Jump to content

హుద్‌హుద్ తుఫాను

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
అత్యంత తీవ్రమైన హుద్‌హుద్ తుఫాను
Very severe cyclonic storm (IMD scale)
Category 4 (Saffir–Simpson scale)
Hudhud nearing landfall at peak strength on October 12, 2014
Formedఅక్టోబరు 7, 2014
తీరందాటిన తేదిఅక్టోబరు 14, 2014
Highest winds3-minute sustained: 175 km/h (110 mph)
1-minute sustained: 215 km/h (130 mph)
Lowest pressure960 mbar (hPa); 28.35 inHg
(Estimated at 937 hPa (27.67 inHg) by the JTWC[1])
Fatalities24 total[2]
కలిగించిన నష్టము$1.63 billion (2014 USD)[3]
తుఫాను ప్రభావిత ప్రాంతాలుఅండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా
Part of the 2014 North Indian Ocean cyclone season

హుధుద్ తుఫాను (ఆంగ్లం: Cyclone Hudhud) అనేది దక్షిణ హిందూ మహాసముద్రంలో యేర్పడిన తుఫాను. ఇది అక్టోబరులో బెంగాల్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ తీరాలను తాకనుంది. దీనికి ఒక పక్షి పేరుతో (ఓమన్ భాషలో) నామకరణం చేశారు.[4][5][6] తూర్పు మధ్య బంగాళాఖాతంలో హుధుద్ పెనుతుపాన్‌గా మారింది. గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్ల దూరంలో తుపాను అక్టోబరు 9 2014 నాటికి కేంద్రీకృతమైంది. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ఈ తుఫాను 24 గంటల్లో తుపానుగా మారి 36 గంటల్లో తీవ్ర పెనుతుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబరు 12 2014 న మధ్యాహ్నం విశాఖ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది. 11 నుంచి ఒడిశా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నాయి.

పేరు వెనుక చరిత్ర

సాధారణంగా అరేబియా సముద్రంలో సంభవించే తుఫానుకు పేరును నిర్ణయించే అధికారం భారత్, పాకిస్థాన్,ఓమన్,బంగ్లాదేశ్, మాయన్మార్,శ్రీలంక,మాలదీవులు, థాయ్‌లాండ్ దేశాలకు ఉంది. 2014 అక్టోబరు మాసం రెండవవారంలో సంభవించిన తుఫానుకు పేరు నిర్ణయించే అవకాశం ఓమన్ దేశానికి ఇవ్వబడింది. ఆదేశం ఈ తుఫానుకు హుధ్‌హుద్ (ఓమన్ భాష) అని నిర్ణయించింది. ఈ పక్షి ఇజ్రాయేల్ దేశానికి జాతీయ పక్షి. ఇది ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాలలో కనిపిస్తుంది.[7]

9 వ తేదీ బుధవారం హెచ్చరిక

Storm track
7, 8 తేదీలలో అండమాన్, నికోబార్ ద్వీపాలను దాటిన హుద్ హుద్ తుఫాను.

“హుధుద్” పరిధి సుమారు 500 కిలోమీటర్లు ఉండవచ్చని పేర్కొన్న భారత వాతావరణ శాఖ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు సూచించింది. ఒడిశాలోని 9 జిల్లాలకు తుపాను ముప్పు పొంచి ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణా రాష్ట్రంలో “హుధుద్” తుపాను ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.[8] ఈ తుఫాన్ ప్రభావంతో 11 నుండి ఉత్తరాంధ్రా, దక్షిణ ఒడిషాలలో వర్షాలు కురవడానికి అవకాశం ఉంది. 11 న 50-60 కి.మీ వేగంతో, 12 న 130-140 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భావిస్తున్నారు. తుఫాను పరిధి 500కి.మీ

