వికీపీడియా:పేజీ క్లుప్త వివరణ
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: ప్రధాన పేరుబరిలో ఉన్న వ్యాసాలన్నిటికీ, ప్రధాన పేరుబరిలో ఉన్న ఇతర పేజీలు (దారిమార్పులు, అయోమయ నివృత్తి వగైరాలు) దాదాపుగా అన్నిటికీ ఆ పేజీ గురించి సుమారుగా 40 అక్షరాల్లో ఒక చిన్నపాటి, క్లుప్తమైన వివరణ ఉండాలి. ఈ వివరణలను మొబైలు యాప్స్ లోను, వెతుకులాట ఫలితాలను మెరుగుపరచడం లోనూ వాడుతారు. |
వికీపీడియా వ్యాసం లేదా ప్రధాన పేరుబరి లోని ఇతర పేజీల క్లుప్త వివరణ ఆ పేజీ పరిధిని సంక్షిప్తంగా వివరిస్తుంది. వికీపీడియా మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా వెతుకులాటలను పెంచడానికి ఈ వివరణలను ఉపయోగిస్తుంది. వికీపీడియా యాప్ లో వ్యాసం శీర్షిక క్రింద ఈ వివరణను చూపిస్తుంది.
మొదట్లో, వికీడేటాలోని అంశపు వివరణ ఫీల్డు నుండి సంక్షిప్త వివరణలు వచ్చేవి. కాని మరొక ప్రాజెక్టు నుండి నేరుగా సమాచారాన్ని చేర్చడం పట్ల వెలువడ్డ ఆందోళనల కారణంగా, వికీమీడియా ఫౌండేషన్ (WMF) వికీపీడియాలోనే రాసుకున్న క్లుప్త వివరణలతో వీటిని ఓవర్రైట్ చేయడానికి వీలు కల్పించింది.
అంతిమంగా, వికీపీడియా వ్యాసాలన్నిటి లోనూ, షార్ట్ డిస్క్రిప్షన్ అనే మూస ఉండాలి. మూసలో వివరణ ఖాళీగా ఉండొచ్చు గాక,మూస మాత్రం ఉండాలి. దీనివలన, వివరణ చేర్చాల్సిన కొత్త వ్యాసాలను ట్రాక్ చేయడం సులభంగా ఉంటుంది.
అంతర్గత వికిలింక్‌లను ఉల్లేఖించడానికి {{Annotated link}} ఉల్లేఖన టెంప్లేట్ ద్వారా కూడా క్లుప్త వివరణలను చూడవచ్చు.
క్లుప్త వివరణ ఉండాల్సిన పేజీలు
[మార్చు]- ప్రధాన పేరుబరి లోని పేజీలు చాలావాటికి క్లుప్త వివరణ ఉండాలి.
- ప్రధానబరిలో వ్యాసాలు కాని పేజీల్లో - దారిమార్పులు, అయోమయ పేజీలు వంటివి - సాధారణంగా క్లుప్త వివరణలు ఉండాలి. అయితే అది అక్కరలేని సందర్భాలు ఉండవచ్చు. ఓ జనరిక్ మూస ద్వారా సాధారణ సంక్షిప్త వివరణ ఈ తరగతి పేజీల్లో పెట్టే వీలుంది. పెద్ద సంఖ్యలో పేజీలకు ఇలా చెయ్యవచ్చు.
- నిర్దుష్ట పేజీలు లేదా పేరుబరుల్లో క్లుప్త వివరణ ఉండనక్కర్లేదని చెప్పే విధానం గాని, శైలి మార్గదర్శకత్వం గానీ లేదు. మీ విచక్షణను వాడండి.
