Jump to content

జింజిబర్

వికీపీడియా నుండి

జింజిబర్
Zingiber officinale rhizome
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
జింజిబర్

జింజిబర్ (Zingiber) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలకు చెందిన ప్రజాతి. జింజిబర్ జింగిబెరేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. దీనిని అల్లం అని పిలుస్తారు.

చరిత్ర

[మార్చు]

జింజిబర్ కుటుంబములో ఏలకులు, కలిహి, పసుపు , గాలాంగల్ వంటి జాతులు కూడా ఉన్నాయి. మొట్టమొదట గా ఆగ్నేయాసియాలో ఈ కుటుంబం విస్తరించింది . తరువాత ఆగ్నేయాసియా, ఓషియానియా, చైనా, తైవాన్ , మడగాస్కర్లలోని సాగు చేశారు.మొక్క యొక్క బెండులు (అల్లం లేదా అల్లం రూట్)పురాతన వైద్యం లో ప్రసిద్ది చెందాయి.దీని ఉపయోగాల కారణంగా, ఐరోపాకు ఎగుమతి చేసిన మొదటి కొన్ని సుగంధ ద్రవ్యాలలో అల్లం ఒకటి.“అల్లం” అనే పదం “జింగిఫెర్” నుండి, గ్రీకు “జింగిబెరిస్” నుండి, మధ్యయుగ లాటిన్ “జింగిబర్” నుండి వచ్చింది. అల్లం మొక్కలు పెరుగుదలకు వేడి , తేమ వాతావరణం లో సాగు చేయవచ్చును.వేసవికాలంలో అల్లం మూలాలను నాటడం ఉత్తమం, సాధారణ అల్లం యొక్క పరిపక్వ పరిమాణం 4 ′ - 5 అడుగుల పొడవు. ఈ మొక్కకు 19 ° - 29 ° C డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలలో పేరుగా గలదు [1]

జింజిబర్ మొక్క సముద్ర మట్టం నుండి 1500 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది, సగటు వర్షపాతం 2500-3000 మిమీ, సంవత్సరంలో సరి పోతుంది. పొడి ప్రాంతాల్లో సాగునీటి పంటగా పేరుగా గలదు . ఇది సమగ్రమైన పంట కాబట్టి, పంటకు సరిపోయిన నేల ఎక్కువగా ఉండాలి, సేంద్రియ ఎరువులు వేయాలి అధిక పంట రాబడి కోసం [2]

ఉపయోగములు

[మార్చు]

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో అల్లం ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు, ఆహారముగా తీసుకునే వాటిలో కేకులు, కూరలు, పచ్చడి, వంటి వంటకాలకు వీటిని కలుపుతారు . ఎండబెట్టి ఒక పొడిగా చేసి నిల్వ ఉంచుకుని వచ్చును . మూలికా చికిత్సలలో అల్లం రూట్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది - ఆయుర్వేదంలో,చైనీస్ మందులలో వాడతారు. జీర్ణక్రియ ,కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది, వికారం, వాంతులు,దగ్గును నియంత్రిస్తుంది.అన్ని రకములైన అనారోగ్యం లలో సహా అన్ని రకాల వికారం చికిత్సలో జింజిబర్ మొక్క ఉపయోగించబడుతుంది [3]

జాతులు

[మార్చు]

Zingiber officinale
Zingiber spectabilis
Zingiber petiolatum
Zingiber zerumbet
Zingiber purpureum
Zingiber mioga
Zingiber malaysianum

మూలాలు

[మార్చు]
  1. "Zingiber Officinale Care: Learn Tips On Growing Ginger". Plant Care Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-11-19. Retrieved 2020-09-25.
  2. "Zingiber officinale (ginger)". www.cabi.org (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
  3. "Zingiber officinale - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-10-25. Retrieved 2020-09-25.


మూలాలు

[మార్చు]