Jump to content

లారీ పేజ్

వికీపీడియా నుండి
లారీ పేజ్
Larry Page in the European Parliament, 17.06.2009 (cropped)
జననం
లారెన్స్ ఎడ్వర్డ్ పేజ్

(1973-03-26) 1973 మార్చి 26 (వయసు 51)
ఈస్ట్ లన్సింగ్, మిచిగాన్
జాతీయతఅమెరికా
విద్యాసంస్థస్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
మిచిగాన్ విశ్వవిద్యాలయం
ఈస్ట్ లాన్సింగ్ హై స్కూల్
వృత్తికంప్యూటర్ శాస్త్రవేత్త, సాంకేతిక నిపుణుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గూగుల్ సహా వ్యవస్థాపకుడు
నికర విలువIncreaseUS$15 billion (2010)[1]
జీవిత భాగస్వామిలుసిండా సౌత్వోర్త్

లారన్స్ "లారీ" పేజ్ [2] (1973 మార్చి 26 జననం), అమెరికాకు చెందిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, సాఫ్ట్‌వేర్ డెవలపర్, వాణిజ్యవేత్త. సెర్జీ బ్రిన్ తో కలిసి గూగుల్ యొక్క స్థాపనకర్తగా ఇతను సుప్రసిద్ధుడు. ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా 2011 జనవరి 21 నాడు ప్రకటించినట్లుగా,[3] అతను గూగుల్ యొక్క రోజువారి కార్యకలాపాలను చూసుకునే ప్రధాన ఎగ్జిక్యూటివ్ అధికారిగా 2011 ఏప్రిల్ 4 నుంచి బాధ్యతలు తీసుకున్నాడు.[4]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

మిచిగన్ లోని ఈస్ట్ లాన్సింగ్ లో ఒక యూదుల కుటుంబములో పేజ్ జన్మించాడు.[5][6] అతని తండ్రి కార్ల్ పేజ్, 1965లో కంప్యూటర్ రంగం తోలి దశలో ఉన్నప్పుడే కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్.డి పట్టా పొందాడు. "కంప్యూటర్ సైన్స్, కృత్తిమ పరిజ్ఞానం (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) రంగాలకు వైతాళికుల"గా అయిన పేరొందాడు. ఆయన, పేజ్ తల్లి ఇద్దరూ మిచిగన్ స్టేట్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు.[7][8]

పేజ్ ఒకేమోస్, మిచిగన్ లోని ఒకేమోస్ మాన్టెసరి స్కూల్ (ప్రస్తుతం మాన్టెసరి రాడ్మూర్ అని పిలవబడుతుంది)లో 1975 నుంచి 1979 వరకు చదివి 1991లో ఈస్ట్ లాన్సింగ్ ఉన్నత పాఠశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.[9] అతను మిచిగన్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో బేచలర్ ఆఫ్ సైన్స్ ఆనర్స్ డిగ్రి, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్సులో మాస్టర్ డిగ్రిలు పొందాడు. మిచిగన్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు "లెగో బ్రిక్" లతో (వాస్తవానికి ఒక లైన్ ప్లాటర్) చేయబడిన ఒక ఇంకుజెట్ ప్రింటర్ ను రూపొందించాడు. అంతే కాక [10] ఫాల్ 1994లో HKN కు అధ్యక్షుడిగా[11] వ్యవహరించాడు, శౌర్య కార్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు.

