Jump to content

1749

వికీపీడియా నుండి

1749 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1746 1747 1748 - 1749 - 1750 1751 1752
దశాబ్దాలు: 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • జూన్ 6: జూన్ 29 న జరగాల్సిన బానిసల కుట్ర మాల్టాలో వెల్లడైంది.
  • ఆగస్టు 3: రెండవ కర్ణాటక యుద్ధం: బ్రిటిషు మద్దతు ఉన్న ఆర్కాటు నవాబుకూ 77 ఏళ్ల అన్వరుద్దీన్ ఖాన్ కూ, ఫ్రెంచ్-మద్దతు ఉన్న చందా సాహిబ్ దళాలకూ మధ్య అంబూరు పోరు మొదలైంది. కోట గోడ దాటి వెలుపలికి వచ్చి చందా సాహిబ్ సైన్యంతో చేసిన యుద్ధంలో నవాబు ఓడిపోయాడు. యుద్ధంలో అతడు హతుడయ్యాడు. [1]
  • ఆగష్టు 15ఆర్కిటిక్ మహాసముద్రం ద్వీపమైన ఎడ్జియాలో ఆరు సంవత్సరాలకు పైగా చిక్కుకుపోయిన రష్యన్ నావికులు-అలెక్సీ ఇంకోవ్, క్రిసాన్ఫ్ ఇంకోవ్, స్టెపాన్ షరపోవ్, ఫెడోర్ వెరిగినే లను రక్షించారు. 1743 మేలో మంచు తాకిడికి వాళ్ళ పడవ ఛిన్నమై పోయినపుడు మొత్తం 14 మంది సిబ్బందిలో వారు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. [2] ఈ నలుగురు సెప్టెంబరు 28 న ఇంటికి తిరిగి వచ్చారు. నాలుగో వ్యక్తి, ఫెడోర్ వెరిగినే, స్కర్వీ వ్యాధితో దారి లోనే మరణించాడు
  • నవంబర్ 12: ఫ్రాన్స్‌లో ఆకలితో అలమటించే గ్రామీణులు పారిస్‌కు తరలిరాకుండా ఉండేందుకు గాను, కింగ్ లూయిస్ XV ఒక ఆర్డినెన్స్ జారీ చేసాడు: "పారిస్ వీధుల్లో, చర్చిలలో, చర్చి ద్వారాల వద్దా, పారిస్ శివార్లలో ఉండే గ్రామీణ ప్రాంతాలలోనూ కనిపించే బిచ్చగాళ్ళను ఏ వయస్సు వారైనా, ఏ లింగమైనా సరే అరెస్టు చేసి జైళ్లలో పెట్టాలి. ఎంత కాఅలం అవసరమైతే అంత కాలమూ అక్కడే ఉంచాలి. " [3] [4]

జననాలు

[మార్చు]
గెథే

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Spencer C. Tucker, ed., A Global Chronology of Conflict: From the Ancient World to the Modern Middle East (ABC-CLIO, 2009) p756
  2. David Roberts, Four Against the Arctic: Shipwrecked for Six Years at the Top of the World (Simon and Schuster, 2005) p10
  3. "Child Abduction Panic", in Outbreak!: The Encyclopedia of Extraordinary Social Behavior, ed. by Hilary Evans and Robert E. Bartholomew (Anomalist Books, LLC, 2009) pp83-84
  4. Christine Pevitt Algrant, Madame de Pompadour: Mistress of France (Grove Press, 2003) p95