ఎయిడ్స్
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా (Death Sentenced Disease) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఎయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease) వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్) అను వైరస్ వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం కు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గడం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషలకు మాత్రమే సోకుతుంది.
ఎయిడ్స్ బాధితులు
[మార్చు]2010 వరకు ప్రపంచంలో మొత్తం HIV AIDS రోగుల సంఖ్య 3,40,00000 కాగ 2010 సంవత్సరంలో కొత్తగా నమోదయిన రోగుల సంఖ్య 27,000,000.[1][2] ఎయిడ్స్ బాధితులలో అత్యధికులు ఆఫ్రికా ఖండంవారే. వారి తరువాత స్థానంలో భారతదేశం ఉంది. అంతే కాదు భారత దేశంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్లో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) చెబుతుంది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలొ మొత్తం HIV/AIDS రోగుల సంఖ్య 23,95,442 అలాగే 2009 వరకు మన రాష్ట్రంలో HIV/AIDS రోగుల సంఖ్య 4,99,620 గా ఉంది. ఒక్క 2011-2012 లోనే నమోదైన HIV/AIDS కేసులు 2,66,919 అదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే 60,952. భారతదేశంలో మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV/AIDS రోగుల సంఖ్య మార్చి 2012 వరకు 5,16,412. ఆంధ్రప్రదేశ్ నుండి 1,13,106 [3][4]గా ఉంది. దేశంలో 20% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు.ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారిపోతుఉంటాయి. పై సంఖ్యలన్ని అధికారిక లెక్కలు మాత్రమే, NACO లో నమోదు చేసుకొకుండా ప్రైవేటుగా చికిత్స అందే వారి వివరాలు ఇందులో కలపబడలేదు.
ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది?
[మార్చు]శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ గ్రీన్ చింపాంజీలకు ఎస్ఐవి (SIV) సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహ పడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు.
మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది?
[మార్చు]హెచ్ఐవి వైరసు మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాధి నిరోధకత తగ్గినకొద్ది ఎయిడ్స్ ఆహ్వానిత వ్యాధులు (Opportunistic Infections) రావటం మొదలు పెడతాయి. ART మందులు వాడటం మొదలుపెడితే ఈ వ్యాధులు రావటం అరుదు.[5]
హెచ్ఐవి మరియూ ఎయిడ్స్
[మార్చు]హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు.
హెచ్ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే:
- రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోధకత బాగా క్షీణించిందని తేలినప్పుడు. CD4 కణాల సంఖ్య 200 కంటే తక్కువ ఉన్నప్పుడు
- ఎయిడ్స్ కలిగించిన రుగ్మత (Opportunitic Infections)
ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు
[మార్చు]మనుషులలో సహజంగా రోగనిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటుంది. ఆ నిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతులు శరీరంలోకి చేరుకుంటాయి. ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా, ఆరోగ్యవంతులెవరికీ రావు. అందుకనే వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు. ఎయిడ్స్ కలిగించే కొన్ని రుగ్మతలు:
- హర్ప్‌స్ జొస్టర్ ( శింగెల్స్ గజకర్ణము )Herpes Zoster Virus (shingles)
- కపోసీస్ సర్కోమా (Kaposi's Sarcoma) - సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సరు.
- సిఎంవి రెటీనైటిస్ (CMV Retinitis) - కంటి వెనుక భాగంలో సోకే ఒక వైరసు.
- న్యుమోనియా (PCP) - ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము, ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది.
- టాక్సోప్లాస్మోసిస్ (Taxoplasmosis) - ఈ రోగము మెదడుకు సోకుతుంది.
- క్షయ (Tuberculosis)
- ఇన్వేసీవ్ సర్వికల్ క్యాన్సర్ (Invasive Cervical Cancer) - ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సరు.
హె.ఐ.వి. పరీక్షలు
[మార్చు]బాగా వ్యాధి ముదిరేవరకు తమలో జబ్బు ఉందని ఎవరూ అనుకోరు, ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్యపరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్, 2.వెస్ట్రన్ బ్లాట్, 3. సి.డి సెల్ కౌంట్.
