Jump to content

బెనిన్

వికీపీడియా నుండి
రిపబ్లిక్ ఆఫ్ బెనిన్
Republic of Benin

République du Bénin  (French)
Flag of బెనిన్
జండా
Coat of arms of బెనిన్
Coat of arms
నినాదం: 
  • "Fraternité, Justice, Travail" (French)
  • "Fraternity, Justice, Labour"
గీతం: 
Location of  బెనిన్  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  బెనిన్  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

Location of బెనిన్
రాజధానిPorto-Novoa
అతిపెద్ద నగరంCotonou
అధికార భాషలుFrench
Vernacular languages
జాతులు
(2002)
పిలుచువిధం
  • Beninese
ప్రభుత్వంPresidential republic
• President
Yayi Boni
శాసనవ్యవస్థNational Assembly
Independence
• from France
August 1, 1960
విస్తీర్ణం
• మొత్తం
114,763 కి.మీ2 (44,310 చ. మై.) (101st)
• నీరు (%)
0.02%
జనాభా
• July 2013 estimate
10,323,000 (85th)
• 2013 census
9,983,884
• జనసాంద్రత
78.1/చ.కి. (202.3/చ.మై.) (120th)
GDP (PPP)2012 estimate
• Total
$15.586 billion[1]
• Per capita
$1,666[1]
GDP (nominal)2012 estimate
• Total
$7.429 billion[1]
• Per capita
$794[1]
జినీ (2003)36.5[2]
medium
హెచ్‌డిఐ (2013)Steady 0.476[3]
low · 165th
ద్రవ్యంWest African CFA franc (XOF)
కాల విభాగంUTC+1 (WAT)
• Summer (DST)
UTC+1 (not observed)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+229
Internet TLD.bj
  1. Cotonou is the seat of government.
Population estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected.

బెనిన్

Benin (/bɛˈnn/ beh-NEEN, /bɪˈnn/ bih-NEEN;

[4] అధికారికంగా " రిపబ్లిక్కు ఆఫ్ బెనిన్ " అంటారు. దీనికి సరిహద్దుగా పశ్చిమసరిహద్దులో టోగో, తూర్పుసరిహద్దులో నైజీరియా, ఉత్తరసరిహద్దులో బుర్కినా ఫాసో, నైజర్ ఉన్నాయి. ప్రజలలో అధికభాగం అట్లాంటికు మహాసముద్రం ఉత్తరప్రాంతంలో ఉన్న ఉష్ణమండలంలో భాగంగా ఉన్న గినియా గల్ఫులోని బైటు ఆఫ్ బెనిన్ దక్షిణ తీరప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.[5] బెనిన్ రాజధాని పోర్టో-నోవో. ప్రభుత్వ స్థానం దేశంలోని అతిపెద్ద నగరం ఆర్థిక రాజధాని కోటోనౌలో ఉంది. బెనిన్ వైశాల్యం 1,14,763 కిలోల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. [6] 2016 లో గణాంకాల ఆధారంగా జనసంఖ్య సుమారు 10.87 మిలియన్లు ఉన్నట్లు అంచనా వేయబడింది. [7]బెనిన్ ఒక ఉష్ణమండల దేశం. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. పత్తి, పామాయిలు పెద్ద ఎత్తున ఎగుమతిదారు. జీవనాధార వ్యవసాయం నుండి గణనీయమైన ఉపాధి ఆదాయం ఉత్పన్నమవుతాయి.[8]

బెనిన్ అధికారిక భాష ఫ్రెంచి. అయితే ఫాను, యోరుబా వంటి స్థానిక భాషలు వాడుక భాషలుగా ఉన్నాయి. బెనిన్లో అతిపెద్ద మత సమూహంగా రోమను కాథలిక్కులు ఉన్నారు. తరువాత స్థానంలో ఇస్లాం, వోడును, ప్రొటెస్టాంటిజం ఉన్నాయి. బెనిన్ ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా సమాఖ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సంఘం, ఇస్లామికు కో ఆపరేషను సంస్థ, దక్షిణ అట్లాంటికు శాంతి & సహకార జోను, లా ఫ్రాంకోఫోనీ, సహెలు-సహారను దేశాల సంఘం, ఆఫ్రికను పెట్రోలియం ఉత్పత్తిదారుల అసోసియేషను, నైజరు బేసిను అథారిటీ సభ్యదేశంగా ఉంది.[9]

17 నుండి 19 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో దాహోమీ రాజ్యం, పోర్టో-నోవో నగర-రాజ్యంతో పాటు, ఉత్తరాన అనేక ప్రాంతాలతో కూడిన పెద్ద ప్రాంతం వివిధదేశాల పాలనలో ఉంది. ట్రాన్సు- అట్లాంటికు బానిస వాణిజ్యం సమయంలో కొత్త ప్రపంచానికి పెద్దసంఖ్యలో బానిసల రవాణా కారణంగా ఈ ప్రాంతాన్ని 17 వ శతాబ్దం నుండి స్లేవ్ కోస్టు అని పిలుస్తారు. బానిసత్వం రద్దు చేయబడిన తరువాత ఫ్రాన్సు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దీనికి ఫ్రెంచి దాహోమీ అని పేరు పెట్టారు. 1960 లో దాహోమీ ఫ్రాన్సు నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుండి సార్వభౌమ రాజ్యానికి గందరగోళ చరిత్ర ఉంది. అనేక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, సైనిక తిరుగుబాట్లు, సైనిక ప్రభుత్వాలు ఉన్నాయి.

1975, 1990 మధ్యకాలంలో బెనిన్ మార్క్సిస్టు-లెనినిస్టు దేశంగా పీపుల్సు రిపబ్లికు ఆఫ్ బెనిను పేరుతో ఉనికిలో ఉంది. 1991 లో దీనిని ప్రస్తుత బహుళ-పార్టీ రిపబ్లికు ఆఫ్ బెనిన్ భర్తీ చేసింది.[10]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

వలసరాజ్యాల కాలంలో, స్వాతంత్ర్యం సమయంలో దేశాన్ని దాహోమీ అని పిలుస్తారు. 1975 నవంబరు 30 న బెనిన్ అని పేరు మార్చబడింది.[11] బైటు ఆఫ్ బెనిన్ జలభాగంలో ఉన్న ప్రస్తుత నైజీరియాకు ఐరోపియన్లు బెనిన్ సామ్రాజ్యం అని పేరు పెట్టారు. ఆధునిక నైజీరియాలోని బెనిన్ నగరం లేదా బెనిన్ కాంస్యాలతో బెనిన్ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. "బెనిన్" రూపం ఉబిను నగరం (ఇప్పుడు బెనిన్ సిటీ) పోర్చుగీసు ఉచ్ఛారణాభేదం ఫలితంగా వచ్చింది.

కొత్త పేరు బెనిన్, దాని తటస్థతకు ఎంపిక చేయబడింది. దహోమీ పూర్వపు ఫాను కింగ్డం ఆఫ్ డాహోమీ పేరు నుండి స్వీకరించబడింది. ఇది ప్రస్తుత దేశంలోని దక్షిణ మూడవ భాగానికి పరిమితం చేయబడింది. అందువలన పోర్టో-నోవో (యోరుబా రాజ్యం శతృదేశంగా ఉంది), సెంట్రలు బెనిన్ (దీనిని కూడా యెరూబా రాజ్యం ఆధిపత్యం చేసింది), బహుళ-జాతి ప్రజలు నివసించిన వాయవ్య భూభాగంలో అటాకోరా, బారిబా ప్రజలు నివసించిన బొర్గు రాజ్యం ఉంది.[12]

చరిత్ర

[మార్చు]

బెనిన్ దేశాన్ని 1975 వరకు దహోమీ అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుండి బానిసలను కొని ఇతర దేశాలకు తరలించేవారు. ఇక్కడే పూడూ తెగవాళ్లు మనుషులను బలి ఇచ్చే సాంప్రదాయం కొనసాగింది. 18, 19 శతాబ్దాల కాలంలో ఇతర ఆఫ్రికన్ రాజులు ఈ దేశంపై ఆధిపత్యం వహించారు. 1892లో ఫ్రాన్స్ దేశం దీనిని తన అధీనంలోకి తెచ్చుకుంది. 1904 వరకు ఇది ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికాగా పరిగణించబడింది. ఇప్పటికీ ప్రజల్లో దాదాపు 50 శాతం ఫ్రెంచ్ భాషనే మాట్లాడతారు. 1960లో ఫ్రాన్స్ నుండి బెనిన్‌కు స్వతంత్రం లభించింది. అప్పటి నుండి 1972 వరకు దేశంలో అంతర్గత యుద్ధాలు చెలరేగాయి. 1990 మార్చి 1న రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌గా అధికారికంగా పేరు నిర్ధారించారు. ఐస్‌క్రీమ్ కోన్‌ను నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉండే బెనిన్ దేశం పశ్చిమ ఆఫ్రికా దక్షిణ భాగం ఉంది. ఉండడానికి చిన్న దేశమే అయినా ప్రకృతి పరంగా ఒక గొప్పదేశం. సముద్రతీర ప్రాంతంలో నోకౌ, పోర్టోనోవో లాంటి గొప్ప సరస్సులు ఉన్నాయి. నలుచదరంగా ఉండే ఇళ్లు చూపరులను ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఈ సరస్సులకు ఉత్తర భాగంలో సారవంతమైన నేలలు ఉన్నాయి. వీనిని టెర్రే డి బర్రె నేలలు అంటారు. దేశానికి ఉత్తర భాగంలో అటకోరా పర్వతాలు, పచ్చని గడ్డితో నిండిన సవన్నా పీఠభూములు దర్శనమిస్తాయి.

