Jump to content

ఢిల్లీ దర్బారు పతకం (1903)

వికీపీడియా నుండి
ఢిల్లీ దర్బారు పతకం, 1903
1903 ఢిల్లీ దర్బారు పతకం ముందు వెనుక వైపులు
Typeస్మారక పతకం
Awarded forదర్బారులో కొలువు, లేదా భారత సామ్రాజ్యానికి విస్తృత సేవ
దేశంయునైటెడ్ కింగ్‌డమ్ Edit this on Wikidata
అందజేసినవారుయునైటెడ్ కింగ్‌డమ్, బ్రిటిషు రాజ్
Established1903
Total140 బంగారు, 2,567 వెండి పతకాలు
రిబ్బను పట్టీ

బ్రిటిషు పాలనలో ఉన్న భారతదేశానికి కొత్త చక్రవర్తిని ప్రకటించినపుడు ఢిల్లీ దర్బారు జ్ఞాపకార్థం యునైటెడ్ కింగ్‌డమ్ నెలకొల్పిన పతకాలను ఢిల్లీ దర్బారు పతకాలు అంటారు. [1] వీటిని రెండు సందర్భాలలో - 1903 లో ఎడ్వర్డ్ VII రాజైనపుడు ఒకసారి, మళ్ళీ 1911 లో జార్జ్ V రాజైన సందర్భంలో రెండోసారి ఈ పతకాలను ప్రదానం చేసారు. ఇవి ఒకటిన్నర అంగుళాల వ్యాసం కలిగి, బంగారు, వెండి రెండింటి తోనూ ప్రదానం చేసారు. [2] వీటిని ఎడమ ఛాతీపై పట్టాభిషేకం, జూబ్లీ పతకాలతో పాటు తేదీ క్రమంలో ధరిస్తారు. దీన్ని ఒకటిన్నర అంగుళాల వెడల్పు ఉన్న రిబ్బనుకు తగిలిస్తారు. [3] ఈ రాయల్ స్మారక పతకాలు 1918 నవంబరు వరకు ప్రచార పతకాల కంటే ముందు ధరించారు. [4] ఆ తర్వాత ధరించే క్రమాన్ని మార్చి, ప్రచార పతకాల తర్వాత, సుదీర్ఘ సేవా పురస్కారాలకు ముందూ ఈ దర్బారు పతకాలను ధరించారు.

ఢిల్లీ దర్బారు పతకం, 1903

[మార్చు]

బొమ్మ వైపున: కిరీటం ధరించిన రాజు తల కుడివైపుకు తిరిగి ఉంటుంది. తలకి ఎర్మిన్ వస్త్రాన్ని ధరించి, గార్టర్ కాలర్, బ్యాడ్జ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బాత్‌ ధరించి ఉంటుంది. బస్ట్ క్రింద లారెల్ శాఖ, రిమ్ చుట్టూ, లెజెండ్, ఎడ్‌వార్డ్ VII ఢిల్లీ దర్బారు 1903 .వెనక వైపు: గులాబీ పూల దండ లోపల - ఒక పర్షియన్ శాసనం ఉంటుంది: సామ్రాజ్య ప్రభువు, భారత చక్రవర్తి ఎడ్వర్డ్ అనుగ్రహంతో 1901 . [5] [6] [7]పతకంపై పేరేమీ లేకుండా ప్రదానం చేయబడింది. [8]

పాలకమండలి అధిపతులకు 140 బంగారు పతకాలను, ఇతర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులకు, వేడుకల్లో పాల్గొన్న సాయుధ దళాల సభ్యులకూ 2,567 వెండి పతకాలనూ అందజేశారు.[9][10]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Christopher McCreery (2012). Commemorative Medals of the Queen's Reign in Canada, 1952-2012. Dundurn. pp. 32–. ISBN 978-1-4597-0756-6.
  2. Howard N Cole. Coronation and Royal Commemorative Medals. pp. 24 and 37. Published J. B. Hayward & Son, London. 1977.
  3. "Order of wear: London Gazette: 22 April 1921, issue: 32300, page:3184".
  4. Howard N Cole. Coronation and Royal Commemorative Medals. pp. 3-4. Published J. B. Hayward & Son, London. 1977.
  5. Awards of honour: the orders, decorations, medals, and awards of Great Britain & the Commonwealth, from Edward III to Elizabeth II. Arthur Jocelyn - 1956 pp:124,127
  6. British orders and awards: a description of all orders, decorations, long service, coronation, jubilee and commemoration medals, together with historical details concerning knighthood, service ranks and similar information by Lawrence L. Gordon, Kaye & Ward, 1968 pp:78-79
  7. Henry Taprell Dorling (1918). Ribbons and Medals. G. Philip & Son. pp. 19, 40–41.
  8. Howard N Cole. Coronation and Royal Commemorative Medals. pp. 3-4. Published J. B. Hayward & Son, London. 1977.
  9. Howard N Cole. Coronation and Royal Commemorative Medals. p. 25. Published J. B. Hayward & Son, London. 1977.
  10. Mussell, John W. (ed.). Medal Yearbook 2015. p. 289. Published Token Publishing Limited, Honiton, Devon. 2015.