ట్రైడాట్
[మార్చు]ఎలీసా టెస్ట్స్ లో ఇది మొదటిది. మనిషి శరీరములో ప్రవేశించిన 'హెఐవి' క్రిములకు ప్రతిస్పందన కణాలు (Antibodies) తయారవడానికి 3 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్‌ను గుర్తించవచ్చు. 'హెఐవి' ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది. ఈ టెస్ట్ చేయడము తేలిక, తొందరగా అయిపోతుంది. మాస్ స్క్రీనింగ్ విధానములో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు.
వెస్ట్రన్ బ్లాట్
[మార్చు]హెచ్.ఐ.వి నిర్ధారణ కోసం ఉపయోగించే పరీక్ష ఇది. ఖర్చు ఎక్కువ. వారం రోజులు పడుతుంది. పూర్తి టెస్ట్ వివరాలకోసం వేరే చోట చూడండి.
సిడి4 కణాల సంఖ్య
[మార్చు]మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంభిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ధ్రువపరుస్తారు.
ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది
[మార్చు]- లైంగిక సంపర్కం వలన. ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
- రక్తం ద్వారా. పచ్చబొట్లు పొడిపించుకోవటం వలన, వ్యాధి గ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించ వచ్చు. పచ్చబొట్టు వల్ల ఎందుకంటే, వారు ఒకరికి ఉపయోగించిన సూదినే మళ్ళీ ఇంకొకరికి ఉపయోగిస్తారు, అయితే ఇలాంటి కోవాకే చెందిన క్షవరం, సుంతీ, ఇంజెక్షను మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతో ఉండవలెను.
- తల్లి నుండి బిడ్డకు. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరయిన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమయిన వ్యాప్తికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి సరయిన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాప్తిని ఒక్క శాతానికి తగ్గించవచ్చు.
హెచ్ ఐ వి లక్షణాలు
[మార్చు]సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల) వరకు రక్త పరీక్షల ద్వారా వైరస్ జాడ కనుగొనలేము.[6] దీనినే Window Period అంటారు. ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగులలో కనిపిస్తాయి. జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes, మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికో దాదాపు 10 సంవత్సరాలు[7][8] పడుతుంది, కొందరిలో అంతకంటే ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలో ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితే జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు.[9] [10] [11] ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వారా ఎయిడ్స్ రోగుల జీవితకాలం పెరుగుతూ ఉంటుంది.
శిశువులలో హెచ్.ఐ.వి
[మార్చు]సాధారణంగా హెఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోడానికి కనీషము 18 నెలలు వ్యవధి కావాలి. హెచ్ఐవి తల్లుల సాదారణ పురుడులో 30% వరకూ,హెఐవి సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకు 10%-15% వరకూ,సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టినపిల్లలకు 1% జబ్బు అంటుకునే అవకాశాలున్నాయి. హెచ్ఐవి తల్లులకు గర్భినిగా ఉన్నపుడు 'ఎ.అర్.టి.' మందులు వాడమువలన బిడ్డలకు 'హెచ్ ఐ వి' సోకే అవకాశము 1-2% వరకు తగ్గుతుంది. 18 నెలలు వ్యవధిలో బిడ్డకు హెచ్ ఐవి జబ్బు ముదిరిపోయే అవకాశము ఎక్కువే కావున మామూలు పరీక్షలతో నిర్ధారణ చేయడము కంటే వేగవంతమైన పరీక్ష ఉంటే బాగుండుననే ఉద్దేశముతో ఈ మధ్యన డిఎన్ఎ-పిసీర్ పరీక్ష ద్వారా 0-7 రోజుల వయసులో హెచ్‌ఐవి పరీక్షలు ఇర్వహించి తొందరగా హే ఐవి ట్రీట్మెంట్ ప్రారంభించి పూర్తిగా హెచ్ఐవి లేకుండా నివారించే అవకాశాముంది. ఈ పద్ధతి ద్వారా శిశువు కాలు వద్ద ప్రికింగ్ చేసి (రక్తసేకరణ) డిఎన్ఎ-పిసీర్ పరీక్షచేసి హెచైవి నిర్ధారణ చేస్తారు.