కాలనీపూర్వ చరిత్ర

[మార్చు]

ప్రస్తుత దేశం బెనిన్ ఫ్రెంచి వలస నియంత్రణకు ముందు భిన్నమైన రాజకీయ వ్యవస్థలు, జాతులను కలిగి ఉన్న మూడు ప్రాంతాల మిశ్రితం చేస్తుంది. 1700 కి ముందు తీరం వెంబడి కొన్ని ముఖ్యమైన నగర-రాజ్యాలు (ప్రధానంగా అజా జాతి సమూహం, కానీ యోరుబా, జిబి ప్రజలతో సహా) ఉన్నాయి. లోతట్టు గిరిజన ప్రాంతాలలో బరిబా, మాహి, గెదేవి, కబై ప్రజలు ఉన్నారు. ఆధునిక బెనిన్కు తూర్పుప్రాంతం ఓయో సామ్రాజ్యంలో ఉండేది. ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన సైనిక శక్తి పెద్ద ఎత్తున ఉంది. ఇది క్రమం తప్పకుండా దాడులు నిర్వహించి తీరప్రాంత రాజ్యాలు, గిరిజన ప్రాంతాలను సామంతరాజ్యాలుగా చేసుకుంది.[13] 1600 - 1700 ల ప్రారంభంలో పరిస్థితిలో మార్పులు సంభవించాయి. ఫాను ప్రజలు ఉన్న అబోమీ పీఠభూమిలో ఎక్కువగా దాహోమీ రాజ్యం స్థాపించబడింది. ఇది తీరం వెంట ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది.[14] 1727 నాటికి దాహోమీ రాజ్యంలోని రాజు " అగాజా " అల్లాడా, వైడా మొదలైన తీరప్రాంత నగరాలను స్వాధీనం చేసుకున్నాడు, కాని ఇది ఓయో సామ్రాజ్యం సామంతరాజ్యంగా మారింది. ఓయో అనుబంధ నగర-రాజ్యమైన పోర్టో-నోవోపై నేరుగా దాడి చేయలేదు.[15] దహోమీ రాజ్యం పెరుగుదలతో దహోమీ రాజ్యం, పోర్టో-నోవో నగరం మధ్య శత్రుత్వం, ఉత్తర ప్రాంతంలోని గిరిజన రాజకీయాలు వలసరాజ్యాల పాలనాకాలం, వలసరాజ్య అనంతర కాలాలలో కొనసాగాయి.[16]

దాహోమీ రాజ్యం దాని సంస్కృతి, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. యువకులు తరచూ పాత సైనికులవద్ద శిక్షణ పొందుతూ సైన్యంలో చేరేంత వయస్సు వచ్చేవరకు రాజ్యసైనిక ఆచారాలను నేర్పించేవారు.[17] అహోసి అని పిలువబడే ఒక ఉన్నత మహిళా సైనికుల దళాలను స్థాపించడంలో దాహోమీ ప్రత్యేకత సంతరించుకుంది. అనగా రాజు భార్యలు (మినో) ఫాను భాష ఫాంగ్బేలో "మా తల్లులు"ను చాలా మంది ఐరోపియన్లు దాహోమియను అమెజాంసు అని పిలుస్తారు. దహోమీల సైనిక తయారీ, సాధనల కారణంగా దహోమీని ఐరోపియను పరిశీలకులు, సర్ రిచర్డు బర్టను వంటి 19 వ శతాబ్దపు అన్వేషకులు "బ్లాక్ స్పార్టా" అనే మారుపేరుతో పిలిచారు.[18]

పోర్చుగీసు సామ్రాజ్యం

[మార్చు]
Map of the Kingdom of Dahomey, 1793.

దహోమీ రాజులు తమ యుద్ధఖైదీలను అట్లాంటికు బానిసవాణిజ్యంలో అమ్మారు.[19] " యాన్యుయలు కస్టమ్సు " అని పిలువబడే ఒక కార్యక్రమంలో యుద్ధ బందీలను చంపే పద్ధతి కూడా వారికి ఉంది. సుమారు 1750 నాటికి దాహోమీ రాజు ఆఫ్రికా బందీలను ఐరోపా బానిస-వ్యాపారులకు అమ్మడం ద్వారా సంవత్సరానికి 250,000 అమెరికా డాలర్లు సంపాదించాడు.[20]

దాహోమీ నాయకులు మొదట్లో బానిస వ్యాపారాన్ని ప్రతిఘటించినట్లు కనిపిస్తున్నప్పటికీ దాదాపు 300 సంవత్సరాలు దాహోమీ ప్రాంతంలో బానిసవ్యాపారం అభివృద్ధి చెందింది. 1472 లో పోర్చుగీసు వ్యాపారులతో వాణిజ్య ఒప్పందం జరిగింది. వర్ధిల్లుతున్న ఈ వర్తకం కారణంగా ఈ ప్రాంతానికి "స్లేవు కోస్టు" అని పేరు పెట్టారు. కోర్టు ప్రోటోకాల్సు రాజ్యం అనేక యుద్ధాలలో పట్టుబడిన బందీలలో కొంత భాగాన్ని శిరచ్ఛేదం చేయాలని డిమాండు చేయడంతో ఈ ప్రాంతం నుండి ఎగుమతి చేస్తున్న బానిసల సంఖ్య తగ్గింది. 1780 లలో 1,02,000 ఉన్న బందీల సంఖ్య 1860 నాటికి 24,000 కు చేరుకుంది.[21]

దాహోమీ అమెజాన్సు రాజుతో యుద్ధానికి వెళుతున్నాడు, 1793

1808 లో బ్రిటను యునైటెడు స్టేట్సు, తరువాత ఇతర దేశాలు ట్రాన్సు-అట్లాంటికు బానిస వాణిజ్యాన్ని నిషేధించిన (స్లేవు ట్రేడు యాక్టు 1807) కారణంగా ఈ క్షీణత ఏర్పడింది.[20] ఈ క్షీణత 1885 వరకు కొనసాగింది. చివరి బానిస ఓడ దక్షిణ బెనిన్ రిపబ్లికు తీరం నుండి దక్షిణ అమెరికాలోని బ్రెజిలుకు బయలుదేరింది. ఇది ఇంకా బానిసత్వాన్ని రద్దు చేయలేదు. రాజధాని పేరు పోర్టో-నోవో పోర్చుగీసు ("న్యూ పోర్టు"). ఇది మొదట బానిస వ్యాపార ఓడరేవుగా అభివృద్ధి చేయబడింది.

కాలనీ కాలం (1900 - 1958)

[మార్చు]
The French conquest of Dahomey in 1893

పంతొమ్మిదవ శతాబ్దం మధ్య నాటికి, దాహోమీ ప్రాంతీయ శక్తిగా బలహీనపడి దాని హోదాను కోల్పోవడం ప్రారంభించింది. ఫలితంగా 1892 లో దీనిని ఫ్రెంచి స్వాధీనం చేసుకుంది. 1899 లో ఫ్రెంచి తన విశాలసామ్రాజ్యంలో ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా వలసరాజ్యాల ప్రాంతంలో దాహోమీ అని పిలువబడే భూభాగాన్ని చేర్చింది.

1958 లో ఫ్రాన్సు రిపబ్లిక్కు ఆఫ్ దాహోమీకి స్వయంప్రతిపత్తిని ఇచ్చింది. 1960 ఆగస్టు 1 న పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఈ రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ సెలవుదినంగా జరుపుకుంటారు.[22] దేశాన్ని స్వాతంత్ర్యానికి నడిపించిన నాయకుడు హుబెర్టు మాగా అధ్యక్షుడు అయ్యడు.[23][24]

కాలనీ తరువాతి కాలం

[మార్చు]

1960 తరువాత పన్నెండు సంవత్సరాలు జాతి కలహాలతో అల్లకల్లోలంగా మారాయి. హుబెర్టు మాగా, సౌరౌ అపితి, జస్టిను అహోమడాగ్బే, ఎమిలే డెర్లిన్ జిన్సౌ నాయకుల కారణంగా అనేక తిరుగుబాట్లు, పాలన మార్పులు సంభవించాయి; మొదటి ముగ్గురు దేశంలోని భిన్నమైన ప్రాంతం, జాతికి ప్రాతినిధ్యం వహించారు. 1970 ఎన్నికలలో జరిగిన హింస కారణంగా దెబ్బతిన్న తరువాత ఈ ముగ్గురు అధ్యక్ష మండలిని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.

పీపుల్సు రిపబ్లికు ఆఫ్ బెనిన్ జెండా

1972 మే 7 న, మాగా తన అధికారాన్ని అహోమదగ్బేకు అప్పగించాడు. 1972 అక్టోబరు 26 న లెఫ్టినెంటు కల్నలు మాథ్యూ కొరోకౌ పాలక త్రియుంవిరాటేను అధికారం నుండి పడగొట్టి తాను దేశానికి అధ్యక్షుడయ్యాడు. 1974 నవంబరు 30 న దేశం అధికారికంగా మార్క్సిస్టు దేశం అని ప్రకటించింది. మిలటరీ కౌన్సిలు ఆఫ్ ది రివల్యూషను (సిఎమ్ఆర్) నియంత్రణలో ఉంది. ఇది పెట్రోలియం పరిశ్రమ, బ్యాంకులను జాతీయం చేసింది. 1975 నవంబరు 30 న అతను దేశాన్ని పీపుల్సు రిపబ్లిక్కు ఆఫ్ బెనినుగా మార్చాడు.[25][26]

1979 లో సి.ఎం.ఆర్. రద్దు చేయబడింది. కారకో ఏర్పాటు చేసిన ఎన్నికలలో అతను మాత్రమే అనుమతించబడిన అభ్యర్థిగా ఉన్నాడు. అతను చైనా, ఉత్తర కొరియా, లిబియాతో సంబంధాలను ఏర్పరచుకుని దాదాపు అన్ని వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వ నియంత్రణలో ఉంచాడు. దీనివల్ల బెనిన్‌ఉలో విదేశీ పెట్టుబడులు శుష్కించాయి.[27] కోరకౌ విద్యను పునర్వ్యవస్థీకరించడానికి ప్రయత్నించాడు. "పేదరికం ఒక ప్రాణాంతకం కాదు" వంటి తన సొంత సూత్రాలను ప్రతిపాదించిన ఫలితంగా అనేక ఇతర నిపుణులతో పాటు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో దేశం విడిచిపోయారు.[27] మొదట సోవియటు యూనియను నుండి, తరువాత ఫ్రాన్సు నుండి అణు వ్యర్థాలను తీసుకోవటానికి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఈ పాలన ఆర్థికంగాస్వావలంబన కలిగి ఉంది.[27]

1980 లో కోర్కౌ ఇస్లాం మతంలోకి మారి తన మొదటి పేరును అహ్మదుగా మార్చుకున్నాడు. తరువాత అతను " క్రీస్తు తిరిగి జన్మించాడు " అని పేర్క్ని తన పేరును తిరిగి మార్చుకున్నాడు. 1989 లో తన సైన్యాన్ని చెల్లించడానికి తగినంత డబ్బు చెల్లించలేక పోయినందున దేశంలో అల్లర్లు చెలరేగాయి. బ్యాంకింగు వ్యవస్థ కుప్పకూలింది. చివరికి కోరకౌ మార్క్సిజాన్ని త్యజించాడు. ఈ సమావేశంలో రాజకీయ ఖైదీలను విడుదల చేసి ఎన్నికలు ఏర్పాటు చేయమని కోరకోను బలవంతం చేసింది.[27] ప్రభుత్వ విధానంగా ఉన్న మార్క్సిజం-లెనినిజం దేశం నుండి రద్దు చేయబడింది.[28]

1990 మార్చి 1 న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ రాజ్యాంగం పూర్తయిన తరువాత దేశం పేరు అధికారికంగా రిపబ్లిక్కు ఆఫ్ బెనినుగా మార్చబడింది.[29]

యాయి బోని 2006 అధ్యక్ష పదవీస్వీకరణోత్సవం

1991 ఎన్నికలలో కారకో నికోఫోరు సోగ్లో చేతిలో ఓడిపోయాడు. 1996 గెలిచిన తరువాత కోరకౌ తిరిగి అధికారంలోకి వచ్చాడు. 2001 లో దగ్గరి పోరుతో జరిగిన ఎన్నికలలో కారకో మరొక పదవీకాలం కొనసాగాడు. ఆ తరువాత అతని ప్రత్యర్థులు ఎన్నికల అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.

