Jump to content

వికీపీడియా:తొలగింపు విధానం

వికీపీడియా నుండి
(వికీపీడియా:PROD నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:DEL
WP:DELETE

వికీపీడియాలో వ్యాసాలు తొలగించబడుతూ ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితంలో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.

పేజీల తొలగింపుకు, పునస్థాపనకు నిర్వాహకులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. కింద ఇచ్చిన పద్ధతిని అనుసరించి వారు సరైన నిర్ణయం తీసుకోవాలి.

నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్థాపన చెయ్యగలరు. అయితే దీనికి పునస్థాపనకై వోట్లు లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పద్ధతిలో గాక త్వరిత పద్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక, తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్థాపనపై మార్గదర్శకాల కొరకు పునస్థాపన విధానం చూడండి.

ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు). కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింప జేయడానికి పదే పదే ప్రయత్నించడం విఛ్ఛిన్నకరంగా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!

తొలగించే పద్ధతి

[మార్చు]

వ్యాసం త్వరగా తొలగించవలసిన కారణాల జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళ్ళైతే బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు, వర్గాలు, మూసలు, దారిమార్పులు).

ఒక వ్యాసాన్ని గానీ, బొమ్మను గానీ, దారిమార్పును గానీ, ఇతరాలను గానీ తొలగించే పద్ధతిలో ఉండే మెట్లు ఇవి:

  1. తొలగించాలని మీరు భావించిన పేజీలో సదరు నేముస్పేసుకు సంబంధించిన మూసను పేజీ పై భాగాన ఉంచాలి. (ఉదాహరణకు, వ్యాసపు పేజీల కోసం: {{తొలగించు}} మూసను పేజీలో పెట్టాలి.)
  2. ఆ తరువాత ఆ పేజీని తొలగించాలో లేదో తేల్చేందుకు చర్చ జరగాలి. ఈ చర్చ కోసం ప్రతిపాదించిన వ్యాసం కోసం ఒక ఉపపేజీ తయారుచెయ్యాలి. ఆ పేజీ ఇలా ఉంటుంది.. [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం]]. వ్యాసం పేజీలో పెట్టిన తొలగింపు మూస నుండి ఈ పేజీకి లింకు ఉంటుంది. ఇక్కడ తొలగింపు విషయమై సభ్యులు తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తారు.
  3. తరువాత ఈ పేజీని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి. ఇలా: {{వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం}}
  4. సభ్యుల అభిప్రాయాల కోసం తగు సమయం ఇచ్చిన తరువాత, ఆ అభిప్రాయాలను క్రోడీకరించి, చర్చను ముగిస్తారు. ఈ ముగింపులోనే చర్చ పర్యవసానాన్ని కూడా నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం తొలగించు, ఉంచు, దారిమార్చు, విలీనం చెయ్యి వగైరా నిర్ణయాల్లో ఏదైనా కావచ్చు. చర్చ ముగింపును నిర్వాహకులు గానీ, అనుభవజ్ఞులైన సీనియరు సభ్యులు గానీ చేస్తారు. చర్చ ముగిసిన విషయం స్పష్టంగా తెలిసేలా రెండు మూసలను చేర్చి, పేజీ నేపథ్యం రంగును మారుస్తారు. ఒకసారి చర్చను ముగించాక, ఇక అక్కడ సభ్యులు ఏమీ రాయరాదు.
  5. చర్చ నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యను తీసుకుంటారు. నిర్ణయం తొలగించడమే అయితే, దాన్ని నిర్వాహకులు అమలు చేస్తారు; తొలగించే అనుమతులు వారికే ఉంటాయి మరి.

మరిన్ని వివరాలకు వికీపీడియా:తొలగింపు పద్ధతి చూడండి.

సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి

[మార్చు]

పేజీ నిజంగా తొలగింపు ప్రతిపాదనలో పెట్టవచ్చా? ఇది తెలుసుకోవడానికి కింది రెండు పట్టికలను చదవండి.