చికిత్స నెవిరపిన్ ఓరల్ డ్రాప్స్ డాక్టర్ చెప్పిన మోతాదులో (ఈ పట్టిక చూడండి)వాడండి.[12]
హెచ్ఐవి , ఎయిడ్స్‌ల చికిత్స
[మార్చు]HIV ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతే అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతో, మంచి జీవన శైలిసహాయంతో, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారో HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లో సుసాధ్యం[9][13] [10][14] [15] కాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందుల వేళకు వేసుకొవటం (Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన ఆహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంబిస్తే జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగే ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సారలు వాడుతుపోతుఉంటే హెచ్ఐవీ వైరస్ మందులను తట్టుకునే సామర్థ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
హెచ్ఐవి చికిత్సకు సంబంధించి ముఖ్యమయిన మందులు వీటినే ART ( Antiretroviral Therapy) లేదా ARV's (Antiretrovirals) అని పిలుస్తారు. వీటిని అవి పనిచేసే తీరును బట్టి వెర్వెరు తరగతులుగా విభజించారు.ఇక్కడ భారతదేశంలొ దొరికే మందులను, చౌకగా దొరికే వాటిని మాత్రమే పొందుపరచబడినవి. ఇవికాక మనదేశంలో దొరకని మందులు, మనదేశంలొ దొరికుతు ఖరీదైన మందులు ఉన్నాయి. వీటిని ఇక్కడ పొందుపరచడంలేదు.
Nucleoside/Nucleotide Reverse Transcriptase Inhibitors (NRTIs)
- D4T (Stavudine) స్టావుడిన్
- 3TC (Lamivudine) లామివుడిన్
- AZT (Zidovudine) జిడోవుడిన్
- DDI (Didanosine) డిడనొసిన్
- ABC (Abacavir) అబాకవిర్
- TDF (Tenofovir) టెనొఫవిర్
- FTC (Emtricitabine) ఎంట్రిసిటబిన్
Non-Nucleoside Reverse Transcriptase Inhibitors (NNRTIs)
- NVP (Nevirapine) నెవిరపిన్
- EFZ (Efavirenz) ఎఫావిరెంజ్
- RPV (rilpivirine) రిల్పివైరిన్
- DLV (delavirdine) డెలవిర్డిన్
Protease Inhibitors (PIs)
- IDV (Indinavir) ఇండినవిర్
- ATV (Atazanavir) అటాజనవిర్
- RTV (Ritonavir) రిటనోవిర్
- LPV (Lopinavir) లొపినవిర్
- DRV (Darunavir) డారునవిర్
- NFV (Nelfinavir) నెల్పినవిర్
- SQV (Saquinavir) సాక్వినవిర్
Integrase Inhibitors
- RAL (raltegravir) రల్తెగ్రవిర్
- DTG (dolutegravir) దొలుతెగ్రవిర్
Entry Inhibitors
- ENF (enfuvirtide) ఏంఫువిర్టైడ్
- MVC (maraviroc) మరవిరొక్
PK Enhancer
- COBI (Cobicistat) కొబిసిస్టాట్
ఈ మందులు ఒకప్పుడు కేవలం ధనిక దేశాలలో మాత్రమే లభించేవి. ఒకప్పటితొ పొలిస్తే ఇప్పుడు వీటికయ్యే ఖర్చు చాల తక్కువ. పేటెంట్లను అడ్డం పెట్టుకొని వేలాది రుపాయలకు అమ్ముకునే కంపనీలకు మన ఇండియా కంపనీలు నిర్గాంతపొయెలా చేశాయి. మన దేశానికి చెందిన సిప్లా, అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యే చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు ఉంది.[16][17][18][19] ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి?
[మార్చు]WHO 2009 సంవత్సరపు మార్గదర్శకాల ప్రకారం CD4 350 cells/mm3 కంటే తక్కువగా ఉన్న ప్రతిఒక్కరు మొదలు పెట్టాలి లేదా CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి మీకు ఎయిడ్స్ కలిగించే రుగ్మత ఏది వచ్చిన వెంబడే ప్రారంభించాలి అలాగే CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి గర్భవతిగా ఉన్న ప్రతి మహిళ మందులు ప్రారంబించాలి.[20]
అయితే ఈ మార్గదర్శకాలను ప్రతి దేశం వారి ఆర్థికవనరులను బట్టి మార్చుకుంటుంది. బ్రిటన్లో అయితే CD4 500 cells/mm3 కంటే తగ్గినప్పుడు, అమెరికా సంయుక్త రాష్ట్రంలో అయితే HIV ఉన్న ప్రతి ఒక్కరు వారి CD4 సంఖ్య ఎంత అనే సంబంధం లేకుండా వెంబడే ప్రారంభించేటట్లుగా మార్చుకున్నారు.[21]
ఎయిడ్స్‌ని అరికట్టడం
[మార్చు]అయితే ఎయిడ్స్‌ను పూర్తిగా నివారించే చికిత్స ప్రస్తుతానికి లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది.
