హరివంశ పర్వము
ఈ వ్యాసంలో పూర్తిగా కథా సంగ్రహం మాత్రమే ఉంది. దీనిలో వ్యాస విషయం "గురించి" ఏమీ లేదు. |
మహాభారతమును తన తాతలైన పాండవుల ఘనచరిత్రను సంపూర్ణముగా విని జనమేజయుడు తనకు కలిగిన అసంతృప్తిని దాచలేక వైశంపాయనుడితో " మహాత్మా ! భారతమును పూర్తిగావిన్నా నా మనసున అసంతృప్తి మిగిలి ఉంది. అందుకు కారణం మహానుభావుడైన శ్రీకృష్ణుడు జన్మించిన యదువంశము గురించి భారతంలో అవసరమైనంత వరకే చెప్పబడినది. మీరు సర్వజ్ఞులు కనుక నాకు శ్రీకృష్ణుడు జన్మించిన వృష్టివంశ చరిత్ర వినిపించి నన్ను ధన్యుడిని చేయండి " అని అడిగాడు. వైశంపాయనుడు అదివిని చిరునవ్వు నవ్వి. జనమేజయమహారాజా ! నీకు కలిగినట్లే వ్యాసుడికి అసంతృప్తి కలిగింది. సాక్షాత్తు విష్ణంశ సంభూతుడైన వ్యాసుడు భారతము వ్రాసి ముగించిన పిదప భగవంతుడు ధర్మరక్షకుడైన శ్రీకృష్ణుడు జన్మించిన వృష్టివంశ చరిత్రను ఖిలపర్వము అనే పేరుతో రచించాడు. భారతం పద్దెనిమిది పర్వాలే ఖిలపర్వము దానిలో ఒక భాగం అయింది. ఖిలపర్వము చేరితేనే అది మహాభారతం అయ్యింది. ఇక వృష్టివంశ చరిత్ర శ్రీకృష్ణుడి లీలావైభవం ఆలకించు జనమేజయ మహారాజా ! " అని వైశంపాయనుడు చెప్పి వృష్టివంశముగురించి చెప్పసాగాడు.
చంద్రుని జననము
[మార్చు]వృష్టివంశముకు మూల పురుషుఁడు చంద్రుఁడు. చంద్రుని తండ్రి బ్రహ్మ మానసపుత్రుఁడూ సప్తరుషులలో ఒక్కడూ అయిన అత్రిమహర్షి. అత్రిమహర్షి ఒకసారి లోకహితమును కోరుతూ తపమాచరించాడు. అప్పుడు అతడు ఉధ్వరేతస్కుడు కాగా ఆ రేతస్సు బిందువులుగా అతడి కన్నుల నుండి స్రవించి అది దిక్కులన్నింటిని ఆక్రమించగా ఆ రేతోతేజమును దశదిశలు భరించజాలక భూమి మీద వదిలి వేసాయి. అప్పుడు బ్రహ్మ లోకములను రక్షించ తలచి వేయశ్వముల రధమును చేసి అందు ఉంచాడు. ఆ రేతస్సు తేజోవంతమైన బాలుడై బ్రహ్మరధమును అధిరోహించి లోకముంతా తిరిగి సామ్రాజ్యమును సాధించి రాజతేజముతో వెలుగసాగాడు. అది చూసిన దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహము జరిపించాడు. తరువాత చంద్రుడు అత్రిమహర్షి హోతగా, భృగుమహర్షి అధ్వర్యునిగా, నారదమహర్షి ఉద్ఘాతగా రాజసూయమును చేశాడు. ఆ యాగముకు సనత్కుమారుల వంటి మహాముని పరివేష్టితుడైన విష్ణువు తిలకించాడు. యాగసమాప్తి అందు హిరణ్య, రత్న, రజిత గర్భాయిన ముల్లోకాలు దానముగా ఇవ్వబడినవి. ఆ యాగ ప్రభావముగా చంద్రుడు ధృతి, ప్రభ, కీర్తి, ధృష్టిని పొంది అధిక తేజముతో విరాజిల్లాడు. మిక్కుటమైన సంపదలు చంద్రుడికి అత్యధిక అతిశయము కలిగించినవి. అతడు గర్వాంధుడై బృహస్పతిని ఓడించి అతడి భార్య తారను బలవంతంగా తీసుకు వెళ్ళాడు. ఎంత మంది విడువమని నచ్చజెప్పినా చంద్రుఁడు దానిని పెడచెవిన పెట్టాడు.