10వ తారీఖు పరిస్థితి

తుఫాను దిశను మార్చుకుంది. ఒడిషాలోని గోపాల్‌పూర్ వద్ద తీరానికి చేరవచ్చని అంచనావేయబడిన తుఫాను విశాఖకు సమీపంలో తీరం దాటవచ్చని అధికారులు భావించారు. తుఫాను శుక్రవారం 12 గంటల తరువాత తీరం తాకే అవకాశం ఉందని భావించారు. విశాఖలో 10 మండలాలకు చెందిన 50 గ్రామాలు, శ్రీకాకుళంలో 13 మండలాలకు చెందిన 78 గ్రామాలలో తుఫాను ప్రమాదం ఉండవచ్చని అంచనా వేసారు. తుఫాను ప్రభావం విశాఖపట్టణం,విజయనగం, శ్రీకాకుళం జిల్లాలో ఉంటుందని అధికారులు హెచ్చరించారు. జిల్లా అధికారుల చేత మేరిన్ పోలీస్ శాఖ, కోస్టల్ గార్డులు, నావికాదళం అప్రమత్తం చేయబడింది. తుఫాన్ ప్రభావంతో 12 నుండి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు ఉంటాయని భావించారు.

  • హెచ్చరిక చేయబడిన మండాలాలు భోగనగర్, పూసపాటిరేగ, (విజయనగరం) మచిలీపట్నం, మోపిదేవి, నాగాయలంక, కృత్తివెన్ను, అవనిగడ్డ, కోడూరు, బణ్టుమిల్లి (కృష్ణా జిల్లా)
  • విశాఖవద్ద సముద్రం అనూహ్యంగా వెనుకకు తగ్గింది.[9]

11వ తారీఖు పరిస్థితి

An animation showing Hudhud developing an eye on October 11

11 న తుఫాను తీవ్రంగా మారింది. విశాఖపట్టణానికి తూర్పు ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో ఒడిషా లోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 460 కేంద్రీకృతం అయి ఉంది. తుఫాను ఆదివారం నాడు తీరం చేరవచ్చని భావించబడింది. శనివారం నుండి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు, పశ్చుమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం. శనివారం గాలుల వేగం 60-70 ఆదివారం గాలుల వేగం 130-140.

  • కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్టణం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం (3వ నెంబరు హెచ్చరిక) కృష్ణపట్నం, నిజాంపట్టణం (2వ నెంబరు హెచ్చరిక).
  • రాజకీయంగా తూర్పుగోదావరి (మంత్రి చినరాజప్ప), విశాఖపట్టణం (మంత్రి ఘంటా శ్రీనివాసరావు), శ్రీకాకుళం (మంత్రి అచ్చెన్ననాయుడు) జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిపి ఆదేశాలను జారీచేయడం. జాతీయ విపత్తుల స్పందనల డిఐ.జి గులేరియా, కలెక్టర్ అరవింద్ కుమార్ సమీక్ష.
  • పైకప్పులు ఎగిరిపోవడం, కరెంటుస్తంభాలు విరిగిపడం, రైలు, రహదారి మార్గాలు కొట్టుకు పోవడం.
  • అలలతాకిడి : తూర్పు గోదావరి, విశాఖ తీరంలో అలలు 2 మీటర్ల ఎత్తుకు ఎగసి పడడం.
  • లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, సముద్రంలో చేపల వేట నిషేధం.
  • సహాయక చర్యలు: 60 మంది గజయీతగాళ్ళతో కూడిన 15 బృందాలు, 5 హెలికాఫ్టర్లు, 2 విమానాలు, 225 మంది జవాన్లు.
  • నౌకాదళం : 4 నౌకలు, రబ్బరు బోట్లు, 30 మంది గజయీతగాళ్ళతో కూడిన బృందాలు, ఐ.ఎన్.ఎన్ డేగాలో 4 ప్లాటూన్ల నావికాదళం సమాయత్తం.
  • వైద్యరక్షణ: మండలానికి 2 అంబులెంసులు సంసిద్ధత, వైద్యబృందాల సంసిద్ధత, రక్తపోటు, రక్తహీనత, మధుమేహం వంటి సమస్యలు ఉన్న గర్భవతులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించమని హెచ్చరించడం.[7]

12వ తారీఖు పరిస్థితి

12వ తారీఖు నాటికి తుఫాను తీవ్రరూపందాల్చింది. 9కిమీ మందం, 450 కి.మీ వ్యాసంలో తుఫాను సుడులు తిరుగుతూ విశాఖపట్నానికి 230 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. విశాఖతీరంలో సముద్రం 20 మీ. ముందుకు పొంగి వచ్చింది. తుఫాన్ విశాఖ వద్ద తీరం దాటవచ్చని అధికారులు భావించారు. తుఫాను ప్రభావంతో ఒడిషాలోని కలహండి, పుల్బని, గజాం, గజపతి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాజలో 48 గంటల భారీ వర్షాలు సంభవం అని అధికారుల హెచ్చరిక జాతీచేయబడింది. 60 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు 195 కి.మీ వేగానికి చేరుకోవచ్చని హెచ్చరిక.[10]