ఒక ముఖాముఖిలో తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న పేజ్, "తమ ఇంట్లో కంప్యూటర్లు, పాపులర్ సైన్స్ పత్రికలు అన్ని చోట్ల పడి ఉండి ఎప్పుడూ గందరగోళంగా ఉంటుందని చెప్పాడు." అతనికి ఆరు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే, "చుట్టూ పడి ఉన్న వస్తువులతో ఆడడం" ప్రారంభించినప్పుడు కంప్యూటర్ల మీద ఆకర్షణ మొదలయింది. "ప్రాధమిక పాఠశాలలో ఒక వర్డ్ ప్రాససర్ నుంచి ఒక అసైన్మెంట్ ను పూర్తి చేసిన మొదటి బాలుడు"గా నిలిచాడు.[12] వస్తువులను ఎలా విడివిడిగా విడగొట్టాలని అతనికి అతని అన్నయ్య కూడా నేర్పించడంతో, త్వరలోనే "ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటిని అవి ఎలా పని చేస్తున్నాయో అని తెలుసుకోవడానికి వాటిని విడగొట్టేవాడు." "బాల్యం నుంచే కొత్తవి కనిపెట్టాలని నాకు కోరిక ఉండేదని నేను తెలుసుకున్నాను" అని అతడు చెప్పాడు. అందువలన, నాకు సాంకేతికం... వ్యాపారం. . . పై చాలా ఆసక్తి కలిగింది. నేను ఎట్టకేలకు ఒక సంస్థను స్థాపించబోతున్నానని బహుశా నా 12వ వయస్సు నుంచే నాకు తెలుసు.[12]

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్.డి. ప్రోగ్రాంలో చేరిన తరువాత, లారీ పేజ్ ఒక డిసర్టేషన్ థీం కొరకు వెతుకుతూ ఉండగా, వరల్డ్ వైడ్ వెబ్ యొక్క అనుసంధాన నిర్మాణాన్ని ఒక భారి గ్రాఫ్ మాదిరిగా అవగాహాన చేసుకుంటూ దాని యొక్క గణితాత్మక అంశాలను పరిశీలిద్దామని అనుకున్నాడు.[13] అతని సూపర్వైజర్ అయిన టెర్రీ వినోగ్రాడ్ ఆ ఆలోచనను కొనసాగించమని ప్రోత్సాహించాడు. "నాకు లభించిన అత్యుత్తమ సలహా అదే" అని తరువాత పేజ్ గుర్తు తెచ్చుకున్నాడు.[14] ఏఏ వెబ్ పేజీలను ఒక ఫలాన పేజీకు అనుసంధానం చేస్తున్నాయనే విషయాన్ని కనుగొనే సమస్య పై అనంతరం పేజ్ దృష్టి సారించాడు. ఆ పేజీ గురించి తెలుసుకోవడానికి ఇటువంటి బ్యాక్ లింకుల సంఖ్య, లక్షణం విలువైన సమాచారమని అతను పరిగణించాడు (అకాడెమిక్ ప్రచురణ రంగములో సైటేషన్ల పాత్రను దృష్టిలో పెట్టుకున్నాడు.[13] "బ్యాక్‌రబ్" అని పేరు పెట్టబడిన అతని పరిశోధనా ప్రాజక్ట్ కు సెర్జీ బ్రిన్ అనే తోటి పిహెచ్.డి విద్యార్థికూడా జత కలిశాడు.[13]

వయర్డ్ పత్రిక స్థాపకులలో ఒకరైన జాన్ బాటలే పేజ్ గురించి ఈ విధంగా రాశాడు, "వెబ్ మొత్తం కూడా సైటేషన్ల పై ఆధారపడినదని - అనగా లింక్ అంటే సైటేషన్ కాకుండా ఇంకేమేటి?" అని పేజ్ ఆలోచించాడు. వెబ్ లో ఉన్న ప్రతి బ్యాక్‌లింకును లెక్క పెట్టి, దానిని విలువకట్టే ప్రక్రియను అతను కనుక్కో గలిగితే, పేజ్ చెప్పినట్లుగా "వెబ్ మరింత విలువగల స్థలమవుతుంది".[13] పేజ్, బ్రిన్ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్ట్ లో ఏ విధముగా పని చేయడం ప్రారంభించారని బాటలే మరింత వివరించారు:

"బ్యాక్‌రబ్ ను పేజ్ రూపొందించిన సమయములో వెబ్‌లో సుమారు 10 మిలియను డాక్యుమెంటులు, వాటి మధ్య లెక్కలేనన్ని లింకులు ఉండేవి. ఇంత భారీ వ్యవస్థను పూర్తిగా పరిశీలించటానాకి అవసరమైన కంప్యూటర్ సధుపాయాలు ఒక విద్యార్థిప్రాజెక్ట్ కు కావాలసిన వాటి కంటే చాలా ఎక్కువ. తాను చేపట్టిన పని గురించి పూర్తిగా అవగాహన లేకుండానే, పేజ్ తన క్రాలర్ ను రూపొందించడం ప్రారంభించాడు.
"ఈ ఆలోచన వెనుక ఉన్న క్లిష్టత, స్థాయి బ్రిన్ ను ఈ పనికి ఆకర్షించింది. ఒక ప్రాజక్ట్ నుంచి మరొక ప్రాజక్ట్ కు మారుతూ, ఏ యొక్క థీసిస్ టాపిక్ లోనూ స్థిరపడకుండా ఉన్న వివిధ రంగాలలో నైపుణ్యత కలిగిన బహుభాషాకోవిదుడు అయిన బ్రిన్ కు ఈ బ్యాక్‌రబ్ ప్ర్రాజక్ట్ వెనుక ఉన్న ఆలోచన బాగా నచ్చింది. పాఠశాలలో "నేను అనేక పరిశోధనా బృందాలతో మాట్లాడాను" అని చెపుతూ బ్రిన్ ఈ విధంగా చెప్పాడు, "రెండు కారణాల వలన ఇది అన్నిటికంటే ఇదే అత్యదిక ఆసక్తి కలిగించిన ప్రాజక్ట్ - ఒకటి ఏమంటే, ఇది మానవ మేధస్సును ప్రతిఫలించే వెబ్ కు సంబంధించినది మరొకటి నాకు లారీ అంటే ఇష్టం."[13]

బ్రిన్, పేజ్ ఇద్దరూ మొదటి సారిగా 1995 మార్చి లో, కొత్త కంప్యూటర్ పిహెచ్.డి అభ్యర్థులుగా వసంతకాల శిక్షణా సదస్సులో కలిశారు. అప్పటికే రెండు సంవత్సరాలుగా ఆ ప్రోగ్రాంలో ఉన్న బ్రిన్, కొందరు కొత్త విద్యార్థులకు విశ్వవిద్యాలయ క్యాంపస్ ను చూపించడానికి నియమించబడ్డాడు. ఆ కొత్త విద్యార్థులలో పేజ్ కూడా ఉన్నాడు. తరువాత ఆ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు.[15]

బ్యాక్‌రబ్ యొక్క వెబ్ క్రాలర్ ద్వారా సేకరించిన బ్యాక్లింక్ సమాచారాన్ని వెబ్ పేజీ యొక్క విలువను కొలిచే ఒక కొలమానముగా మార్చడానికి, బ్రిన్, పేజ్ పేజ్ రాంక్ అల్గారిధాన్ని రూపొందించారు. దీన్ని ఉపయోగించి అప్పుడు ఉన్న శోధనా ఇంజన్ల కంటే అత్యంత మెరుగైన ఒక శోధనా ఇంజన్ ను తయారుచేయవచ్చు అని వారికి అర్ధమయింది.[13] ఇది ఒక నూతన సాంకేతిక అంశం మీద ఆధారపడి ఉండి, ఒక వెబ్ పేజీని మరొక పేజీకి అనుసంధానం చేసే బ్యాక్ లింకుల ప్రాముఖ్యతను పరిశీలిస్తుంది.[15] ఆగస్టు 1996లో, గూగుల్ యొక్క తొలి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే కేవలం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ లో మాత్రమే అది అందుబాటులో ఉండేది.[13]