తొలగింపు అవసరం లేని సమస్యలు

[మార్చు]
సమస్య పరిష్కారం ఈ టాగు చేర్చండి
వ్యాసం తెలుగులో లేదు
వికీపీడియా:వ్యాస అనువాద విజ్ఞప్తులు లో చేర్చండి. {{అనువాదము}}
మొలక (ఎదిగే అవకాశం ఉంది)
విస్తరించండి! {{మొలక}} లేదా {{విస్తరణ}}
వ్యాసం అవసరం లేనంత చిన్న విషయం
వేరే వ్యాసంలో కలిపేసి, దారి మార్చండి {{విలీనం ఇక్కడ|వ్యాసంపేరు}}
వేరే వ్యాసపు విషయానికి ఇది అనుకరణ
కలిపేసి దారి మార్చండి.

ఎలా కలిపాలో అర్ధం కాకపోతే, టాగు పెట్టి డూప్లికేటు వ్యాసాలులో చేర్చండి.

{{విలీనం|వ్యాసంపేరు}}.
వ్యాసాన్ని మెరుగు పరచాలి
శుధ్ధి లో చేర్చండి. {{శుధ్ధి}}
వ్యాసం చాలా మెరుగు పడాలి దృష్టి పెట్టవలసిన పేజీలు లో చేర్చండి  
వ్యాసం పక్షపాత ధోరణితో ఉంది
దృష్టి పెట్టవలసిన పేజీలు లో చేర్చండి. {{npov}} or {{POV check}}
వ్యాసంపై వివాదం
వ్యాఖ్యానాల కొరకు వినతి లో చేర్చండి {{disputed}}
రెండు విషయాలకు ఒకే పేరు
అయోమయ నివృత్తి పేజీ తయారు చెయ్యండి {{అయోమయ నివృత్తి}}
వ్యాసంలోని సమాచారం నిర్ధారణ కాలేదు
నిర్ధారణ పద్ధతిని అనుసరించండ.

అది పని చెయ్యకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి. నిజంగానే నిర్ధారణ చెయ్యలేనిదయితే, తొలగించవచ్చు.

 
అసంబధ్ధమైన సభ్యుని పేజీ సభ్యునితో చర్చించండి.

పని కాకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి.

 
పూర్వపు కూర్పుకు తీసుకు వెళ్ళండి.

అవసరమైతే దుశ్చర్య జరుగుతూనే ఉంది పేజీలో పెట్టండి.

 
కోపం తెప్పించే సభ్యుడు శాంతంగా ఉండండి.

అవసరమైతే సభ్యుని వ్యాఖ్యానాల కొరకు వినతి లో చేర్చండి.

 

తొలగింపు అవసరమైన సమస్యలు

[మార్చు]
సమస్య పరిష్కారం ఈ ట్యాగు చేర్చండి
తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో చేర్చండి. {{తొలగించు|కారణం}}
వ్యాసంలో కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు
కాపీహక్కు సమస్యలు లో చేర్చండి. {{కాపీహక్కు సమస్య}} లేదా
{{కాపీహక్కు సమస్య|చిరునామా=మూలం}}
బొమ్మ యొక్క కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు కాపీహక్కు సమస్యలు లో చేర్చండి. {{imagevio}} లేదా
{{imagevio|url=source}}
తొలగింపు అవసరమైన బొమ్మ లేదా ఇతర మీడియా (కాపీ హక్కుల ఉల్లంఘన కాదు) తొలగింపు కొరకు బొమ్మలు లో చేర్చండి {{ఈ బొమ్మను తొలగించాలి}}
అవసరం లేని దారి మార్పు
వదిలెయ్యండీ, నష్టమేమీ లేదు కదా!

కాదూ తీసెయ్య వలసిందేనంటారా, తొలగింపు కొరకు దారిమార్పు లో చేర్చండి. కానీ ముందు దారి మార్పుల తొలగింపు పై మార్గదర్శకాలు చూడండి.

{{rfd}}
వర్గీకరణ గజిబిజి అయిపోయింది
తొలగింపు కొరకు వర్గాలు లో చేర్చండి. {{cfd}}
అవసరం లేని, తప్పుదారి పట్టించే సీరీస్‌ బాక్సు. తొలగింపు కొరకు మూసలు లో చేర్చండి. {{tfd}} (Put in the box itself)
అవసరం లేని, తప్పుదారి పట్టించే మొలక మూస లేదా వర్గం. తొలగింపు కొరకు మొలకల రకాలు లో చేర్చండి. {{sfd-c}} మొలకల వర్గాల కొరకు; {{sfd-t}} మొలకల మూసల కొరకు
నిఘంటువులో ఉండే అర్ధానికి మించి పెరగనే పెరగదు ("dicdef")
విక్షనరీ లోకి తరలించవలసినవి లో చేర్చండి

విక్షనరీ లో ఇప్పటికే అది ఉంటే, విషయాన్ని తీసివేసి ఇది చేర్చండి:{{wi}}.