విశాఖ భౌగోళిక స్థితి

సాధారణంగా విశాఖపట్టణం భౌగోళికంగా తుఫాను నుండి సురక్షితంగా ఉంటుంది. దక్షిణ పీఠభూమి పర్వతాలు విశాఖ సముద్రతీరంలో విస్తరించి ఉన్న కారణంగా విశాఖ వద్ద తుఫాను తీరానికి చేరదు కనుక విశాఖ తుఫానుల నుండి సురక్షితంగా ఉంటుంది. 1983 ఒకసారి విశాఖ సమీపంలో ఉన్న భీమునిపట్నం వద్ద తీరాన్ని తాకింది. తరువాత 1996లో తుఫాను తీవ్రంగా విశాఖను తాకింది. హుధ్‌హుద్ తుఫాను 9 కి.మీ మందంలో ఉన్నందున దక్షిణ పీఠభూమి పర్వతాలు విశాఖను రక్షించలేవని అధికారులు భావిస్తున్నారు.[10]

ప్రాంతాలవారీ పరిస్థితి

  • విశాఖలో యారాడ, ఆర్‌కెబీచ్, ౠషికొండాఅ, భీమునిపట్నం ప్రాంతాలలో సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. అలల తాకిడికి ఫిషింగ్ హార్బర్‌లో గోడ పడిపోయింది. పైలిన్ తుఫాను తాకిడికి ఈ గోడ ఒక సారి కూలిపోవడం విశేషం. బస్సు, రైలు, విమానసేవలు రద్దు, తిరంలోని ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు తీరం వదలడానికి నిరాకరించారు.
  • పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు, ఎలమంచిలి, భీమవరం, నరసాపురం, కాళ్ళ మండలాలలో సహాయక చర్యలు తీవ్రం. 50వేల మందిని తరలించాలని యోచన. 5 వేలమందిని తరలింపు. 20 పునరావాస కేంద్రాల ఏర్పాటు. మంత్రులు పీతల సుజాత, ఎం.పీ నరసరాజు పర్యటించి పరిస్థితిని సమీక్షించడం వంటి రాజకీయ చర్యలు.
  • తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం 200 మీ ముందుకు చొచ్చుకువచ్చింది. రహదార్లు కోతకు గురైయ్యాయి. విజయవాడ - కాకినాడ రహదారి, ఉప్పాడ- తొడంగి రహాదారులు మూసి వేయబడ్డాయి. మంత్రి చినరాజప్ప కొనసీమను పర్యవేక్షించాడు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసారు. తీరప్రాంతంలో ప్రతి మండలానికి ప్రత్యేక అధికార్లు, ప్రతిగ్రామానికి ఒక అధికారి నియమించబడ్డారు.
  • భోగాపురం, పూసపాటిరేగు లలో సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చింది. రాత్రి వేళకు కోనాడ, తిప్పవసల, పతివాడ,బర్రిపేట, పులిగెడ్డపాలెం, తిమ్మయ్యపాలెం, చింతపల్లి, ముక్కాల, మద్దురు, చేపలవాని చెరువు, కొత్తూరు లలో అలలతాకిడి ఉదృతం కాగలదని అంచనా. 22 గ్రామాల పరిధిలో 12 పునరావాస కేంద్రాల ఏర్పాటు. బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు, పంచదార, వంటగ్యాసు వంటి అత్యావసర వస్తువుల పంపిణి. 40 మంది జాతీయ విపత్తు సభ్యులు నాలుగు బృందాలుగా 4 మండలాలో సహాయకచర్యలు చేపట్టడం. 24,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం. మంత్రి కిమిడి మృణాళిని విజయనగరం, భోగాపురం, పూసపాటిరేగు ప్రాంతాలలో పయటన. మత్స్యకారులను తరలించడం.
  • శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఉధృతం. అలలతాకిడి ఉధృతమై గ్రామంలోకి చొచ్చుకువచ్చిన సముద్రపు నీరు. 15మీ ఎత్తుకు ఎగసిపడిన అలలు. వంశధారకు వరద ప్రమాదం. ఒడిషా జలాశయాల నుండి వదిలిన నీటితో శ్రీకాకుళంలో వరద ప్రమాదం. ఉద్ధానం ప్రాతంలో తుఫాను తీవ్రప్రభావం. పైలిన్ తుఫాను సమయంలో కూడా ఇదే ప్రాంతం తీవ్రంగా దెబ్బతినడం విశేషం. లక్ష క్యూసెక్కుల వరద నీరు. 80 పునరావాస కేంద్రాలు, 40 వేలమంది పునరావాస కేంద్రాలకు తరలింపు, 80 మంది ఎన్.డీ.ఆర్.ఏన్. దళాలు సహాయానికి సంసిద్ధత, 272 గజ ఈతగాళ్ళు సహాయానికి నియమనం వంటి చర్యలు చేపట్టబడ్డాయి. వరద ముంపు ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు రావడానికి నిరాకరించారు.[10]