1999 లో అట్లాంటికు బానిస వ్యాపారంలో ఆఫ్రికన్లు పోషించిన పాత్రకు కొరోకౌ జాతీయ క్షమాపణలు జారీ చేశారు.[30]

2006 ఎన్నికలలో వయస్సు, అభ్యర్థుల మొత్తం నిబంధనల సంబంధిత రాజ్యాంగ పరిమితుల కారణంగా కొరోకౌ, మాజీ అధ్యక్షుడు సోగ్లో పోటీ చేయలేదు.

2006 మార్చి 2 న జరిగిన ఎన్నిక స్వేచ్ఛయుతమైనదిగా, న్యాయంగా నిర్వహించబడినట్లు పరిగణించబడింది. మార్చి 19 న రన్ ఆఫ్ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 6 న విజయం సాధించిన యాయీ బోనీ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. బెనిన్‌లో జరిగిన సరసమైన బహుళ పార్టీల ఎన్నికలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. 2011 లో బోనీ తిరిగి ఎన్నికయ్యాడు. మొదటి రౌండ్లో 53.18% ఓట్లను తీసుకున్నారు-ఇది రన్ఆఫ్ ఎన్నికలను నివారించడానికి సరిపోతుంది. 1991 లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిన తరువాత రన్ఆఫ్ లేకుండా ఎన్నికల్లో గెలిచిన మొదటి అధ్యక్షుడుగా బోనీ గుర్తింపు పొందాడు.

2016 మార్చిన అధ్యక్ష ఎన్నికలలో బోనిని రాజ్యాంగం మూడవసారి పోటీ చేయకుండా నిరోధించింది. వ్యాపారవేత్త ప్యాట్రిసు టాలోను 65.37% ఓట్లతో రెండవ రౌండ్లో గెలిచారు. ఇన్వెస్ట్మెంటు బ్యాంకరు, మాజీ ప్రధాన మంత్రి లియోనెలు జిన్సౌను ఓడించారు. 2016 ఏప్రెలు 6 న టాలోను ప్రమాణ స్వీకారం చేశారు.[31] రాజ్యాంగ న్యాయస్థానం ఫలితాలను ధ్రువీకరించిన అదే రోజున మాట్లాడిన టాలోను "రాజ్యాంగ సంస్కరణను మొట్టమొదటగా పరిష్కరిస్తానని" అన్నారు. స్థిరత్వం సాధించడానికి అధ్యక్షుల పదవీకాలం ఐదేళ్ల కాలానికి పరిమితం చేయాలనే తన ప్రణాళిక గురించి చర్చించారు. ప్రభుత్వ పరిమాణాన్ని 28 నుండి 16 మంది సభ్యులకు తగ్గించాలని యోచిస్తున్నట్లు అతను చెప్పారు.[32]

భౌగోళికం

[మార్చు]
Benin map of Köppen climate classification.

పశ్చిమ ఆఫ్రికాలో ఇరుకైన ఉత్తర-దక్షిణ భూభాగపట్టీగా ఉన్న బెనిన్ 6 ° - 13 ° ఉత్తర అక్షాంశం, 0 ° - 4 ° రేఖాంశం మద్య ఉంటుంది. బెనిన్ పశ్చిమసరిహద్దులో టోగో, ఉత్తరసరిహద్దులో బుర్కినా ఫాసో - నైజర్, తూర్పుసరిహద్దులో నైజీరియా, దక్షిణసరిహద్దులో బెనిన్ బైటు ఉన్నాయి. ఉత్తరసరిహద్దులో నైజరు నది నుండి దక్షిణసరిహద్దులో ఉన్న అట్లాంటికు మహాసముద్రం వరకు దూరం 650 కిమీ (404 మైళ్ళు) ఉంటుంది. తీరప్రాంతం 121 కిమీ (75 మైళ్ళు) ఉంది. దేశం వెడల్పు 325 కిమీ (202 మైళ్ళు) ఉంటుంది.

బెనిన్ ఉత్తరాన ఉన్న రెండు విభాగాలలో అటాకోరా ఒకటి
పశ్చిమ ఆఫ్రికాలోని ఇతర పెద్ద జంతువులకు బెనిన్ లోని చాలా ముఖ్యమైన నిల్వలలో ఒకటైన పెండ్జారి నేషనల్ పార్కు

బెనిన్ భౌగోళికంగా ఎత్తులో వైవిధ్యం తక్కువగా ఉంటుంది. దక్షిణప్రాంతం నుండి ఉత్తరప్రాంతాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఇది లోతట్టు ప్రాంతం, ఇసుక ప్రాంతం, తీర మైదానం (ఎత్తైన ఎత్తు 10 మీ (32.8 అడుగులు))ప్రాంతం (గరిష్ఠంగా 10 కిమీ ( 6.2 మైళ్ళు) వెడల్పు) ఉంటుంది. ఇది చిత్తడినేల, సరస్సులు, మడుగులతో సముద్రంతో అనుసంధానమై ఉంటుంది. తీరం వెనుక దక్షిణ బెనిన్ గినియా అటవీ-సవన్నా మొజాయికు-కప్పబడిన పీఠభూములు ఉన్నాయి (20 - 200 మీ (66 - 656 అడుగుల మధ్య ఎత్తు), ఇవి కౌఫో, జూ, ఓయుం నదులతో ఉత్తరం నుండి దక్షిణప్రాంతం వరకు లోయల ద్వారా విభజించబడింది.

రాతి కొండలతో నిండిన చదునైన భూమి వైశాల్యం 400 మీ (1,312 అడుగులు)ఉంది. ఇది నిక్కి, సేవ్ ప్రాంతాలకు విస్తరించి ఉంది.

పర్వతాల శ్రేణి వాయవ్య సరిహద్దు వెంట టోగో వరకు విస్తరించి ఉంది; ఇవి అటాకోరా. 658 మీ (2,159 అడుగులు) ఎత్తు ఉన్న మోంటు సోక్బారో దేశంలో ఎత్తైన ప్రదేశంగా గుర్తించబడుతుంది. బెనిన్లో ఫాలో పొలాలు, మడ అడవులు, పెద్ద అడవుల అవశేషాలు ఉన్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో పొదలతో నిండిన సవన్నా, భారీ బయోబాబు చెట్లతో నిండి ఉంది. నదీతీరాల ఒడ్డున అడవులు విస్తరించి ఉన్నాయి. బెనిన్ ఉత్తర - వాయవ్య ప్రాంతంలో " రిజర్వుడు డు డబ్ల్యు డు నైజరు ", " పెండ్జారి నేషనలు పార్కు " ఏనుగులు, సింహాలు, జింకలు, హిప్పోలు, కోతులతో పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.[33] పెండ్జారి నేషనలు పార్కు సరిహద్దులో అర్లి, నైజరు - బుర్కినా ఫాసోలోని " డబల్యూ ", అంతరించిపోతున్న పశ్చిమ ఆఫ్రికా సింహానికి ప్రధాన నివాసాలలో ఒకటిగా ఉంది. ఇక్కడ 356 (పరిధి: 246–466) సింహాలు ఉన్నాయి. డబ్ల్యూ-అర్లి-పెండ్జారిలో ఉన్న సింహాలు పశ్చిమ ఆఫ్రికాలో మిగిలిన అతిపెద్ద సింహాల జనాభాగా గుర్తించబడుతుంది.[34] బెనిన్ అంతరించిపోతున్న పెయింటు వేట కుక్క, లైకాను పిక్టసులకు నివాసంగా ఉంది.[35] అయినప్పటికీ ఇది స్థానికంగా నిర్మూలించబడిందని భావిస్తున్నారు.

వాతావరణం

[మార్చు]

బెనిన్ వాతావరణం వేడి, తేమతో ఉంటుంది. తీర ప్రాంతంలో వార్షిక వర్షపాతం సగటున 1300 మిమీ (51 అంగుళాలు) ఉంటుంది. బెనినులో సంవత్సరానికి రెండు వర్షాలు, రెండు పొడి సీజన్లను కలిగి ఉంటుంది. ప్రధాన వర్షాకాలం ఏప్రిల నుండి జూలై చివరి వరకు ఉంటుంది. సెప్టెంబరు చివరి నుండి నవంబరు వరకు తక్కువ వర్షపాతం తక్కువగా ఉంటుంది. ప్రధాన పొడి కాలం డిసెంబరు నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది, జూలై చివరి నుండి సెప్టెంబరు ఆరంభం వరకు చిన్న శీతల పొడి కాలం ఉంటుంది. ఉష్ణమండల తీరం వెంబడి ఉష్ణం - తేమ ఎక్కువగా ఉంటాయి. కోటోనౌలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 31 ° సెం (87.8 ° ఫా); కనిష్ఠ ఉష్ణోగ్రత 24 ° సెం (75.2 ° ఫా).[33]

సావన్నా, పీఠభూమి మీదుగాసాగే ఉత్తరంలోని సాహెలు వైపు వెళ్ళేటప్పుడు ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు పెరుగుతాయి. డిసెంబరు నుండి మార్చి వరకు సహారా నుండి వచ్చే పొడి గాలులను " హర్మాటను బ్లోసు " అని అంటారు. గడ్డి ఎండేసమయంలో ఇతర వృక్షాలు ఎర్రటి గోధుమ రంగులోకి మారుతాయి. దేశం అంతటిని చక్కటి ధూళి ముసుగు వెంటాడుతూ ఉంటుంది. దీనివల్ల ఆకాశం మేఘావృతమవుతుంది. ఇది రైతులు పొలాలలో పొదలను కాల్చే సీజనుగా కూడా ఉంటుంది.[33]

నైసర్గిక స్వరూపం

[మార్చు]
  • వైశాల్యం: 1,14,763 చదరపు కిలోమీటర్లు
  • రాజధాని: పోర్టో-నోవో
  • కరెన్సీ: సిఎఫ్‌ఎ ఫ్రాంక్
  • జనాభా: 1,03,23,000 (2015 నాటికి)
  • ప్రభుత్వం: ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
  • భాషలు: అధికారిక భాష - ఫ్రెంచ్, ఫాన్, యోరుబా, ఇతర ఆఫ్రికా భాషలు
  • మతం: 70% అనిమిస్ట్, 15% క్రైస్తవ, 13% ముస్లిములు
  • వాతావరణం: ఆగస్టులో 23 డిగ్రీలు, మార్చిలో 28 డిగ్రీలు
  • పంటలు: కస్సావా, యామ్స్, మొక్కజొన్న, గోధుమ, కాఫీ, పత్తి, పామ్, వేరుశనగ, చిలగడదుంపలు
  • పరిశ్రమలు: వ్యవసాయాధారిత పరిశ్రమలు, పామ్ ఆయిల్, దుస్తులు, కాటన్ జిన్నింగ్, కోకో
  • సరిహద్దులు: నైగర్, బుర్కినా, టోగో, నైజీరియా
  • స్వాతంత్ర్య దినోత్సవం: 1960, ఆగస్టు 1.

పరిపాలన

[మార్చు]
AliboriAtakoraBorgouDongaCollinesPlateauZouCouffoAtlantiqueOuéméMonoLittoral
Departments of Benin.

పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 12 భాగాలుగా విభజించారు. ఈ విభాగాలను డిపార్టుమెంట్‌లు అంటారు. ఈ డిపార్టుమెంట్‌లు తిరిగి 77 కమ్యూన్‌లుగా విభజింపబడ్డాయి. ఇవి పన్నెండు డిపార్టుమెంట్‌లు అలిచోరి, అటకోరా, అట్లాంటిక్, బోర్గు, కోలిన్స్, డోంగో, కౌఫో, లిట్టోరల్, మోనో, ఓవుమి, ప్లాటూ, జోవ్. బెనిన్ దేశంలో ప్రజలు ఎక్కువగా దేశపు దక్షిణ భాగంలోనే నివసిస్తారు. జనాభాలో అత్యధిక శాతం యువత ఉంది. దాదాపు 42 ఆఫ్రికన్ తెగలు ఈ దేశంలోనే ఉన్నాయి. యోరుబా, డెండి, బారిబా, ఫులా, బేటమ్మా రిబే, సోంబా, ఫాన్, అబోమీ, మీనా, జూడా, అజా తెగలు దేశంలో ప్రముఖమైనవి. ఈ దేశంలో భారతీయులు కూడా వివిధ వ్యాపార రంగాలలో ఉన్నారు.

పర్యాటకం

[మార్చు]

బెనిన్ దేశంలో పర్యాటక పరిశ్రమ పెద్దగా అభివృద్ధి చెందలేదు. అయినప్పటికీ, ప్రకృతి రమణీయత వల్ల ప్రతి ఏటా దాదాపు లక్షా ఏభై వేల పర్యాటకులు వస్తూ ఉంటారు. అబోమీ, రాజధాని పోర్టోనోవో, పెండ్‌జారి జాతీయ పార్కు, డబ్ల్యు జాతీయ పార్కు, కొటోనోవ్ నగరం చూడదగ్గ ప్రదేశాలు.

పోర్టో-నోవో

[మార్చు]

బెనిన్ దేశానికి పోర్టోనోవో రాజధాని. ఈ నగరాన్ని హాగ్‌బోనోవ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు ఫ్రెంచ్ దహోమీకి రాజధానిగా ఉండేది. ఈ నగరం ఒక డిపార్టుమెంటు, కమ్యూన్‌గా ఉంది. దీని వైశాల్యం 110 చదరపు కిలోమీటర్లు. ఈ నగరంలోనే శాసనసభ ఉంది. ఈ నగర పరిసరాలలో పామ్ ఆయిల్ తోటలు, పత్తి పంటలు ఎక్కువ. ఈ నగరంలో పోర్టోనోవో మ్యూజియం ఉంది. ఇందులో గత కాలపు రాజులు ఉపయోగించిన అనేక వస్తువులు, దుస్తులు ఉన్నాయి. టోఫా రాజ భవనం కూడా ఇక్కడ ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.ఈ ప్రాంతపు మొట్టమొదటి రాజు విగ్రహం ఈ నగరంలో ఉంది. గవర్నర్ రాజభవనం ఒక విశాలమైన భవనం. ప్రస్తుతం ఈ భవనమే శాసనసభా భవనంగా ఉపయోగపడుతోంది. పోర్టోనోవో మసీదు మరో చూడదగిన పెద్ద భవనం.

కొటోనోవ్ నగరం

[మార్చు]

ఇది బెనిన్ దేశంలో అతి పెద్ద నగరం. నగరంలో దాదాపు 8 లక్షల జనాభా ఉంది. ఇది అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉంది. ఇక్కడ ఓడరేవు కూడా ఉంది. ఈ నగరం ఆర్థిక రాజధానిగా ఉండడం వల్ల ఇక్కడ అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. దేశం మొత్తానికి ఇదే పెద్ద ఓడరేవు పట్టణం. ఎగుమతులు, దిగుమతులు అన్నీ ఇక్కడి నుండే జరుగుతాయి. ఈ నగరంలో ఫ్రెండ్‌షిప్ స్టేడియం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇంకా కొటోనోవ్ కాథెడ్రల్, కొటోనోవ్ సెంట్రల్ మాస్క్, పురాతన బెనిన్ జాతీయ విశ్వవిద్యాలయం ఉన్నాయి.ఈ నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణ - మోటారు సైకిల్ టాక్సీలు లభించడం. పూర్వం ఈ నగరాన్ని దమోమీ రాజులు పరిపాలించారు. 1851లో ఫ్రెంచ్‌వాళ్లు దీనిని ఆక్రమించారు.

పెండ్‌జారి జాతీయ పార్కు

[మార్చు]

ఈ జాతీయ పార్కు దేశానికి ఉత్తర- పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది పెండ్ జారీ నది తీరంలో ఉండడం వల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో కొండలు, కోనలు, రాతి పర్వతాలు ఉన్నాయి. ఎంతో సహజమైన పార్కుగా ఇది పేరు గాంచింది. ఈ పార్కులో అనేక రకాల జంతుజాలాలు ఉన్నాయి. సవన్నా గడ్డి మైదానాలు కూడా ఈ పార్కులో ఉన్నాయి. ఆఫ్రికన్ చీతాలు, ఆఫ్రికన్ సింహాలు, వేటాడే కుక్కలు, చిరుత పులులు, మచ్చల హైనాలు, చారల నక్కలు, ఆఫ్రికన్ కెవెట్‌లు ఉన్నాయి. ఈ పార్కులో దాదాపు 800 ఏనుగులు ఉన్నాయి. అలాగే హిప్పోలు వేలాదిగా ఉన్నాయి. ఇంకా అడవి దున్నలు, ఆంటిలోప్‌లు, బబూన్‌లు, కోతులు వేల సంఖ్యలో ఉన్నాయి. అలాగే వందలాది పక్షి జాతులు కూడా ఈ జాతీయ పార్కులో ఉన్నాయి.

అబోమీ నగరం

[మార్చు]

ఈ నగ రాన్ని 17-19 శతాబ్దాల మధ్యన ఫాన్ తెగ రాజులు పరిపాలించారు. నగరం చుట్టూ మట్టి గోడ కట్టి ఉంటుంది. దీని చుట్టుకొలత దాదాపు ఆరు మైళ్లు ఉంటుంది. మట్టిగోడకు ఆరు చోట్ల ఆరు గేట్లు ఉన్నాయి. ఈ గోడ బయటి భాగంలో లోతైన కందకం ఉంటుంది. దీనిలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. ఈ కందకంలో తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి ఉంటాయి. నగరం అంతా విచిత్రంగా విభజింపబడి ఉంటుంది. అనేక రాజభవనాలు, ప్రజలకు గ్రామాలు, మార్కెట్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని యునెస్కో ్రపపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. సా.శ. 1625 నుండి సా.శ.1900 వరకు ఈనగరాన్ని రాజధానిగా చేసుకుని దాదాపు 12 మంది రాజులు పరిపాలన చేశారు.

ఆర్ధికం

[మార్చు]
Benin Exports by Product (2014) from Harvard Atlas of Economic Complexity.
Extensive agriculture in north of Benin, near Djougou.

బెనిన్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పత్తి ఉత్పత్తి, ప్రాంతీయ వాణిజ్యం మీద ఆధారపడి ఉంటుంది. పత్తి జిడిపిలో 40% భాగస్వామ్యం వహిస్తూ అధికారిక ఎగుమతి 80% నికి భాగస్వామ్యం వహిస్తుంది.[36] గత ఏడు సంవత్సరాలలో ఉత్పత్తి వృద్ధి సగటున 5%గా ఉంది. కాని వేగవంతమైన జనాభా పెరుగుదల కారణంగా ఈ పెరుగుదల చాలా తగ్గింది.[ఎప్పుడు?] గత కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం తగ్గించబడింది. బెనిన్ సి.ఎఫ్.ఎ. ఫ్రాంకును ఉపయోగిస్తుంది, ఇది యూరోకు అనుసంధానించబడింది.

బెనిన్ ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరాలలో బలోపేతం చేయబడుతూనే ఉంది. 2008 - 2009 లో జిడిపి వృద్ధి వరుసగా 5.1% - 5.7% ఉన్నట్లు అంచనా వేయబడింది. వ్యవసాయ రంగం వృద్ధికి ప్రధాన కారణంగా ఉంది. ప్రధాన ఎగుమతిగా పత్తి ఉంది. సేవారంగం జిడిపిలో అత్యధిక భాగం వహిస్తూ ఉంది. బెనిన్ భౌగోళిక ప్రాధాన్యత దాని పొరుగు రాజ్యాలతో వాణిజ్యం, రవాణా, పర్యాటక కార్యకలాపాలకు అవకాశం కలుగజేస్తుంది.[37]

ఉత్తర బెనినులో పత్తి క్షేత్రం

బెనిన్ ఆర్థిక వృద్ధిని పెంచడానికి మరింత విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, పర్యాటకానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి, కొత్త ఆహార తయారీ వ్యవస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి వీలు కల్పించాలని ప్రణాళిక వేస్తుంది. కొత్త సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని యోచిస్తోంది. వాణిజ్యరంగం అభివృద్ధి చేయడానికి భూమి మంజూరులో సంస్కరణలు, న్యాయవ్యవస్థను సంస్కరించడం, ఫైనాంసు విధానంలో మార్పులు తీసుకు వచ్చి ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి 2006 ఫిబ్రవరిలో బెనిన్ $ 307 మిలియన్ల అమెరికా డాలర్ల మిలీనియం ఛాలెంజి అకౌంటు గ్రాంటు " కు సంతకం చేసింది.[38]

పారిసు క్లబు, ద్వైపాక్షిక రుణదాతలు బాహ్య రుణ పరిస్థితిని సరళీకరించారు. బెనిన్ 2005 జూలైలలో ప్రకటించిన జి 8 రుణ తగ్గింపు నుండి లబ్ది పొందారు. అదే సమయంలో మరింత వేగంగా నిర్మాణాత్మక సంస్కరణల కోసం ఒత్తిడి అధికం అయింది. దేశీయ విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకున్నప్పటికీ తగినంత విద్యుత్తు సరఫరా బెనిన్ ఆర్ధిక వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.[39]

బెనిన్లోని కార్మిక సంఘాలు అధికారిక శ్రామికశక్తిలో 75% వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మహిళల వేతన సమానత్వం లేకపోవడం, బాల కార్మికుల వాడకం, వంటి సమస్యలను కొనసాగుతున్నాయి. " అంతర్జాతీయ ట్రేడు యూనియను కాన్ఫెడరేషను (ఐటిసియు)" అనధికారిక ఆర్థిక వ్యవస్థ, వెట్టిచాకిరి సమస్య ఉనికిని గుర్తించింది.[40]

బెనిన్ ఆఫ్రికాలో " హార్మోనైజేషన్ ఆఫ్ బిజినెస్ లా (ఓహాడా)" లో సభ్యదేశంగా ఉంది.[41]

కోటోనౌ నగరంలో దేశం ఏకైక ఓడరేవు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. కోటోనౌ పోర్టో నోవో మధ్య కొత్త ఓడరేవు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. బెనిన్ రెండు లేన్ల తారు రహదారుల ద్వారా దాని పొరుగు దేశాలతో (టోగో, బుర్కినా ఫాసో, నైజర్, నైజీరియా) అనుసంధానించబడి ఉంది. వివిధ ఆపరేటర్ల ద్వారా దేశవ్యాప్తంగా మొబైలు టెలిఫోను సేవ అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎ.డి.ఎస్.ఎల్. కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. బెనిన్ ఉపగ్రహ కనెక్షన్ల ద్వారా (1998 నుండి), ఏక కేబుల్ శాట్-3 (2001 నుండి) ద్వారా ఇంటర్నెటుతో అనుసంధానించబడి ఉంది. డేటా ధరను చాలా ఎక్కువగా ఉంచుతుంది. 2011 లో ఆఫ్రికా కోస్టు టు యూరపు కేబులు ప్రారంభించడంతో మరింత అభివృద్ధి సాధించవచ్చని భావించబడింది.