వ్యాపారం

[మార్చు]
యూరోపియన్ పార్లమెంట్, 2009 జూన్ 17

1998లో బ్రిన్, పేజ్ ఇద్దరూ కలిసి గూగుల్ ఇన్కార్పరేషన్ ను స్థాపించారు.[16] బ్రిన్ తో పాటు పేజ్ గూగుల్ కు ఉమ్మడి-అధ్యక్షుడుగా 2001 వరకు వ్యవహరించాడు. తరువాత ఎరిక్ ష్మిట్ ను గూగుల్ కు అధినేత, సిఈఓగా నియమించారు. 2011 జనవరిలో గూగుల్ చేసిన ఒక ప్రకటనలో అదే సంవత్సరం ఏప్రిల్ లో ష్మిట్ స్థానే సిఈఓగా పేజ్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొనబడింది.[17] పేజ్, బ్రిన్ ఇద్దరూ ఏడాదికి ఒక్క డాలర్ మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నారు. 2011 ఏప్రిల్ 4న, పేజ్ గూగుల్ కు అధికారకంగా ప్రధాన నిర్వాహణా అధికారి అవుతారు, ష్మీట్ నిర్వాహణా అధినేత (ఎక్జేక్యూటివ్ ఛైర్మన్) గా అవుతారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పేజ్ 2007లో నేకెర్ ఐలాండ్ అనే రిచర్డ్ బ్రాన్సన్ కు స్వంతమైన ఒక కరిబియన్ ద్వీపంలో లుసిండా సౌత్వర్త్ ను వివాహం చేసుకున్నాడు.[18] సౌత్వర్త్ ఒక పరిశోధనా శాస్త్రవేత్త. ఆమె నటి, మాడల్ అయిన కారీ సౌత్వర్త్ యొక్క సోదరి.[19][20][21]

ఇతర అభిరుచులు

[మార్చు]

టెస్లా మోటర్స్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన సంస్థలలో పేజ్ భారిగా పెట్టుబడి పెట్టాడు. ఆ సంస్థ టెస్లా రోడ్‌స్టర్ అనే 220-మైలు (350 కి.మీ.)బేటరీ విద్యుత్ వాహనాలను రూపొందించింది.[22] ప్రత్యామ్నాయ ఇంధనశక్తి టెక్నాలజీ పై ఇప్పటికి అతను విశ్వాసం చూపుతూ ఉన్నాడు. గూగుల్ యొక్క దాతృత్వ సంస్థ అయిన గూగుల్.ఆర్గ్ సహాయంతో ప్లగ్-ఇన్ సంకర విద్యుత్ కారులు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనశక్తి పెట్టుబడుల వాడకాన్ని అతను ప్రోత్సహిస్తున్నాడు.[12]

బ్రోకెన్ ఏరోస్ అనే ఒక 2007 నాటి చిత్రానికి బ్రిన్, పేజ్ ఇద్దరే ఎక్జిక్యూటివ్ నిర్మాతలు.

పురస్కారాలు, గుర్తింపు

[మార్చు]

2003లో "కొత్త వ్యాపారాల సృష్టికి వ్యాపార సామర్థ్య స్ఫూర్తిని, వేగాన్ని కలిగించినందుకు......" బ్రిన్, పేజ్ ఇద్దరూ IE బిజినెస్ స్కూల్ నుంచి గౌరవ MBA అందుకున్నారు,[23] 2004లో వారు మార్కోని ఫౌండేషన్ బహుమతి అందుకున్నారు. ఇది "ఇంజినీరింగ్‌లో అత్యున్నత పురస్కారం". అంతేకాక వారు కొలంబియా విశ్వవిద్యాలయంలో మార్కోని ఫౌండేషన్ ఫెల్లోస్ గా ఎన్నికయ్యారు. "వారి ఎన్నిక ప్రకటన సందర్భంగా, ఫౌండేషన్ అధ్యక్షులు జాన్ జే ఐస్లీన్ ఈనాటి సమాచార పునఃసంపాదన యొక్క మార్గాన్ని సమూలంగా మార్చివేసిన వారి నవకల్పనకు వారిద్దరిని అభినందించారు." "ఎంపికైన 32 మంది ప్రపంచ అత్యంత ప్రభావశీల సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన వైతాళికుల" సరసన వారు చేరారు.[24] 2004లో నేషనల్ అకాడమి ఆఫ్ ఇంజనీరింగ్ కు ఎన్నికయ్యాడు. 2005లో, బ్రిన్, పేజ్ ఇద్దరూ అమెరికన్ అకాడెమి అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ కు ఫెల్లోస్ గా ఎన్నికయ్యారు.[25] 2002లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేజ్ ను గ్లోబల్ లీడర్ ఫర్ టుమారో గానూ 2004లో ఎక్స్‌ ప్రైజ్ పేజ్ ను తమ పాలక మండలి ట్రస్టీగా ఎన్నుకున్నారు.[10]