సురక్షితమయిన శృంగారం
[మార్చు]తొడుగులను (కండోమ్) ఉపయోగించండి. తొడుగులను ఉపయోగించటం వలన ఎయిడ్స్ వ్యాప్తి దాదాపు సున్నాగా ఉంటుంది. దాదాపుగా, యెందుకంటే అప్పుడప్పుడు కొంతమంది తొడుగును సరిగ్గా ఉపయోగించరు కాబట్టి. కాబట్టి సాధ్యమయినంత వరకూ తెలియని వారితో సంపర్కించవద్దు. భారత దేశంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ తొడుగులను ప్రజలకు విరివిగా అందుబాటులో ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ఒక సారి వాడిన తొడుగులను ఎట్టి పరిస్థితుల్లోను రెండోసారి వాడరాదు. తొడుగులకు కూడా గడువు పూర్తి అయ్యే తేది ఉంటుంది, ఒక సారి పరిశీలించి తీసుకోండి. తొడుగులు మగవారికే కాదు ఆడవారికి కూడా లభ్యమవుతున్నాయి.
ఎయిడ్స్‌పై ఎయిడ్స్‌తో పోరు
[మార్చు]మేరీల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్‌ఐవీ వైరస్‌ను నిష్క్రియపరిచిన తర్వాత కోతుల్లోకి వ్యాక్సిన్ రూపంలో ప్రవేశపెట్టారు. ఆరునెలల తర్వాత తిరిగి అవే కోతుల్లోకి క్రియాశీలకంగా ఉన్న ఎస్‌ఐవీని ఎక్కించారు. కొన్ని వారాల వ్యవధిలోనే కోతుల్లో ఉన్న ఎయిడ్స్ వైరస్ 95 శాతానికి పడిపోయింది. (ఈనాడు 20.2.2010)
ఎయిడ్స్ ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల వేతన సెలవు
[మార్చు]ఎయిడ్స్ వ్యాధితో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులు 18 నెలలపాటు వేతనంతో కూడిన సెలవు పొందే వేసులుబాటును తమిళనాడు ప్రభుత్వం కల్పించింది.ఇప్పటి వరకు క్యాన్సర్, టీబీ, గుండె, మూత్రపిండాలు, నేత్ర సంబంధిత శస్త్రచికిత్సలకు మాత్రమే వేతనంతో కూడిన దీర్ఘకాలిక సెలవు మంజూరు చేసేవారు.ఎయిడ్స్ కలిగిన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, ప్రభుత్వం వారితో ఉందన్న భావన కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పులిరాజా ప్రచారోద్యమం
[మార్చు]పులిరాజా ఎవరు? అన్న ప్రశ్నతో 2003లో పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ (పీ.ఎస్.ఐ.) అన్న సామాజిక సేవా సంస్థ ఈ అడ్వర్టైజ్మెంట్ విశాఖపట్నంలో ప్రారంభించింది. క్రమేపీ ఇదొక సంచలనాత్మకమైన ప్రశ్నగా ప్రజల్లో కుతూహలాన్ని రేకెత్తించింది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ తర్వాత సాగిన ప్రచారోద్యమం ఎయిడ్స్ గురించిన ప్రచారంలో మంచి పురోగతి సాధించింది.[22]
ఎయిడ్స్ ఇలా వ్యాపించదు
[మార్చు]ఈ క్రింది మార్గాలలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించదు [23]
- దోమ కాటు,పిల్లుల కాటు,కుక్క కాటు, దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల
- స్పర్శించటం వలన,హెచ్‍ఐవి/ఎయిడ్స్ సోకిన వ్యక్తిని కౌగలించుకొవడం వలన
- వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించటం వలన,ఒకే మరుగు దొడ్లను, ఒకే స్విమ్మింగ్ పూల్‌లను ఉపయోగించటం ద్వారా
- ఎయిడ్స్‌గల వారితో కలిసిమెలిసి జీవించడం వల్ల
- ఎయిడ్స్‌పీడితుల సంరక్షణ బాధ్యతవహించేవారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదు.
- హెచ్‍ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదు.