{{move to Wiktionary}}
వ్యాసం మూల పాఠ్యం
Move text to Wikisource and replace it with a stub and a soft redirect.  
త్వరిత తొలగింపులు లో చేర్చండి.

సరళమైన కేసుల్లో, {{deletebecause}} అనే టాగును తగిలిస్తే చాలు, CAT:CSD లో చేరిపోతుంది.

{{db|reason}}

తొలగింపు పధ్ధతులలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. వివరాల కొరకు సంబంధిత పేజీ చూడండి. దానిని ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి. ఇతర సభ్యులు దానిపై వ్యాఖ్యానించడానికి కొంత సమయం పాటు అది అలాగే ఉంటుంది. కొంత సమయం తరువాత, ఒక స్థూలమైన ఏకాభిప్రాయం వస్తే నిర్వాహకుడు ఆ పేజీని తొలగించుతాడు - వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు చూడండి.

త్వరగా తొలగించవలసిన వాటి విషయంలో, నిర్వాహకులు తొలగింపు పద్ధతిని పాటించనవసరం లేదు – వాటిని గమనించిన వెంటనే తొలగించవచ్చు. అయితే కొందరు నిర్వాహకులు కొన్ని సందర్భాలలో త్వరిత తొలగింపు పద్ధతిని పాటిస్తారు.

పేజీని తొలగింపు జాబితా లోకి ఎలా చేర్చాలి

[మార్చు]

పేజీ తొలగింపు జాబితాలోకి చేర్చడానికి 3 అంచెలు: వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు

తొలగింపు కొరకు వ్యాసాలులో పునః ప్రతిపాదనలపై పరిమితులు

[మార్చు]

సాధారణంగా, తొలగింపు కొరకు వ్యాసాలులో ఒక వ్యాసంపై చర్చ జరిగి, తొలగించకూడదని నిర్ణయం జరిగితే, ఆ వ్యాసాన్ని తొలగించాలని మళ్ళీ వెంటనే ప్రతిపాదించ కూడదు. ఎందుకంటే, మరీ అంత కొద్ది వ్యవధిలో మనసు మార్చుకునేటంత బలమైన కారణం ఉంటే తప్ప, రెండో సారి కూడా మొదటి ఫలితమే వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు వోట్లు చాలా తక్కువ రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. మళ్ళీ ప్రతిపాదించడానికి ఇంత వ్యవధి ఉండాల్సిందేనని నియమమైతే లేదుగానీ, "మరీ మొన్నే కదా దీని గురించి చర్చించింది, ఉంచేస్తే పోలా" అని ఎక్కువ మంది అనుకోవచ్చు.

ఒకవేళ ట్రాన్స్‌వికీకి వెళ్ళడమే నిర్ణయమైతే, ఆ పని అవగానే పేజీ త్వరగా తొలగించవలసిన జాబితాలో చేరిపోయినట్లే; తొలగింపు కొరకు వ్యాసాలుకి వెళ్ళ వలసిన పని లేదు.

"తొలగింపు జాబితాలో చేరింది" నోటీసు

[మార్చు]

పేజీని తొలగింపు కొరకు వ్యాసాలు లో చేర్చగానే, ఈ సంగతి అందరికీ తెలియజేయడం మర్యాద. పేజీ పైభాగాన సంబంధిత మూసను/టాగును తగిలించడం అనేది సూచించబడిన విధానం.

పేజీని ఎందుకు తొలగించారో అనే సందేహాన్ని ఈ నోటీసు నివృత్తి చేస్తుంది. ఒక గమనిక: కాపీహక్కు సమస్యలకు వేరే నోటీసు ఉంది.

కింది సందర్భంలో నోటీసు అవసరం లేదు:

వ్యాసం పేజీ ఖాళీగా ఉన్నపుడు (దారిమార్పు వంటివి), మరియు చెప్పుకోదగినంత చరితం లేనపుడు.

