మీనార్
మీనార్ (ఆంగ్లం : Minaret) (అరబ్బీ మనారా (లైట్ హౌస్) منارة, కాని సాధారణంగా مئذنة) ఇస్లామీయ నిర్మాణ శైలుల మస్జిద్ ల విభాగాలు. ఈ మీనార్లు, మస్జిద్ యొక్క గుంబద్ లేదా డూమ్ తో బాటు నిర్మించబడుతాయి. ఈ మీనార్లు ఎత్తైనవిగా, నిటారుగా, నిలకడగా, దూరంనుండి వీక్షించగలిగే నిర్మాణాలుగా వుంటాయి.
వ్యాసాల వరుస క్రమం
|
నిర్మాణం |
నిర్మాణ శైలి |
ఇతర |
ప్రపంచంలో మస్జిద్ లు |
మీనార్ల ఆవశ్యకత
మార్చుమీనార్లు క్రింది విషయాల ఆవశ్యకతను కలిగి ఉన్నాయి.
- మీనార్ అనే పదానికి మూలం అరబ్బీ పదం 'నూర్', నూర్ అనగా 'కాంతి' లేక 'జ్యోతి', అల్లాహ్ భక్తులపై తన నూర్ ను విరజిమ్ముతాడని, నమ్మకంతో వీటికి మీనార్ అనే పేరు పెట్టి, అల్లాహ్ యొక్క నూర్ ను స్వాగతించడానికి గల ఏర్పాటని భావిస్తారు.
- దూరంనుండి మస్జిద్ గల ప్రదేశాన్ని సులభంగా కనుగొనుటకు.
- మువజ్జిన్, ఈ మీనార్లపై ఎక్కి అజాన్ ఇచ్చి, నమాజ్ కొరకు పిలుచుట సులభం.
- ఇవి 'వాచ్ టవర్'లు లేదా "వీక్షణా బురుజులు" గానూ ఉపయోగపడేవి.
- సమకాలీనంలో అజాన్ ఇచ్చి భక్తులకు నమాజ్ కొరకు పిలిచేందుకు, లౌడ్ స్పీకర్లు వుంచేందుకు ఉపయోగం. దూరంవరకూ గల భక్తులకు ఈ అజాన్ వాణి వినిపించేందుకు సులభం.
- మస్జిద్ లో గల డూమ్, మీనార్ ల ద్వారా సహజసిద్ధమైన వెంటిలేషన్ కలుగజేయుటకు ఉపయోగం.
- ఈ మీనార్ లను, స్వర్గద్వారాలుగా అభివర్ణిస్తారు. ఈ మీనార్లు, అలీఫ్ ఆకారంలో వుంటాయి, అలీఫ్ తోనే అల్లాహ్ పేరు మొదలవుతుంది,, భాష, పరిభాష, విద్య, విజ్ఞానం, ఈ అలీఫ్ తోనే ఆరంభమవుతుంది గనుక, ఈ విషయాలకు ప్రతీకగా మీనార్ ను భావిస్తారు.
ప్రపంచంలోని ప్రముఖ మీనార్లు
మార్చు- ప్రపంచంలోనే ఎత్తైన మీనార్ మొరాకో, కాసాబ్లాంకా లోని హసన్ 2 మస్జిద్లో గలదు. దీని ఎత్తు 210 మీటర్లు.
- ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకలతో నిర్మింపబడిన మీనార్ ఢిల్లీలోని కుతుబ్ మీనార్ దీని ఎత్తు 72.5 మీటర్లు.
- ఇరాన్ లోని టెహ్రాన్ నగరంలో నిర్మాణ దశలో వున్న రెండు మీనార్ల పొడవు 230 మీటర్లు.
నిర్మాణం
మార్చుమీనార్ల నిర్మాణం మూడు దశలపై ఆధారపడి వుంటుంది : బేస్ లేదా మూలం, స్తంభం, గేలరీ.
- బేస్ : భూమిని త్రవ్వి మీనార్ యొక్క పునాదిని తయారు చేయడం.
- స్తంభం : ఈ నిర్మాణమే అతిముఖ్యం. ఇది ఓ సిలెండర్, శంఖువు, లేదా స్తంభాకార నిర్మాణం. ఇది భూమిపై నిటారైన నిర్మాణం. భూమికి లంబంగా ఆకాశంవైపు చూస్తూ వుంటుంది.
- గేలరీ : ఈ నిర్మాణం మీనార్ లోపలి నిర్మాణం. ఇందులో మెటుకల ద్వారా మీనార్ పైభాగానికి పోవడానికి మార్గముంటుంది. మీనార్ బయటి భాగంలో 'మిహ్రాబ్' లేదా కిటికీల ద్వారా బయటకు చూచుటకు అనువుగా నిర్మాణముంటుంది. మీనార్ అంతస్తుల ప్రకారం ప్రతి అంతస్తునకూ ఒక బురుజు లాంటి ఆకారం లేదా బాల్కనీ వుంటుంది. ఈ బురుజులు, నిలబడి బయటి ప్రదేశాన్ని వీక్షించుటకు అనువుగా నిర్మింపబడివుంటుంది.
ప్రాంతీయ శైలులు
మార్చుఇస్లామీయ నిర్మాణ శైలుల యందు మస్జిద్ ల తరువాత మీనార్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇవి పలు రకాలు, ప్రాదేశిక నిర్మాణ శైలుల ప్రభావంగా నిర్మింపబడుతాయి.
- టర్కిష్ (11వ శతాబ్దం)
- 1,2,4 లేదా 6 మీనార్లు, మస్జిద్ ల ఆకారాలనుబట్టి, సన్నని నాజూకైన, పొడవైన మీనార్లు.
- ఈజిప్టు (7వ శతాబ్దం) / సిరియా (13వ శతాబ్దం వరకు)
- తక్కువ ఎత్తుగల టవర్లు, మస్జిద్ కు నలువైపులా నిర్మింపబడి వుంటాయి.
- ఇరాక్
- కోన్ లేదా శంఖవు ఆకారం గల ఎత్తైన మీనార్లు, సర్పిలాకార మెట్లుగలవి.
- ఈజిప్టు (15వ శతాబ్దం)
- షడ్ముఖాకారం. రెండు బాల్కనీలు, ఒకటి పైభాగాన రెండవది క్రింది భాగాన కలిగి వుంటుంది.
- పర్షియన్ సామ్రాజ్యం (17వ శతాబ్దం)
- రెండు జతల నాజూకైన మీనార్లు మస్జిద్ ముఖద్వారం దగ్గర నిర్మింపబడివుంటాయి. దీనికి బాల్కనీలు వుంటాయి.
- తాతారిస్తాన్ (18వ శతాబ్దం)
- ఒకే మీనార్ నిర్మింపబడి వుంటుంది, దానిపై ఒక గ్లోబు ఆకారపు పైకప్పు వుంటుంది. (ఉదాహరణకు మర్జానీ మస్జిద్).
- మొరాకో
- సాధారణంగా ఒకే మీనార్ వుంటుంది, దీని ఆకారం 'చతురస్రాకారం'.
చిత్రమాలిక
మార్చు-
హైదరాబాదు లోని చార్మినారు
-
Almnara Tower Somalia.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Minarets, at the Encyclopedia of the Orient Archived 2008-05-17 at the Wayback Machine
- Minaret Photo Gallery
- Minaret@Everything2.com
- Minaret Types[permanent dead link] An Architectural review
- The Minaret The weekly student newspaper of the University of Tampa
- 230 metre tall Minarets Under construction in Iran
- The minaret, Symbol of a civilization