గత రెండు దశాబ్దాలుగా జిడిపి వృద్ధి రేటు 4-5% స్థిరంగా ఉన్నప్పటికీ, పేదరికం పెరుగుతోంది.[42] బెనిన్లోని " నేషనలు ఇన్స్టిట్యూటు ఆఫ్ స్టాటిస్టిక్సు అండు ఎకనామికు అనాలిసిసు ప్రకారం " దారిద్య్రరేఖలో నివసిస్తున్న వారు 2011 లో 36.2% ఉండగా 2015 నాటికి 40.1% అధికరించారు.[43]

గణాంకాలు

[మార్చు]
Children in Benin.
Population[7]
Year Million
1950 2.2
2000 6.8
2016 10.9

బెనిన్ ప్రజలలో అధిక భాగం దక్షిణాదిలో నివసిస్తున్నారు. జనాభా యువత అధికంగా ఉన్నారు. ప్రజల ఆయుఃపరిమితి 62 సంవత్సరాలు. [39] ఈ దేశంలో సుమారు 42 ఆఫ్రికన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఈ సమూహాలు వేర్వేరు సమయాలలో బెనినులో వలస వచ్చి స్థిరపడ్డారు. ఈ సమూహాలలో ఆగ్నేయంలో నివసించే యోరుబా (12 వ శతాబ్దంలో నైజీరియా నుండి వలస వచ్చింది); ఉత్తర-మధ్య ప్రాంతంలోని డెండి (16 వ శతాబ్దంలో మాలి నుండి వచ్చినవారు); ఈశాన్యంలో బారిబా, ఫులా; అటాకోరా శ్రేణిలోని బేతమారిబే, సోంబా; సౌత్ సెంట్రలులోని అబోమీ చుట్టుపక్కల ప్రాంతంలోని ఫాను; మినా, క్సుడా, అజా (టోగో నుండి వచ్చినవారు) ప్రజలు ఉన్నారు.[33]

ఇటీవలి వలసలు ఇతర ఆఫ్రికా జాతీయులను బెనినుకు తీసుకువచ్చాయి. ఇందులో నైజీరియన్లు, టోగోలీలు, మాలియన్లు ఉన్నారు. విదేశీ సమాజంలో లెబనీయులు, భారతీయులు వాణిజ్యంలో పాల్గొన్నారు. ఐరోపియన్లు 5500 మంది అనేక ఐరోపా రాయబార కార్యాలయాలు, విదేశీ సహాయ కార్యకలాపాలు, ప్రభుత్వేతర సంస్థలు, వివిధ మిషనరీ సమూహాల సిబ్బందిగా ఉన్నారు.[33] బెనిను ప్రజలలో ఉన్న ఐరోపా జనాభాలో ఒక చిన్న భాగం ఫ్రెంచి వంశానికి చెందిన వారు ఉన్నారు.

Religion in Benin (CIA World Factbook estimate 2013)[44]

  Christianity (48.5%)
  Islam (27.7%)
  Others / None (12.2%)
  Vodun (11.6%)
A Celestial Church of Christ baptism in Cotonou. Five percent of Benin's population belongs to this denomination, an African Initiated Church.

2002 జనాభా గణాంకాల ఆధారంగా బెనిన్ ప్రజలలో 42.8% మంది క్రైస్తవులు (27.1% రోమను కాథలిక్కు, 5% సెలెస్టియలు చర్చి ఆఫ్ క్రైస్టు, 3.2% మెథడిస్టు, 7.5% ఇతర క్రైస్తవ వర్గాలు), 24.4% ముస్లింలు, 17.3% వోడున్లు, 6% ఇతర స్థానిక సాంప్రదాయ మతాలను ఆచరించే వారు ఉన్నారు. 1.9% ఇతర మతాలను ఆచరించేవారు, 6.5% మంది నాస్థికులు ఉన్నారు.[45] 2011-2012 లో ఆరోగ్య సర్వే కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ సర్వేలో క్రైస్తవ మతం 57.5%కి (కాథలిక్కులు 33.9%, మెథడిస్టులు 3.0%, ఖగోళాలు 6.2%, ఇతర క్రైస్తవులు 14.5%) అధికరించారు. ముస్లింలు 22.8%కి తగ్గారు.[46]

అటకోరా (అటకోరా, డోంగా ప్రావిన్సులు)ప్రాంతంలోని సాంప్రదాయ మతాలలో స్థానిక ఆనిమిస్టికు మతాలు ఉన్నాయి. మద్య - దక్షిణ ప్రాంతంలోని యోరుబాలోని వోడును, ఒరిషా ప్రాంతాలలో టోడో ప్రజలు ఉన్నారు. మధ్య తీరంలో ఓయిడా పట్టణం బెనినెసు వోడున్ల ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది.

ప్రస్తుతం దక్షిణ - మధ్య ప్రాంతాలలోని అటకోరాలోని ఒట్టమ్మరి ప్రాంతాలలో క్రైస్తవ మతం అతిపెద్ద మతంగా ఉంది. దేశంలో సోంగ్హై సామ్రాజ్యం, హౌసా వ్యాపారులు ప్రవేశపెట్టిన ఇస్లాం ప్రస్తుతం అలీబోరి, బోర్గౌ, డోంగా ప్రావిన్సులలో అధికంగా ఆచరించబడుతుంది. అలాగే యోరుబాలో క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు అధికంగా ఉన్నారు. అయినప్పటికీ చాలామంది వోడును, ఒరిషా నమ్మకాలను కొనసాగిస్తున్నారు. వోడును, ఒరిషా క్రైస్తవ మతంలో చేరారు. 19 వ శతాబ్దంలో ఉద్భవించిన అహ్మదీయ ముస్లిం సమాజం కూడా ఒక ముఖ్యమైన అల్పసంఖ్యాక మతంగా ఉంది.

విద్య

[మార్చు]
బెనిన్ విద్యార్థులు

బెనిన్లో అక్షరాస్యత రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది: 2015 లో ఇది 38.4% (పురుషుల అక్షరాస్యత శాతం 49.9%, స్త్రీల అక్షరాస్యతా శాతం27.3%) గా అంచనా వేయబడింది.[39] బెనిన్ సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించింది. 2013 లో మాధ్యమిక విద్యలో సగం మందికంటే అధికమైన పిల్లలు (54%) చేరారు అని " యునెస్కో ఇన్స్టిట్యూటు ఫర్ స్టాటిస్టిక్సు " తెలిపింది.

బెనినులో ఒక సమయంలో విద్యా విధానం ఉచితం కానప్పటికీ,[47] ప్రస్తుత బెనిన్ ప్రభుత్వం పాఠశాల ఫీజులను రద్దు చేసింది. 2007 ఎడ్యుకేషనలు ఫోరం సిఫారసులను పరిశీలనకు తీసుకుంటుంది.[48]

2009 నుండి ప్రభుత్వం విద్య కొరకు జిడిపిలో 4% కంటే అధికనిధులు కేటాయించింది. 2015 లో విద్యపై ప్రభుత్వ వ్యయం (అన్ని స్థాయిలు) జిడిపిలో 4.4% అని " యునెస్కో ఇన్స్టిట్యూటు ఫర్ స్టాటిస్టిక్సు " తెలిపింది. ఈ వ్యయంలో బెనిన్ తృతీయ స్థాయి విద్యకు చాలా ఎక్కువ వాటాను కేటాయించారు: జిడిపిలో 0.97%.[49]

2009 - 2011 మధ్యకాలంలో విశ్వవిద్యాలయంలో చేరిన యువకుల వాటా 18-25 సంవత్సరాల వయస్సు విద్యార్థులలో 10% నుండి 12%కి పెరిగింది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక నిష్పత్తులలో ఒకటి. 2006 - 2011 మధ్య తృతీయ విద్యలో విద్యార్థుల నమోదు 50,225 నుండి 1,10,181 కు రెట్టింపు అయ్యింది. ఈ గణాంకాలు బ్యాచిలరు, మాస్టర్సు, పిహెచ్.డి, నాన్-డిగ్రీ పోస్ట్-సెకండరీ డిప్లొమా విద్యార్థులు చేర్చబడ్డారు.[49]

సైంసు, సాంకేతికత

[మార్చు]

జాతీయ విధానం

[మార్చు]

ఉన్నత విద్య శాస్త్రీయ పరిశోధన మంత్రిత్వ శాఖ సైన్సు పాలసీని అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. " నేషనలు డైరెక్టరేటు ఆఫ్ సైంటిఫికు అండు టెక్నలాజికలు రీసెర్చి " ప్రణాళిక, సమన్వయాన్ని నిర్వహణాబాధ్యత వహిస్తుంది. నేషనలు కౌన్సిలు ఫర్ సైంటిఫికు అండు టెక్నికలు రీసెర్చి & నేషనలు అకాడమీ ఆఫ్ సైన్సెసు - ఆర్ట్సు, లెటర్సు ద్వారా సలహా అందించే పాత్ర పోషిస్తాయి. బెనిను నేషనలు ఫండు ఫర్ సైంటిఫికు రీసెర్చి అండు టెక్నలాజికలు ఇన్నోవేషను నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. బెనిన్ ఏజెన్సీ పరిశోధన ఫలితాల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణల కొరకు కృషిచేస్తూ పరిశోధన ఫలితాల అభివృద్ధిని సాంకేతిక బదిలీకి బాధ్యత వహిస్తుంది.[49]

2006 నుండి దేశం మొదటి సైన్సు పాలసీని తయారుచేసే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్కు అభివృద్ధి చెందింది. ఇది అప్పటి నుండి సైన్సు, ఆవిష్కరణలపై కొత్త గ్రంథాల ద్వారా నవీకరించబడి సంపూర్ణంగా ఉంది (దత్తత తీసుకున్న సంవత్సరం బ్రాకెట్ల మధ్య ఉంది):[49]

  • నిర్మాణాత్మక పరిశోధన, సంస్థలను పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి ఒక మాన్యువల్ (2013);
  • పరిశోధనా కార్యక్రమాలు, ప్రాజెక్టులను ఎలా ఎంచుకోవాలి, పోటీ నిధుల కోసం నేషనలు ఫండు ఫర్ సైంటిఫికు రీసెర్చి అండు టెక్నలాజికల్ ఇన్నోవేషను (2013) కు ఎలా దరఖాస్తు చేయాలనే దానిపై ఒక మాన్యువల్;
  • శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలకు నిధులు సమకూర్చే ముసాయిదా చట్టం, శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణల కోసం * ముసాయిదా నియమావళి రెండూ 2014 లో సుప్రీంకోర్టుకు సమర్పించబడ్డాయి;
  • శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణల కోసం ఒక వ్యూహాత్మక ప్రణాళిక (2015 లో అభివృద్ధిలో ఉంది).