హెచ్ ఐ వి రొగి తీసుకొనవలసిన జాగ్రత్తలు
[మార్చు]- పౌష్టికరమైన (Protein Rich Food )ఆహారం సమయానికి తీసుకొవటం, శరీరానికి తగినంత విశ్రాంతి ( నిద్ర), తగినంతగా వ్యాయామం చేయాలి, ప్రశాంతమైన జీవితం.
- వేళకు తప్పకుండా మందులు వెసుకోవాలి ( Drug Adherence ), డాక్టరు అపాయింట్మెంట్ లను, Lab Test లను మరవకూడదు.
- వైరల్ వ్యాధులు వ్యాపించిన ప్రదేశాలకు అలాంటి రోగులకు దూరంగా వుండాలి.
- http://www.thebody.com/content/40480/living-with-hiv-aids.html?ic=3001[permanent dead link] సూచించిన టీకాలు తీసుకొవటం వల్ల కొన్ని వ్యాధులను నివారించవచ్చు.
- ఎలాంటి వ్యాదులైన వస్తే సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.
- దూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
- మీ CD4 సంఖ్య బాగా తగ్గినప్పుడు ఎయిడ్స్ రుగ్మతలు రాకుండా HIV మందులతో పాటుగా Prophylaxis తీసుకొవటం.[5] ఎయిడ్స్ కు సంబంధించిన చాల రుగ్మతలు రాకుండా Prophylaxis మందులు వున్నాయి
కొన్ని ప్రశ్నలు
[మార్చు]- ఎయిడ్స్ రాకుండా ఏవైనా టీకాలు ఉన్నాయా?
- హెచ్.ఐ.వి. రాకుండా నిరొదింఛే టీకా ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్నారు కూడా. భారతదేశం విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ "నారి" (జాతీయ ఎయిడ్స్ పరిశొధనా సంస్థ, పుణె ) ఈ దిశగా ఎంతో కృషి చేస్తోంది. వ్యాక్సిన్ పరిశొధనలు,వివిధ దశలలొ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే ఇది ఇప్పటికే వ్యాధిగ్రస్తులైన వారికి మాత్రం ఉపయోగపడదు. కొత్తగా ఎవరూ హెచ్.ఐ.వి బారిన పడకుండా మాత్రమే కాపాడగలదు. శరీరంలోని రోగనిరోధక శక్తికి అందకుండా దాక్కుని ఉన్న హెచ్.ఐ.వీ వైరస్ లక్షణాలను గుర్తించి దానిపై పోరాడే వ్యాక్సిన్ తయారైంది.[24] ఈ వ్యాక్సిన్‌ను ఒరేగాన్ వర్సిటీ విద్యార్థులు కనుగొన్నారు. ఇది శరీరంలోని హెచ్ఐవీ వైరస్‌పై తీవ్రంగా పనిచేస్తుంది. శరీరంలో ఏ మూలన దాక్కున్న వైరస్‌నైనా నియంత్రించి ఇతర శరీర భాగాలపై దాని ప్రభావం లేకుండా చేస్తుంది. వ్యాక్సిన్‌ను ఇంజక్షన్ ద్వారా అందిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరస్ వృద్ధి చెందకుండా చూస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఎయిడ్స్ గ్యారంటీగా నయం చేయగలమని కొందరు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. నమ్మవచ్చా?
- ఇంతవరకు ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులు తయరు కాలేదు. అయితే ఎయిడ్స్ దశలో రోగి జీవిత కాలాన్ని పొడిగించే "ఎ.అర్.టి." మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 45 ART సెంటర్లలొ NACO ఉచితంగా మందులను ఇస్తుంది.[25] ART మందులు తప్ప వెరె ఏ మందులు హెచ్ ఐ వి / ఎయిడ్స్ పైన పని చేయవు గ్యారంటీగా ఎయిడ్స్ నయం చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారిని నమ్మకండి.
- హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో సిడి-4 కౌంట్ 200కు తగ్గగానే పలు కేంద్ర నాడీ మండల వ్యాధులు చుట్టుముడతాయి.హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ (హార్ట్) చికిత్సతో వ్యాధిని నియంత్రించే అవకాశం కలిగిఇంది.
