కేరళ ఎక్స్‌ప్రెస్
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Superfast | ||||
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను | ||||
ఆగే స్టేషనులు | 38 | ||||
గమ్యం | త్రివేండ్రం సెంట్రల్ | ||||
ప్రయాణ దూరం | 3,036 కి.మీ. (1,886 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 50 గంటల 45 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
రైలు సంఖ్య(లు) | 12625 / 12626 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | 2 Two Tier AC, 3 Tier AC, SL, General | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | Yes | ||||
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | 7 | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 59.86 km/h (37.20 mph) average with halts | ||||
|
భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తోన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కేరళ ఎక్స్ ప్రెస్ (ఆంగ్లం: Kerala Express) కూడా ఒకటి. ఈ రైలు భారతదేశ రాజధాని క్రొత్తఢిల్లీ, కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం (తిరువనంతపురం) లోని త్రివేండ్రం సెంట్రల్ మధ్య నడుస్తుంటుంది. ప్రతిరోజు నడిచే ఈ రైలు న్యూఢిల్లీ, త్రివేండ్రం మధ్య 3, 036 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో మొత్తం 40 చోట్ల ఆగుతుంటుంది. దీని సగటు వేగం 59 కి.మీ./గం.[1] న్యూ ఢిల్లీ, తిరువంతపురం సెంట్రల్ స్టేషన్ల మధ్య నడిచే ఈ రైలు భారతదేశంలో అతి ఎక్కువ దూరం ఎలక్ట్రిక్ ఇంజిన్ తో నడిచే రైలుగా రికార్డు సృష్టించింది.[2] ఈ రైలును అందరూ అధిగమించే రారాజు (కింగ్ ఆఫ్ ఓవర్ టేక్స్) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ మార్గంలో నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్, శతాబ్ది ఎక్స్ ప్రెస్ మినహా దాదాపు మిగతా అన్ని రైళ్లను అధిగమించింది.
చరిత్ర
[మార్చు]ఈ రైలు 1976లో కేరళ – కర్ణాటక (కె.కె. ఎక్స్ ప్రెస్) పేరుతో ప్రారంభమైంది. అప్పట్లో కేరళ-కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు న్యూ ఢిల్లీ నుంచి బయలు దేరి త్రివేండ్రంతో పాటు జోలార్ పెట్టి జంక్షన్ వద్ద విడిపోయి బెంగళూరు వరకు నడుస్తుండేది. 1980లో కె.కె. ఎక్స్ ప్రెస్ కాస్తా కేరళ ఎక్స్ ప్రెస్ మరియ కర్ణాటక ఎక్స్ ప్రెస్ పేర్లతో రెండు రైళ్లుగా విడిపోయింది. తిరిగి కేరళ ఎక్స్ ప్రెస్ లో కొంతభాగం పాల్ ఘాట్ జంక్షన్ వద్ద విడిగొట్టి మంగళూరు మార్గంలోకి మళ్లించారు. దీనిని జయంతి జనతా స్థానంలో సర్దుబాటు చేశారు. గతంలో జయంతి జనతా రైలు షోర్నాపూర్ వద్ద విడిపోయి ఒక భాగం రైలు కొచ్చిన్ ఓడరేవుకు, మరో భాగం మంగళూరుకు వెళ్లేది. ఆ తర్వాత ఈ రెండు రైళ్లను కలిపేసి కేరళ మంగళ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. 