Jump to content

విమాన వాహకనౌక

వికీపీడియా నుండి
అట్లాంటిక్ మహాసముద్రంలో హెచ్.ఎం.ఎస్. ఇల్లస్ట్రియస్

విమాన వాహకనౌక లేదా విమాన రవాణాఓడ (aircraft carrier) అనేది సముద్రాలలో సైనిక విమాన అవసరాలకు స్థావరంగా తోడ్పడే ఒక యుద్ధనౌక. వీటికి పూర్తి నిడివి ఓడ కప్పు (flight deck) కలిగి ఉంటుంది. విమాన యంత్రాంగ సన్నాహాలు, మోహరింపు, పునరుద్ధరణ సౌకర్యాలు కూడా కలిగి ఉండవచ్చు. భూస్థాపరాల అవసరం లేకుండా దూరప్రాంత వైమానిక కార్యకలాపాలు వీలుచేయటం వలన నౌకాదళంలో సాధారణంగా ముఖ్య ఓడగా ఇది వ్యవహరిస్తుంది. విమాన వాహకాలు నిర్మించడానికి చాలా ఖరీదవుతుంది, కాబట్టి ఇవి క్లిష్టమైన ఆస్తులలో ఒకటి.

విమాన వాహకలకంటూ ఒక స్థిర నిర్వచనం లేదు. ఆధునిక నౌకాదళాలు అనేక రూపాంతరాల వాహకలు వాడుతున్నాయి. కొన్నిసార్లు ఈ వాహకలు విమాన వాహకలలో ఉపరూపలగా వర్గీకరించబడతాయి. మరికొన్ని సార్లు వేరే రకమైన ఏవియేషన్-సామర్థ్య నౌకలుగా గుర్తించబడతాయి. ఇవి మోసే విమానాల బట్టి, కార్యాచరణ కేటాయింపులను బట్టి వీటిని వర్గీకరించవచ్చు. బ్రిటిష్ రాయల్ నేవీ దళపతి మార్క్ స్టాన్హోప్ మాటలలో, "సులువుగా చెప్పడానికి, వ్యూహాత్మక అంతర్జాతీయ ప్రభావం కోరుకునే దేశాల కొఱకే విమాన వాహకలు."

చరిత్ర

[మార్చు]

మూలాలు

[మార్చు]
జపనీయుల సముద్ర విమాన వాహకనౌక వకమియ

1912 మే 9 లో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన హెచ్.ఎం.ఎస్. హైబర్నియా ఓడకప్పు నుండి మొట్టమొదట సారి విమానం ఎగిరే పరీక్షలు జరిపింది. 1911 లో సముద్రంలో విమానాల సహాయం కొఱకు మాత్రమే ఉపయోగపడే ఓడను ఫ్రెంచివారు నిర్మించారు. సెప్టెంబరు 1914 లో మొట్టమొదటి సారి జపాన్ సామ్రాజ్య నౌకాదళం విజయవంతంగా విమాన వాహకనౌక సహాయంతో వాయు దాడి పూర్తిచేసింది. దీనితో సమ ఉపరితల (Flat top) ఓడలు పెద్ద ఎత్తున ఉత్పత్తి కావడం మొదలయింది. 1918 లో, హెచ్.ఎం.ఎస్. ఆర్గస్, విమానాలు మోహరించడం, కోలుకునే సామర్ధ్యం కల్గిన మొదటి వాహకంగా మారింది. ప్రారంభంలో సరుకు ఓడలు, క్రూజర్లు, యుద్ధనౌకలు విమాన వాహకనౌకలుగా మార్పిడి చెందాయి. 1920 లో అనేక నౌకాదళాలు ఉద్దేశ్యపూరితంగా యుద్ధనౌకలను విమాన వాహకనౌకలుగా రూపొందించడానికి ఆదేశాలు జారీచేశాయి. దీనితో హోషో, హెచ్.ఎం.ఎస్. హెర్మస్, బియాన్ వంటి ప్రతిష్ఠాత్మక వాహకనౌకలు నియమింపబడ్డాయి.

రెండవ ప్రపంచ యుద్ధం

[మార్చు]

విమాన వాహకనౌకలు నౌకాపోరులో నాటకీయ మార్పులు తీసుకువచ్చాయి. వైమానిక ఆధిపత్యం యుద్ధంలో ఒక ముఖమైన అంశంగా మారింది. వాహకనౌకలు, వాటితోపాటు అభికేంద్ర విమానాలు (Focal aircraft), అందుబాటులోకి రావటంతో పరిధి, వశ్యత, ప్రభావం పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో, ఈ ఓడలే అమెరికా, బ్రిటిష్, జపనీయ నౌకాదళాలకు వెన్నుపూసలా నిలిచాయి. 1941 లో జపనీయులు పెర్ల్ హార్బర్ పై జరిపిన ఆశ్చర్య దాడి వీటియొక్క శక్తివంతమైన ప్రక్షేపక సామర్థ్యాలకు ఉదాహరణ. తక్కువ-శ్రేణి కాల్పులు మాత్రం వీటి బలహీనత.

