Jump to content

హిజ్రా (దక్షిణాసియా)

వికీపీడియా నుండి
(నపుంసకులు నుండి దారిమార్పు చెందింది)

హిజ్రాలు దక్షిణాసియాలో‌ గురు-చేల వ్యవస్థ అనే కుటుంబ వ్యవస్థని అవలంభించే ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ మహిళలు. ఈ గురు-చేల వ్యవస్థలో, కొత్తగా చేరిన సభ్యు‌ల్ని ఎవరైనా ఒక వయస్సులో పెద్దవారైన హిజ్రా సారథ్యంలో పెడతారు. ఈ హిజ్రా వారికి తమ సమాజంలో ఎలా జీవించాలో నేర్పిస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే అందరు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులూ హిజ్రాలు కారు.[1][2]

చరిత్ర

[మార్చు]

భారతదేశ చరిత్రని పరికిస్తే వీరి ప్రస్తావన అనేక సార్లు చేయబడింది. పాండవ వనవాసములో అర్జునుడు బృహన్నల్లగా జీవిస్తాడు. హిజ్రాలు లేదా తృతీయ ప్రకృతి కలిగిన వారు మన సమాజానికి కొత్త కాదు. మన దేశ చరిత్ర పూర్వనుండి హిజ్రాలు, లింగమార్పిడిదారుల ఉనికిని నమోదు చేస్తూనే వచ్చింది. కాని వందేళ్ల క్రితం బ్రిటిష్ పాలకులు వీరిని నేరస్థుల ముఠాగా ముద్ర వేయడంతో యావత్ సమాజం వీరిని అపార్థం చేసుకోవడం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు వీరు సమాజం నుంచి వెలివేయబడుతున్నారు. అవమానించబడుతున్నారు. లైంగిక దోపిడికి గురవుతున్నారు. సమాజం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా హిజ్రాలు, లింగమార్పిడిదారులు తమ కుటుంబాలనుంచి దూరం చేయబడ్డారు. భారతీయ హిజ్రాలు నేటికీ యాచకుల్లాగే మిగిలిపోయారు. వందేళ్లుగా తమ హక్కుల కోసం వారు పోరాడుతున్నారు. లైంగికంగా దోపిడి చేయబడుతున్నారు. కుటుంబాలు త్యజించినప్పటికీ హిజ్రా కమ్యూనిటీలోని ఇతర లింగమార్పిడిదారులతో వీరు జీవిస్తున్నారు. ఒక లింగమార్పిడిదారుకు సమాజంలో జీవితం కొనసాగించడం నిజంగానే నరకప్రాయం అవుతోంది. ఎందుకంటే యావత్ సమాజం నిర్లక్ష్యం ప్రదర్శించడం కారణంగా వీరిని అన్ని తరగతుల వారు తప్పుగా అర్థం చేసుకంటూ దూరం పెడుతూ వస్తున్నారు.

గోవా లోని ఒక హిజ్రా

రైట్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ బిల్లు

[మార్చు]

మన రాజ్యాంగం లోని 21వ ఆర్టికల్ హిజ్రాలతో సహా దేశ పౌరులందరి గోప్యత, వ్యక్తిగత గౌరవ రక్షణ హక్కును కల్పించింది. మనుషులు, యాచకుల, నిర్బంధ కూలీల అక్రమ రవాణాను ఆర్టికల్ 23 నిషేధించింది. ఇంకా రాజ్యాంగంలో మరెన్నో నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేకించి 14, 15 ఆర్టికల్స్ మతం, జాతి, సెక్స్, జన్మస్థలం ప్రాతిపదికన వివక్షత చూపడాన్ని నిషేధించాయి. ఈ రకమైన చట్టాలు స్త్రీ పురుషులకు మాత్రమే సంబంధించినవి కాదు. అవి భారత పౌరుల, వ్యక్తుల గురించి ప్రస్తావిస్తున్నాయి. లింగమార్పిడిదారులు భారత పౌరులు. ఈ చట్టాలు హిజ్రాలు, లింగమార్పిడిదారులతో సహా సమస్త వ్యక్తుల హక్కులను కాపాడుతున్నాయి కాని అవన్నీ పుస్తకాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణకు తిరుచ్చి ఎంపీ శివ (డీఎంకే) ప్రవేశపెట్టిన ‘రైట్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ బిల్లు-2014’ను రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్లమెంటు చరిత్రలో ఓ ‘ప్రైవేటు మెంబర్‌ బిల్లు’ ఆమోదం పొందడం 45ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి . దీని ద్వారా వోటర్ గుర్తింపు కార్డులు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సుతోసహా అన్ని సౌకర్యాలను, నేషనల్‌ ట్రాన్స్‌జెండర్‌ వెల్ఫేర్‌ కమిషన్‌, ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ వీరిని వివిధ దశల్లో సమాజ భాగస్వాములను చేసేలా పది చాప్టర్లు, 58 క్లాజులతో బిల్లును రూపొందించారు. ఇక ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు పత్రాల్లో ‘థర్డ్‌ జెండర్‌’ అన్న కాలమ్‌ను ఏర్పాటుచేస్తారు. విద్య, ఆరోగ్యం, జాబ్స్, ఫైనాన్సియల్ గా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రిజర్వేషన్ కల్పిస్తారు[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

వీరి గురించిన రచనలు

[మార్చు]
  • అగర్వాల్, అనుజ, Gendered Bodies: The Case of the 'Third Gender' in India".In Contributions to Indian Sociology, new series, 31 (1997) : 273–97.
  • అహ్మద్, మోనా, దయనితా సింగ్ (ఛాయాచిత్రగ్రాహకుడు). Myself Mona Ahmed. స్కేలో ప్రచురణ, 2001 సెప్టెంబరు 15. ISBN 3-908247-46-2
  • గనాన్, షేన్ ప్యాట్రిక్. Translating the hijra: The symbolic reconstruction of the British Empire in India. PhD Thesis. అలబామా విశ్వవిద్యాలయము, 2009.
  • జామి, హుమరియా. "పాకిస్తాన్ లోని హిజ్రాల పరిస్థితి", జాతీయ మానసిక పరిశోధనాలయము, క్వైద్-ఇ-ఆజమ్ విశ్వవిద్యాలయము (nd, 2005?)
  • మల్లోయ్, రూత్ లోర్, మీన్ బాలాజీ, ఇతరులు. Hijras: Who We Are. Toronto: థింక్ ఏషియా, 1997.
  • జాన్ మోనీ. Lovemaps. ఇర్వింగ్టన్ ప్రచురణ, 1988. Page 106. ISBN 0-87975-456-7
  • నంద, సెరేనా. Neither Man Nor Woman: The Hijras of India. వర్డ్స్ వర్త్ ప్రచురణ, 1998. ISBN 0-534-50903-7
  • తల్వార్, రాజేష్. The Third Sex and Human Rights. గ్యాన్ ప్రచురణాలయము, 1999. ISBN 81-212-0266-3

మూలములు

[మార్చు]
  1. "Who are the hijras?". Retrieved 2022-08-14.
  2. Nanda 1991, "Among thirty of my informants, only one appeared to have been born intersexed.".
  3. - See more at: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/63354-rajya-sabha-passed-historic-private-bill-to-promote-transgender-rights.html#sthash.WAXKGVpP.dpuf Archived 2015-05-30 at the Wayback Machine

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.