ఇప్పటికే ఉన్న పాలసీ పత్రాలలో సైన్సును ఏకీకృతం చేయడానికి బెనిన్ చేసిన ప్రయత్నాలు కూడా అంతే ముఖ్యమైనవి:

  • బెనిన్ డెవలప్మెంటు స్ట్రాటజీసు 2025: బెనిను 2025 అలఫియా (2000);
  • పేదరికం తగ్గింపుకు వ్యూహం 2011–2016 (2011);
  • విద్యా రంగానికి పదేళ్ల అభివృద్ధి ప్రణాళికలో 3 వ దశ 2013–2015;
  • ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధన కోసం అభివృద్ధి ప్రణాళిక 2013–2017 (2014).

2015 లో బెనినులో శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్న రంగాలు: ఆరోగ్యం, విద్య, నిర్మాణం, నిర్మాణ సామగ్రి, రవాణా, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటక, హస్తకళలు, పత్తి / వస్త్రాలు, ఆహారం, శక్తి, వాతావరణ మార్పు.[49]

బెనిన్లో పరిశోధన, అభివృద్ధి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు:[49]

  • పరిశోధన కోసం అననుకూల సంస్థాగత చట్రం: బలహీనమైన పాలన, పరిశోధనా నిర్మాణాల మధ్య సహకారం లేకపోవడం, పరిశోధకుల స్థితిపై అధికారిక పత్రం లేకపోవడం;
  • చాలని మానవ వనరులు, పరిశోధకులకు ఎటువంటి ప్రేరణ విధానం లేకపోవడం;,
  • పరిశోధన, అభివృద్ధి అవసరాల మధ్య అసమతుల్యత.

పరిశోధనలో మానవ వనరులు, ఆర్ధిక నిధుల అందుబాటు

[మార్చు]

2007 లో బెనిన్ 1,000 మంది పరిశోధకులు (హెడ్‌కౌంట్లలో) ఉన్నట్లు గణాంచబడింది. ఇది మిలియను నివాసులకు 115 మంది పరిశోధకుల నిష్పత్తిలో ఉంటుంది. బెనిన్లోని ప్రధాన పరిశోధనా నిర్మాణాలలో " సెంటరు ఫర్ సైంటిఫికు అండు టెక్నికలు రీసెర్చి, నేషనలు ఇన్స్టిట్యూటు ఆఫ్ అగ్రికల్చరలు రీసెర్చి, నేషనలు ఇన్స్టిట్యూటు ఫర్ ట్రైనింగు & రీసెర్చి ఇన్ ఎడ్యుకేషను, ఆఫీసు ఆఫ్ జియోలాజికలు అండు మైనింగు రీసెర్చి, సెంటరు ఫర్ ఎంటొమోలాజికలు రీసెర్చి ప్రాధాన్యత వహిస్తున్నాయి.[49]

2014 లో ప్రపంచ బ్యాంకు తన సెంటర్సు ఆఫ్ ఎక్సలెన్సు ప్రాజెక్టులో పాల్గొనడానికి, అనువర్తిత గణితంలో నైపుణ్యం పెంపొందించడానికి అబోమీ-కాలావి విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రపంచ బ్యాంకు బెనినుకు 8 మిలియన్ల అమెరికా డాలర్ల రుణాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న పశ్చిమ ఆఫ్రికాలోని 19 విశ్వవిద్యాలయాలలో విజ్ఞాన-భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడానికి అసోసియేషన్ ఆఫ్ ఆఫ్రికన్ విశ్వవిద్యాలయాల నిధులు కూడా వచ్చాయి.[49]

పరిశోధన, అభివృద్ధిలో బెనిన్ పెట్టుబడి స్థాయిపై డేటా అందుబాటులో లేదు:[49]

2013 లో ప్రభుత్వం జిడిపిలో 2.5% ప్రజారోగ్యానికి కేటాయించింది. పశ్చిమ ఆఫ్రికా దేశాల ఎకనామికు కమ్యూనిటీ (ఎకోవాసు) సంయుక్త చొరవలో భాగంగా, 2014 డిసెంబరులో 150 స్వచ్ఛంద ఆరోగ్య నిపుణులు బెనిన్, కోటు డి ఐవోయిరు, ఘనా, మాలి, నైజరు, నైజీరియా నుండి గినియా, లైబీరియా, సియెర్రా లియోన్లకు వెళ్లారు. దాని ప్రత్యేక ఏజెన్సీ అయిన " వెస్టు ఆఫ్రికన్ హెల్త్ ఆర్గనైజేషను " అంటువ్యాధిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఎబోలా మహమ్మారి పశ్చిమ ఆఫ్రికా ఆరోగ్య వ్యవస్థలలో దీర్ఘకాలిక పెట్టుబడుల విషాదకరమైన రిమైండరుగా మారింది.[49]

2003 లో మాపుటో డిక్లరేషనులో ఆఫ్రికన్ యూనియన్ సభ్యులు ఈ ప్రాంతానికి కనీసం 10% జిడిపిని ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ బెనిన్ ప్రభుత్వం 2010 లో జిడిపిలో 5% కన్నా తక్కువ వ్యవసాయ అభివృద్ధికి కేటాయించింది. 2014 లో ఈక్వటోరియలు గినియాలో ఆమోదించిన మాలాబో డిక్లరేషనులో వారు ఈ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. తరువాతి ప్రకటనలో వారు తమ జాతీయ బడ్జెట్లలో 10% వ్యవసాయ అభివృద్ధికి కేటాయించాలనే ఉద్దేశ్యాన్ని పునరుద్ఘాటించారు. వ్యవసాయ ఉత్పాదకతను రెట్టింపు చేయడం, పంటకోత నష్టాన్ని సగానికి తగ్గించడం వంటి లక్ష్యాల కొరకు కృషిచేయడానికి అంగీకరించారు. ఆఫ్రికా అంతటా పంటనష్టం 10% నికి తగ్గింది. ఈక్వటోరియలు గినియాలో ఆఫ్రికను నాయకుల సమావేశం 10% లక్ష్యానికి సాధారణ ప్రమాణాల పరిష్కరించడం గురించి చర్చించడంలో విఫలమైంది. [50]

రీసెర్చి ఫలితాలు

[మార్చు]

థామ్సను రాయిటర్సు వెబు ఆఫ్ సైన్సు, సైన్సు సైటేషను ఇండెక్సు ప్రకారం, పశ్చిమ ఆఫ్రికాలోని శాస్త్రీయ పత్రికాప్రచురణలో బెనిన్ 3 వ స్థానంలో ఉంది. ఈ డేటాబేస్లో 2014 లో జాబితా చేయబడిన మిలియను నివాసితులకు 25.5 శాస్త్రీయ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గాంబియా 65.0, కేప్ వర్దే 49.6, సెనెగలు 23.2, ఘనా 21.9 తో శాత్రీయ ప్రచురణలు ఉన్నాయి. ఈ డేటాబేస్లోని ప్రచురణల పరిమాణం 2005 - 2014 మధ్య 86 నుండి 270 వరకు మూడు రెట్లు పెరిగింది. 2008 - 2014 మధ్యకాలంలో బెనిన్ ప్రధాన శాస్త్రీయ సహకారులలో ఫ్రాన్సు (529 వ్యాసాలు), యునైటెడు స్టేట్సు (261), యునైటెడు కింగ్‌డం (254), బెల్జియం (198) జర్మనీ (156) ప్రచురించాయి.[49]

రవాణా

[మార్చు]

బెనిను రవాణా వ్యవస్థలో రహదారి, రైలు, నీరు, వాయు రవాణా భాగంగా ఉన్నాయి. బెనిను మొత్తం 6,787 కి.మీ రహదారిని కలిగి ఉంది. వీటిలో 1,357 కి.మీ. పొడవైన పాదచారుల బాట నిర్మించిన 10 ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి. ఇది 5,430 కి.మీ పాదచారుల బాట వేయని రహదారి ఉంటుంది. ట్రాన్సు-వెస్టు ఆఫ్రికను తీర రహదారి బెనిను దాటి, తూర్పున నైజీరియాతో, పశ్చిమాన టోగో, ఘనా, ఐవరీ కోస్టులను అనుసంధానిస్తుంది. లైబీరియా, సియెర్రా లియోన్లలో నిర్మాణం పూర్తయిన తరువాత పశ్చిమ ఆఫ్రికా దేశాల (ఎకోవాస్) దేశాల ఏడు ఇతర పశ్చిమదేశాలకు కొనసాగించబడింది. పాదచారిబాట నిర్మించిన రహదారి బెనిన్ను ఉత్తరం వైపు నైజరు దేశం ద్వారా బుర్కినా ఫాసో, వాయవ్య దిశలో మాలిని కలుపుతుంది.

బెనినులో రైలు రవాణాలో 578 కిమీ (359 మైళ్ళు) సింగిలు ట్రాకు, 1,000 ల (3, 3 3 3 ⁄ 8 మీటరు) మీటరు గేజి రైలు మార్గాలు ఉన్నాయి. ఈ సమయంలో బెనిన్ ప్రక్కనే ఉన్న దేశాలతో రైల్వే సంబంధాలను పంచుకోలేదు. అయితే బెనిన్ను నైజరు, నైజీరియాతో అనుసంధానించే అంతర్జాతీయ మార్గాలు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టోగో, బుర్కినా ఫాసోలకు మరింత అనుసంధానం ప్రణాళికలు ప్రకటించబడ్డాయి. ఆఫ్రికా రైలు ప్రాజెక్టులో బెనిను పాల్గొంటుందని భావించబడింది.

కోటోనౌ వద్ద ఉన్న " కాడ్జెహౌను విమానాశ్రయం " అక్ర, నియామీ, మన్రోవియా, లాగోస్, ఔగడౌగౌ, లోమే, డౌలాతో పాటు ఆఫ్రికాలోని ఇతర నగరాలకు ప్రత్యక్ష అంతర్జాతీయ జెటు సేవా సౌకర్యాలు అందిస్తుంది. కలిగి ఉంది. పారిసు, బ్రసెల్సు, ఇస్తాంబులు దేశాలకు ప్రత్యక్ష ప్రయాణ సేవలు అందించబడుతుంటాయి.