అత్యుత్తమ 100 వెబ్‌సైట్లు, సెర్చ్ ఇంజిన్ (1998)లలో గూగుల్ ఒకటిగా నిలిచిందని పిసి మాగజిన్ ప్రశంసించింది. అంతేకాక 1999లో వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో నవకల్పనకు టెక్నికల్ ఎక్స్‌లెన్స్ అవార్డును గూగుల్ కు ప్రధానం చేసింది. 2000లో గూగుల్ సంస్థ వెబ్బీ అవార్డును అందుకుంది. ఇది సాంకేతిక ఘనతకు ప్రదానం చేసే ఒక పీపుల్స్ వాయిస్ అవార్డు. అలాగే 2001లో ఔట్‌స్టాండింగ్ సెర్చ్ సర్వీస్, బెస్ట్ ఇమేజ్ సెర్చ్ ఇంజిన్, బెస్ట్ డిజైన్, మోస్ట్ వెబ్‌మాస్టర్ ఫ్రెండ్లీ సెర్చ్ ఇంజిన్, బెస్ట్ సెర్చ్ ఫీచర్ అవార్డులను సెర్చ్ ఇంజిన్ వాచ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా అందజేశారు."[26]

2004లో ఏబిసి వరల్డ్ న్యూస్ టునైట్ పేజ్, బ్రిన్ ఇద్దర్ని "పెర్సంస్ ఆఫ్ ది వీక్"గా ఎన్నుకుంది. 2009లో మిచిగన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుల ప్రారంభ ఉత్సవాలలో పేజ్ గౌరవ డాక్టరేట్ పొందాడు.[27]

2009లో, ఫోర్బ్స్ వారి ప్రపంచ బిలియనర్ల జాబితాలో పేజ్ 26వ స్థానంలో నిలిచి అమెరికాలో 11వ అత్యంత సంపన్నుడుగా నిలిచాడు.[28][29]