దిద్దుబాటు చేసే పద్ధతులు
[మార్చు]సంక్షిప్త వివరణ వ్యాసం కంటెంట్‌లో భాగం. కంటెంట్ నిర్ణయాల యొక్క ప్రామాణిక ప్రక్రియలకు లోబడి ఉంటుంది, వీటిలో బోల్డ్-రివర్ట్-డిస్కస్, దిద్దుబాటు యుద్ధాలు, దుశ్చర్యలకు సంబంధించిన నియమాలన్నీ వర్తిస్తాయి. సంక్షిప్త వివరణలు అనేక వికీపీడియా కంటెంటు ప్రమాణాలకు లోబడి ఉంటాయి : జీవిస్తున్నవారి జీవిత చరిత్ర వ్యాసాలు, వికీపీడియా: తటస్థ దృక్పథం వంటి వాటితో సహా. అయితే, శీర్షిక వలె, వాటికి ఇన్లైన్‌లో మూలాలను సూచించలేరు. వ్యాసం శీర్షికల మాదిరిగానే, వాటిని ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయిస్తారు.
క్లుప్త వివరణలను సృష్టించడానికీ సవరించడానికీ అత్యంత అనుకూలమైన మార్గం క్లుప్త వివరణ గాడ్జెట్‌ను ఉపయోగించడం. దయచేసి దారిమార్పులు / సత్వరమార్గాలను సృష్టించవద్దు, ఉపయోగించవద్దు. గాడ్జెట్ ఈ పనిని బాగా చేస్తుంది. దారిమార్పులు గాడ్జెట్ పనితీరును విచ్ఛిన్నం చేస్తాయి. మీరు మానవికంగా ఈ పని చేయదలిస్తే, {{Short description}}
టెంప్లేట్ ను ఉపయోగించండి.
దారిమార్పులు వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం ఇతర టెంప్లేట్ల లోపల {{Short description}}
ను వాడటంలో ఈ పరిమితి వర్తించదు. ఇక్కడ ఇప్పటికే ఉన్న టెంప్లేట్‌లో ట్రాన్స్‌క్లూజన్ ద్వారా సాధారణ వర్గ వివరణ మొత్తం పేజీల పేజీలకు జోడించబడుతుంది.
క్లుప్త వివరణ రాయడం
[మార్చు]క్లుప్త వివరణ రాసేటప్పుడు, ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి.
ప్రయోజనాలు
[మార్చు]వ్యాసం కవర్ చేసిన క్షేత్రాన్ని సంక్షిప్తంగా సూచించడంతో పాటు అనేక ప్రయోజనాలకు సంక్షిప్త వివరణ ఉపయోగపడుతుంది. క్లుప్త వివరణాత్మక ఉల్లేఖనగా పనికొస్తుంది. వెతుకులాటలో అయోమయ నివృత్తికి, ప్రత్యేకించి ఒకే విధమైన పేరు కలిగి వివిధ రంగాలకు చెందిన విషయాలను వేరు చేయడానికి, పనికొస్తుంది.
విషయము
[మార్చు]డెస్క్‌టాప్ లేదా మొబైల్‌లో చూసినపుడు, వ్యాసం శీర్షికకు సరిగ్గా కింద క్లుప్త వివరణ కనిపిస్తుంది. క్లుప్త వివరణలు సాధ్యమైనంతవరకు కింది విధంగా ఉండాలి:
- వివాదాస్పదంగాను, తీర్పు ఇస్తున్నట్లు గానూ కాకుండా ఉండాలి. వేగంగా మారిపోయే లాగా ఉండకూడదు. సార్వత్రికంగా ఆమోదించబడిన వాస్తవాలను ఉపయోగించండి
- ప్రత్యేక పరిభాషను వాడకండి. ఈ విషయం గురించి ముందే వివరణాత్మక జ్ఞానం ఉంటే తప్ప అర్థం కానట్లుగా వివరణ క్లుప్త ఉండరాదు. సరళమైన, సులభంగా అర్థమయ్యే పదాలను వాడండి
- విషయాన్ని ఖచ్చితంగా నిర్వచించటానికి ప్రయత్నించకుండా, పైన పేర్కొన్న ప్రయోజనాలపై దృష్టి పెట్టండి
- పేజీ శీర్షికలో ఉన్న సమాచారాన్నే మళ్ళీ క్లుప్త వివరణ లోనూ రాయకండి.