- డాక్టర్లు నేను హెచ్ ఐ వి పాజిటివ్ గా నిర్దారించారు, నేను వెంబడే చనిపోతానా? [26]
- లేదు, హెచ్ ఐ వి పాజిటివ్ పర్సన్ అంటె ఎయిడ్స్ ను కలగచెసె హెచ్ ఐ వి అనె వైరస్ మీ శరీరంలొ వున్నది అని అర్థం. అంతే కాని మీకు ఎయిడ్స్ ఉన్నది వెంబడె చనిపోతారని మాత్రం కాదు. ఏయిడ్స్ కు పూర్తిగా తగ్గించడానికి మందులు లేవు కాని ఎయిడ్స్ వల్ల వచ్చె అన్ని రుగ్మతలకు (opportunistic infections) పూర్తిగా నివారించె మందులు, రాకుండా అరికట్టె మందులు ప్రస్తుతానికి అందుబాటులో వున్నాయి. ఇవన్ని కలిపి హెచ్ ఐ వి / ఎయిడ్స్ తొ జీవించె వ్యక్థుల జీవన ప్రామాణాల్ని చాలవరకు పెంచాయి.
మందులు
[మార్చు]పాదపీఠికలు , మూలాలు
[మార్చు]- ↑ http://www.who.int/hiv/data/en/
- ↑ http://www.who.int/hiv/data/2011_epi_core_en.png
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2022-01-19. Retrieved 2012-05-28.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-27. Retrieved 2012-05-28.
- ↑ 5.0 5.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-05. Retrieved 2012-05-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-21. Retrieved 2012-05-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-27. Retrieved 2012-05-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-06. Retrieved 2012-05-26.
- ↑ 9.0 9.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-27. Retrieved 2012-05-26.
- ↑ 10.0 10.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-21. Retrieved 2012-05-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-30. Retrieved 2012-05-27.
- ↑ http://www.merck.com/media/mmpe/pdf/Table_280-3.pdf
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-16. Retrieved 2012-07-15.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-07. Retrieved 2012-07-15.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-25. Retrieved 2012-07-15.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-05. Retrieved 2012-05-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-04. Retrieved 2012-05-26.
- ↑ http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on
- ↑ http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-22. Retrieved 2012-05-29.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-02. Retrieved 2012-05-29.
- ↑ టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రతినిధి. "Puli Raja ads a misery for namesake". టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 30 August 2017.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-05. Retrieved 2012-05-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-19. Retrieved 2013-09-15.
- ↑ http://www.nacoonline.org/upload/Directory%20of%20Service%20Facilities/List%20of%20functional%20355%20ART%20Centres%20as%20on%20March-2012.pdf[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-22. Retrieved 2012-05-26.
ఇతర గ్రంధాలు
[మార్చు]- ఎయిడ్స్ రచన డాక్టర్ యనమదల మురళీకృష్ణ Archived from date.available: 2015-09-09
- "2007 AIDS epidemic update" (PDF). UNAIDS. Archived from the original (pdf) on 2008-11-22. Retrieved 2008-03-21.
- "UNAIDS Annual Report — Making the money work" (PDF). UNAIDS. Archived from the original (pdf) on 2008-03-17. Retrieved 2008-03-21.
- "Financial Resources Required to Achieve, Universal Access to HIV Prevention, Treatment Care and Support" (PDF). UNAIDS. Archived from the original (pdf) on 2008-03-17. Retrieved 2008-03-21.
- "Practical Guidelines for Intensifying HIV Prevention" (PDF). UNAIDS. Archived from the original (pdf) on 2008-03-17. Retrieved 2008-03-21.
- "Antiretroviral Formulations" (PDF). US Department of Health and Human Services. Archived from the original (pdf) on 2009-01-13. Retrieved 2008-03-21.
- "Approved Medications to Treat HIV Infection" (PDF). US Department of Health and Human Services. Archived from the original (pdf) on 2007-07-15. Retrieved 2008-03-21.
- "The HIV Life Cycle" (PDF). US Department of Health and Human Services. Archived from the original (pdf) on 2007-07-15. Retrieved 2008-03-21.
బయటి లింకులు
[మార్చు]
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి
- AIDSinfo Archived 2011-02-25 at the Wayback Machine - HIV/AIDS Treatment Information, U.S. Department of Health and Human Services
- UNAIDS: The Joint United Nations Programme on HIV/AIDS
- Portal to all Federal HIV/AIDS information - Office of HIV/AIDS Policy
- భారతదేశంలో ఎయిడ్స్ గురించిన సమాచారం