Jump to content

గాంధారి (మహాభారతం)

వికీపీడియా నుండి
గాంధారి
మహాభారతం పాత్ర
గాంధారి
వ్యాసుని నుండి ఆశీస్సులు అందుకుంటున్న గాంధారి
సమాచారం
కుటుంబంసుబల (తండ్రి), శకుని (అన్న)
దాంపత్యభాగస్వామిధృతరాష్ట్రుడు
పిల్లలుధుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడుతోపాటు 97 మంది కుమారులు దుశ్శల (కుమార్తె)

గాంధారి (సంస్కృతం:गांधारी) మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడి భార్య, కౌరవులకు తల్లి.[1] ఇప్పుడు ఆప్ఘనిస్తానులో ఉన్న కాంధహార్ (పాతపేరు "గాంధార") నగరానికి చెందినది కావున ఈమెకు పేరు "గాంధారి" అని వచ్చింది. గాంధారి తండ్రి సుబలుడు, తమ్ముడు శకుని. ధృతరాష్ట్రుడుతో వివాహ సంబంధం వచ్చిన వేంటనే గాంధారి ధృతరాష్ట్రుడిని పతిగా భావించి, తన భర్త గ్రుడ్డి వాడు అవడం చేత తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొంది. ఈమెకు దుర్యోధనుడితో మొదలయ్యే నూరుగురు (కౌరవులు) కుమారులు, దుస్సల అనే కుమార్తె కలిగారు.[2]

గాంధారి ధృతరాష్ట్రులు తదితరులు వనవాసమునకు బయలుదేరుట-రాజ్మానామా నుండి ఒక దృశ్యం

తొలి జీవితం - వివాహం

[మార్చు]

గాంధార రాజు సుబలుడికి, సుధర్మ కు గాంధారి జన్మించింది. మాతి అవతారంగా పరిగణించబడుతున్న గాంధారి తన ధర్మ స్వభావంతో పేరొందింది.[3] హర్యానా ప్రాంతం ఢిల్లీలోని కురు రాజ్యానికి పెద్ద యువరాజు ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం ఏర్పాటు చేయబడింది. అందమైన, ధర్మవంతురాలైన స్త్రీగా, అంకితభావంతో ఉన్న భార్యగా మహాభారతంలో చిత్రీకరించబడింది. భీష్ముడు వివాహం జరిపించాడు. తన భర్త అంధుడిగా జన్మించాడని తెలుసుకున్నప్పుడు, ఆమె కూడా తన భర్తలా ఉండటానికి తన కళ్ళకు గంతలు కట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఒక అంధుడిని వివాహం చేసుకోవాలని తెలుసుకున్నప్పుడు గాంధారి మనసులో ఏముంది అనేది ఏ ఇతిహాసంలోనూ [1][permanent dead link]. తనకు తాను కళ్ళకు గంతలు కట్టుకోవడం ప్రేమకు సంకేతంగా చిత్రీకరించబడింది.[4]

వివాహానికి పూర్వం గాంధారి తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకొని 100 మంది పిల్లలను పుట్టడానికి వరం పొందిందని చెబుతారు. భీష్ముడు గాంధారిని కురు రాజ్యానికి పెద్ద కోడలిగా చేసుకోవడానికి ప్రధాన కారణాలలో ఈ వరం కూడా ఒక కారణం అని చెప్పబడింది. గాంధారపై హస్తినాపుర ఆక్రమణ యుద్ధంలో తన సోదరులందరూ చంపబడినందుకు కురు వంశంపై కోపం పెంచుకున్న శకుడు కురు రాజవంశాన్ని నాశనం చేస్తానని శకుని ప్రమాణం చేశాడు. దాయాదుల మధ్య గొడవలు, యుద్ధాలు జరగడంలో కీలక పాత్ర పోషించాడు.

సంతానం

[మార్చు]

తన భర్త పట్ల గాంధారి భక్తిని చూసిన వేద వ్యాసుడు 100మంది కుమారులు పుట్టడానికి వరం ఇచ్చాడు. గాంధారి గర్భవతి అవుతుంది, కాని 2 సంవత్సరాలు అయినా కాని ప్రసవం కాదు. ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి, నిరాశ నిస్సహాయతతో కడుపుపై కొట్టుకుంటుంది. ఫలితంగా బూడిదరంగులో ఒక ముద్ద పుడుతుంది. వేదవ్యాసడు దీనిని 101 భాగాలుగా విభజించి, మట్టికుండలలో నిల్వచేసి మరో 2 సంవత్సరాలు దాచిపెడతాడు. అలా వారిలో మొదట దుర్యోధనుడు జన్మించగా, తరువాత 99మంది సోదరులు, ఒక సోదరి దుశ్శల జన్మిస్తుంది.[5]

మొదటి కుమారుడు దుర్యోధనుని పుట్టినప్పుడు అనారోగ్య శకునాలు సంభవించడం చూసిన సత్యవతి, వ్యాసుడు, భీష్ముడు, విదురుడు మొదలగువారు పిల్లవాడు తమ రాజ్యానికి గొప్ప విధ్వంసం కలిగించవచ్చని ముందే తెలుసుకొని, ఆ పిల్లవాన్ని గంగానది నీటిలోకి పడేయడమో లేదా చంపడమో చేయాలని ధృతరాష్ట్ర దంపతులకు సలహా ఇచ్చారు. కాని వారు దానిని తిరస్కరించారు.