- చాలా ముఖ్యమైన సమాచారంతో క్లుప్త వివరణను మొదలు పెట్టండి (కొన్ని మొబైల్ యాప్‌లు ఎక్కువ నిడివి ఉన్న వివరణలను కత్తిరిస్తాయి).
ఫార్మాటింగ్
[మార్చు]క్లుప్త వివరణలు కింది విధంగా ఉండాలి:
- HTML ట్యాగ్‌లు, వికీ మార్కప్‌లూ ఏమీ లేకుండా సాదా వచనంలో రాయాలి
- ఇంగ్లీషులో కాకుండా తెలుగు లోనే రాయండి.
- ప్రారంభ కథనాలను నివారించండి (A, An, The)
- క్లుప్తంగా రాయండి: సాధ్యమైనంత వరకు సుమారు 40 అక్షరాల కంటే ఎక్కువ రాయవద్దు. (అవసరమైనప్పుడు దానికి మించి కూడా రాయవచ్చు).
క్లుప్త వివరణ ఎక్కడ లభించవచ్చు
[మార్చు]- వికీ ప్రాజెక్టుల్లో ఆయా వ్యాసాలకు వర్తించే ప్రామాణిక ఆకృతి దొరకవచ్చు.
- వికీడేటాలో వికీపీడియా వ్యాసానికి సంబంధించిన అంశంలో వివరణ ఉంటుంది. సముచితంగా ఉందని భావిస్తే దాన్నే ఇక్కడ కాపీ చెయ్యవచ్చు. వికీడేటాలో తెలుగు వివరణ లేకపోతే, ఇంగ్లీషు వివరణను అనువదించి ఇక్కడ పెట్టుకోవచ్చు. వికీడేటా వివరణను ఉపయోగిస్తే మాత్రం అది సముచితంగాను, ఖచ్చితంగానూ ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యం. ఎందుకంటే వికీడేటా వివరణలు అన్నీ వికీపీడియా కంటెంట్ విధానాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. ప్రత్యేకించి, జీవిస్తున్నవారి జీవిత చరిత్ర వ్యాసాలకు, వైద్య వ్యాసాలకూ ఇది చాలా ముఖ్యమైనది.
ఏదైనా వ్యాసానికి క్లుప్త వివరణ వికీపీడియాలో లేకపోతే as of 2020 సెప్టెంబరు[update] వికీడేటా వివరణను వాడుతోంది. భవిష్యత్తులో ఈ ఏర్పాటును తీసేస్తారు.
క్లుప్త వివరణలను చేర్చడం ఎలా
[మార్చు]{{Short description}} మూసను వాడి క్లుప్త వివరణను చేర్చవచ్చు
వ్యాసాలన్నిటికీ క్లుప్త వివరణ ఉండాలి. అనేక వ్యాసాలకు ఒకే క్లుప్త వివరణ ఉండేట్లైతే (ఉదా: ఒక మండలం లోని గ్రామాలు లేదా ఒక జిల్లా లోని మండలాలు) ఈ వ్యాసాలన్నీ ఉపయోగించే మూసలో {{Short description}} మూసను చేర్చవచ్చు. ఉదా: మూస:గుంటూరు జిల్లా మండలాలు అనే మూసలో {{Short description}} మూసను చేర్చి దాని పరామితిలో "గుంటూరు జిల్లా లోని మండలం" అని రాస్తే, ఆ జిల్లా లోని మండలాల పేజీలన్నిటికీ ఈ క్లుప్త వివరణ చేరుతుంది.
{{Short description}} మూస పేజీలో అన్నిటికంటే పైన ఉండాలి. అంటే తొలగింపు / రక్షణ వగైరా ట్యాగులు, CSD, PROD, AFD, PP వగైరా నోటీసులు, నిర్వహణ లేదా వివాదం ట్యాగులు మొదలైన వాటన్నిటికంటే పైన ఉండాలి.
- మినహాయింపులు: దారిమార్పు పేజీల్లో #దారిమార్పు క్రింద {{Short description}} ఉండాలి.