13వ తారీఖు పరిస్థితి

13 వ తారీఖున ఆదివారం నాడు 8-12 ప్రాంతంలో తుఫాను తీరం దాటింది. విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద తీరం తాకింది. ప్రచంఢమైన గాలులతో విలయతాండవం చేసి బీభత్సం సృష్టిబ్చిన హుద్‌హుద్ తుఫాను 12 గంటల తరువాత కొంత విశ్రాంతి తీసుకుని తిరిగి 2 గంటల నుండి తిరిగి గాలులు వీచడం మొదలైంది. మొదటి దఫా గాలులకు తీరప్రాంతాలు తీవ్రనష్టానికి గురై అతలాకుతలం అయింది. రెండడవసారి గాలితీవ్రత తగ్గినప్పటికీ దీర్ఘకాలం కొనసాగింది. కుండపోతగా వర్షం కురవడం వలన సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. 180-210 కి.మీ వేగంతో గాల్లులు వీచాయి. తుఫాన్ ప్రభావం ఆధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్టణం తీవ్రంగా దెబ్బతిన్నాయి. పైకప్పులు ఎగిరిపోయాయి, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి, కరెంటు తీగలు తెగిపోయాయి, వాహనాలు దెబ్బతిన్నాయి, రహదార్లు విధ్వంసానికి గురైంది. జనజీవనం అంతరాయానికి గురైంది.తుఫాన్ హుధుద్ 4 వర్గానికి చెందిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాణ నష్ట్రం 3 గా వెల్లడించారు. దాదాపు 2 లక్షల మందిని పునరావాస కేద్రాలకు తరలించబడ్డారు.

  • శనివారం రాత్రి నుండి విద్యుత్తు సరఫరా ఆపివేయబడింది. విద్యుత్తు తీగలు తెగిపడిన ప్రాణనష్టం జరగగలదన్న అనుమానంతో విదుత్తు సరఫరా మద్యలో పునరుద్దరించబడలేదు.
  • మంత్రులు గంటాశ్రీనివాస్, పి. నారాయణ, కలెక్టర్ విజయకుమార్, తుఫాను ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్ సిబ్బందితో గడగడలాడుతూనే సహాయక చర్యలను కొనసాగించడం.
  • సహాయచర్యలలో ఎన్.డి.ఆర్.ఎఫ్ నుండి 240 మంది, సైనికులు 240, నావల్ రెస్క్యూ 30బృందాలు (120) మంది, గజ ఈతగాళ్ళు 270 మంది, పాల్గొన్నారు.
  • ఒడిషాలో 90,013 మంది, విశాఖ నుండి 68 వేలమంది పునరావాసాలకు తరలించబడ్డారు.
  • నష్టాలను అంచనా వేయడానికి 9 జిల్లాలకు 90 బృందాల నియామకం.
  • విమానాశ్రయ టెర్మినల్, కలెక్టర్ కార్యాలయం, ఆంధ్రవిశ్వవిద్యాలయం, గవర్నర్ భవనం, డిటిఒ, ఆర్.టి.ఒ, డి.పి.ఒ, డిజిపి, ఎస్.పి, డి.ఎస్.పి కార్యాలయాలు తీవ్ర అఘాతం. లక్ష గృహాలు విధ్వంసం, 60-70 కి.మీ దూరంలో రైల్వే మార్గం విధ్వంసం. నష్టాన్ని నివారించడానికి పలు రైళ్ళు రద్దు చేయబడ్డాయి. కొన్ని రైళ్ళు దారి మళ్ళినబడ్డాయి.
  • వర్షపాతం : ఇచ్చాపురం (120.9), విశాఖపట్నం (139), శ్రీకాకుళం, నెల్లిమర (93), కళింగపట్నం (117),పూసపాటి రేగు (103), రణస్థలం (97.2), టెక్కలి (93), విజయనగరం (101) మిల్లీ మీటర్ల వర్షం.