1990 తర్వాత మంగళూరుకు ప్రత్యేక రైలును పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అదే మార్గంలో నడుస్తోంది. ఇది అప్పట్లో ప్రతిరోజు నడిచేది కాదు. తమిళనాడు ఎక్స్ ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్, కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైళ్ల సమయంలోనే ఇది ఉండటం వల్ల ఆ కాలాన్ని పంచుకుని నడిచేది. కానీ... ఆతర్వాత ఇది ప్రతిరోజు నడిచే రైలుగా సొంత కాల భాగాన్ని పొంది స్వతంత్రంగా మారింది.[3]
కేరళ ఎక్స్ ప్రెస్ నిజానికి ఆరంభంలో 125/126 అనే మూడంకెల నెంబర్లతో నడిచేది. ఆ తర్వాత ఈ నెంబర్లను పలుమార్లు మార్చాల్సి వచ్చింది. 1989 తర్వాత భారతీయ రైల్వేలు నాలుగు అంకెలు గల నెంబర్ల పద్ధతిని ప్రవేశపెట్టడంతో రెండోసారి రైలు నెంబర్లను 2625/2626 నెంబర్లుగా మార్చారు.[4] తిరిగి డిసెంబరు 2010లో ఐదు అంకెల విధానాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో మళ్లీ కేరళ ఎక్స్ రైలు నెంబర్లు మూడోసారి మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ రైలు పై స్థాయి (అప్ వర్డ్) ప్రయాణంలో 12625 నెంబర్ తో నడుస్తుండగా, దిగువ స్థాయి (డౌన్ వర్డ్) ప్రయాణంలో 12626 నెంబరుతో నడుస్తోంది.[5]
ఈ రైలు 12626 నెంబరుతో న్యూ ఢిల్లీ నుంచి త్రివేండ్రం మార్గంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా 12625 నెంబరు గల రైలు త్రివేండ్రం నుంచి న్యూ ఢిల్లీకి ప్రయాణిస్తుంది.
బోగీల విభజన
[మార్చు]మొత్తం 24 బోగీలు గల ఈ రైలును వివిధ విభాగాలుగా విభజించారు. వీటిలో 7 ఏసీ బోగీలున్నాయి. (ఏసీ విభాగంలో వీటిలో 2 టూ టైర్ ఏసీ బోగీలు, మరో 5 త్రీ టైర్ ఎసీ బోగీలుంటాయి.), ఇవిగాక 12 స్పీపర్ తరగతి బోగీలు, 4 సాధారణ బోగీలు, ఒక ప్యాంట్రీ కారు ఉంటాయి. ఈ రైలును లాగడానికి ఈరోడ్ షెడ్ కు చెందిన డబ్ల్యు.ఎ.పి-4 ఇంజిన్ తో గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.
మార్గం
[మార్చు]ఈ రైలు తిరువనంతపురంలో బయలుదేరి కొల్లాం, కాయంకులం, మావేలికరా, చెంగన్నూర్, తిరువెల్ల, చెంగనస్సేరీ, కొట్టాయాం, ఎర్నాకులం, ఆలువా, త్రిశూర్, షోర్నూర్, పలక్కాద్, కోయంబత్తూర్, తిరుపూర్, ఈ రోడ్, సేలం, జోలర్ పెట్టాయ్, కట్పడి, చిత్తూరు,తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, రామగుండం, బల్లర్షా, నాగపూర్, భోపాల్, ఝాన్షీ, గ్వాలియర్, ఆగ్రా, మథుర గుండా ప్రయాణించి న్యూఢిల్లీ చేరుతుంది.