యుద్ధానంతర శకం

[మార్చు]

ప్రపంచ యుద్ధం ముందు 1922, 1930, 1936 అంతర్జాతీయ నౌకా ఒప్పందాలు అన్ని యుద్ధ నౌకల పరిమాణాలను అదుపులో ఉంచాయి. ఆ తర్వాత నుండి పెరుగుదల కల్పించేందుకు వాహకనౌకల పరిమాణం స్థిరంగా పెరుగుతూ వస్తుంది. నేటి వాహకనౌకల ఎంత విలువంటే తయారీకి దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక ప్రభావాలను ముప్పులో పెడుతున్నాయి. యుద్ధం తరువాత, నౌకలపై కార్యకలాపాలకు పరిమాణం, ప్రాముఖ్యత పెరగటం కొనసాగింది. హెచ్చువాహకలు (Supercarriers) వాహకనౌకల వృద్ధిలో పరాకాష్ఠగా మారాయి. కొన్ని అణు రియాక్టర్ల ఆధారంగా, యుద్ధనావల సముహంలో ముఖ్యభాగంగా వ్యవహరిస్తూ స్వస్థలానికి దూరంగా పనిచేస్తున్నాయి. ఉభయచర దాడి నౌకలు నావికాదళాలను మోయడానికి, దింపడానికి ఉపయోగపడుతున్నాయి.

రకాలు

[మార్చు]

విమాన వాహకనౌకలు వాటి పాత్రల బట్టి, ఆకృతీకరణ బట్టి, పరిమాణం బట్టి వర్గీకరించబడతాయి.

పాత్ర వలన

[మార్చు]

విమాన వాహక వాడుక పద్ధతితో ఆధారపడి ఈ విధంగా వర్గీకరించవచ్చు.

  1. నౌకాదళ విమాన వాహకనౌక: ప్రత్యక్ష యుద్ధంనకు (Fleet carriers)
  2. రక్షణదళ విమాన వాహకనౌక: ఇతర ఓడల కూటమిని రక్షించేటందుకు (Escort carriers)
  3. ఉభయచర దాడి వాహకనౌకలు: భూ, సముద్ర దాడులకు (Amphibious assault ship)
  4. హెలికాప్టర్ వాహకం: హెలికాప్టర్లను మాత్రమే మోసుకునుటకు
  5. జలాంతర్గామి వ్యతిరేక విమాన వాహకాలు (Anti-submarine warfare carrier)

పరిమాణం వలన

[మార్చు]
  1. తేలిక విమాన వాహకం
  2. నౌకాదళ విమాన వాహకం
  3. హెచ్చువాహకలు
  4. భారీ విమానయాన క్రూజర్లు

విమాన మోహరింపు వలన

[మార్చు]

విమానాలు ఎగిరే, దిగే విధానాల బట్టి వాహకనౌకలు ముఖ్యంగా నాల్గు విధాలుగా విభజించబడ్డాయి.

  1. కాటాపుల్ట్ ద్వారా ఎగరడం కాని అడ్డగించబడిన దిగడం (CATOBAR)
  2. హద్దుగల ఎగరడం కాని అడ్డగించబడిన దిగడం (STOBAR)
  3. హద్దుగల ఎగరడం నిలువుగా దిగడం (STOVL)
  4. హెలికాప్టర్ వాహకం - నిలువుగా ఎగరడం నిలువుగా దిగడం

భారతదేశ నౌకాదళం

[మార్చు]
INS విక్రమాదిత్య

ప్రస్తుతం

[మార్చు]

ఒక STOBAR వాహకం INS విక్రమాదిత్య, 45,400 టన్నుల పరివర్తిత కీవ్ శ్రేణి విమాన వాహకనౌక. 2004 జనవరి 20 లో, కొన్ని ఏళ్ళ రాజీ తర్వాత 16 వేల కోట్ల రూపాయలకు భారత ప్రభుత్వం ఈ వాహకం కొన్నది. జూలై 2013లో సముద్ర పరీక్షలు, సెప్టెంబరు 2013లో వాయు పరీక్షలు విజయవంతంగా ఈ ఓడ పూర్తిచేసింది. ఇది అధికారికంగా సెవెరొడ్విన్స్క్, రష్యా జరిగిన ఒక వేడుకలో 2013 నవంబరు 16 న ప్రారంబించబడింది.[1]

ఒక STOVL వాహకం INS విరాట్, 28,700 టన్నుల పాత బ్రిటిష్ మార్పు చెందిన హెచ్.ఎం.ఎస్. హెర్మస్ వాహకం. 1986లో కొనుగోలు, 1987లో నియమించబడింది, 2016 నాటికి ఉపసంహరించనుంది.[2]

భవిషత్తు

[మార్చు]

40,000 టన్నుల, 260 మీటర్ల పొడువుగల విక్రాంత్ శ్రేణి విమాన వాహకనౌక 2009 లో నిర్మించటం మొదలుపెట్టింది. ఈ కొత్త వాహకం మికోయాన్ మిగ్-29కేను, నావిక విమానం అయిన HAL తేజస్ను, భారత తయారి హెలికాప్టర్ HAL ధృవ్ను నడపనుంది. 160 బలగాలను, 1,400 నావికులను, and 30 విమానాలను మోస్తుంది. 15,000 కీ.మీ.ల పరిధి ఉంది. నాలుగు గ్యాస్ టర్బైన్ ఇంజన్ల సహాయంతో నడుస్తుంది. కొచ్చి నౌక నిర్మాణ కేంద్రంలో తయారవుతుంది.

మరో విక్రాంత్ శ్రేణి విమానం 65,000 టన్నుల బరువుతో, అణుశక్తి పై ఆధారపడే, CATOBAR వర్గానికి చెందిన INS విషాల్ రూపకల్పన దశలో ఉంది.

వీటిని కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. "Aircraft carrier INS Vikramaditya inducted into Indian Navy". IBN Live. IN. Archived from the original on 18 నవంబరు 2013. Retrieved 16 November 2013.
  2. "INS Viraat to be decommissioned in 2016".