దేవదానవయుద్ధము
[మార్చు]ఈ అధర్మాన్ని సహించలేని శివుడు దేవతలమీద బ్రహ్మశిరము అను అస్త్రమును ప్రయోగించి బలహీన పరిచాడు. దేవతలు బలహీనులు కాగానే దానవులు విజృభించి దేవతల మీదకు యుద్ధానికి వచ్చారు. ఆయుద్ధములో దేవతలు అనేకులు మరణించారు. దేవతలు చివరకు దానవులకు ఝడిసి బ్రహ్మను శరణువేడగా బ్రహ్మదేవుడు బృహస్పతిని పిలిపించి చంద్రుని తారను రప్పించి తారను బృహస్పతికి ఇప్పించాడు. కాని అప్పటికి తార గర్భవతిగా ఉన్నందున అమె అప్పుడు ఒక బాలుని ప్రసవించింది. ఆ బాలుడు తారను చూసి ఆగ్రహించి తనకు ఇలాంటి జన్మ ఇచ్చిందుకు తల్లిని శపించ తలిచాడు. బ్రహ్మదేవుడు ఆ బాలుని వారించి శపించకుండా ఆపాడు. తరువాత బ్రహ్మ తారను అడిగి ఆ శిశువు చంద్రుడిది అని తెలుసుకుని పుట్టిన శిశువును చంద్రుడికి ఇప్పించి తారను బృహస్పతి వెంట పంపాడు.
భోజవంశము
[మార్చు]చంద్రుడు తన పుత్రుని చూసి అతడి ప్రకాశము చూసి మురిసి పోయాడు. అతడికి బుధుడు అని నామకరణము చేసాడు. బుధుడికి ఇలతో వివాహము జరిగినది. వారికి పురూరవుడు జన్మించాడు. పురూరవుడుని ఊర్వశి వరించి వివాహము చేసుకొన్నది. వారికి ఆయువు, అసమాయువు, ధృడ్హఆయువు, పరమాయువు, శతాయువు అను పుత్రులు కలిగారు. ఆయువుకు నహుషుడు, వృద్ధశర్ముడు, రంభుడు, రజి, అనేయుడు అను పుత్రులు కలిగారు. వారిలో నహుషుడికి యయాతి, సంయాతి, ప్రయాతి అనుపుత్రులు కలిగారు. యయాతికి దేవయాని వలన యదువు, తుర్వసుడు కలిగారు. శర్మిష్ఠ వలన ద్రుహ్యుడు, పూరుడు అను పుత్రులు కలిగారు. యదువుకు సహస్రజిత్తు, క్రోష్టుడు, నలుడు, రిపుడు అను కుమారులు కలిగారు. సహస్రజిత్తుకు హేహయుడు, వేణుహయుడు, హైహయుడు అను కుమారులు కలిగారు. హైహయునకు ధర్మనేత్రుడు, కార్తి, సహస్రజిత్తు, మహిష్మంతుడు, భద్రశ్రేణ్యుడు, దుర్ధముడు, ధేనుకుడు అను కుమారులు కలిగారు. ధేనుకునకు కృతవీర్యుడు, కృతాజ్ఞి, కృతధన్వుడు, కృతాంజలుడు జన్మించారు. కృతవీర్యునకు కార్తవీర్యుడు అను కుమారుడు కలిగాడు. కార్తవీర్యునకు శూరుడు, శూరసేనుడు, ధృష్టుడు, జయధ్వజుడు అను కుమారులు కలిగారు. జయధ్వజుడు అవంతీ పురరాజయ్యాడు. అతడి నూరుగురు కుమారులు తాలజంఘులు. తాలజంఘుల వంశంకరుడు వృషుడికి మధువు అను కుమారుడు కలిగాడు. మధువు వలన మాధవులు, వృష్టి వలన వృష్టులు వృద్ధి చెందారు.
ఈ గ్రంథం లోని ఇతర అధ్యాయాలు
[మార్చు]- అంధకవంశము
- వృష్ణి వంశము
- శ్యమంతకమణి కథ
- భూదేవీ విలాపము
- సముద్రుడు శంతనుడు
- శ్రీకృష్ణావతారము
- పూతనా సంహారం
- శకటాసుర సంహారము
- శ్రీకృష్ణుడి బాలక్రీడలు
- యమళార్జున భంజనము
- బృందావనముకు తరలుట
- కాలకలి నిర్మూలనము
- నీలాపరిణయము
- కాళీయమర్ధనము
- బలరాముని ప్రభావము
- బలదేవుడు
- గోవర్ధనోద్ధరణ
- రాసక్రీడలు
- వృషభాసుర వధ
- కంసుని కలత
- కేశి సంహారము
- మధురకు పయనము
- మధురలో ప్రవేశించుట
- కుబ్జను అనుగ్రహించుట
- కంసుడి విల్లును విరచుట
- కంసుడి జన్మరహస్యము
- కంస వధ
- ఉగ్రసేనుడికి పట్టముగట్టుట
- గురుకుల వాసము
- నృగాలవాసుదేవుడి సంహారము
- జరాసంధుడి దండయాత్ర
- కాలయవనుడి అంతము
- ద్వారక నిర్మాణము
- రుక్మిణీ కల్యాణము
- ప్రద్యుమ్నుడు
- శుభాంగి స్వయంవరము
- అనిరుద్ధుడి పరిణయము
- బలరాముడి జూదము
- నరకాసుర వధ
- సురకన్యల విముక్తి
- పారిజాతాపహరణము
- ఘంటాకర్ణ విముక్తి
- పౌండ్రుని వధ
- శివకేశవ సమాగమము
- బాణాసుర వృతాంతము
- శివకేశవ సంగ్రామము
- ఉషాపరిణయము
- వరుణుని జయించుట