నాసా హెచ్చరిక

హుద్‌హుద్ తుఫాను గురించి ముందుగానే నాసా హెచ్చరించింది. 9 వ తేదీ రాత్రి 7.53 సమయంలో భారత్‌ గగనవీధిలో పయనించిన నాసా వారి అక్వా ఉపగ్రం తుఫాను గురించిన చిత్రాలను నాసాకు పంపింది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 155 కి.మీ దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని నాసా తెలియజేసింది. ఆదివారం తీరం దాటే సమయంలో గాలులు 139.కి.మీ వేగంతో వీస్తాయని తెలియజేసారు. 7 గంటల సమయానికి తీరం వెంట గాలులు మొదలయ్యాయి. 10 గంటలకు గాలుల వేగం 170 కి.మీకి చేరుకుంది. తుఫాను విశాఖకు 45కి.మీ దూరానికి చేరుకుంది. తీరం చేరేసమయానికి గాలులవేగం 207 కు చేరుకుంది.

తుఫానులో గాలులవేగం 61కి.మీ చేరుకుంటే ఉష్ణమండల వాయుగుండం, 117 ను చేరుకుంటే ఉష్ణమండల స్ట్రోం, 119 చేరుకుంటే హరికేన్ అంటారు. ఆతరువాత హరికేన్ గాలితీవ్రతను అనుసరించి 1,2,3,4,5 గా వర్గీకరిస్తారు. గాలివేగం 209-252 వరకు హరికేన్ 4 వర్గానికి చేరుతుంది. గాలివేగం 254 కి.మీ దాటితే హరికేన్ సూపర్ తైఫూంగా వర్గీకరిస్తారు. [11]

తుఫాను ద్వారా జరిగిన నష్టాలు

హుద్‌హుద్ తుఫాను కారణంగా దెబ్బతిన్న విశాఖపట్టణం బీచ్‌లోని రెండవ ప్రపంచయుద్ధం నాటి బంకరు

సమస్యలు

  • ఎత్తు ఎక్కువగా ఉండి సముద్రానికి సమీపంలో ఉన్న కైలాసగిరి కొండ తుఫాను దాటికిపూర్తిగా పాడయింది. ఇక్కద కల అన్ని వృక్షాలు నేలకూలాయి. యాత్రికులకోసం కట్టిన అన్ని భవనాలు నాశనమైనాయి. వినోదసాధనాలు ఎగిరిపోయాయి.
  • పెట్రోలు బంకులలో రేకులు ఎగిరిపడి బంకులు పనిచేయక వాహనాలు ఆగిపోయాయి, హోటళ్ళలో సిబ్బంది రాలేని పరిస్థితి, మంచినీటి సరఫారా ఆగిపోవడంతో హోటళ్ళు పనిచేయలేదు.

స్టార్ హోటళ్ళు సహితం ఆహారం సరఫరా చేడానికి ఇబ్బంది పడడం. సెల్‌ఫోన్లు పనిచేయక పోవడం వంటి తీవ్రసమస్యలు ఎదుర్కొన్నారు.

