Jump to content

చెక్క

వికీపీడియా నుండి
Wood surface, showing several features

చెక్కను ఇంగ్లీషులో Wood అంటారు. ఇది చెట్ల యొక్క మాను, పెద్ద కొమ్మలు, వేర్ల నుండి లభిస్తుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది పీచు నిర్మాణ కణజాలం. వందల, వేల సంవత్సరాల నుంచి దీనిని వంట చెరుకుగాను, గృహ నిర్మాణ సామాగ్రి గాను ఉపయోగిస్తున్నారు. ఇది ఒక సేంద్రీయ పదార్థం, సెల్యూలోజ్ ఫైబర్ల యొక్క సహజ మిశ్రమం, ఇందులో ఇమిడి ఉన్న లిగ్నిన్ మాతృక (matrix of lignin) కుదింపులను నిరోధిస్తాయి. ఈ చెక్క గట్టితనం చెట్టుని బట్టి, చెట్టు పెరిగిన ప్రాంతాన్ని బట్టి, చెట్టు వయసుని బట్టి, తీసుకున్న భాగాన్ని బట్టి, తీసుకున్న పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ భూమి ట్రిలియన్ టన్నుల చెక్కను కలిగి ఉంది, ఇది సంవత్సరానికి 10 బిలియన్ టన్నుల రేటుతో పెరుగుతుంది. చెక్క వస్తువులు సమృద్ధి అయిన కార్బన్ న్యూట్రల్ పునరుత్పాదక వనరు వంటి, ఆసక్తి కరమయిన పునరుత్పాదక శక్తి. 1991లో సుమారు 3.5 బిలియన్ క్యూబిక్ మీటర్ల వుడ్ పండించబడింది. చెక్కను ఆధిపత్యంగా ఫర్నిచర్, భవన నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారు.

కళలు

[మార్చు]
Artists can use wood to create delicate sculptures.
Stringed instrument bows are often made from pernambuco or brazilwood.

చెక్క దీర్ఘ కాలంగా ఒక కళాత్మక మాధ్యమంగా వాడుతున్నారు. సహస్రాబ్దాలుగా కొయ్య శిల్పాలు, కొయ్యబొమ్మలు ఈ చెక్కపై చెక్కి తయారు చేస్తున్నారు. వయోలిన్, గిటార్, క్లారినెట్, రికార్డర్, జల తరంగిని, మారిబా వంటి కొన్ని రకాల సంగీత సాధనలను, చెక్కను ఎక్కువగా లేదా పూర్తిగా ఉపయోగించి తయారు చేస్తారు.

క్రీడలు

[మార్చు]

అనేక రకాల క్రీడా పరికరాలను చెక్కతో తయారు చేస్తారు. ఉదాహరణకు, క్రికెట్ బ్యాట్ సాధారణంగా తెలుపు విల్లో చెట్టు చెక్కతో తయారు చేస్తారు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

కలప

వెలుపలి లింకులు

[మార్చు]