1751
Appearance
1751 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1748 1749 1750 - 1751 - 1752 1753 1754 |
దశాబ్దాలు: | 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 14: లక్కిరెడ్డిపల్లె వద్ద, హైదరాబాద్ యొక్క కొత్త నిజాం, సుభాదర్ ముజాఫర్ జంగ్, కర్నూలు సంస్థానానికి వ్యతిరేకంగా అశ్వికదళంతో దండయాత్ర చేసాడు. అతడిని నవాబ్ బహదూర్ ఖాన్ ఎదుర్కొన్నాడు. సుబేదార్, నవాబు ఇద్దరూ తమ సైనికులను గుర్రాలపై నుండి దిగి, చేతులతో తలపడమని ఆదేశించారు. ఈ సమయంలో నవాబు సుబేదారు తలలోకి ఈటెను దింపు చంపేసాడు. ఆ వెంటనే సుబేదారు సైనికులు నవాబునూ "ముక్కలు ముక్కలుగా నరికేసారు". [1]
- ఫిబ్రవరి 16 – ఇంగ్లీష్ కవి థామస్ గ్రే మొట్టమొదట ది మ్యాగజైన్ ఆఫ్ మ్యాగజైన్స్‌లో ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రీ చర్చియార్డ్‌ను ప్రచురించాడు. ఈ పద్యమే ఇప్పుడు "గ్రేస్ ఎలిజీ"గా ప్రసిద్ధి చెందింది. [2]
- మార్చి 25: ఇంగ్లాండ్, వేల్స్‌లలో, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ల్లోని బ్రిటిషు వలసల్లో మార్చి 25 ను కొత్త సంవత్సరాదిగా చివరిసారిగా జరుపుకున్నారు. [3]
- నవంబర్ 14: ట్రిచినోపోలీ లోని (ఇప్పుడు తిరుచిరప్పల్లి) బ్రిటిష్ కోటపై, ఫ్రెంచ్ మద్దతుతో చందా సాహిబ్ చేసిన 50 రోజుల ముట్టడి భగ్నమైంది.బ్రిటిషు వారు మస్కెట్ కాల్పులు జరిపినపుడు, చందా సాహిబ్ దళం లోని ఏనుగుల చెల్లాచెదురై ఆ తొక్కిసలాట జరిగింది. [4]
- డిసెంబర్ 3: రెండవ కర్ణాటక యుద్ధంలో ఆర్నీ వద్ద జరిగిన పోరులో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజా సాహిబ్ నాయకత్వంలో గల చాలా పెద్ద ఫ్రాంకో-ఇండియన్ సైన్యాన్ని ఓడించి మట్టి కరిపించింది.
- తేదీ తెలియదు: స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త కార్ల్ లిన్నేయస్ తన ఫిలాసోఫియా బొటానికాను, వివరణాత్మక క్రమబద్ధమైన బొటానికల్ వర్గీకరణ యొక్క మొదటి పాఠ్య పుస్తకం, అతని ద్విపద నామకరణం యొక్క మొదటి రూపాన్ని ప్రచురించాడు.
జననాలు
[మార్చు]- మార్చి 16: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- అక్టోబర్ 30: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (మ. 1816)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ N. S. Ramaswami, Political History of Carnatic Under the Nawabs (Abhinav Publications, 1984) pp145-146
- ↑ Catherine Robson, Heart Beats: Everyday Life and the Memorized Poem (Princeton University Press, 2012) p134
- ↑ "Saturday's Post from the Whitehall and General Evening Posts", The Derby Mercury (Derby, Derbyshire), September 15, 1752, p. 1
- ↑ Micheal Clodfelter, ed., Warfare and Armed Conflicts: A Statistical Encyclopedia of Casualty and Other Figures, 1492–2015 (McFarland, 2017) p110