పెట్టింది. ఈ మేరకు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తంచేశారు. కళాశాల యాజమాన్యం, వేధింపుల వల్లనే తన కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్య ఎఫైర్.. ప్రియుడి ఇంటిని తగలబెట్టిన భర్త
మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు కారణంగా ఆగ్రహంతో మహిళ భర్త, బంధువుల చేతిలో ఒకరికి చెందిన రూ.20 లక్షల విలువగల ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ దహనమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం గుండాలగడ్డ తండా∙గ్రామానికి చెందిన ఓ వివాహితతో అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి పద్ధతి మార్చుకోవాలని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోలేదు. ఆ వివాహిత భర్త, బంధువులు ఆగ్రహంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి చెందిన ఇల్లు, ఇంట్లోని వస్తుసామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ (హార్వెస్టర్) విలువైన సామగ్రిని దహనం చేశారు. తండావాసులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై దీపిక, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భార్య వేరేవాడితో ఉంటుందని..!
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ నడిబొడ్డున పట్టపగలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోరె విశ్వనాథ్ (30), ఇదే మండలం వడ్డెరకాలనీకి చెందిన లక్ష్మి ఇద్దరూ కలిసి జగిత్యాల బైపాస్‌రోడ్‌లోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు.కాగా, లక్ష్మీకి గతంలో వడ్డెరకాలనీకి చెందిన గంగాధర్‌తో వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. 9 నెలల క్రితం లక్ష్మీకి ఇన్‌స్ట్రాగామ్‌లో విశ్వనాథ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయారు. పోలీసులు పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి లక్ష్మీని భర్తకు అప్పగించారు. కానీ, లక్ష్మి భర్త వద్ద ఉండకుండా మళ్లీ విశ్వనాథ్‌తో కలిసి శ్రీరాంనగర్‌లో ఉంటున్నారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథ్, లక్ష్మి పెంబట్ల కోనాపూర్ దుబ్బరాజేశ్వరస్వామిని దర్శించుకుని జగిత్యాలకు వచ్చారు. బైపాస్‌రోడ్‌లో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా గంగాధర్‌తో పాటు అతడి బంధువులు మరో ఇద్దరు విశ్వనాథ్‌పై కర్రలతో దాడి చేశారు. తలకు తీవ్రగాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. లక్ష్మీకి సైతం గాయాలయ్యాయి. ఘటన స్థలాన్ని పట్టణ సీఐ కరుణాకర్ పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి బోరె చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
పవన్ అభిమానుల నుంచి ముప్పు.. బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
కూసుమంచి (ఖమ్మం): తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (45) అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం 7–30 సమయంలో కారు నీళ్లలో కొంతమేర మునగగా.. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందడం.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్‌గానూ గుర్తింపు పొందారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తిచేసిన ఆయన పలు పుస్తకాలు రచించగా.. 2014లో పవన్‌కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశంపై ‘పవన్‌కళ్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకం 8 లక్షలకుపైగా కాపీలు అమ్ముడుపోయిందని సమాచారం. పవన్‌కళ్యాణ్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఏం జరిగిందంటే.. పాలేరు రిజర్వాయర్‌లోకి శనివారం ఉదయం ఏపీ 16 డీపీ 2345 నంబరు కారు దూసుకెళ్లింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా.. ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు లాగారు. కారు నీళ్లలో కొంతమేర మునగగా, వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెంది ఉన్నాడు. అయితే, కారు నీటిలో పడిన సమయాన డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి నాయకన్‌గూడెం వైపు వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ ఘటనాస్థలిని పరిశీలించారు.బయటపడిన వ్యక్తి ఏమైనట్టు? కారులో ఇద్దరు ఉండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెనుకాల సీటులో కూర్చున్న వ్యక్తిని కాపాడకుండా హడావుడిగా వెళ్లిపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలు ఉండగా కారు నీటిలో పడిన సమయాన తగిలాయా, ఎక్కడైనా హత్య చేసి కారులో తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌పై పుస్తకం రాసిన దృష్ట్యా శ్రీనివాస్‌కు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కలి్పంచిందని శ్రీనివాస్ స్నేహితులు ‘సాక్షి’కి తెలిపారు. ఈనేపథ్యంలో శ్రీనివాస్‌ది ముమ్మాటికీ హత్యేనని, పోలీసులు విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. కారు రిజర్వాయర్‌లో పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం చేరేందుకు హైవే ఉన్నప్పటికీ పాత సర్వీస్ రోడ్డును ఎంచుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు రిజర్వాయర్‌లో పడిపోయి ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అని పోలీసులు, మృతుడి స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు నీట మునిగాక ఒడ్డుకు చేరి వెళ్లిపోయిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తూనే నాయకన్‌గూడెం వద్ద ఉన్న టోల్‌ప్లాజా సీసీ ఫుటేజీల ద్వారా కారు నంబర్ సేకరించి ఎవరిదనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, శ్రీనివాస్ మృతదేహం ప్రస్తుతం నేలకొండపల్లి ఆస్పత్రి మార్చురీలో ఉండగా, ఆయన సోదరులు శనివారం అర్ధరాత్రి వరకు ఇక్కడకు చేరే అవకాశముందని సమాచారం.
వీడియోలు
నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం
మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ
లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు
ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు
తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..
ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!
కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది
Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!
Punjagutta: సైలెంట్ గా కిలో బంగారం కొట్టేశాడు