- పేజీలో ట్రాన్స్‌క్లూడు చేసిన మరొక మూస లోపల {{Short description}} మూసను వాడినపుడు. ఉదా Infobox మూస. అప్పుడు ఈ మూసకు రెండవ పరామితి
| noreplace ని చేర్చండి
పేజీలో నేరుగా మానవికంగా ఏదైనా క్లుప్త వివరణ చొప్పించినపుడు దాన్ని అధిగమించటానికిలిప్యంతరీకరణ ఈ పరామితి వీలు కలిగిస్తుంది.
పేజీలో కనిపించేలా చెయ్యడం ఎలా
[మార్చు]డెస్క్‌టాప్ బ్రౌజర్‌ని ఉపయోగించి వికీపీడియాను సందర్శించినప్పుడు క్లుప్త వివరణ సాధారణంగా కనిపించదు. ఇది మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా కనిపిస్తుంది.
డెస్క్‌టాప్ బ్రౌజర్‌ల నుండి క్లుప్త వివరణలను చూడటానికి, కింది పద్ధతిని పాటించాలి:
- మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఉన్న common.js పేజీని తెరవండి. ఉదాహరణకు వాడుకరి:Chaduvari/common.js
- ఆ పేజీలో అన్నిటి కంటే అడుగున కింది కోడ్‌ను చేర్చండి:
mw.loader.getScript( 'https://en.wikipedia.org/w/load.php?modules=ext.gadget.libSettings' ).then( function() { mw.loader.load( 'https://en.wikipedia.org/w/load.php?modules=ext.gadget.Shortdesc-helper' ); })
- భద్రపరచండి. ఇక ప్రతీ పేజీ లోనూ పేజీ శీర్షిక కింద ఈ క్లుప్త వివరణ కనిపిస్తుంది. పక్కనే దాన్ని దిద్దుబాటు చేసే లింకు కూడా కనిపిస్తుంది.
క్లుప్త వివరణ కనిపిస్తోంది గానీ, పేజీలో ఆ కోడ్ కనిపించడం లేదా?
[మార్చు]పేజీలో {{Short description}}
మూస కనబడకపోతే, కింది పరిశీలనలు చెయ్యండి:
{{SHORTDESC: }}
మేజిక్ పదం ఉందేమో చూడండి.- అది కనబడకపోతే, పేజీలోని సమాచారపెట్టె మూసలో క్లుప్త వివరణ పరామితి ఉందేమో చూడండి.
- ఇది కూడా లేకపోతే, ఇది మెటాడేటా నుండి స్వయంచాలకంగా ఉత్పత్తి చేస్తుందేమో చూడాలి; మూస డాక్యుమెంటేషన్ పేజీని చూడండి. అవసరమైతే ఇన్ఫోబాక్స్ ఉపయోగించే మెటా-టెంప్లేట్ పేజీ చూడండి. మెటా-టెంప్లేట్ అటువంటి పరామితిని కలిగి ఉందనీ, దాన్నుండి ఉత్పన్నమైన ఈ మూసలో లేదనీ మీరు కనుగొంటే, దయచేసి దాన్ని ఉత్పన్నమైన మూసల్లో దాన్ని చేర్చండి. దాని డాక్యుమెంటేషన్లో కూడా దీని గురించి చేర్చండి. స్వయంచాలక క్లుప్త వివరణలను తరచూ ఓవర్‌రైడు చేస్తూండాలి.
- పోర్టల్స్ వద్ద, పోర్టల్ కోడ్‌లో
{{Portal description}}
మూస ఉందేమో చూడండి. మీరు|topic=
అనే పరామితిని చేర్చి స్వయంచాలకంగా ఉత్పత్తి అయిన టాపిక్ పేరును ఓవర్‌రైడు చేయవచ్చు. - ఇంకా కనబడలేదా? ఆ పేజీలో ట్రాన్స్‌క్లూడు అయిన ఇతర మూసలు లేదా వికీడేటా-సంబంధిత కోడ్ కోసం చూడండి.