  • గిరిజన వాడలు: గిరిజనవాడలలో వాగులు, వంకలు, సెలయేర్లు పొంగిపొరలుతున్నాయి. పైనుండి వచ్చి పడుతున్న జలప్రవాహంతోవాడేరు ఆర్.బి బగ్లా దెబ్బతిన్నది. పాడేరు, రైవాడ రిజర్వాయర్లు పొంగిపొరలే అవకాశం. శరదా నదికి వరద అనకాపల్లికి మునక ప్రమాదం సూచించబడింది.
  • పరిశ్రమలకు నష్టం: విశాఖ ఉక్కు కర్మాగారంలో పనులకు అంతరాయం. విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్, ష్ప్‌యార్డ్ దెబ్బతినడంతో సరుకుల రవాణాకు అంతరాయం.
  • గవర్నమెంటు ఆసుపత్రులు : కె.బి.హెచ్,టిబి హె హెచ్, ఆర్.బి.హెహ్, వి.జి హెచ్, ఇ.ఎన్.టి, ఐ.జి హెచ్ వంటి ఆసుపత్రులలో కరెంటు కోత వలన వైద్యసేవలకు అందక నిటి సరఫరా అందక గాలి వానలతో ఇబ్బందులకు గురైయ్యారు.
  • ఈ తుఫాను కారణంగా విద్యుత్తు వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగింది. విశాఖలో 144, విజయనగరంలో 83 ఉపకేద్రాలు విధ్వంసానికి గురైయ్యాయి. విశాఖలో 18 వేల స్తంభాలు, విజయనగరంలో 20వేల స్తంభాలు నేలకొరిగాయి. ఇ.పీ.డీ.సి.ఎల్‌కు 400-500 కోట్ల నష్టం వాటిల్లగలదని అంచనా. నివారణ చర్యలలు ఇ.పి.డి.సి.ఎల్ సిబ్బందిని అప్రమత్తం చేసారు [12]]
  • తుఫాను వలన భారీగా పంట నష్టం సంభవించింది. వరి పంట నీటమునిగింది, బొప్పాయి, అరటితోటలు నేలకొరిగాయి. విశాఖలో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు.[12]
  • హుద్‌హుద్ తుఫాను కారణంగా రైల్వే ప్రయాణీకుల టిక్కెట్లు, సరుకురవాణా మూలంగా 15.6 కోట్లు నష్టపోయింది. 11,12,13 తారీఖులలో దాదాపు 90 రైళ్ళు రద్దుచేబడ్డాయి. రైల్వే సిబ్బంది యుద్ధప్రాయిపదికలో 32 గంటలు శ్రమించి మంగళవారం 2.30 గంటలకు కొంతవరకు రైలుమార్గాన్ని సుగమం చేసారు.

పారిశ్రామిక నష్టాలు

  • హుద్‌హుద్ తుఫాను కారణంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు దాదాపు 1000 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. విశాఖలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు దాదాపు 3 వేలు ఉన్నాయని తుఫానుకు వాటిలో 2 మూతపడ్డాయని అంచనా. సరిచేయడానికి పనివారు లభించక పరిశ్రమలు తెరవడానికి వీలుకాని పరిస్థితి ఎదురైంది. [4]
  • ఓడరేవు నష్టం కూడా తీవ్రస్థాయికి చేరింది. తుఫాను సమయంలో నౌకలు రేవులో ఉంటే జట్టీలకు ఢీకొట్టుకుంటాయని సముద్రంలోకి నెట్టివేయబడతాయి. అలా పంపిన నౌకలలో తుఫాను తరువాత కూడా రేవులోకి చేరలేదు. పోర్టులో సమాచారవ్యవస్థ కుప్పకులినందువలన నౌకలకు అనుమతి లభించక రేవుకు రాలేదు. రేవులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న సరుకు కూడా ధ్వంసం అయింది. డి.ఎ.పి, యూరియా, ఎం.ఎ.పి వంటి ఎరువులు 1.5 టన్నులు ధ్వంసం అయ్యాయి. ఈన్నర్ హార్బర్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ జెట్టీ క్రుంగిపోవడంతో 100కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. నౌఖాశ్రయానికి మొత్తం 200 కోట్లు నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. [5]
  • హెచ్.పి.చి.ఎల్ లో కూడా నష్టం అధికాంగా ఉంది. సాంకేతికంగా సంభవించిన లోపాల కారణంగా ఉత్పత్తు నిలిపివేయబడింది. కంఫ్యూటర్ ఇతర వ్యవస్థలు దెబ్బతినడం కారణంగా పెట్రోలు, డీజల్ కూడా విక్రయించలేని పరిస్థితి ఎదురైందని భావిస్తున్నారు.[6]
  • విశాఖ ఉక్కు కర్మాగారంలో తీవ్రమైన నష్టం ఏర్పడింది. 270 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు ఉన్నా పరిశ్రమకు విద్యుత్తు అందని పరిస్థితి. ప్రభుత్వం కూడా విద్యుత్తు అందించలేని పరిస్థితి కారణంగా ఉతపత్తి నిలిచిపోయింది. నష్టం వేలకోట్లకు చేరగలదని అంచనా.[7]
  • కోళ్ళ పరిశ్రమలో 25 కోళ్ళు మరణించాయి. విదుత్తు, నీరు, ఆహారం లభించక అధికంగా కోళ్ళు మృత్యువు వాతపడడానికి అవకాశం ఉందని అంచనా. 14 వ తారీఖు నాటికి 125 కోట్ల నష్టం జరిగిందని ఇది 200 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ళ మరణించిన కారణంగా నష్టం అదనంగా 60 కోట్లకు చేరుకుంటుందని అంచనా.[8]
  • గీతం విశ్వవిద్యాలయానికి 200 కోట్లు ఉండని అంచనా. అంతర్జాల వసతి స్తంభించినందున ఐ.టి సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి.[9]