మూలాలు

[మార్చు]
  1. Forbes Magazine (2010). "Larry Page". Forbes Magazine. Retrieved May 18, 2010.
  2. Larry Page (1999). "Lawrence or Larry Page's Page". Stanford Web Site. Retrieved May 18, 2010.
  3. {http://googleblog.blogspot.com/2011/01/update-from-chairman.html
  4. http://blogs.wsj.com/digits/2011/01/20/statement-from-eric-schmidt-on-google-ceo-change/
  5. స్ట్రాస్, రాండాల్. ప్లానెట్ గూగుల్: మనకు తెలిసినవన్నిటిని చక్కగా గుదిరించడానికి ఒక సంస్థ చేస్తున్న సాహసిక ప్రయత్నం , సైమన్ & షస్టర్ (2008) పే. 75
  6. బ్రాండ్, రిచర్డ్ ఎల్. ఇన్సైడ్ లారీ అండ్ సేర్జీస్ బ్రెయిన్ , పెంగుయిన్ (2009)
  7. స్మెల్, విల్. "ప్రొఫైల్: ది గూగుల్ ఫౌండర్స్" బిబిసి , ఏప్రిల్ 30, 2004
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-06-25. Retrieved 2020-01-08.
  9. "గూగుల్ చూసెస్ మిచిగన్ ఫర్ ఎక్స్‌పాన్షన్,"ఆఫీస్ ఆఫ్ థ గవర్నర్ కార్యాలయం, స్టేట్ అఫ్ మిచిగన్ , జూలై 11, 2006[మార్చ్ 6, 2010న తీయబడింది]
  10. 10.0 10.1 గూగుల్ సంస్థాగత సమాచారం: నిర్వాహణ: లారీ పేజ్
  11. "HKN College Chapter Directory". Eta Kappa Nu. January 15, 2007.
  12. 12.0 12.1 12.2 స్కాట్, విర్జీనియా. గూగుల్: కర్పరేష్ణ్స్ దట్ చెంజ్ద్ ది వరల్డ్ , గ్రీన్వుడ్ పబ్లిషింగ్ గ్రూప్(2008)
  13. 13.0 13.1 13.2 13.3 13.4 13.5 13.6 బాటలే, జాన్. "ది బర్త్ అఫ్ గూగుల్." విరేడ్ మగజినె. ఆగష్టు 13
  14. నాకు లభించిన అత్యుత్తమ సలహా (ఫార్చూన్, ఏప్రిల్ 2008)
  15. 15.0 15.1 మోస్చోవిటిస్ గ్రూప్. ది ఇంటర్నెట్: ఎ హిస్టోరికల్ ఎన్సైక్లోపెడియా , ABC-CLIO (2005)
  16. "Larry Page Profile". Google.
  17. "Google's Page to Replace Schmidt as CEO".
  18. గూగుల్ స్థాపకుడు లారీ వివాహమాడబోతున్నారు, రాయిటర్స్.
  19. మక్ కార్తి, మేగన్. "అధ్యక్షుడు బుష్, క్లింటన్లు గూగ్లర్ వివాహంలో కలవబోతున్నారు?" Archived 2008-09-19 at the Wayback Machineవ్యాలీవాగ్.కాం Archived 2008-09-19 at the Wayback Machine డిసెంబర్ 7, 2007.
  20. కొలరిడ్జ్, డానియల్ ఆర్. " Archived 2008-08-04 at the Wayback Machineనైట్ షిఫ్ట్ 'స్ మోడల్ ఎండి." Archived 2008-08-04 at the Wayback Machineసోప్నెట్.కాం. Archived 2008-08-04 at the Wayback Machine జులై 7 2009: సెప్టెంబర్ 10, 2006న తిరిగి చూడబడినది.
  21. గూగుల్ ఉమ్మడి-స్తాపుకుడు పేజ్ కు వివాహం Archived 2007-11-16 at the Wayback Machine, ది అసోసియేటడ్ ప్రెస్.
  22. "సిలికాన్‌బీట్: టెస్లా మోటర్స్ కొత్త విద్యుత్ స్పోర్ట్స్ కార్". Archived from the original on 2007-04-28. Retrieved 2011-02-15.
  23. బ్రిన్ అండ్ పేజ్ అవార్దేడ్ ఎంబిఏస్ Archived 2009-02-26 at the Wayback Machine, పత్రిక విడుదల, సెప్. 9, 2003
  24. బ్రిన్, పేజ్ మార్కొని ఫౌండేషన్ యొక్క అత్యుత్తమ గౌరవాన్ని అందుకున్నారు, ప్రెస్ విడుదల, సెప్. 23, 2004
  25. "అకాడమీ ఫెల్లోలు, విదేశీ గౌరవ సభ్యుల 225వ క్లాస్ ను ఎన్నుకుంది". Archived from the original on 2009-06-15. Retrieved 2020-01-08.
  26. "నేషనల్ సైన్సు ఫౌండేషన్, ఫెలో ప్రోఫైల్స్". Archived from the original on 2011-05-13. Retrieved 2020-01-08.
  27. "Larry Page's University of Michigan 2009 Spring Commencement Address=2009-10-6".
  28. మాక్ దౌగల్, పాల్. " Archived 2010-06-15 at the Wayback Machineబిల్ గేట్స్ ఇంకా అమెరికా యొక్క అత్యధిక సంపన్నుడు" Archived 2010-06-15 at the Wayback Machine, ఇన్ఫర్మేషన్ వీక్ , సెప్. 21, 2007
  29. "The 400 Richest Americans 2009". Forbes. September 30, 2009.

బాహ్య లింకులు

[మార్చు]
అంతకు ముందువారు
కంపెనీ స్థాపించబడింది
గూగుల్ సి.ఈ.ఓ
1998-2001
తరువాత వారు
ఎరిక్ స్కామిడిట్
సుందర్ పిచై
అంతకు ముందువారు
ఎరిక్ స్కామిడిట్
అల్భాబేట్ సి.ఈ.ఓ
2011- ప్రస్తుతం
తరువాత వారు
Incumbent