మహారాష్ట్రలో కోవిడ్-19 మహమ్మారి
వ్యాధి | కొవిడ్ 19 |
---|---|
ప్రదేశం | మహారాష్ట్ర భారతదేశం |
మొదటి కేసు | పూణే |
ప్రవేశించిన తేదీ | 9 మార్చి2020 (4 సంవత్సరాలు, 9 నెలలు, 2 వారాలు , 5 రోజులు) |
క్రియాశీలక బాధితులు | సమాసంలో (Expression) లోపం: -కు ఒక ఆపరాండును ఇవ్వలేదు |
ప్రాంతములు | 36 జిల్లాలు |
అధికార వెబ్‌సైట్ | |
arogya.maharashtra.gov.in Public Health Department, Maharashtra |
మహారాష్ట్రలో కరోనా వైరస్ మొదటి కేసు 2020 మార్చి 9 న నమోదయ్యింది. మార్చి 17 న, మొదటి కరోనా సోకిన వ్యక్తి మరణించాడు.
కాలక్రమం
[మార్చు]రోజువారి పాజిటివ్ కేసులు
ప్రభుత్వ సహాయక చర్యలు
[మార్చు]మార్చి9 | మహారాష్ట్రలో మొదటి పాజిటివ్ కేసు నమోదయ్యింది |
---|---|
మార్చి13 | వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూసివేత |
మార్చి14 | బహిరంగ సభలు, కార్యక్రమాలపై నిషేధం |
మార్చి20 | అవసరమైన సేవలను మినహాయించి అన్ని కార్యాలయాలు మూసివేత |
మార్చి 22 | సెక్షన్ 144 , లాక్డౌన్ విధించారు |
మార్చి 23 | అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. సరిహద్దు రాష్ట్రాలను మూసివేశారు. |
మార్చి 25 |
ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. |
ఏప్రిల్ 11 | లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. |
ఏప్రిల్ 14 | మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించారు |
మే 1 |
మే 17 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించారు |
- మార్చి 22 న మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 ప్రకటించింది. మార్చి 23 మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.
- మార్చి 23 న సిఎం ఉద్ధవ్ ఠాక్రే అన్ని జిల్లాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా కఠినమైన కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.[1]
విద్య వ్యవస్థ ప్రభావం
[మార్చు]పాఠశాలల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అన్ని విద్యాసంస్థలు మూసివేశారు.మహారాష్ట్ర ప్రభుత్వ పరీక్షలను అన్ని రద్దు చేసింది.1 నుండి 8 వ తరగతి పరీక్షలను అన్ని రద్దు చేసింది. పరీక్షలు లేకుండా పై తరగతుల్లో వెళ్ళడానికి ఆదేశాలు జారీ చేసింది.
రవాణా వ్యవస్థ ప్రభావం
[మార్చు]కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 11 నుండి మహారాష్ట్ర ప్రభుత్వం 20,000 కి పైగా బస్సు సర్వీసులు రద్దు చేశారు ఫలితంగా మార్చి 17 నాటికి ₹ 3 కోట్ల నష్టం వాటిల్లింది.ఇతర రాష్ట్రాల నుంచి వైరస్ వ్యాపిస్తుందని రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. మార్చి 22 నుంచి 31 మధ్య ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు భారత రైల్వే ప్రకటించింది.
పర్యాటక వ్యవస్థ ప్రభావం
[మార్చు]రాష్ట్రవ్యాప్తంగా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అనేక పర్యాటక ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలను మూసివేస్తామని ఆరోగ్య అధికారులు ప్రకటించారు. పర్యాటక ప్రదేశాలు ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా , ఎల్లోరా గుహలు , రాయ్‌గడ్ జిల్లాలోని ఎలిఫాంటా గుహలు పై ప్రభావం పడింది.రాష్ట్రంలో హోటళ్ళు, టాక్సీలు ప్రైవేట్ బస్సు సర్వీసు వ్యాపారాలు రద్దు చేశారు.
ఆర్థిక రంగం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Uddhav Thackeray imposes curfew in entire Maharashtra". The Economic Times. 2020-03-23. Retrieved 2020-03-23.