సహాయకచర్యలు

సహాయక చర్యలలో భాగంగా త్రివిధ దళాలు " ఆపరేషన్ లెహర్ " పేరుతో సహాయం అందించాయి. నౌకాదళం ఒడిషాలోని చిల్కా నుండి, విశాఖ స్థావరం నుండి సహాయం అనిదిస్తున్నాయి. 15 గజ ఈతగాళ్ళ బృందాలను పంపాయి. భారతీయ గస్తీదళం 17 నౌకలను, 11 విమానాలను రక్షణకొరకు పంపింది. చెన్నై, కాకినాడలలో 6, విశాఖలో 3, పరాద్వీపంలో 4, హల్దియాలో 1 చొప్పున నౌకలను నిలిపింది. ఢిల్లీ, చంఢీగడ్‌ల నుండి విమానాలు పంపించారు. హైదరాబాదులో 3 చేతక్ విమానాలు, నాగపూర్, బారక్‌పూర్, రాంచీలలో రెండేసి చొప్పున హెలీకాఫ్టర్లు నిలుపబడ్డాయి. పారామిలిటరీ దళాలు సహాయ చర్యలు చేపట్టాయి. వైద్యబృందాలు ఔషధాలు సహాయక సిబ్బందితో సిద్దంగా ఉన్నాయి. [13] విద్యుత్ సిబ్బంది కూడా రాత్రింబవల్లు కస్టపడి కేవలం రెండు రొజుల్లొనే కె. జి. హెచ్, రైల్వె లకు విద్యుత్ అందించారు.

తుఫాను గురించి ప్రతిస్పందనలు

  • 37 ఏళ్ల క్రితం ఒక అర్థరాత్రి దివిసీమ ఉప్పెన వచ్చింది. దానిలో వేలమంది చనిపోయారు. అది వచ్చిన 37 ఏళ్ల తర్వాత ఒక మధ్యాహ్నం హుద్‌హుద్‌ వచ్చింది. వేల మంది బతికారు. అది చావు. ఇది బతుకు. ఈ చావు బతుకుల మధ్య మనం సాధించిన సాంకేతిక ప్రగతి అపారం. అపురూపం. తుపాను వచ్చి వెళ్లిన 48 గంటల్లో పాలు మామూలు రేట్లకే అమ్మటం మొదలుపెట్టారు. గుంటూరు, మైదుకూరు, నెల్లూరు- ఇలా రకరకాల ప్రాంతాల నుంచి వేల మంది సిబ్బంది హుఠాహుటిన వచ్చి మరమ్మత్తులు చేపట్టారు.. ఇంకో వారం రోజుల్లో కొంత ప్రశాంతత రావచ్చు. ఈ హుద్‌హుద్‌ భౌతికంగా తీవ్ర నష్టాన్ని కలిగించి ఉండచ్చు. కానీ మానవ సంకల్పాన్ని మరో సారి గుర్తుకు కూడా తెచ్చింది. ఒక ప్రధాని వచ్చి కలెక్టర్‌ ఆఫీసులో కూర్చుని రివ్యూ మీటింగ్‌ పెట్టడం నేను (ఇంతకుముందు) చూడలేదు. జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోగలగటమే ధీరత్వం అది మనకుందని హుద్‌హుద్‌ మరో సారి గుర్తుచేసింది - గొల్లపూడి మారుతీరావు.[14]
  • పోర్ట్ చైర్మన్ కృష్ణబాబు " అధికారికంగా వాయు వేగం 210 నమోదౌనప్పటికీ తుఫాను తీరాన్ని తాకిన సమయంలో రాడార్లు పని చేయలేదు. అయినప్పటికీ తీరంలో నిలిపి ఉంచిన నౌకలలో 140 నాట్లు(259 కి.మీ) నమోదైందని " అభిప్రాయపడ్డాడు.మరొక ఐ.ఎ.ఎస్ అధికారి నౌకా విభాగం వద్ద వాయువేగం 150 నాట్లు (277 కి.మీ) నమోదౌందని " అభిప్రాయ పడ్డాడు.