సమయ సారణి
[మార్చు]సంఖ్య | స్టేషన్ కోడ్ | స్టేషన్ పేరు | 12625 : తిరువనంతపురం - న్యూఢిల్లీ | 12626 : న్యూఢిల్లీ - తిరువనంతపురం | |||||
చేరు
సమయం |
బయలుదేరు
సమయం |
దూరం | చేరు
సమయం |
బయలుదేరు
సమయం |
దూరం | ||||
1 | TVC | త్రివేండ్రం సెంట్రల్ | మూల | 11:15 (డే 1) | 0 | 14:35 (డే 3) | గమ్యం | 3035 | |
2 | VAK | వర్కల | 11:44 (డే 1) | 11:45 (డే 1) | 41 | 13:25 (డే 3) | 13:27 (డే 3) | 2994 | |
3 | QLN | కొల్లం జంక్షన్ | 12:10 (డే 1) | 12:15 (డే 1) | 65 | 13:00 (డే 3) | 13:05 (డే 3) | 2970 | |
4 | KYJ | కాయంగుళం జంక్షన్ | 12:55 (డే 1) | 12:57 (డే 1) | 106 | 12:15 (డే 3) | 12:17 (డే 3) | 2929 | |
5 | MVLK | మావేలికర | 13:03 (డే 1) | 13:05 (డే 1) | 114 | 12:03 (డే 3) | 12:05 (డే 3) | 2921 | |
6 | CNGR | చెంగన్నూర్ | 13:18 (డే 1) | 13:20 (డే 1) | 126 | 11:48 (డే 3) | 11:50 (డే 3) | 2909 | |
7 | TRVL | తరువల్ల | 13:28 (డే 1) | 13:30 (డే 1) | 135 | 11:38 (డే 3) | 11:40 (డే 3) | 2900 | |
8 | CGY | చంగనశ్శేరి | 13:38 (డే 1) | 13:40 (డే 1) | 143 | 11:28 (డే 3) | 11:30 (డే 3) | 2892 | |
9 | KTYM | కోట్టయం | 14:02 (డే 1) | 14:05 (డే 1) | 161 | 11:07 (డే 3) | 11:10 (డే 3) | 2874 | |
10 | VARD | వైకం రోడ్ | 14:23 (డే 1) | 14:25 (డే 1) | 186 | 10:23 (డే 3) | 10:25 (డే 3) | 2850 | |
11 | ERS | ఎర్ణాకుళం జంక్షన్ | 15:35 (డే 1) | 15:45 (డే 1) | 220 | 09:35 (డే 3) | 09:45 (డే 3) | 2815 | |
12 | AWY | అలువ | 16:07 (డే 1) | 16:09 (డే 1) | 240 | 08:35 (డే 3) | 08:37 (డే 3) | 2795 | |
13 | TCR | త్రిశ్శూర్ | 17:00 (డే 1) | 17:03 (డే 1) | 295 | 07:37 (డే 3) | 07:40 (డే 3) | 2741 | |
14 | OTP | ఒట్టప్పాలెం | 18:03 (డే 1) | 18:05 (డే 1) | 340 | 06:53 (డే 3) | 06:55 (డే 3) | 2695 | |
15 | PGT | పాలక్కాడ్ | 18:40 (డే 1) | 18:45 (డే 1) | 372 | 06:20 (డే 3) | 06:25 (డే 3) | 2664 | |
16 | CBE | కోయంబత్తూరు JN | 19:55 (డే 1) | 20:00 (డే 1) | 426 | 05:05 (డే 3) | 05:10 (డే 3) | 2609 | |
17 | TUP | తిరుప్పూర్ | 20:48 (డే 1) | 20:50 (డే 1) | 476 | 04:03 (డే 3) | 04:05 (డే 3) | 2559 | |
18 | ED | JN ఈరోడ్ | 21:50 (డే 1) | 22:00 (డే 1) | 527 | 03:15 (డే 3) | 03:20 (డే 3) | 2509 | |
19 | SA | సేలం జంక్షన్ | 22:55 (డే 1) | 23:00 (డే 1) | 589 | 02:10 (డే 3) | 02:15 (డే 3) | 2446 | |
20 | JTJ | జోలార్పేటై | 00:43 (డే 2) | 00:45 (డే 2) | 709 | 00:33 (డే 3) | 00:35 (డే 3) | 2326 | |
21 | KPD | కాట్పాడి జంక్షన్ | 02:00 (డే 2) | 02:02 (డే 2) | 793 | 23:18 (డే 2) | 23:20 (డే 2) | 2242 | |
22 | CTO | చిత్తూరు | 02:39 (డే 2) | 02:40 (డే 2) | 826 | 21:58 (డే 2) | 22:00 (డే 2) | 2210 | |
23 | TPTY | తిరుపతి | 03:55 (డే 2) | 03:57 (డే 2) | 897 | 20:52 (డే 2) | 20:54 (డే 2) | 2138 | |