ఆరోగ్యం

[మార్చు]

2013 లో బెనినులో ఎయిడ్సు శాతం 15-49 సంవత్సరాల వయస్సు గల పెద్దలలో 1.13% ఉన్నట్లు అంచనా వేయబడింది.[51] బెనినులో మలేరియా ఒక సమస్య, ఇది 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అనారోగ్యం, మరణాలకు ప్రధాన కారణంగా ఉంటుంది.[52]

1980 లలో దేశ జనాభాలో 30% కన్నా తక్కువ మందికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అత్యధిక మరణాల రేటు ఉన్న దేశాలలో బెనిన్ ఒకటి. శిశు మరణాల రేటు ప్రతి 1000 సజీవ జననాలకు 203 మరణాలు సంభవిస్తున్నాయి. ముగ్గురు తల్లులలో ఒకరికి మాత్రమే ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉన్నాయి. సమాజ-ఆధారిత ఆరోగ్య సంస్కరణను ప్రవేశపెట్టడం ద్వారా బమాకో ఇనిషియేటివు దానిని నాటకీయంగా మార్చిది. ఫలితంగా మరింత సమర్థవంతంగా, సమానమైన సేవలను అందించారు.[53] 2015 నాటికి బెనిన్ ప్రపంచంలో 26 వ అత్యధిక ప్రసూతి మరణాలు సంభవించాయి.[54] 2013 యునిసెఫు నివేదిక ప్రకారం 13% మంది మహిళలు స్త్రీ జననేంద్రియ వైకల్యానికి గురయ్యారు.[55] ఆరోగ్య సంరక్షణ సూచికలలో తదుపరి మెరుగుదల, ఆరోగ్య సంరక్షణ సామర్థ్యం, వ్యయంలో మెరుగుదలతో ఆరోగ్య సంరక్షణ అన్ని రంగాలకు సమగ్ర విధాన వ్యూహం విస్తరించబడింది.[56] 1996 నుండి బెనినులో మూడు సర్వేలను పూర్తి చేశాయి.[57]

సంస్కృతి

[మార్చు]
Palais Des Congres in Cotonou.

దుస్తులు

[మార్చు]

యువతీ యువకులు పాశ్చాత్యశైలి దుస్తులు ధరిస్తారు. గ్రామీణ ప్రాంత మహిళలు షర్టు, స్కర్టు ధరిస్తారు. తలకు టోపీ లాంటిది పెట్టుకుంటారు. కుటుంబంలో మహిళలకు ప్రాముఖ్యత ఇస్తారు. వీరు వ్యవసాయ పనుల్లో ముందుంటారు. మార్కెట్లు, షాపులను బాగా నడుపుతారు. వివాహ సమయంలో వధువు ప్రత్యేకమైన దుస్తులు తొడుక్కోవడంతోపాటు రకరకాల పూసల దండలను మెడలోనూ, తలకు ధరిస్తారు. పట్టణాలలో నివసించేవారు ప్యాంటు, షర్టు ధరిస్తారు.

కళలు

[మార్చు]
Traditional music group.

ఫ్రెంచి ఆధిపత్య భాషగా మారడానికి చాలా కాలం ముందు బెనిను సాహిత్యం బలమైన మౌఖిక సంప్రదాయాన్ని కలిగి ఉంది.[58] 1929 లో ఫెలిక్సు కొచోరో మొట్టమొదటి బెనిను నవల ఎల్ ఎస్క్లేవు (ది స్లేవు) రాశారు.

స్వాతంత్ర్యం తరువాత దేశం ఒక శక్తివంతమైన వినూత్న సంగీతానికి నిలయంగా ఉంది. ఇక్కడ స్థానిక జానపద సంగీతంలో ఘనా హైలైఫు, ఫ్రెంచి క్యాబరేటు, అమెరికన్ రాకు, ఫానికి అండు సోలు, కాంగో రుంబాలు భాగంగా ఉన్నాయి.

2010 లో బెనినులో అనేక సంస్థలను, కళాకారులతో ప్రాజెక్టులను కొనసాగిస్తున్న బిన్నెలే బెనిన్ "రిగార్డు బెనిను" అనే సహకార కార్యక్రమంగా ప్రారంభమైంది. 2012 లో ఈ ప్రాజెక్టు స్థానిక సంఘాల సమాఖ్య అయిన కన్సార్టియం సమన్వయంతో ద్వైవార్షికంగా మారింది. 2012 బిన్నెలే బెనిను అంతర్జాతీయ ప్రదర్శన, కళాత్మక కార్యక్రమాన్ని అబ్దుల్లా కర్రోం, క్యురేటోరియలు ప్రతినిధి బృందం పర్యవేక్షిస్తుంది.

జార్జెసు అడాగ్బో, మెస్చాకు గాబా, రొమువాల్డు హజౌమా, డొమినికు జింక్పే, ఎమో డి మెడిరోసు వంటి అనేక బెనిను కళాకారులు అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

పేర్లు

[మార్చు]

చాలామంది దక్షిణప్రాంత బెనిను ప్రజలు " అకాను ఆధారిత పేర్లు " (వారు పుట్టిన వారం పేరులో చేర్చబడుతుంది) పెడుతుంటారు. ఇది అకాను ప్రభావిత ప్రాంతాలలో ఉన్న అక్వాం, ఇతర ప్రజలు ఇలాంటి పేర్లు నిర్ణయిస్తారు.[59]

భాషలు

[మార్చు]

స్థానిక భాషలను ప్రాథమిక పాఠశాలలలో బోధనా భాషలుగా ఉపయోగిస్తారు. ఫ్రెంచి చాలా సంవత్సరాల తరువాత మాత్రమే ప్రవేశపెట్టబడింది. అయితే సంపన్న నగరాలలో ఫ్రెంచిని సాధారణంగా చిన్న వయస్సులోనే బోధిస్తారు. సాధారణంగా మాధ్యమిక పాఠశాల స్థాయిలలలో స్థానిక భాష నిషేధించబడింది. ఫ్రెంచి ఏకైక బోధనా భాషగా ఉంది. బెనిను భాషలు సాధారణంగా ఉచ్ఛారణా ధ్వని (ఫోనెమే) కొరకు ఒక ప్రత్యేక అక్షరంతో లిప్యంతరీకరించబడతాయి. ఇందులో బెనిను యోరుబా ఉంది. ఉదాహరణకు మధ్య అచ్చులు ఫ్రెంచి భాషలో é è, ô, o వ్రాయబడ్డాయి. బెనిను భాషలలో ఇ, ɛ, ఓ, వ్రాయబడ్డాయి. అయితే హల్లులు ఎన్.క్యూ, ఎస్.హెచ్, సి.హెచ్. ఇంగ్లీషులో వ్రాయబడ్డాయి ఎన్ - సి వ్రాయబడ్డాయి. ఏది ఏమయినప్పటికీ నాసికా అచ్చులు, లాబియల్-వెలార్ హల్లులు కె.పి, క్యూ.బి. లకు డిగ్రాఫులు ఉపయోగించబడతాయి. ఫాను భాష పేరు ఫాను గబే (ఫో గ్బే) డయాక్రిటికులను టోను మార్కులుగా ఉపయోగిస్తారు. ఫ్రెంచి భాషా ప్రచురణలలో ఫ్రెంచి, బెనిను ఆర్థోగ్రఫీల మిశ్రమాన్ని చూడవచ్చు.

ఆహారసంస్కృతి

[మార్చు]
Acarajé is peeled black-eyed peas formed into a ball and then deep-fried.

బెనిను వంటకాలు ఆఫ్రికాలో విశిష్ట పదార్థాలు, రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందాయి. బెనిను వంటకాలలో వివిధ రకాల కీలకమైన సాసులతో అందించే తాజా భోజనం ఉంటుంది. దక్షిణ బెనిను వంటకాలలో సర్వసాధారణంగా మొక్కజొన్న అధికంగా ఉపయోగిస్తారు. దీనిని తరచుగా పిండిగా తయారు చేసి ఆహారంలో ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగా వేరుశెనగ- లేదా టమోటా-ఆధారిత సాసులతో వడ్డిస్తారు. దక్షిణ బెనిను వంటకాలలో చేపలు, చికెను వంటి మాంసాలు తరచుగా ఉపయోగిస్తారు. కానీ గొడ్డు మాంసం, మేక, బుషు ఎలుకలను కూడా ఆహారంగా తీసుకుంటారు. ఉత్తర బెనినులో ప్రధాన ప్రధానంగా చిలగడదుంపలు ఉపయోగిస్తారు. దీనిని తరచుగా పైన పేర్కొన్న సాసులతో వడ్డిస్తారు. ఉత్తర ప్రావిన్సులలోని ప్రజలు గొడ్డు మాంసం, పంది మాంసాన్ని ఉపయోగిస్తారు. ఇది పామాయిలు, వేరుశెనగ నూనెలో వేయించి లేదా సాసులలో వండుతారు. కొన్ని వంటలలో జున్ను ఉపయోగిస్తారు. మామిడి, నారింజ, అవోకాడో, అరటి, కివి ఫ్రూటు, పైనాపిల్సు వంటి పండ్లతో కౌస్కాసు, బియ్యం, బీన్సు సాధారణంగా తింటారు.

మాంసం సాధారణంగా చాలా ఖరీదైనది. భోజనంలో సాధారణంగా మాంసం తక్కువగా, కూరగాయల కొవ్వు అధికంగా ఉంటుంది. సాధారణంగా బెనినులో మాంసం తయారీలో పామాయిలు, వేరుశెనగ నూనె ఉపయోగిస్తారు. సాధారణంగా బెనినులో పొగబెట్టిన చేపలను తయారు చేస్తారు. మొక్కజొన్న పిండిని తయారు చేయడానికి గ్రైండర్లను ఉపయోగిస్తారు. దీనిని పిండిగా తయారు చేసి సాసులతో వడ్డిస్తారు. బెనిను సాంప్రదాయ వంటకం "చికెను ఆన్ ది స్పిటు" తయారీలో చికెను చెక్క కర్రల నిప్పు మీద కాల్చబడుతుంది. తాటి తేగలను కొన్నిసార్లు ఉప్పునీరు, ముక్కలు చేసిన వెల్లుల్లితో ఒక కూజాలో నానబెట్టి, వాటిని మృదువుగా చేస్తారు. తరువాత వంటలలో ఉపయోగిస్తారు. చాలా మందికి వంట కోసం ఇంటి వెలుపల నిర్మించిన మట్టి పొయ్యి ఉంటుంది.

దేశంలో తీరప్రాంతాల ప్రజలు జలచరాలను ముఖ్యంగా రొయ్యలు, పీతలు, ఎండ్రకాయలను ఇష్టంగా తింటారు. ఇతర ప్రాంతాలలో మొక్కజొన్నపిండి, టమోటారసం, పామోలిన్ నూనె ఎక్కువగా వాడుతారు. కొన్నిప్రాంతాలలో వరి అన్నం కూడా తింటారు. నారింజ, అరటి, అనాస పళ్లు తింటారు. ఆవుపాలతో చేసిన పదార్థాన్ని వాగాసి అంటారు. ఇంకా అలోకో, ఫు-ఫు, గర్రె, మోమో అమివో, అక్‌పాన్, అకస్సా పేర్లు గలిగిన ఆహారాన్ని తింటారు. చేకాచి అనే పేరుగల మిల్లెట్ బీరు తాగుతారు.

