Jump to content

అతిమధురం

వికీపీడియా నుండి

అతిమధురము
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
G. glabra
Binomial name
Glycyrrhiza glabra
Glycyrrhiza glabra

అతిమధురము (ఆంగ్లం Liquorice) ఒక తియ్యని వేర్లు గల మొక్క.

అతిమధురం, Glycyrrhiza Glabra (liqcorice) Barks & root Plant

ఆయుర్వేద వైద్య విధానంలో అత్యంత తీయని రుచి కలిగి అత్యంత శక్తివంతమైన ఔషధాల్లో అతి మధురం అగ్రస్థానాన్ని పొందిందంటే అతిశయోక్తి కాదు. మధుయష్టి, యష్టి మధు, మధూకలాంటి వివిధ సంస్కృత నామాలతో వ్యవహరింప బడుతూ, హిందీలో ములేటిగా ప్రాచుర్యం పొందిన ఫాబేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన మొక్క ఇది. దీని శాస్త్రీయ నామం 'గ్లయిసిరైజా గ్లాబ్రా'. ఈ మొక్కపై జరిగిన అధ్యయనాల్లో ఈ మొక్కలో గ్లయిసిరైజిక్‌ ఆమ్లం, గ్లూకోజ్‌, సుక్రోజ్‌, యాస్పిరాజిన, ఈస్ట్రోజెన్‌, స్టిరాయిడ్‌, సుగంధిత తైలం మొదలైన అంశాలున్నట్లు వెల్లడైంది. పంజాబ్‌ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అతి మధురం, గుమ్మడి, రోజు పూలు, సోపు గింజలు మొదలైన వాటితో ఒక ఔషధాన్ని రూపొం దించి, ఎలుకలపై ప్రయోగించి పరి శోధించారు. జీర్ణా శయంలోని వ్రణాన్ని మార్చడమే కాక, ఇతర ఆధునిక ఔషధాలతోపాటు దీనిని కూడా వాడటం వల్ల ఆ వ్రణం మానే ప్రక్రియ శీఘ్రతరమైనట్లు గుర్తించారు. అలాగే ఆధునిక ఔషధాల దుష్పరిణామాలు తగ్గడాన్ని కూడా గుర్తించారు. పచారి కొట్లలోను, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లోనూ లభించే ఈ మొక్క వేళ్లు, వేళ్ల చూర్ణాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు.

ఔషధోపయోగాలు(medical uses):

[మార్చు]

అతి మధుర చూర్ణంలో సగభాగం వచ చూర్ణం కలిపి పూటకు పావు స్పూను వంతున మూడు పూటుల తగినంత తేనెతో కలిపి తీసుకుంటే వివిధ రకాలైన దగ్గులు తగ్గుతాయి. అతిమధురం, అశ్వగంధ, శుంఠి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, అరస్పూను నుంచి ఒక స్పూను వరకూ అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే కీళ్లు, కండరాల నొప్పులు, ఒంట్లో నీరసం తగ్గి హుషారుగా ఉంటారు. సోపు గింజల చూర్ణానికి రెట్టింపు అతి మధురం, పటికబెల్లం కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తే కడుపు ఉబ్బరం, దగ్గు, ఆయాసం, త్రేన్పులు తగ్గుతాయి. అతి మధుర చూర్ణాన్ని మూడు పూటలా పూటకు ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే అధిక దాహం, ఎక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట, అధిక వేడి, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి. అరకప్పు పాలలో కలిపి సేవిస్తుంటే బాలింతల్లో స్తన్యవృద్ధి జరుగుతుంది. బియ్యం కడుగు నీళ్లతో సేవిస్తే నోరు, ముక్కు మొదలైన భాగాలనుంచి కారే రక్తస్రావం, స్త్రీలలో అధిక బహిష్టు రక్తస్రావం తగ్గుతాయి. జీర్ణాశయ, గర్భాశయ, శ్వాసకోశ వ్యాధులకు వాడే ఔషధాల్లో అతి మధురాన్ని ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు. అతి మధుర చూర్ణంతో పళ్లు తోముకుంటే పిప్పిపళ్లు, చిగుళ్లనుంచి రక్తస్రావం, నోటి పుళ్లు, నోటి దుర్వాసన తగ్గుతాయి. అతి మధుర చూర్ణం, ఎండు ద్రాక్ష సమానంగా కలిపి దంచి ముద్ద చేసి ఉంచుకుని, రోజూ రెండుసార్లు పూటకు పది గ్రాముల చొప్పున చప్పరించి కప్పు పాలు సేవిస్తుంటే స్త్రీలలో రక్తహీనత వల్ల కలిగే నీరసం, ఆయాసం, అలసట, గుండె దడ, మలబద్ధకం తగ్గు తాయి. రుతురక్తం సక్రమంగా పద్ధతిలో, సరైన ప్రమాణంలో వెలువడుతుంది. అధిక రుతుస్రావం తగ్గు తుంది. సుఖ ప్రధమైన నిద్ర కలుగుతుంది. అతి మధురం, ఆకుపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఒక స్పూను వంతుగా రోజూ రెండుపూటలా అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే మనో వ్యాకులత తగ్గి మనో నిబ్బరం, మానసిక ప్రశాంతత, మానసిక ఉత్తేజం కలుగుతాయి. అతి మధుర చూర్ణాన్ని గాయాలు, వ్రణాలు, పుళ్లపై చల్లుతుంటే రక్తస్రావం తగ్గి శీఘ్రంగా మానుతాయి. అతి మధురం, కరక, తాని, ఉసిరిక చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, ఉదయం, సాయంత్రం రెండుపూటలా సేవిస్తుంటే నేత్ర దోషాలు తగ్గి కంటి చూపు మెరుగవుతుంది. అతి మధురం, సరస్వతి ఆకు, అశ్వగంధ, పటిక బెల్లం చూర్ణాలను సమానంగా కలిపి రెండుపూటలా పావుస్పూను నుంచి స్పూను వరకూ మోతాదుగా అరకప్పు పాలతో సేవిస్తుంటే మెదడుపై ప్రభావం చూపి మతి మరుపు తగ్గి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అతి మధురం, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, గ్లాసు పాలలో ఒక స్పూను చూర్ణం, ఒక స్పూను వంటున పటికబెల్లం పొడి, నెయ్యి, తేనె కలిపి రోజూ ఒకటి రెండుసార్లు తాగుతుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగడమే కాక, లైంగిక కార్యం తరువాత కలిగే నీరసం, నిస్సత్తువ, కండరాలు బిగదీసుకున్నట్లు ఉండే ఇబ్బందులు తొలగుతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు అతి మధురం వాడే విషయంలో వైద్యుల సలహాలను అనుసరించాల్సి ఉంటుంది. --డాక్టర్‌ చిట్టిభొట్ల మధుసూదన శర్మ ఆయుర్వేదిక్‌ ఫిజిషియన్‌, నంద్యాల

మూలాలు

[మార్చు]