వ్యవధులు

[మార్చు]

పేజీని ఒకసారి జాబితాలో చేర్చిన తరువాత సభ్యులు దానిని గమనించి వ్యాఖ్యానించడానికి వీలుగా ఒక నిర్ణీత సమయం పాటు అక్కడ ఉంచాలి. వివిధ పేజీలకు విభిన్న వ్యవధులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవధులు ఇలా ఉన్నాయి:

వ్యాఖ్యానించడం

[మార్చు]

వ్యాసాన్ని జాబితాలోకి చేర్చాక ఎవరైనా దానిపై వ్యాఖ్యానం చెయ్యవచ్చు. అభిప్రాయం రాసేటపుడు మీ అభిప్రాయం, మీరు చెప్పే కారణం రాయండి. ~~~~- ఇలా సంతకం చెయ్యండి. కింది పదాలు వాడాలని సూచన.

  • తొలగించాలి
  • ఉంచాలి
  • వ్యాఖ్య (వోటు కాదు)
  • ఇతర (ఇతర చర్య). కిందివి ఈ కోవలోకి వస్తాయి
    • [[ఫలానా వ్యాసం]] కు దారి మార్పు
    • [[ఫలానా వ్యాసం]] తో ఏకీకృతం చేసి, దారి మార్చు
    • Wiktionary / Meta / other GFDL site కి తరలించు

నిర్ణయ విధానం

[మార్చు]

తొలగింపు విజ్ఞప్తిని తొలగింపు కొరకు వ్యాసాలులో ఉంచిన ఐదు రోజుల తరువాత, ఒక స్థూల విస్తృతాభిప్రాయం వస్తే, ఆ పేజీని తొలగిస్తారు. లేదంటే తొలగించరు. స్థూల విస్తృతాభిప్రాయం ఎంత అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి – మూడింట రెండు వంతులు ఆధిక్యత ఉండాలని కొందరంటే, మరి కొందరు ఇంకా ఎక్కువ ఉండాలంటారు.

పేజీని జాబితాలో చేర్చిన తరువాత అది మెరుగుపడి, తొలగించవలసిన అవసరం ఇప్పుడు లేకపోతే కూడా పేజీని తొలగించరు.

ఓట్లను తొలగించవద్దు. ఓట్ల విషయంలో ఒకే వ్యక్తికి చెందిన వివిధ ఓట్లని అనుమానం వచ్చినా, వేరే ఏ కారణం చేతనైనా ఓటు చెల్లదని మీరు భావించినా, దానిపై ఒక వ్యాఖ్య రాసి, అక్కడే ఉంచేయండి. చర్చను సమీక్షించే నిర్వాహకుడు మీ వ్యాఖ్యను గమనించి, ఆ ఓటును పరీక్షించి దానిని లెక్కింపు లోకి తీసుకోవాలో లేదో నిరణయిస్తారు. ఓట్లను తొలగించకపోవడం వలన ఎవరు తొలగించారు, ఏమి తొలగించారు వంటి వివాదాలు రావు.

వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు నిర్వాహకులకు మరిన్ని మార్గదర్శకాలు సూచిస్తుంది.

పేజీని తొలగింపు కొరకు వ్యాసాలు జాబితా నుండి తీసివేయడం

[మార్చు]

తొలగింపు కంటే మెరుగైన పరిష్కారం లభిస్తే, పేజీని జాబితాలో అలాగే కొన్నాళ్ళు ఉండనివ్వండి. దానిని అక్కడ చేర్చిన సభ్యుడికి విషయం తెలుస్తుంది, అందువలన మళ్ళీ ప్రతిపాదన రాకుండా ఉంటుంది. ఆ తరువాత (ఆ సభ్యుడు చూసినా చూడకున్నా ఒక రోజు తరువాత) పేజీని జాబితా నుండి తొలగించవచ్చు.

వ్యవధి అయిపోయాక

[మార్చు]

ఐదు రోజుల తరువాత, చర్చను తొలగింపు కొరకు వ్యాసాలు పేజీ నుండి తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి పేజీకి తరలిస్తారు. నిర్వాహకుడు నిర్ణయం తీసుకునే వరకు అది అక్కడే ఉంటుంది. ఈ పనులకు వికీపీడియా:తొలగింపు విధానం లో సూచించిన పధ్ధతులను పాటించండి. పేజీని తొలగించినా, దాని తొలగింపుపై జరిగిన చర్చను మాత్రం దాచాలి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]