ఈ విషయమై వాతావరణ విభాగం అధికారిగా పదవీ విరమణ చేసిన రామారావు మాత్రం నౌకలలో ఖచ్చితమైన నమోదు ఉండదని అభిప్రాయపడ్డాడు. [10]

  • పోర్ట్ చైర్మన్ క్రిష్ణబాబు 1977 లో దివిసీమలో సంభవించిన తుఫాను అనుభవానికి ప్రస్తుత హుద్‌హుద్ తుఫానుకు చాలా వ్యత్యాసం ఉందని. దివిసీమలో సంభవించిన తుఫాను కంటే ఇది తీవ్రమైనదని, హుద్‌హుద్ తుఫాను దీర్ఘకాలం వీచిందని, హుద్‌హుద్ తుఫాను సమయంలో మనుషులు నిలబడడం కూడా కష్టమైనదని " అభిప్రాయం వెలిబుచ్చారు.

[11]

  • సత్యనారాయణ అనే ఉద్యోగి 1996లో అమలాపురం తుఫాను అనుభవాన్ని ఇప్పటి హుద్‌హుద్ తుఫానుతో పోల్చిచూసి " అమలాపురం తుఫానులో 4-5 గంటలు వీచిన గాలులు మొత్తం తుడిపెట్టిందని, హుద్‌హుద్ తుఫాను ఉదయం 8 నుండి కొంత విరామంతో అర్ధరాత్రి వరకు గాలులు వీచాయని, 5.5 టన్నుల కంటైనర్ 150 మీటర్ల దూరం కదిలిపోయిందని " చెప్పాడు.

[12]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Tropical Cyclone Hudhud Best Track". Naval Research Laboratory. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 12 October 2014.
  2. "Workers clear debris after Indian cyclone kills 24". 13 October 2014. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 13 October 2014.
  3. "India: Damage from cyclone Hudhud likely to exceed $1 billion". 13 October 2014. Archived from the original on 12 అక్టోబరు 2022. Retrieved 13 October 2014.
  4. "Cyclone Hudhud to bring more rain to Kolkata". The Times of India. 8 October 2014. Retrieved 9 October 2014.
  5. "Cyclone Hudhud heads to Andhra Pradesh, Odisha coast". The Times of India. 8 October 2014. Retrieved 9 October 2014.
  6. "Cyclone Hudhud heads for India, after battering Andaman and Nicobar islands". anjib Kumar Roy and Jatindra Dash. Reuters. 8 October 2014. Archived from the original on 10 అక్టోబరు 2014. Retrieved 9 October 2014.
  7. 7.0 7.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-16. Retrieved 2014-10-14.
  8. "తుఫాను సమాచారం". Archived from the original on 2014-10-10. Retrieved 2014-10-09.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-15. Retrieved 2014-10-14.
  10. 10.0 10.1 10.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-15. Retrieved 2014-10-14.
  11. [1][permanent dead link]
  12. 12.0 12.1 [2]
  13. [3][permanent dead link]
  14. "గొల్లపూడి మారుతీరావు:అది చావు ఇది బ్రతుకు:ఆంధ్రజ్యోతి:అక్టోబరు 17, 2014". Archived from the original on 2014-10-20. Retrieved 2014-10-17.

వెలుపలి లింకులు