తరువాతి జీవితం - మరణం

[మార్చు]

మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడి వంశం, ఆయన పిల్లలు, యాదవులు నశిస్తారని గాంధారి కృష్ణుడిని శపించింది. శ్రీకృష్ణుడు శాపమును సంతోషంగా అంగీకరించాడు. యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత యాదవులు త్రాగి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ శాపం నిజమైంది. వాళ్ళు ఋషులను ఆటపట్టిస్తుండేవారు.

గాంధారి తన పెద్ద కొడుకు దుర్యోధనుడిని చూడటానికి ఆమె కళ్ళ గంతలు ఒకసారి విప్పింది. అప్పుడు ఒకే చూపులో ఆమె తన శక్తిని తన కొడుకు శరీరంలోకి పంపించింది. కాబట్టి, దుర్యోధనుడి నడుము మినహా శరీరమంతా పిడుగులా బలంగా ఉంటుంది. తన తల్లిని కలవడానికి ముందు తన శరీరాన్ని కప్పుకోవాలని చెప్పిన కృష్ణుడి మాటను దుర్యోధనుడు పట్టించుకోలేదు.[6] కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిదవ రోజున జరిగిన పోరులో భీముడు దుర్యోధనుడి తొడలను పగులగొట్టాడు. జన ప్రాచూర్యంలో ఉన్నప్పటికీ, వేదవ్యాసుడు రాసిన మహాభారతం మూలంలో ఈ కథ ప్రస్తావించబడలేదు. వ్యాస మహాభారతం ప్రకారం... దుర్యోధనుడు, భీముడితో పోరాడుతున్నప్పుడు, అతనికున్న శక్తి కారణంగా భీముడు అతన్ని ఓడించలేకపోయాడు. దాంతో అతనిని చంపడానికి నియమాలను ఉల్లంఘించాల్సి వచ్చింది.[7]

గాంధారి కుమారులు అందరూ తమ బంధువులైన పాండవులతో కురుక్షేత్రంలో, ముఖ్యంగా భీముడి చేతిలో జరిగిన యుద్ధంలో చంపబడ్డారు. ఈ వార్త విన్న తరువాత, కళ్ళకు కట్టిన గంతలకు ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఆమె చూపు యుధిష్ఠరుడి బొటనవేలు మీద పడిందని, ఆమె కోపం శక్తి కారణంగా అతని శుభ్రమైన బొటనవేలు నల్లగా మారిందని చెబుతారు. పాండవుల కుమారులు (ఉపపాండవులు) మరణించిన వార్త విన్న ఆమె పాండవులను ఆలింగనం చేసుకుని ఓదార్చింది. ఈ విధ్వంసం జరగడానికి కారణమైన కృష్ణుడి వైపు ఆమె కోపంగా తిరిగింది.[8] శ్రీకృష్ణుడు, అతని నగరం, అతని ప్రజలందరూ నాశనం అవుతారని ఆమె శపించింది. కృష్ణుడు శాపమును అంగీకరించాడు. మహాభారత యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత ఆమె శాపం సాగి, ఒక పండుగలో యాదవుల మధ్య పోరాటం జరిగి యదు రాజవంశం నశించిపోయింది. శ్రీకృష్ణుడు 126 సంవత్సరాలు జీవించిన తరువాత తన లోకానికి వెళ్ళిపోయాడు. అతను కనిపించకుండా పోయిన ఏడు రోజుల తరువాత బంగారు ద్వారకా నగరం మునిగిపోయింది. యుద్ధం ముగిసిన 15 సంవత్సరాల తరువాత గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు, బావమరిది విదుర, మరదలు కుంతిలతో కలిసి తపస్సు కోసం హస్తినాపూర్ నుండి బయలుదేరింది. హిమాలయాలలో ధృతరాష్ట్ర, విదుర, కుంతిలతో పాటు అటవీ అగ్నిప్రమాదంలో గాంధారి కూడా మరణించి మోక్షాన్ని పొందింది.[9]

మూలాలు

[మార్చు]
  1. గాంధారి, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 63.
  2. Ganguli, Kisari Mohan. The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose by Kisari Mohan Ganguli. N.p.: n.p., n.d. Web.
  3. "Adi Parva Sambhava Parva : Section LXVII". Mahabharata Book 1. p. 139.
  4. Irawati Karve, Yuganta: The End of an Epoch, Chapter:3
  5. "The Mahabharata, Book : Adi Parva:Sambhava Parva : Section:CXV". Sacred-texts.com.
  6. Gandhari, the Rebel. Vol. 29. Economic and Political Weekly. p. 1517-1519.
  7. "60-61". Mahabharata Book 9. Vol. Shalya Parva.
  8. Stri Parva The Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1889)
  9. Pattanaik, Devdutt. "Tears of Gandhari". Devdutt. Archived from the original on 2019-06-18. Retrieved 2020-07-01.

ఇవి కూడా చూడండి

[మార్చు]