BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
లైంగిక వేధింపుల కేసులో జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలుశిక్ష విధించిన బాంబే హైకోర్ట్
‘‘ట్రయల్ కోర్టులో ఏడున్నరేళ్లపాటు న్యాయపోరాటం చేసిన తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యాం. ఇప్పుడు వాళ్లు మళ్లీ మాపై పడ్డారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని వదిలేసి, వ్యతిరేకంగా జర్నలిజం చేసిన వారిని నిత్యం వేధిస్తున్నారు’’ అని తరుణ్ తేజ్‌పాల్ విమర్శించారు.
చనుబాలు: పుట్టగానే ఎంతమందికి అందుతున్నాయి? వాటి మీద ఎన్ని అపోహలున్నాయి, నిజమేంటి?
శిశువు జన్మించిన వెంటనే వచ్చే పసుపు రంగు పాలను కొలస్ట్రం (Colostrum) అని పిలుస్తారు. ఇవి సహజసిద్ధమైన తొలి టీకాలాంటివి. ఇందులో ఇమ్యూనోగ్లోబులిన్-ఏ, లాక్టోఫెరిన్, ల్యూకోసైట్లు, గ్రోత్ ఫ్యాక్టర్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శిశువును అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. తొలి ఆరు నెలలు శిశువులకు తల్లిపాలు మాత్రమే సరిపోతాయి.
గర్భంలో ఉండగానే శిశువుకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన వైద్యులు, 3 నెలల తర్వాత తల్లికి సుఖ ప్రసవం
థియోలాంటి సంక్లిష్ట కేసుల్లో అయితే నవజాత శిశువుల ఐసీయూలో ఆరు నెలల వరకు చికిత్స, అనేక శస్త్రచికిత్సలు, రెండేళ్ల వరకు ఐవీ ద్వారా పోషకాహారం, అవసరమైతే పేగుల మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావచ్చు.
భారత్‌లో షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్.. బంగ్లాదేశ్‌లో ఆగ్రహం
ప్రెస్ కాన్ఫరెన్సులో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కూడా కనిపించడంతో బుధవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి జరిగినట్లు చెబుతున్నారు. "బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ నివాసంపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్, గౌరవనీయ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనాతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొన్న కొద్ది గంటలకే ఈ దాడి జరిగింది" అని బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
నిజంగా సింహం గడ్డి తింటుందా, ఫోటోలు, వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?
సింహాలు నిజంగా గడ్డి తింటాయా? లేదంటే, అలా యాదృచ్చికంగా జరిగిందా? లేక ఫేక్ న్యూసా?
పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ మీడియాపై ఆంక్షలు.. రిపోర్టింగ్ చేయాలంటే 'ఎన్వోసీ తప్పనిసరి'
పాకిస్తాన్లో అంతర్జాతీయ మీడియా రిపోర్టింగ్‌పై అక్కడి అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ నగరాలు మినహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రిపోర్టింగ్ చేసేందుకు, పాకిస్తాన్ పౌరులతో సహా విదేశీ మీడియా కోసం పనిచేసే ఎవరైనా ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం కొత్త రహస్యాలను బయటపెట్టనుందా?
బుధవారం మధ్యాహ్నం సుమారు 12.05 గంటలకు(భారత కాలమానం ప్రకారం) అది చంద్రుడిని ఢీకొట్టింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అప్పటికే పగలు కావడంతో, ఆ ఢీకొన్నప్పుడు ఏర్పడిన స్వల్ప మెరుపు టెలిస్కోప్‌లో కూడా కనిపించనంత మసకగా ఉంది.
మార్క్ జుకర్‌బర్గ్: మోదీ వీడియో డిలీట్, బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ విషయంలో భారత్‌కు ‘సారీ’ చెప్పిన మెటా అధినేత
బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CSAM), డీప్‌ఫేక్‌ల, తమ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణలో దొర్లిన 'పొరపాట్ల'పై మార్క్ జుకర్‌బర్గ్, భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పినట్లు బీబీసీకి కొన్ని సోర్సుల ద్వారా తెలిసింది.
జంతర్ మంతర్ నిరసన: బెదిరింపులు రావడంతో ఇల్లువదిలి వెళ్లిపోయిన ఓ యువతి కుటుంబం, ఏం జరిగింది?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని ఆరోపిస్తూ న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఓ బాలికపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజాశాంతికి భంగం కలిగిస్తాయని అందులో పేర్కొన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