క్రీడలు

[మార్చు]

బెనినులో " అసోసియేషను ఫుట్బాలు " ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. గత దశాబ్ధంలో బెనినులో " బేస్బాలు " ప్రవేశపెట్టబడింది.[60]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Benin". International Monetary Fund. Retrieved 2013-04-17.
  2. "Distribution of family income – Gini index". The World Factbook. CIA. Archived from the original on 2007-06-13. Retrieved 2009-09-01.
  3. "2014 Human Development Report Summary" (PDF). United Nations Development Programme. 2014. pp. 21–25. Retrieved 27 July 2014.
  4. మూస:Cite EPD
  5. Hughes, R. H.; Hughes, J. S. (1992). A Directory of African Wetlands. IUCN. p. 301. ISBN 978-2-88032-949-5. Archived from the original on 8 మే 2016. Retrieved 12 అక్టోబరు 2015.
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; AS2010 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. 7.0 7.1 "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  8. "Food and Agriculture Organization of the United Nations" Archived 24 అక్టోబరు 2012 at the Wayback Machine. United Nations, 29 June 2010.
  9. "Benin – International Cooperation"]. Nation Encyclopedia (29 June 2010).
  10. Ibp Usa. Global Logistics Assessments Reports Handbook: Strategic Transportation and Customs Information for Selected Countries, p. 85. Int'l Business Publications, 2008. ISBN 0-7397-6603-1
  11. Lea, David; Rowe, Annamarie, eds. (2001). A Political Chronology of Africa. Taylor & Francis. p. 33. ISBN 978-1-85743-116-2. Archived from the original on 3 జూన్ 2016. Retrieved 12 అక్టోబరు 2015.
  12. Smith, Bonnie G., ed. (2008). The Oxford Encyclopedia of Women in World History, Volume 1. Oxford University Press. p. 535. ISBN 978-0-19-514890-9. Archived from the original on 22 నవంబరు 2015. Retrieved 12 అక్టోబరు 2015.
  13. Bay, Edna (1998). Wives of the Leopard: Gender, Politics, and Culture in the Kingdom of Dahomey. University of Virginia Press.
  14. Akinjogbin, I.A. (1967). Dahomey and Its Neighbors: 1708–1818. Cambridge University Press. OCLC 469476592.
  15. Law, Robin (1986). "Dahomey and the Slave Trade: Reflections on the Historiography of the Rise of Dahomey". The Journal of African History. 27 (2): 237–267. doi:10.1017/s0021853700036665.
  16. Creevey, Lucy; Ngomo, Paul; Vengroff, Richard (2005). "Party Politics and Different Paths to Democratic Transitions: A Comparison of Benin and Senegal". Party Politics. 11 (4): 471–493. doi:10.1177/1354068805053213.
  17. Harms, Robert W. (2002). The Diligent: A Voyage Through the Worlds of the Slave Trade. Basic Books. p. 172. ISBN 978-0-465-02872-6. Archived from the original on 9 మే 2016. Retrieved 12 అక్టోబరు 2015.
  18. Alpern, Stanley B. (1998). Amazons of Black Sparta: The Women Warriors of Dahomey. C. Hurst & Co. Publishers. p. 37. ISBN 978-1-85065-362-2. Archived from the original on 6 మే 2016. Retrieved 12 అక్టోబరు 2015.
  19. African Ambassador Apologizes for Slavery Role Archived 22 మే 2010 at the Wayback Machine. FOXNews.com. 10 July 2003
  20. 20.0 20.1 African Slave Owners Archived 8 మార్చి 2013 at the Wayback Machine the story of South Africa|BBC World Service
  21. Manning, Patrick (1982). Slavery, Colonialism and Economic Growth in Dahomey, 1640–1960. London: Cambridge University Press.
  22. "President Sirleaf congratulates Benin on 57th Independence Anniversary". Agence de Presse Africane (in ఇంగ్లీష్). 31 జూలై 2017. Archived from the original on 30 జూలై 2018. Retrieved 30 జూలై 2018.
  23. Stokes, Jamie, ed. (2009). Encyclopedia of the Peoples of Africa and the Middle East: L to Z. Infobase Publishing. p. 229. ISBN 978-0-8160-7158-6. Archived from the original on 3 మే 2016. Retrieved 12 అక్టోబరు 2015.
  24. Araujo, Ana Lucia (2010). Public Memory of Slavery: Victims and Perpetrators in the South Atlantic. Cambria Press. p. 111. ISBN 978-1-60497-714-1. Archived from the original on 17 జూన్ 2016. Retrieved 12 అక్టోబరు 2015.
  25. Dickovick, J. Tyler (9 ఆగస్టు 2012). Africa 2012. Stryker Post. p. 69. ISBN 978-1-61048-882-2. Archived from the original on 2 జూన్ 2013. Retrieved 5 మార్చి 2013.
  26. Houngnikpo, Mathurin C.; Decalo, Samuel (14 డిసెంబరు 2012). Historical Dictionary of Benin. Rowman & Littlefield. p. 33. ISBN 978-0-8108-7171-7. Archived from the original on 23 ఏప్రిల్ 2014. Retrieved 5 మార్చి 2013.
  27. 27.0 27.1 27.2 27.3 Kneib, Martha (7 January 2007). Benin. pp. 22–25. ISBN 0-7614-2328-1.
  28. "A Short History of the People's Republic of Benin (1974–1990)". Socialist.net. 27 ఆగస్టు 2008. Archived from the original on 23 ఏప్రిల్ 2010. Retrieved 2 మే 2010.
  29. "Benin". Flagspot.net. Archived from the original on 12 జూన్ 2010. Retrieved 2 మే 2010.
  30. Gates, Henry Louis, "Ending the Slavery Blame-Game Archived 7 మార్చి 2017 at the Wayback Machine". The New York Times, 22 April 2010
  31. "Businessman sworn in as Benin's president". Reuters. 6 ఏప్రిల్ 2016. Archived from the original on 17 ఏప్రిల్ 2016. Retrieved 1 మే 2016.
  32. "Newly-elected Benin president aims to reduce presidential terms". Reuters. 26 మార్చి 2016. Archived from the original on 3 మే 2016. Retrieved 1 మే 2016.
  33. 33.0 33.1 33.2 33.3 33.4 "Background Note: Benin" . U.S. Department of State (June 2008).  This article incorporates text from this source, which is in the public domain.
  34. Henschel, P.; Coad, L.; Burton, C.; Chataigner, B.; Dunn, A.; MacDonald, D.; Saidu, Y.; Hunter, L. T. B. (2014). Hayward, Matt (ed.). "The Lion in West Africa is Critically Endangered". PLoS ONE. 9: e83500. doi:10.1371/journal.pone.0083500. PMC 3885426. PMID 24421889.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  35. C. Michael Hogan. 2009. Painted Hunting Dog: Lycaon pictus, GlobalTwitcher.com, ed. N. Stromberg Archived 9 డిసెంబరు 2010 at the Wayback Machine
  36. "Background Note: Benin". State.gov. 3 ఫిబ్రవరి 2010. Retrieved 2 మే 2010.
  37. "Benin: Financial Sector profile". Archived from the original on 13 May 2011. Retrieved 30 November 2010.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link). MFW4A.org
  38. "2006 Benin Compact Summary" (PDF). Millennium Challenge Corporation. 2006. Archived from the original (PDF) on 3 ఫిబ్రవరి 2016. Retrieved 30 జూలై 2019.
  39. 39.0 39.1 39.2 Benin Archived 2015-09-18 at the Wayback Machine. CIA World Factbook
  40. "Serious violations of core labour standards in Benin, Burkina Faso and Mali". ICFTU Online. Retrieved 30 July 2007.
  41. "OHADA.com: The business law portal in Africa". Archived from the original on 26 మార్చి 2009. Retrieved 22 మార్చి 2009.
  42. "The World Bank In Benin". The World Bank. 10 అక్టోబరు 2017. Archived from the original on 9 మార్చి 2018. Retrieved 14 మార్చి 2018.
  43. International Monetary Fund. African Dept. (2017). Benin: Request for a Three-year Arrangement Under the Extended Credit Facility-Press Release; Staff Report; and Statement by the Executive Director for Benin. International Monetary Fund. p. 5.
  44. "Archived copy". Archived from the original on 6 ఏప్రిల్ 2011. Retrieved 6 నవంబరు 2008.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  45. International Religious Freedom Report 2007: Benin . United States Bureau of Democracy, Human Rights and Labor (14 September 2007). This article incorporates text from this source, which is in the public domain.
  46. "Enquête Démographique et de Santé (EDSB-IV) 2011-2012" (PDF) (in French). Ministère du Développement, de l'Analyse Économique et de la Prospective Institut National de la Statistique et de l'Analyse Économique (INSAE). p. 39. Archived from the original (PDF) on 23 జూన్ 2017. Retrieved 20 ఏప్రిల్ 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  47. "Benin". Country Reports on Human Rights Practices. U. S. Department of State. 23 ఫిబ్రవరి 2001. Retrieved 17 సెప్టెంబరు 2010.
  48. "Benin". U. N. Educational, Scientific and Cultural Organization. Archived from the original on 13 సెప్టెంబరు 2010. Retrieved 17 సెప్టెంబరు 2010.
  49. 49.00 49.01 49.02 49.03 49.04 49.05 49.06 49.07 49.08 49.09 49.10 Essegbey, George; Diaby, Nouhou; Konté, Almamy (2015). West Africa. In: UNESCO Science Report: towards 2030 (PDF). Paris: UNESCO. pp. 471–497. ISBN 978-92-3-100129-1. Archived (PDF) from the original on 30 జూన్ 2017. Retrieved 12 జూన్ 2017.
  50. "One Applauds AU Malabo Declaration's Recommitment to Agriculture Transformation". ONE.org. 2 జూలై 2014. Archived from the original on 10 అక్టోబరు 2017. Retrieved 12 జూన్ 2017.
  51. "HIV/AIDS—Adult Prevalence Rate". The World Factbook. Central Intelligence Agency. Archived from the original on 21 డిసెంబరు 2014. Retrieved 16 ఏప్రిల్ 2015.
  52. "Malaria in Benin". malaria.com. 24 ఫిబ్రవరి 2011. Archived from the original on 22 జనవరి 2015. Retrieved 16 ఏప్రిల్ 2015.
  53. "Bamako Initiative revitalizes primary health care in Benin". WHO.int. Archived from the original on 6 జనవరి 2007. Retrieved 28 డిసెంబరు 2006.
  54. "Maternal Mortality Rate". The World Factbook. Central Intelligence Agency. Archived from the original on 18 ఏప్రిల్ 2015. Retrieved 16 ఏప్రిల్ 2015.
  55. Female Genital Mutilation/Cutting: A statistical overview and exploration of the dynamics of change Archived 5 ఏప్రిల్ 2015 at the Wayback Machine. UNICEF 2013, p. 27
  56. "Implementation of the Bamako Initiative: strategies in Benin and Guinea". NIH.gov. PMID 5. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  57. Benin Surveys Archived 26 సెప్టెంబరు 2010 at the Wayback Machine, measuredhs.com
  58. "Benin". Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 30 జూలై 2007.
  59. Akwamu – Encyclopedia Article and More from Archived 12 జనవరి 2012 at the Wayback Machine. Merriam-Webster (13 August 2010), retrieved 15 August 2012
  60. Mozey, Brian. (22 June 2016) Duo develops nonprofit organization, Baseball in Benin | Archived 5 ఆగస్టు 2016 at the Wayback Machine. Post.mnsun.com. Retrieved on 2 January 2017.

బయటి లంకెలు

[మార్చు]
ప్రభుత్వము
ప్రసార మాధ్యమాలు
విద్య
ప్రయాణము
వాణిజ్యము