24 | RU | రేణిగుంట జంక్షన్ | 04:10 (డే 2) | 04:20 (డే 2) | 907 | 20:30 (డే 2) | 20:40 (డే 2) | 2128 | |
25 | GDR | గూడూర్ జంక్షన్ | 05:55 (డే 2) | 05:57 (డే 2) | 990 | 19:14 (డే 2) | 19:20 (డే 2) | 2045 | |
26 | NLR | నెల్లూరు | 06:22 (డే 2) | 06:23 (డే 2) | 1029 | 18:08 (డే 2) | 18:10 (డే 2) | 2007 | |
27 | BZA | విజయవాడ JN | 10:00 (డే 2) | 10:15 (డే 2) | 1283 | 14:45 (డే 2) | 15:00 (డే 2) | 1752 | |
28 | WL | వరంగల్ | 13:00 (డే 2) | 13:05 (డే 2) | 1492 | 11:02 (డే 2) | 11:07 (డే 2) | 1544 | |
29 | RDM | రామగుండం | 14:40 (డే 2) | 14:41 (డే 2) | 1592 | 09:30 (డే 2) | 09:32 (డే 2) | 1443 | |
30 | BPQ | బల్హారషా | 17:00 (డే 2) | 17:10 (డే 2) | 1734 | 07:40 (డే 2) | 07:50 (డే 2) | 1301 | |
31 | SEGM | సేవాగ్రామ్ | 18:59 (డే 2) | 19:01 (డే 2) | 1869 | 05:11 (డే 2) | 05:13 (డే 2) | 1166 | |
32 | NGP | నాగపూర్ | 20:05 (డే 2) | 20:15 (డే 2) | 1945 | 04:00 (డే 2) | 04:10 (డే 2) | 1090 | |
33 | ET | ఇటార్సి JN | 01:05 (డే 3) | 01:10 (డే 3) | 2242 | 23:50 (డే 1) | 23:55 (డే 1) | 793 | |
34 | BPL | భోపాల్ జంక్షన్ | 02:55 (డే 3) | 03:00 (డే 3) | 2334 | 21:40 (డే 1) | 21:45 (డే 1) | 701 | |
35 | BINA | బినా JN | 04:50 (డే 3) | 04:55 (డే 3) | 2472 | 19:50 (డే 1) | 19:55 (డే 1) | 563 | |
36 | JHS | ఝాన్సీ జంక్షన్ | 06:55 (డే 3) | 07:07 (డే 3) | 2625 | 17:40 (డే 1) | 17:52 (డే 1) | 410 | |
37 | GWL | గౌలియార్ | 08:20 (డే 3) | 08:25 (డే 3) | 2722 | 16:05 (డే 1) | 16:10 (డే 1) | 313 | |
38 | AGC | ఆగ్రా CANTT | 10:20 (డే 3) | 10:25 (డే 3) | 2840 | 14:05 (డే 1) | 14:10 (డే 1) | 195 | |
39 | MTJ | మధుర JN | 11:12 (డే 3) | 11:15 (డే 3) | 2894 | 13:18 (డే 1) | 13:21 (డే 1) | 141 | |
40 | FDB | ఫరీదాబాద్ | 12:50 (డే 3) | 12:51 (డే 3) | 3007 | ||||
41 | NZM | హెచ్ నిజాముద్దీన్ | 13:21 (డే 3) | 13:23 (డే 3) | 3027 | ||||
42 | NDLS | న్యూఢిల్లీ | 13:45 (డే 3) | గమ్యం | 3035 | మూల | 11:25 (డే 1) | 0 |
కోచ్ల కూర్పు
[మార్చు]ఈ రైలుకు 24 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -
- 12635/12636
తిరువనంతపురం రైల్వే స్టేషను నుండి ఢిల్లీకి నడిచే ఈ రైలులో కోచ్ ల అమరిక ఈ విధంగా ఉంటుంది.
0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ERS | SLR | జనరల్ | A2 | A1 | బి5 | బి4 | బి3 | బి2 | బి1 | ఎస్12 | ఎస్11 | PC | ఎస్10 | ఎస్9 | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | జనరల్ | SLR |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://indiarailinfo.com/train/timetable/935/59/664
- ↑ "Trivia". IRFCA.
- ↑ "Altered Trains". IRFCA.
- ↑ "Old Train Numbers". IRFCA.
- ↑ "Kerala Express-12625". cleartrip.com. Archived from the original on 2014-08-14.
బయటి లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537