త్రయోదశి
Appearance
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదమూడవ తిథి త్రయోదశి. అధి దేవత - మన్మధుడు.
త్రయోదశి వ్రతం
[మార్చు]- త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశి గాని; లేదా 24 శుక్ల పక్ష త్రయోదశులు గాని ఎన్నుకొని నియమబద్ధంగా త్రయోదశి వ్రతాచరణ చేయవచ్చును. ప్రదోషకాలంలో శివపూజ, నక్తభోజనం విధులు. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి.
- శని త్రయోదశి అనగా శనివారం + త్రయోదశి కలిసిన రోజు. దీనిని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు.
త్రయోదశీ నిర్ణయం
[మార్చు]ధర్మ సింధు[1] ప్రకారం త్రయోదశికి శుక్ల పక్షంలో పూర్వదినాన్ని, కృష్ణ పక్షంలో పరదినాన్ని గ్రహించాలి.
పండుగలు
[మార్చు]- చైత్ర శుద్ధ త్రయోదశి - కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూడు రోజుల వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం.
- ఆశ్వయుజ బహుళ త్రయోదశి - ధన త్రయోదశి
- ప్రదోషం.
మూలాలు
[మార్చు]- ↑ త్రయోదశీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 60.